👉 జగన్‌కు భయం – స్టాలిన్ భేటీకి దూరం !..👉 దక్షిణాది ఉద్యమం కాకూడదు విభజన వాదం ! .. 👉కడప: పులివెందులలో ఐదుగురిపై కేసు నమోదు.*..*కడప లో ప్రయివేట్ ఫైనాన్స్ బజాజ్ గోల్డ్ వారి దౌర్జన్యం…!!..**వైఎస్ వివేకానంద రెడ్డి “హత్య” నేపథ్యంలో కొనసాగుతున్న కేసుల పరంపర*..*సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు*.. 👉 విశాఖ బీచ్‌లో తవ్వేకొద్దీ వి.సా.రెడ్డి ఘోరాలే ! ..👉 9 మంది మట్కా రాయుళ్ల అరెస్ట్.. విలేకరుల ముసుగులో మట్కా దందా ..!

👉 నేడే అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల*

▪️ *948 కార్యకర్తలు, హెల్పర్ పోస్టుల భర్తీ: మంత్రి సంధ్యారాణి..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు.. వెరసి 948 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈమేరకు శనివారం జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు శుక్ర వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ పోస్టుల ఎంపికకు రాతపరీక్ష ఉంటుందని, అర్హత ఉన్నవాళ్లను మాత్రమే ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలో 139 కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు.

👉 జగన్ తో ఒప్పందంలో ఉంటూ.. కూటమి చంద్రబాబు తో చేతులు కలిపిన ప్రశాంత్ కిషోర్ ఐ.ప్యాక్ కు వైకాపా గుడ్ బై…అన్ని ఒప్పందాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడి…

👉కడప: పులివెందులలో ఐదుగురిపై కేసు నమోదు.*

*వివేకా హత్యకేసు నిందితుడు సునీల్‌ ఫిర్యాదుతో కేసు. *హత్య సినిమాలో తల్లి పాత్రపై..సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు. *పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.*

👉 *కడప లో ప్రయివేట్ ఫైనాన్స్ బజాజ్ గోల్డ్ వారి దౌర్జన్యం…!!*

గోల్డ్ లోన్ పూర్తిగా కట్టేస్తామని కస్టమర్ అడిగినప్పటికి స్పందించని సిబ్బంది. కస్టమర్ తో దురుసు ప్రవర్తన.లోన్ చెల్లించినా గోల్డ్ ఇవ్వమని ఇష్టం వచ్చినట్లు చేసుకోమని బెదిరింపులు.వడ్డీ ఎక్కువ అవుతుందని చెప్పినప్పటికి స్పందించని సిబ్బంది.సాంబ శివా రెడ్డి దురుసు ప్రవర్తన తో లబోదిబో మంటున్న బాధితులు.వైరల్ అవుతున్న వీడియో.బజాజ్ యాజమాన్యం, సంబంధిత అధికారులు స్పందించి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్.

👉*వైఎస్ వివేకానంద రెడ్డి “హత్య” నేపథ్యంలో కొనసాగుతున్న కేసుల పరంపర* *వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు..*”హత్య” సినిమాలో తనతోపాటు తన తల్లిని క్రూరంగా చిత్రీకరించారని సునీల్ ఫిర్యాదు..*ఏ1గా “వైఎస్ అవినాష్ అన్న యూత్” వాట్సప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్‍ పై కేసు.. ఏ2గా వైసీపీ సోషల్ మీడియా కడప అడ్మిన్‍పై కేసు నమోదు.. హత్య సినిమా డైరెక్టర్, నిర్మాత, రైటర్‍ తో పాటు మరికొందరిపై కేసు నమోదు..

**సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు*

*పవన్ కుమార్ అనే వ్యక్తి వైసీపీ వాట్సప్ గ్రూపులో వైరల్ చేస్తున్నారని సునీల్ ఫిర్యాదు.. *”హత్య” సినిమాకు సంబంధించిన సన్నివేశాలు వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు.. *”వైఎస్ అవినాష్ అన్న యూత్” వాట్సాప్ గ్రూప్‍లో వైరల్ చేస్తున్నారని సునీల్ ఫిర్యాదు.. * ఉదయం 3.45 గంటలకు పులివెందుల పోలీస్ స్టేషన్‍లో సునీల్ యాదవ్ ఫిర్యాదు..**తన ఇంటి వద్ద అనుమానాస్పదందా తిరుగుతున్నారని ఫిర్యాదు చేసిన సునీల్***సునీల్ యాదవ్ ఫిర్యాదుపై బీఎన్‍ఎస్, ఐటీ యాక్టు 67 సెక్షన్ కింద కేసు నమోదు..***తనకు ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సునీల్*

👉 దక్షిణాది ఉద్యమం కాకూడదు విభజన వాదం ! ..

