రామానాయుడు స్టూడియో భూమి తీసుకోవాల్సిందే: ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు.. 👉ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాదం… బయటపడిన నోట్ల కట్టలు..**బెట్టింగ్ యాప్ లో మని పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు..👉ఏకంగా చెరువు నే మింగిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి..👉8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. అడిగితే విద్యార్థినులను కొట్టిన ఇంగ్లీష్ టీచర్.. !!! 🌟కర్నూలులో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు ..🌟హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు..*బెట్టింగ్ యాప్‌ల ఎపిసోడ్ వెనుక పిచ్చెక్కించే నిజాలు.. గంటకు వందల కోట్లు* 

👉 రామానాయుడు స్టూడియో భూమి తీసుకోవాల్సిందే – టీడీపీ ఎమ్మెల్యే శాసనసభలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి విషయం మీద జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ నుంచి భీమిలీ వైపు వెళ్ళే మార్గంలో ఉన్న రామానాయుడు స్టూడియోలో మిగులు భూమి మీద చాలా కాలంగా వివాదం ఉంది. ఈ భూమిని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు కోరుతున్నారు. శాసనసభలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి విషయం మీద జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. రామానాయుడు స్టూడియోకు ప్రభుత్వం దాదాపుగా 35 ఎకరాల భూమిని ఇస్తే అందులో మిగులు భూమిగా 15 ఎకరాలు ఉందని దానిని స్టూడియో అభివృద్ధి కోసం కాకుండా వేరే విధంగా వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ భూములను లే అవుట్లు వేసి విక్రయించాలని గత ప్రభుత్వంలో ప్రయత్నించారని ఆయన చెప్పారు. అయితే ఈ విషయంలో తాను సుప్రీమ్ కోర్టు దాకా వెళ్ళి ఆపించాను అని ఆయన చెప్పారు. ఏడాదిలోనే అంతా మారిపోయింది ఇదిలా ఉండగా ఇన్నేళ్ళ కాలంలో రామానాయుడు స్టూడియోలో ఈ భూమిని సినీ కార్యకలాపాల కోసం వాడలేదని ఆయన గుర్తు చేశారు. అందువల్ల ఏ ప్రయోజనాల కోసం అయితే ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చిందో దానిని అలా వాడకపోతే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే 2000 ప్రాంతంలో తెలుగుదేశం ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖలో ఈ భూమిని రామానాయుడు స్టూడియో కోసం ఇచ్చారు. అందులో దాదాపుగా ఇరవై ఎకరాల వరకూ స్టూడియో కోసమే వినియోగించారు. మిగులుగా మరో 15.17 ఎకరాలు ఉంది.  దీని విషయంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు అనుమతులు తీసుకుని లే అవుట్లు వేసేందుకు ప్రయత్నించారు అని ప్రచారం లో ఉంది. అయితే దీని మీద అపుడే టీడీపీ నేతలు విమర్శలు చేశారు. మొత్తానికి ఇది ఆగింది. ఇపుడు ఈ భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని వెలగపూడి ఎమ్మెల్యే హోదాలో కోరుతున్నారు. ప్రభుత్వం ఈ భూమి తీసుకుంటుందా లేక స్టూడియో యాక్టివిటీని ప్రారంభించాలని కోరుతుందా అన్నది చూడాలి. కారణాలు ఏమైనా ఒకసారి ఒకరికి భూమి ఇచ్చినపుడు తిరిగి తీసుకున్న సందర్భాలు అరుదుగానే ఉన్నాయి. దాంతో పాటు సినీ పరిశ్రమను విశాఖ తో పాటు ఏపీకి రప్పించాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే కోరినట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తుందా అన్నదే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా రామానాయుడు స్టూడియో ఒక్కటే ఏపీలో అందునా విశాఖలో ఉంది. దాని చుట్టూ రాజకీయ వివాదాలు విమర్శలు కొంతకాలంగా వస్తున్నాయి. మరి ఇలాగైతే పరిశ్రమ వర్గాలు ఈ వైపు చూస్తాయా అన్నది మరో చర్చగా ఉంది.

👉ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో అగ్నిప్రమాదం… బయటపడిన నోట్ల కట్టలు..!!!

