👉*ఎన్టీఆర్ జిల్లా ..ఇబ్రహంపట్నం ఫెర్రీ లో యువకుడు దారుణ హత్య.. నలుగురు యువకులు చెలరేగిన వివాదం ఒకరిని నిర్ధాక్షిణ్యంగా చంపేశారు..హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తి గా అనుమానం..గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ GGH కు తరలించిన పోలీసులు.పోలీసుల అదుపులో నిందితులు.
👉 కొండపి నియోజకవర్గం, జరుగుమల్లి మండలం,కామేపల్లి గ్రామంలో రూ.194.21 లక్షలతో నిర్మించనున్న బాలికల వసతి గృహానికి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తో కలసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి.ఈ కార్యక్రమంలో మండల అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు పాల్గొన్నారు.
👉*వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్’ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్’తో కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన సుంకేసుల గ్రామస్తులు..*గెజిట్ నోటిఫికేషన్’లో ఉన్న జాబితా ప్రకారం వరుస క్రమంలో పరిహారం అందజేయాలని డిమాండ్*..గెజిట్’లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్యాకేజీ మంజూరు చేయాలని కోరడం.. *ముంపు గ్రామాల పునరావాస కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని,18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ ఇవ్వాలి..*అర్హత ఉండి సర్వేలో మిస్సింగ్ అయిన ఫ్యామిలీలను గెజిట్’లో చేర్చాలి.. *2996 గాను 2148 కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకెజ్ మంజూరై మిగిలిన 848 పిడిఎఫ్ పెండింగ్ అవార్డులను పూర్తి చేయాలి*.. ఆర్ & ఆర్ ప్యాకేజీ, నష్టపరిహారం తదితర విషయాల్లో పార్టీలకతీతంగా పక్షపాత ధోరణితో కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత వరుస క్రమంలో ఇవ్వాలని తమరి దివ్యసముఖమున కోరుతున్నామని సుంకేసుల గ్రామస్తులు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ద్వారా సుంకేసుల గ్రామ సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ ,నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను శనివారం కలవడం జరిగింది. వారిలో ఎమ్మెల్యే అంట వైసీపీ మండల పార్టీ కన్వీనర్ పాలిలిరెడ్డి కృష్ణారెడ్డి,ఉప సర్పంచ్ భర్త కోటకొండ కోటేశ్వరరావు, వార్డ్ నెంబర్ మల్ల పెద్దగాలిం,మాజీ సర్పంచి మోటకట్ల అక్కిరెడ్డి,నాయకులు ఆవుల నాగిరెడ్డి, ఏరువ సహదేవుడు,సానికొమ్ము పుల్లారెడ్డి,ఆవుల శ్రీనివాసరెడ్డి,గుర్రం ముత్యాలయ్య,రేల రమణారెడ్డి, భోగెం రామకృష్ణుడు,తంగిరాల ఆవులయ్య,భూతపాటి రామయ్య, మండ్లా రామయ్య, గుర్రం నడిపి అల్లూరయ్య, చిన్న మస్తాన్,నాసర్ రెడ్డి,అంజి,నరసింహులు, తదితరులు ఉన్నారు.
👉గుంటూరు నగర మేయర్ రాజీనామా….*మేయర్ పదవీ కి రాజీనామా చేసిన కావటి మనోహర్ నాయిడు, నగర కమిషనర్ తీరుకు నిరసన గా రాజీనామా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్న *మేయర్ కావటి మవోహార్ నాయుడు*
👉 ఒంగోలు పట్టణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు,ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ల తో కలిసి శనివారం ఒంగోలు లో నిర్వహించిన పలు కార్య్రమాల్లో పాల్గొన్నారు.ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ కవర్ లకు బదులు గా క్లాత్ బాగ్స్ పంపిణీ చేశారు. మెప్మా సభ్యులతో కలిసి ట్రెజరీ ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కొత్త మామిడిపాలెం పాత బైపాస్ లోని గార్డెన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో కొత్త పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్లో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించాలని క్లాత్ బ్యాగులను వినియోగించాలని సూచించారు
👉ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ప్లాస్టిక్ కవర్ లకు బదులు గా క్లాత్ బాగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి.
*జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా , శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, నగర మేయర్ గంగడ సుజాత, నగర కమిషనర్ వెంకటేశ్వర్లు, బెజవాడ సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 ఒంగోలు నగరంలోని త్రోవగుంట నందు కోమటినేని విరభద్రరావు వీరభద్ర పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , బెజవాడ సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
👉 ఇటీవల ఒంగోలు నగరం త్రోవగుంట లోని పి.డి.సి.సి బ్యాంక్ EX చైర్మన్ కండే శ్రీనివాసు రావు సతీమణి కండే ఝాన్సీ రాణి అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బెజవాడ సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి .
👉పవన్ కళ్యాణ్ కు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కౌంటర్ ..పవన్ కళ్యాణ్ కు #ఉత్తరాది_అహంకారం నుండి #ఉత్తరాది_ఉత్తమం అనే భావన వచ్చింది. ఆవిర్భావ సభ జనసేనది. ఎజెండా బీజేపీది లా ఉంది. ఇతర రాష్ట్రాల భాషాల పై మాకు గౌరవం ఉంది..అలా అని భాషని మాపై రుద్దాలని చూడటం సరికాదు.మన తమిళ, తెలుగు మలయాళ భాషలను ఆయా హిందీ భాషలు ఉన్న రాష్ట్రంలో 3 భాషగా పరిగణిస్తారా ?.. అని ఆయన ప్రశ్నించారు.
👉100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్నావ్.. గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు నీ వాళ్లు కాదు పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు.. టీడీపీలో టికెట్ రాక, మేము రిజక్ట్ చేసిన వాళ్లు నీ పార్టీలోకి వచ్చి గాలి వీయడంతో గెలిచేశారు..జనసేన, టీడీపీ వేరు కాదు.. రెండు పార్టీలకు బాస్ చంద్రబాబే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
👉పవన్ కళ్యాణ్ ప్రసంగం కనీసం ఆయనకైనా అర్థమైందా..?: అంబటి రాంబాబు..మొదటి 15 నిమిషాలు ఊగిపోయి మాట్లాడారు.. అయితే.. పవన్ ప్రసంగంలో ఒక వాస్తవం ఉంది..నాలుగు దశాబ్దాల టీడీపీ పడిపోతుంటే నిలబెట్టింది జనసేన..కాపులను ఆకర్షించేందుకే టీడీపీ బీ టీమ్ గా జనసేన ఆవిర్భవించిందని అన్నారు.
👉ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్.. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో ఘటన.. సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న యోజిత సాహో (28)..చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయపూర్ కు చెందిన యోజిత..పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి డెడ్ బాడీ తరలింపు.. యోజిత ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉 జనసేన రద్దు..బీజేపీలో విలీనం..కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు*
పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు. పవన్ తన జనసేనను రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్యసభ మాజీసభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్‌ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా? అంటూ విమర్శించారు. తులసిరెడ్డి శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ర్ట కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటినుండి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురూ కీలు బొమ్మలని అంటున్నామని, అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందని తులసి రెడ్డి అన్నారు.. *తనకు పదవి పిచ్చి లేదని,సైద్ధాంతిక బలం వుందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్య మంత్రి పదవి ఎందుకు? సోదరుడు నాగబాబుకు MLC పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో కాసినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మం? అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని తానే నిలబెట్టినట్లు పవన్ చెప్పడం విడ్డూరం. తాతకు మనుమడు దగ్గు నేర్పినట్లుంది పవన్ వాలకం అంటూ దెప్పి పొడిచారు. నిన్నటి పిఠాపురం సభ మొత్తం ఆత్మ స్తుతి పరనింద గా సాగిందన్నారు. సొంత డబ్బా వాయించుకోవడం తోనే సరిపోయిందని సూపర్ సిక్స్ హామీల ప్రస్తావనే లేదని విమర్శించారు.*మంత్రుల పనితీరులో పవన్ కు 10 వ రాంకు రావడం గమనార్హమని, రాష్ర్ట వ్యాప్తంగా గ్రామ పంచాయితీలు మురికి కూపాలుగా తయారయ్యాయి.అటవీ శాఖ అనుమతులు రాక అనేక పనులు ప్రారంభం కాలేదని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా పవన్ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకొని తన శాఖ మీద దృష్టి కేంద్రీకరించాలని తులసి రెడ్డి సూచించారు..
