👉 డీ లిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల పై నిజంగా బీజేపీది ప్రతికారమే: వైఎస్ షర్మిల..*స్టాలిన్ పిలుపులు – జగన్ మొహమాటాలు ! ..స్టాలిన్ సమావేశానికి కమిటైన కేటీఆర్ ! ..👉*రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దొరికిపోయారు… రహస్య సమావేశం సిగ్గుచేటు: కేటీఆర్*..* జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు..*  *రాజకీయ భిక్ష పెట్టిన జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నాను: మాజీ మంత్రి బాలినేని.. *గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌ఐ శివ‌ను సన్మానించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్…*53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి : గాలి జనార్దన్ రెడ్డి*..👉పిఠాపురం లో జనసేన నాయకుల అరాచకం.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా .. 👉చలివేంద్రంను ప్రారంభించిన కంభం ఎస్సై బి. నరసింహారావు

👉డీ లిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల పై నిజంగా బీజేపీది ప్రతికారమే..దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య.. ఏపీసీసీ చీఫ్ వై ఎస్ షర్మిలా రెడ్డి..విజయవాడ

డీ లిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల పై నిజంగా బీజేపీది ప్రతికారమే ,  దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య అని ఏపీసీసీ చీఫ్ వై ఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ లో సౌత్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్రలో భాగం.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిన మాటలు అక్షర సత్యం.  జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేయడం అంటే..   కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే.  1971 తర్వాత సౌత్ కంటే నార్త్ లోనే అత్యధిక జనాభా పెరిగింది. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్ల జనాభా పెరిగింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం యూపీలో 80 నుంచి 143 సీట్లకు అదనంగా పెరుగుతున్నట్లే.  బీహార్ లో 40 నుంచి 79 కి పెరిగే స్థానాలు కలుపుకుంటే … రెండు రాష్ట్రాల నుంచే 222 ఎంపీలు పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి.  ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్లు 12 మాత్రమే. అంటే 42 నుంచి 54కి మాత్రమే.  సౌత్ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు పదుల సంఖ్యలో ఉంటే,   ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటోంది.   డీ లిమిటేషన్ పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.. డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే… ఏపీ సీఎం చంద్రబాబు  స్పందించకపోవడం తగదు. దాటవేసే ధోరణి అవలభించడం అన్యాయం..బీజేపీతో కూటమి పొత్తులో ఉన్నారని మౌనం వహిస్తే… చేతులు కాలాక ఏం పట్టుకున్నా ఉపయోగం లేదని చంద్రబాబు గారు గ్రహించాలి.  డీ లిమిటేషన్ పై మీ వైఖరి వెంటనే చెప్పాలని …రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.

👉 స్టాలిన్ పిలుపులు – జగన్ మొహమాటాలు !

పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున డీఎంకే నేతలు వచ్చి కలుస్తానంటే జగన్ అంగీకరించారు. వారు పసుపు కండువా కప్పుతానంటే అంగీకరించారు. కండువా కప్పించుకుని స్టాలిన్ పంపించిన ఉత్తరం తీసుకున్నారు. అయితే దానికి సమాధానం చెప్పలేదు. తాను ఇరవై రెండో తేదీన స్టాలిన్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలా లేదా అన్నది ఆయన ఇంకా నిర్ణయించుకోలేదు. మరో వైపు తన మిత్ర పార్టీ బీఆర్ఎస్.. కాంగ్రెస్ కూటమిలోని పార్టీ ఈ సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ వెళ్లాలని నిర్ణయించుకుంది.