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్నిప్రమాదం..  మంటలు ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి కనిపించిన నోట్ల కట్టలు.. అలహాబాద్ హైకోర్టుకు న్యాయమూర్తి వర్మ బదిలీ..  కొలీజియం సీరియస్ చర్యలకు సిఫార్సు.. సుప్రీంకోర్టు విచారణకు అవకాశం.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత భారీ మొత్తంలో నగదు లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.. జస్టిస్ యశ్వంత్ వర్మ ఆ సమయంలో ఢిల్లీలో లేరు. అగ్నిప్రమాదం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పివేసిన తర్వాత, అగ్నిమాపక సిబ్బందికి ఒక గదిలో భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీనిని అధికారులు ఐటీ లెక్కల్లో చూపించని డబ్బుగా గుర్తించారు.. స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా, వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దీనిపై తీవ్రంగా స్పందించారు. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మను వెంటనే బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన 2021 అక్టోబర్‌లో అలహాబాద్ నంచే ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు.. అయితే, కొలీజియంలోని కొంతమంది సభ్యులు ఈ ఘటనను బదిలీతో వదిలేస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతుందని అభిప్రాయపడ్డారు. జస్టిస్ వర్మను రాజీనామా చేయమని అడగాలని, నిరాకరిస్తే పార్లమెంటు ద్వారా తొలగించేందుకు సిఫార్సు చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు.రాజ్యాంగ న్యాయస్థానం న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు 1999లో సుప్రీంకోర్టు ఒక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే ప్రధాన న్యాయమూర్తి సంబంధిత న్యాయమూర్తి నుంచి వివరణ కోరుతారు. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.

👉*బెట్టింగ్ యాప్ లో మని పెట్టి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువకుడు*

*గోదావరిఖని అనిల్ డయాగ్నస్టిక్ లో వర్క్ చేస్తున్న కొరవీణ సాయి తేజ బెట్టింగ్ యాప్లో మనీ పెట్టి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోగా రెండు రోజుల క్రితం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు*

*నిమ్మకాయతో మత్తుమందు కలిపి అత్యాచారం చేసి వీడియోలు తీసి*… మెదక్ జిల్లా ఫేక్ బాబ్ అరెస్ట్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దొంగ బాబా మహిళలతో పరిచయం పెంచుకొని సమస్యలు తీర్చేస్తాను అని నమ్మబలికి పూజ చేస్తూ నిమ్మకాయలు మత్తుమందు నీళ్లలో నిద్ర మాత్రలు వేసి మహిళలకు తాగిస్తాడు అని పోలీసులు వెల్లడించారు.. మహిళ స్పృహ కోల్పోయాక వీడియో తీస్తూ అత్యాచారం చేసి మహిళలకు వీడియో పంపించి డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పారు ఇప్పటివరకు లక్షలు వసూలు చేశాడని వందలాదిమంది మహిళలు నగ్న వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు..

👉ఏకంగా చెరువు నే మింగిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి.. జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న జనంపల్లి దుష్యంత్ రెడ్డి మరియు అనిరుధ్ రెడ్డి అనుచరులు.. ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. నల్లకుంటలో 4 ఎకరాల్లో మట్టి పోసి, కాంపౌండ్ కట్టిన ఎమ్మెల్యే అన్న, అనుచరులు..  దీనిపై స్థానికులు హైకోర్టులో పిటిషన్ వెయ్యగా.. ఆ ఆక్రమణలను తొలగించాలని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు.. హైకోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా, కబ్జా చేసిన భూమిలో పనులు జరుపుతున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి.. ఆ కబ్జా భూమి FTL పరిధిలో ఉన్నా పట్టించుకోని అధికారులు.. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేసే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి.. సొంత నియోజకవర్గంలోని నల్లకుంటను అన్న కబ్జా చేయడం కనిపించడం లేదా అంటూ జడ్చర్ల ప్రజలు ఆగ్రహం

🌟 అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు కానీ, భట్టి విక్రమార్క మాత్రం కేంద్ర ప్రభుత్వం మా తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ఒక్క విమర్శ కూడా చేయడం లేదు – అక్బరుద్దీన్ ఒవైసీ

👉8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. అడిగితే విద్యార్థినులను కొట్టిన ఇంగ్లీష్ టీచర్.. !!!

హైదరాబాద్ – హయత్ నగర్ భాగ్యలతలోని శ్లోక స్కూల్ లో.. 8వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. అడిగితే తెలుగులో మాట్లాడారు అంటూ విద్యార్థినులను కొట్టిన పాషా అనే ఇంగ్లీష్ టీచర్.. కొట్టిన విషయాన్ని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారంటూ విద్యార్థినులను మరోసారి కొట్టిన ఇంగ్లీష్ టీచర్.. పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని కడిగి పారేసిన తల్లిదండ్రులు .. శ్లోక స్కూల్లో విద్యార్థి సంఘాల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తత

👉మద్యం మత్తులో కారు నడిపి యాక్సిడెంట్ చేసిన కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ నేత సునీల్ రావు కొడుకు ప్రద్యుమ్న్.. మద్యం తాగి స్నేహితులతో కలిసి కారులో వెళ్తూ.. ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన ప్రద్యుమ్న్.. ప్రద్యుమ్న్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

🌟కర్నూలులో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు .. ఇచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడుతూ.. మల్లెపోగు పూర్ణ చంద్రుడు ఆధ్వర్యంలో 400 మంది వైయస్‌ఆర్‌సీపీలో చేరిక.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎస్వీ విజయ మనోహరి

🌟హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు..!!!

జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న.. 48 మంది నాయకుల అసభ్య వీడియోలు సీడీలు, పెన్ డ్రైవ్ లో ఉన్నాయని.. ఇందులో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఉన్నారని తెలిపిన మంత్రి.. దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, దీని వెనక ఎవరు ఉన్నారనే విషయం ప్రజలకు కూడా తెలియాలని స్పష్టం చేసిన మంత్రి రాజన్న..  ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్ యత్నం జరిగిందని, ఇది కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని తెలిపిన మంత్రి సతీశ్ జారి హోళీ.. ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేశారో లేదో తనకు తెలియదని, దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పందించిన డిప్యూటి సీఎం డీకే శివకుమార్

*బెట్టింగ్ యాప్‌ల ఎపిసోడ్ వెనుక పిచ్చెక్కించే నిజాలు.. గంటకు వందల కోట్లు !!!

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్లపై తెలంగాణ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. యాప్ ప్రమోటర్స్‌పై కేసులు నమోదవుతున్నా.. బెట్టింగ్ యాప్‌ల నిర్వహకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలో బెట్టింగ్ యాప్‌లు చలామణిలో ఉన్నాయి.. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. బెట్టింగ్‌ యాప్‌ల పేర్లు ఏవైనా వారందరికీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నది మాత్రం ఒకరే. సాఫ్ట్‌వేర్ కోసం ప్రతి నెల కొంతమొత్తంలో చెల్లిస్తారు. కానీ ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా రోజుకు వందల కోట్ల రూపాయలను నిర్వహకులు సంపాదిస్తున్నారు. ఈజీగ డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ యాప్‌లను ఒక మార్గంగా ఎంచుకుంటూ.. సాధారణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు యాప్ నిర్వహకులు. బెట్టింగ్ ఓ రకంగా జూదం లాంటిదే. డబ్బు అనే ఒక ఆశ చూపించి బెట్టింగ్ యాప్‌ నిర్వహకులు రెచ్చిపోతున్నారు. జాయినింగ్ బోనస్‌ల పేరిట మొదట బెట్టింగ్‌కు అలవాటుచేసి ఆ తర్వాత బెట్టింగ్ అనే ఊబిలోకి దించుతున్నారు. ఓసారి బెట్టింగ్‌కు అలవాటుపడితే బయటకు రావడం కష్టంగా మారుతోంది. దీంతో చేసేదేమిలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య ఎక్కువుగానే ఉంటుంది..

యాప్‌లపై చర్యలేవి..🤫

బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై కేసులు పెట్టడంవలన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో వీటిని సెలబ్రెటీలు ప్రమోట్ చేయకుండా నియంత్రించే అవకాశం ఉండొచ్చు.కానీ ఇప్పటికే బెట్టింగ్‌కు బానిసలుగా మారిన వారిని కాపాడటం కష్టమే. నేరుగా బెట్టింగ్ యాప్‌ నిర్వహకులు, బెట్టింగ్ యాప్‌లకు సాఫ్ట్‌వేర్ విక్రయిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటేనే ఏదైనా ఫలితం ఉండొచ్చు. సెలబ్రటీల నుంచి సామాన్య మనుషులు సైతం ఈజీగా డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువుగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్‌లో రిజిస్ట్రర్ కావాలంటూ ఆకర్షించడంతో పాటు.. జాయినింగ్ బోనస్ రూ.500 వరకు ఫ్రీగా పొందండనే ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. తీరా జాయినింగ్ బోనస్‌తో ఆడే అవకాశం ఉన్నప్పటికీ వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండదు.. ఫస్ట్ డిపాజిట్ కంప్లసరీ అని బెట్టింగ్ యాప్ నిర్వహకులు షరతులు విధిస్తారు. దీంతో ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత ఎంత మొత్తంలో డిపాజిట్ చేశారో అంత మొత్తంలో గేమ్స్ ఆడినప్పుడు మాత్రమే డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వెయ్యి రూపాయిలు డిపాజిట్ చేసిన తర్వాత రూ.5 నుంచి రూ.6 వేలు వచ్చాయనుకోండి.. డబ్బుపై ఆశతో అవి ఇంకా పెరుగుతాయనే ఆశతో ఆడి మొత్తం డబ్బులు పొగొట్టుకుంటారు. సొంత డబ్బులు రూ.వెయ్యి పోవడంతో వాటి రికవరీ కోసం మరింత డిపాజిట్ చేస్తూ బెట్టింగ్‌కు బానిసలుగా మారుతున్నారు చాలామంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఫోన్, కంప్యూటర్‌లో ఓపెన్ కాకుండా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడంతో పాటు యాప్ నిర్వాహకులపై చర్యలతోనే ఈ బెట్టింగ్‌ యాప్‌లకు పుల్‌స్టాప్ పడే అవకాశం ఉంటుంది..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..