లోకసభ సీట్ల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని… దీన్ని అడ్డుకోవడానికి సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు మేరకు చెన్నైలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేవారు ఎవరు అన్న విషయం పక్కన పెడితే హక్కుల కోసం పోరాటం అనేది ప్రజాస్వామ్య హక్కు. అయితే అది విభజన వాదానికి దారి తీస్తే మాత్రం దేశాన్ని బలహీనం చేసినట్లవుతుంది.

దక్షిణాది సెంటిమెంట్ పెంచుతున్న తమిళ పార్టీలు..

దక్షిణాదికి అన్యాయం అనే వాదనను తమిళ పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకతగా మారాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోఅధికారంలో ఉండే పార్టీలు తమకు అవసరమైనప్పుడల్లా దక్షిణాది వాదాన్ని తెరపైకి తీసుకు వస్తాయి. గతంలో టీడీపీ, జనసేన, కేరళలోని కమ్యూనిస్టు పార్టీలు, కర్ణాటకలో జేడీఎస్ కూడా ఇలాంటి వాదనలు తెచ్చినవే. ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోనున్న స్టాలిన్ ఆ బాధ్యత తీసుకున్నారు..

హక్కుల కోసం పోరాటం ప్రజాస్వామ్య పథం..

హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు. అందులో తప్పేమీ లేదు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు .. విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. అదుపు లేని నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి వాటిని అదుపు చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే.. అది విభజన వాదమే. దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా.. దక్షిణాది తన ప్రాధాన్యతను కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.

ఖరారు కాని డీలిమిటేషన్ విధానం..

జనాభాను బట్టి డీ లిమిటేషన్ జరుగుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఓ ప్రాంతంపై వివక్ష చూపించడం ఎంత ప్రమాదకరమో దేశ నాయకత్వానికి తెలుస్తుంది. అందుకే దక్షిణాది ప్రాధాన్యత తగ్గకుండా చూస్తారని భావించవచ్చు. అయితే వాయిస్ రైజ్ చేయకుండా.. సైలెంటుగా ఉంటే అన్యాయం చేసే అవకాశాలు ఉంటాయి. స్టాలిన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశం దక్షిణాది హక్కుల పోరాటానికి మంచి ముందడుగే. కానీ చేయి దాటకుండా చూసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందన్నది నిపుణుల అభిప్రాయం.

👉 జగన్‌కు భయం – స్టాలిన్ భేటీకి దూరం !..

జగన్ రెడ్డి తనకు కష్టం వచ్చిందని ఢిల్లీలో ధర్నా చేస్తే .. ఆయనకు ధైర్యం ఇవ్వడానికి ఇండియా కూటమిలోని పార్టీల నేతలందరూ వచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయడం లేదు. గతంలో పార్లమెంట్ లో ఏ విషయంలోనూ కాంగ్రెస్ కూటమిని సమర్థించలేదు సరి కదా ఇప్పుడు స్టాలిన్‌తో భేటీకి కూడా దూరంగా ఉన్నారు.

రాజకీయాల్లో ఆప్తమిత్ర పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు నిర్ణయించింది. కేటీఆర్ కూడా వెళ్లారు. కానీ జగన్ మాత్రం అంత ధైర్యం చేయలేకపోయారు. స్టాలిన్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒకరు ఆయన. రాజకీయంగా బీజేపీతో ఇక భయం వద్దని పోరాడాలని డీఎంకే నుంచి వచ్చిన సూచనల్ని కూడా ఆయన పెడచెవినా పెట్టారు.

దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా జగన్ వణికిపోతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే తన పరిస్థితి ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే విదిలించేస్తున్నా సరే జగన్ ఆ పార్టీని వదిలి పెట్టడం లేదు. ఎన్డీఏ కూటమికి ఆయన ఢిల్లీలో మద్దతు తెలియచేయడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదంటే.. ఇంకేం అనుకోవాలి ?..

ఇలాంటి రాజకీయాలు చేస్తే జగన్ కు రాజకీయ భవిష్యత్ అనేది ఉండదని.. పోరాడాలని శ్రేయోభిలాషులు అదే పనిగా సలహాలిస్తున్నారు. కానీ జగన్ మాత్రం పోరాడితే జైలుకు పోతామని.. పార్టీ పోతుందని గట్టి క్లారిటీగా ఉన్నారు. అందుకే రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.

👉 విశాఖ బీచ్‌లో తవ్వేకొద్దీ వి.సా.రెడ్డి ఘోరాలే !