👉 ఒంగోలు పట్టణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు,ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ల తో కలిసి శనివారం ఒంగోలు లో నిర్వహించిన పలు కార్య్రమాల్లో పాల్గొన్నారు.ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ కవర్ లకు బదులు గా క్లాత్ బాగ్స్ పంపిణీ చేశారు. మెప్మా సభ్యులతో కలిసి ట్రెజరీ ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కొత్త మామిడిపాలెం పాత బైపాస్ లోని గార్డెన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో కొత్త పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్లో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించాలని క్లాత్ బ్యాగులను వినియోగించాలని సూచించారు.
👉 జనసేనకు సర్వే నిపుణుడి షాక్- మిమ్మల్ని గెలిపించింది ఆయనే..! తాజా విశ్లేషణ..!*
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఎనిమిది నెలల్లోనే ఇలా తమ వల్లే టీడీపీ గెల్చిందంటూ జనసేన చెప్పుకోవడంపై అన్ని పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలైతే జనసేనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో జనసేనను టార్గెట్ చేస్తూ పోస్టులూ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతల కామెంట్స్ పై ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట స్పందించారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించింది స్థానిక ఓటర్లే, వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వారి ఖర్మ అంటూ స్థానిక టీడీపీ నేత వర్మను ఉద్దేశించి జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.* దీనిపై స్పందించిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట.. ఓ ట్వీట్ చేశారు. ఇందులో అలర్ట్ పిఠాపురం మాత్రమే కాదు..*ఎక్కడైనా గెలిపించేది ప్రజలూ, పార్టీ కార్యకర్తలే! టీడీపీ మద్దతు లేకుంటే.. పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు లాంటి చోట్ల జనసేన గెలుపునకు ఛాన్స్ లేదని తేల్చేశారు.
*కొన్ని చోట్ల జనసేన వల్ల టీడీపీ మెజారిటీ సాధించిందని, ఫైనల్లీ కూటమి మైత్రి వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చాం అనుకోవడం ఓ భ్రమ అని ప్రవీణ్ పుల్లట స్పష్టం చేశారు. *జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల మీద ఏహ్య భావంతో మీరు అఖండ విజయం సాధించారనే విషయం గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఎప్పటికప్పుడు వైసిపి సాధించిన ఓట్ల శాతం కూడా జ్ఞప్తికి వస్తే మీరు మూలాలు మరిచిపోరన్నారు.*చివరిగా బాటమ్ లైన్ అంటూ.. టీడిపి కష్టకాలంలో జనసేనాని ఆదుకున్నారని, జనసేన ఎక్కువ సీట్లు సాధించడంలో టీడీపీ కార్యకర్తల శ్రమ ఉందని తెలిపారు. మిమ్మల్ని విడగొట్టడానికి ఎవరో రానక్కర్లేదు. మీ భాగస్వామ్య పార్టీ చాలు అంటూ జనసేనకు ఆయన చురకలు అంటించారు. తద్వారా కూటమిలో విభేదాలకు కారణం కావొద్దంటూ జనసేనను సుతిమెత్తగా ఆయన హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పక్కాగా గెలుస్తుందని చాలా ముందుగా సర్వే గణాంకాలతో చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట కూడా ఒకరు.
👉బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్..ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి TGSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగానే వైజాగ్ లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ వంటి యూట్యూబర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. మరికొందరిని కూడా ఆయన టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. యువతకు సజ్జనార్ అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ మేరకు Xలో ఒక పోస్ట్ చేశారు. ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది!’ అని ట్వీట్ చేశారు.
👉 గచ్చిబౌలి పోలీసుల అదుపులో ముగ్గురు మైనర్ విద్యార్థులు…. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ తోటి క్లాస్ మేట్ ఓ అబ్బాయితో చనువుగా వుండటం సెల్ ఫోన్ లో వీడియో తీసి తమతో కూడా ఫ్రీగా ఉండాలంటూ వేధింపులకు గురిచేశారు. బాలిక విషయం తల్లిదండ్రులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.వీరంతా ఒకే స్కూల్ లో క్లాస్ మేట్స్ అని పోలీసులు తెలిపారు. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వొద్దు ఇస్తే నిత్యం గమనించాలన్నారు

