👉 సినీ స్టార్లు యాంకర్లు ఎవరినీ విడిచిపెట్టం.. డిసిపి వార్నింగ్ ఇక ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని క్షమించేది లేదని తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్ హెచ్చరించారు.
ఆన్‌లైన్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఎంతో అలెర్ట్ గా ఉంటుంది. ఇక ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని క్షమించేది లేదని తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్ హెచ్చరించారు. బెట్టింగ్ ఆడేవారిని, బెట్టింగ్ ప్రోత్సహించేవారిని, బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించే వారిని ఎవరినీ విడిచిపెట్టమని డిసిపి వార్నింగ్ ఇచ్చారు. సినీ, టీవీ తారలు అయినా విడిచిపెట్టేది లేదని అన్నారు. మండలిలో ఫొటో సెషన్ రచ్చ ఇప్పటివరకూ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పిస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేసామని కూడా వెల్లడించారు. యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించే నటీనటులు, యాంకర్లు బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పిస్తున్నారని అలాంటి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లతో సావాసం అంత మంచిది కాదు. సామాజికంగా తీవ్ర కల్లోలానికి కారణమవుతుంది. అందువల్ల ఇలాంటి వాటితో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని కఠిన స్వరంతో డిసిపి కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లతో సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నాం. ఇంకా ఎందరు ఉన్నా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెట్టింగ్ యాప్స్ కి ఇంకా ఎవరెవరు ప్రచారం కల్పిస్తున్నారో వారి గురించి ఆరాలు తీస్తున్నామని కూడా డిసిపి వెల్లడించారు. బెట్టింగ్ ఆడిన వారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. అయితే ఈ హెచ్చరికతో ఇప్పటికే ఆన్ లైన్ లో పలు వెబ్ సైట్లలో బెట్టింగ్ యాప్ ల ప్రచారంలో కనిపిస్తున్న నటీనటుల్లో ఆందోళన మొదలైంది.
👉మేము పార్టీ మారలేదు.. రేవంత్ రెడ్డిని ”మర్యాద పూర్వకంగా” కలిశాము అంతే… !!!
సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు..మేము పార్టీ మారలేదు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము.. మీడియా దాన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించింది అంటూ సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు..సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది.అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ లు దాఖలు చేస్తున్నారు..!!..ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది…పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే, అయితే సుప్రీంకోర్టులో మాత్రం నేను పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో నాకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు..శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదు అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది..ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్ లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
👉తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసం పై విన్నూత్న నిరసన…
తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియో ను ప్రదర్శించిన మహిళలు..
టికెట్ అడిగితే నా పేరు చెప్పండి సిఎం చంద్రబాబు వీడియో ను చూపించిన మహిళలు, మేయర్ డాక్టర్ శిరీష,.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో ఆర్టీసీ బస్సులో విన్నూత్న నిరసన.. ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్.. కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.. ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీ యునివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలింపు..తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి,మేయర్ శిరీష, టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్ట ఉపాధ్యక్షురాలు గీత యాదవ్, మహిళా విభాగం నాయకురాలు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
👉వీఆర్ కు గుంటూరు పట్టాభిపురం సీఐ మదుసూద నరావు..! .. *పట్టాభిపురం సీఐ వీరేంద్ర స్థానంలో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మదుసూదనరావుకు ఉన్నతాధికారులు ఝలక్ ఇచ్చారు…ఆదివారం రాత్రి ఈయన బాధ్యతలు చేపట్టగా తాజాగా వీఆర్ కు పంపారు…ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఈయనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది…అయితే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో వీఆర్ కు పంపినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది..కాగా కేవలం 9 నెలల వ్యవధిలో ఈ స్టేషన్కు ముగ్గురు సీఐ లు మారడం గమనార్హం.