విశాఖ బీచ్ ను కబ్జా చేసి..భారీ బీచ్ రిసార్టును కట్టాలనుకున్న విజయసాయిరెడ్డి నిర్వాకం సాక్ష్యాలతో వెలుగులోకి వస్తోంది. ఆయన కుమార్తె నేహారెడ్డి పేరుతో ఓ హోటల్ కట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారం వైసీపీ హయాంలోనే బీచ్ ను కబ్జా చేశారు. ఎప్పుడు వేశారో తెలియదు కానీ… బీచ్ లో గోడలు కట్టేందుకు ఎనిమిది నుంచి పది అడుగుల లోతున కాంక్రీట్ గోడలు కట్టేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని పెకిలిస్తున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతుగా ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోశారో వారికే అర్థం కాలేదు. బీచ్‌లో చేస్తున్న అక్రమాలపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. తవ్వే ఖర్చు కూడా ఆ కట్టడాలు నిర్మించిన నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. అంతే కాదు వాటిని తొలగించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అందుకే చాలా వేగంగా వాటిని తొలగిస్తున్నారు. అన్ని అనుమతులతోనే సీఆర్‌జెడ్‌-2 ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టామని నేహారెడ్డి వాదించారు. జనసేన నేత కార్పొరేటర్‌ పీఎల్‌వీఎన్‌ మూర్తి యాదవ్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుపై హైకోర్టు విచారణ జరుపుతోంది.. నిర్మాణానికి వినియోగిస్తున్న భారీ యంత్రాలను సీజ్ చేయాలని గత సెప్టెంబర్ లోనే ఆదేశించారు. హైకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. వారు నిబంధనలు ఉల్లఘించి బీచ్ లో నిర్మాణాలు చేస్తున్నది నిజమని తేలడంతో పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు. ఆ మేరకు స్టేటస్ రిపోర్టు కూడా సమర్పించాలని ఆదేశించారు దీంతో విశాఖ తీరంలో లోతుగా తవ్వి కాంక్రీట్ పునాదుల్ని తొలగిస్తున్నారు.

👉 9 మంది మట్కా రాయుళ్ల అరెస్ట్.. విలేకరుల ముసుగులో మట్కా దందా ..!!!  కంభం టౌన్ బస్టాండ్ సెంటర్ నందు శనివారం 9 మంది మట్కా ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకొని వారి పైన కేసు నమోదు చేసినట్లు కంభం ఎస్సై బి నరసింహారావు తెలిపారు. *వారిలో కొంతమంది విలేకరులు కూడా ఉన్నారన్నారు .కంభం మండలంలో ఎవరైనా మ మట్కా గాని పేకాట గాని క్రికెట్ బెట్టింగ్లు గాని ఆడినట్లయితే వారందరి పైన కఠిన చర్యలు తీసుకోబడును ప్రజలు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తెలియపరిస్తే వారందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామని సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

*గంటకు వందల కోట్ల వ్యాపారం.. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు.. బెట్టింగ్ యాప్‌లను అపేదెలా..?*

బెట్టింగ్ యాప్‌ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది..!

 

రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి..! పట్నమే కాదు ప్రతి పల్లెకూ విస్తరించిందీ బెట్టింగ్‌ మార్కెట్.

 

కోట్లాది మంది సంపాదనలో 50 శాతానికి పైగా బెట్టింగ్‌పైనే పెడుతున్నారు. మరలాంటి బెట్టింగ్‌ మాఫియాను మట్టుబెట్టేదెలా..?

 

యాప్‌లను అపెదెట్లా..?

 

నిర్వహకులపై ఫోకస్‌ సరే.. అసలు ట్రాక్‌ చేసెదెలా..?

 

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై కేసులు పెట్టారు. చాలా మందిని విచారణకూ పిలిచారు. పలువురిని అరెస్ట్‌ కూడా చేశారు. పరారీలో ఉన్నవాళ్ల కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. ఇదంతా సరే.. అసలు బెట్టింగ్‌ అన్నదే లేకుండా చేయడం సాధ్యమేనా..?

 

నిర్వాహకులను పట్టుకోవడం అయ్యే పనేనా..?

 

ఇప్పుడిదే పెద్ద సవాల్‌గా మారింది.నిర్వహకులను పట్టుకోవడం… అలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చే యాప్‌లను నియంత్రించేందుకు టెక్కీలను సైతం రంగంలోకి దించుతున్నారు. బెట్టింగ్‌ యాప్‌లపై ప్రజల్లోనూ అవగాహణ పెంచేందుకు సిద్ధమవుతున్నారు.ఇక ఐపీఎల్‌తో ఇప్పుడు పోలీసులకు బిగ్‌ టాస్క్‌ వచ్చి పడింది. బెట్టింగ్‌ రాయుళ్లు బెస్ట్‌ టైమ్‌గా భావించే ఈ ఐపీఎల్‌లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి. గెలుపోటములపైనే కాదు.. బంతిబంతికీ బెట్టింగులు నడుస్తుంటాయి. దీంతో నిఘా పెంచారు పోలీసులు. బెట్టింగు బాబుల బెండు తీయడమే కాదు.. నిర్వహకుల అంతుచూసేందుకు సిద్ధమయ్యారు. మరి చూడాలి ఈ బెట్టింగ్‌ మాఫియాను ఎలా కట్టడి చేస్తారో..!

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..