👉పదేళ్ల మైనర్ బాలికపై నరరూప రాక్షసుడు అత్యాచారయత్నం..👉వరంగల్ చౌరస్తాలో బ్యాంకు వారి వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం.. * 👉 సంచలనం రేపుతున్న వైఎస్ వివేకా సాక్షుల మరణాలు..*టీడీపీ నేత దారుణ హత్య!!!.. *పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే అన్నా ..

👉పదేళ్ల మైనర్ బాలికపై నరరూప రాక్షసుడు అత్యాచారయత్నం..😱😱😱విశాఖ… గాజువాక… పదేళ్ల మైనర్ బాలికపై నరరూప రాక్షసుడు అత్యాచార యత్నం గాజువాకలో కలకలం రేపింది…గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పూనుకున్న నరరూప రాక్షసుడు దాడి భాను ప్రకాష్ … మద్యం మత్తులో బాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్టు సమాచారం… తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లడంతో, ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నం కి పాల్పడిన దుర్మార్గుడు…  తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు బాను ప్రకాష్ ని అదుపులో తీసుకుని విచారిస్తున్న గాజువాక పోలీసులు

👉వినాయక నగర్ లో భారీ చోరీ*..యర్రగుంట్ల వినాయక నగర్ లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.బాధితుడు అబ్దుల్ సత్తార్ తెలిపిన వివరాల మేరకు..రెండు రోజుల క్రితం తన కూతురు వద్దకు వెళ్లిన బాధితుడు తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగుల కొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు వెండి దోపిడీకి గురి అయినట్లు బాధితుడు తెలిపాడు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉 *టీడీపీ నేత దారుణ హత్య!!!

కర్నూలు జిల్లా శరీన్‌నగర్‌లో టీడీపీ నేత సంజన్నను వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు_*_ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సంజన్న_మాజీ కార్పొరేటర్‌గా పని చేసిన సంజన్న__సంజన్న మృతదేహం కర్నూలు జీజీహెచ్‌కు తరలింపు_

👉వరంగల్ చౌరస్తాలో బ్యాంకు వారి వేధింపులు తట్టుకోలేక తమ దుకాణం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించిన చిలుకూరి క్లాత్ స్టోర్ బ్రదర్స్ కుటుంబ సభ్యులు…ఇద్దరికీ తీవ్ర గాయాలు…

👉జవ్వాజి రంగారెడ్డి మృతికి నివాళులు అర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*

*మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో జవ్వాజి రంగారెడ్డి(66) మృతి చెందగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు రంగారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.*

👉ఓర్సు వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

*మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో ఓర్సు సూరి,లక్ష్మీదేవి గార్ల కుమారుడు వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన ప్రవీణ్ కుమార్,భార్గవి గార్లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.*

👉 *పసుపుల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

*మార్కాపురం టౌన్ శ్రీనివాస కళ్యాణమండపం నందు పసుపుల వెంకటేశ్వర్లు,లక్ష్మీదేవి గార్ల కుమారుడు వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన సందీప్ కుమార్,సబిత కుమారి గార్లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.*

👉వైఎస్ వివేకా సాక్షుల మరణాలు.. న్యాయం కోసం సునీత పోరాటం ఈ ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది.: వైఎస్ వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన హత్య రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తన తండ్రికి న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో పోరాడుతున్నారు. ఆమె చేస్తున్న ఈ న్యాయ పోరాటం అనేక మలుపులు తిరుగుతూ, రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమయం కావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. మొదట్లో రాష్ట్ర పోలీసులు కేసును విచారించారు, కానీ అనేక అనుమానాలు, లొసుగులు ఉండటంతో వైఎస్ సునీత సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా వైఎస్ సునీత తన తండ్రి హత్యపై మరోసారి స్పందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, “నాన్న హత్య జరిగి ఆరేళ్లయింది. ఈ కేసులో ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. “సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. కొందరు నిందితులు సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారు” అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తమ పోరాటం ఆగదని, చివరి వరకు ప్రయత్నిస్తామని సునీత స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ఆమె ఆకాంక్షించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ సునీత అవిశ్రాంత న్యాయపోరాటం తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ, వైఎస్ సునీత తన తండ్రికి న్యాయం జరగాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఆమె స్వయంగా న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ, కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న నిజాలను వెలికి తీయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వైఎస్ సునీత తన పోరాటంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, కొందరు కీలక వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా ఆరోపించారు. అయినప్పటికీ, ఆమె తన లక్ష్యం నుండి ఏమాత్రం తప్పుకోలేదు. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజమైన హంతకులు శిక్షించబడాలని ఆమె బలంగా నమ్ముతున్నానని, న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తేల్చి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ సునీత చేస్తున్న న్యాయ పోరాటం ఒక సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వైఎస్ సునీత మాత్రం తన పోరాటాన్ని విరమించకుండా ముందుకు సాగుతున్నారు. ఆమెకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు తన తండ్రికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆమె ఆశిస్తున్నారు.వైఎస్ సునీత యొక్క ఈ అవిశ్రాంత పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజమైన దోషులు శిక్షించబడాలని డిమాండ్ చేస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే విషయాన్ని కూడా ఆమె తెలియజేస్తుంది. వైఎస్ సునీత పోరాటంలో న్యాయం దక్కుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

👉 *గిద్దలూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయండి*

*స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి*..గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

*స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.. శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం నుండి మెయిన్ బజారు మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. అనంతరం “స్వచ్ఛ ఆంధ్ర ” ప్రతిజ్ఞ చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో గిద్దలూరును ముందంజలో ఉంచడంతో పాటు ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.*ప్రతి నెల మూడవ శనివారం జరిగే స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని గిద్దలూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.*నియోజకవర్గంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణాన్ని, వార్డులను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు.*కాలుష్య కారకాలైన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించి ప్లాస్టిక్ రహిత పట్టణంగా గుర్తింపు తీసుకురావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కమిషనర్ ఐ. శ్రీనివాసులు, ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు, సిబ్బంది పాల్గోన్నారు.*

👉ఆవుల వారి వివాహంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*

*బెస్తవారిపేట పట్టణం, SVLS కళ్యాణ మండపంలో పందిళ్ళపల్లె గ్రామానికి చెందిన ఆవుల కృష్ణారెడ్డి కుమారుడు చి. వెంకట విష్ణు వర్ధన్ రెడ్డి మరియు లక్ష్మి అనూష లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గోన్నారు.*

👉*చేరెడ్డి వారి కళ్యాణంలో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*

*గిద్దలూరు పట్టణంలోని MBR కళ్యాణ మండపంలో కొంగలవీడు గ్రామానికి చెందిన చేరెడ్డి రామమోహన్ రెడ్డి కుమార్తె చి.ల.సౌ రోహిణి మరియు అశ్వని కుమార్ లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గోన్నారు.*

👉నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ముత్తుముల*… కంభం మండలం, చిన్న కంభం గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో పోరుమామిళ్లపల్లె గ్రామానికి చెందిన వన్నెల బాల రంగయ్య కుమారుడు చి. సాయిరంగా మరియు దుర్గాభవాని లకు జరిగిన వివాహా కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గోన్నారు.*

👉 *చిన్నారిని ఆశీర్వదించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*.. కంభం పట్టణంలోని  బృందావనం ఫంక్షన్ హల్ లో ముక్కు ప్రసాద్ రెడ్డి  కుమార్తె చి. శివ సాయి శ్రీజ, ఓణీల ఫంక్షన్ ” కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..