బీఆర్ఎస్ నిర్ణయంతో జగన్ పై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఢిల్లీలో జగన్ ధర్నా చేసినప్పుడు ఆయనకు మద్దతుగా ఇండియా కూటమి పార్టీలు అన్నీ వచ్చాయి. దానికి ప్రతిఫలంగా జగన్ ఇప్పటి వరకూ వారికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించలేకపోయారు. ఇప్పుడు దక్షిణాది అంశాన్ని నెత్తికెత్తుకున్న ఇండియా కూటమిలోని కీలక పార్టీకి మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. స్టాలిన్ కు జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు. జగన్ హాజరైతే బీజేపీకి కోపం వస్తుందన్న భయం వైసీపీ నేతల్లో ఉంటుంది. అయితే ఎంత కాలం ఇలా భయపడుతూ బతకాలని తిరగబడదామన్న సూచనలు కొంత మంది చేస్తున్నారు. అయితే దానికి ఇంకా సమయం ఉందా లేకపోతే.. ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఎలా చూసినా బీజేపీతో కలిసేందుకు వైసీపీకి అవకాశం లేదు. అందుకే కాంగ్రెస్ కూటమి అయితేనే మంచిదన్న ఆలోచనకు వస్తున్నారు. కానీ ఎప్పుడు ఆ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లాలో మాత్రం వారికి అర్థం కావడం లేదు.

👉 స్టాలిన్ సమావేశానికి కమిటైన కేటీఆర్ !

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కలసికట్టుగా పోరాడేందుకు చర్చించుకుందామని స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు కేటీఆర్ అంగీకారం తెలిపారు. డీఎంకే నాయకులు వచ్చి ఆహ్వానం ఇచ్చారు. స్టాలిన్ రాసిన లేఖను కూడా ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ స్టాలిన్ కు సంస్కారం ఉందని ప్రశంసించారు. తాము మీటింగ్ కు హాజరవుతామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం కూడా డీ లిమిటేషన్ అంశంపై పెట్టలేదని విమర్శించారు.

కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అనూహ్యమైనదే. ఎందుకంటే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో కీలక నేత. ఆయన పెట్టే సమావేశానికి ఇండియా కూటమిలోని పార్టీలు హాజరవుతాయి. ఇతర పార్టీలు హాజరవడం కష్టమే. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఇండియాయేతర కూటమి పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూటమిలో కీలక పార్టీ కాబట్టి ఆ పార్టీకి చెందిన దక్షిణాది ముఖ్యమంత్రులు లేదా .. ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో డీఎంకే ఆహ్వానం ఇచ్చింది. హైకమాండ్ సూచన మేరకు హాజరవుతానని రేవంత్ ప్రకటించారు. రేవంత్ లేదా భట్టి విక్రమార్క హాజరు కావొచ్చు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరవుతారు. 22వ తేదీన ఈ సమావేశం జరుగుతుంది. రేవంత్ రెడ్డి హాజరు అయితే బీఆర్ఎస్ పార్టీ హాజరవుతుందా లేదా అన్నది సస్పెన్స్. ఏ సమావేశం అయినా సరే రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం బీఆర్ఎస్ కు ఇష్టం ఉండదు.అదీ కూడా ఒకే కాజ్ మీద పోరాడే అంశంలో వేదిక పంచుకుంటే ..  రెండు పార్టీలు కలిసిపోయాయను కుంటారు. ఇప్పటికిప్పుడు కేటీఆర్ హాజరవుతా మని  చెప్పినప్పటికీ.. సమావేశం దగ్గర పడేనాటికి అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

👉 జనసేన పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. సిద్ధార్థనగర్ లో ని క్యాంప్ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు. రాష్ట్రాన్ని కమ్మ, రెడ్లు పాలించారని, ప్రస్తుతం కాపులు పవన్ కల్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చూసినా ప్రజారాజ్యం చివరి వరకు మనుగడ సాగించలేదని అన్నారు.