👉లంచం కోసం ఎస్సై అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించిన వైనం..2023లో చిత్తూరు జిల్లాలో ఘటన.. తాజాగా వెలుగులోకి..మహిళ నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఎస్సై నరసింహులు..తన వద్ద లేవని చెప్పడంతో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలన్న ఎస్సై..!!! స్వయంగా తాకట్టు వ్యాపారి వద్దకు పంపి కుదువ పెట్టించిన వైనం..ఓ యువకుడిపై అక్రమంగా హత్యాయత్నం కేసు..!!!
అరాచకాలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల విచారణ..ఆరోపణలన్నీ నిజాలేనని తేలడంతో సస్పెన్షన్..లంచం కోసం మహిళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టించిన చిత్తూరు జిల్లా ఎస్సైపై ప్రభుత్వం వేటేసింది. అయితే, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, 2023లో గత ప్రభుత్వ హయాంలో జరిగింది. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. 2023 సెప్టెంబర్‌లో తన భార్య అదృశ్యమైనట్టు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ తమ మధ్య కుటుంబ పరమైన వివాదాలు ఉన్నాయని, కాబట్టి భర్తకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని ఎస్సై నరసింహులకు చెప్పింది. అయితే, అలా ఉండాలనుకుంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో మెడలోని మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలని కోరాడు. అంతేకాదు, తనకు తెలిసిన తాకట్టు వ్యాపారి వద్దకు పంపి మంగళసూత్రాన్ని కుదువ పెట్టించాడు. అప్పటికప్పుడు ఆమె ఫోన్ పే నుంచి రూ. 60 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. అయితే, విషయం బయటపడటంతో ఆ తర్వాత రామన్న అనే కానిస్టేబుల్ ద్వారా వడ్డీ సహా ఆమెకు నగదు తిరిగి ఇచ్చేశాడు. అలాగే, కమ్మపల్లెలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని యువరాజులు నాయుడిని హత్యాయత్నం కేసులో ఇరికించేందుకు ఎస్సై నరసింహులు మరో వర్గం నుంచి రూ. 7 లక్షలు తీసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువరాజులుపై కేసు నమోదు కావడంతో ఆయన అమెరికా వెళ్లే అవకాశం కోల్పోయాడు. దీంతో అతడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి అతడు చెప్పింది నిజమేనని నిర్ధారించారు.అలాగే, మరో కేసులో రూ. 3 లక్షల విలువైన వెదురుకర్రలు దొంగిలించారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా తప్పుడు కేసుగా పేర్కొంటూ దానిని మూసేశారు. తాజాగా, ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో అనంతపురం డీఐజీ షేముషీ బాజ్‌పేయి.. చౌడేపల్లె సీఐతో విచారణ జరిపించారు. ఈ సందర్భంగా ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు. ఎస్సై నరసింహులు ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు.
👉 ప్రకాశం జిల్లాలో దారుణం.. మైనర్ స్కూల్ బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు..
కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు..దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు….
👉తిరువణ్ణామలైలో ఫ్రెంచ్ యువతిపై అత్యాచారం !!!.. ధ్యానం చేయడానికి కొండపైకి వెళ్లిన యువతి.. అత్యాచారానికి పాల్పడ్డ టూరిస్ట్ గైడ్..నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు…తమిళనాడు..
👉నాగ్‌పుర్ అల్లర్లలో మహిళా పోలీసుతో అసభ్యకర ప్రవర్తన!..
మహారాష్ట్రలో నాగ్‌పుర్ లో రెండు గ్రూప్‌ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది. దీనిపై గణేశ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను బట్టి తెలుస్తోంది. దాంతో 51 మందిపై కేసు నమోదైంది. ఇటీవల చెలరేగిన హింసకు కొన్ని అసత్య ప్రచారాలు కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన సంగతి తెలిసిందే. దానిని కట్టడి చేసేందుకు మోహరించిన ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో ఆ పోలీసు అధికారిణి విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు ఎదురైన పరిస్థితి గురించి ఆమె వెంటనే సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అల్లరిమూకపై కేసు నమోదైంది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిని బెదిరించేలా సంజ్ఞలు చేశారని తెలిపారు.