👉*రాజకీయ భిక్ష పెట్టిన జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నాను: మాజీ మంత్రి బాలినేని*

చంద్రబాబును జైల్లో పెట్టించారు..రఘురామకృష్ణంరాజును జైలులో పెట్టి కొట్టించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను దూషించిన వంశీ, పోసానిని తొమ్మిది నెలల తర్వాత అరెస్టు చేశారు. అదే నేనైతే ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే లాఠీతో కొట్టి లోపల వేయించేవాడిని.. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి

👉గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌ఐ శివ‌ను సన్మానించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్…*ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మాట్లాడుతూ క్రమశిక్షణ, కఠిన సాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు…

మహబూబాబాద్ టౌన్ ఎస్సై శివ‌ తన విధులను నిర్వహిస్తూ, చదువుపై ఆసక్తి కనబరచి ఉన్నతర్యాంక్ సాధించడం, ఇతర పోలీస్‌ అధికారులకు ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఐటీసెల్ సిఐ నరేందర్, ఎస్ బి సిఐ చంద్రమౌళి, డీసీఆర్బి సిఐ సత్యనారాయణ, టౌన్ సీఐ దేవేందర్,ఆర్ఐలు నాగేశ్వర్ రావు, అనిల్, పాల్గొన్నారు.

👉హైదరాబాద్‌: ధూల్‌పేట్‌లో గంజాయి కలకలం. ఐస్‌క్రీమ్‌లు, స్వీట్ల ముసుగులో గంజాయి అమ్మకాలు. హోలీ సందర్భంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు. కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి బాల్స్ కలిపి సరఫరా. పోలీసుల అదుపులో సత్యనారాయణ్‌ సింగ్‌ అనే వ్యక్తి.

👉*53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి..* ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న *53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ* గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్‌ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి బ్రాహ్మణి, కుమారుడు జి కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. *అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని* సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్‌ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది.

👉*రాజాసింగ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి దొరికిపోయారు… రహస్య సమావేశం సిగ్గుచేటు: కేటీఆర్* బీజేపీ నేతలతో రహస్యంగా సమావేశం కావడం సిగ్గుపడాల్సిన విషయమన్న కేటీఆర్…

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చీకటి సమావేశాలు పెట్టడమేమిటని ప్రశ్న… దిక్కుమాలిన చిల్లర రాజకీయాలు తెలంగాణ నేలపై ఇంత వరకు చూడలేదని వ్యాఖ్య.. తెలంగాణ బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం కావడం సిగ్గుపడాల్సిన విషయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు నాయకులు రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేసినట్టు వచ్చిన పత్రికా కథనాన్ని తన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

“బీజేపీ నేతలతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలా.. సిగ్గు.. సిగ్గు..!” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి సమావేశాలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయాలు తెలంగాణ నేలపై ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.ఒకవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్లు పోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఏ గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో దమ్ముంటే ముఖ్యమంత్రి బయటపెట్టాలని కేటీఆర్ నిలదీశారు.పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా, ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని ముఖ్యమంత్రికి, ఈ రహస్య సమావేశాలకు మాత్రం సమయం దొరకడం క్షమించలేని ద్రోహమని అన్నారు.  అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే ముఖ్యమంత్రి బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదని పేర్కొన్నారు. రెండు ఢిల్లీ పార్టీలకు తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాతపెడుతుందని ఆయన పేర్కొన్నారు.

👉పిఠాపురం లో జనసేన నాయకుల అరాచకం.. సామాన్య ప్రయాణీకులపై జులుం.. చిత్రాడ వద్ద ట్రాఫిక్ ఏర్పడడంతో ప్రశ్నించిన సామాన్య ప్రయాణీకుడు   ఆగ్రహంతో పార్టీ జెండా కర్రతో ప్రయాణీకుడిపై దాడి.. మరోవైపు కత్తిపూడి -కాకినాడ 216 జాతీయ రహదారిపై బైక్ తో ప్రమాదకర ఫీట్లు..హడలిపోతున్న ప్రజలు

👉పల్నాడు:మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌కు గాయాలు.. బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయం, ఆస్పత్రిలో చికిత్స… కాసు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు..కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కాసు….

👉తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదు : ఎంపీ రఘునందన్ రావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేది.. కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుంది…ఇది చాలా బాధాకరమైన విషయం..దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి.. ఎంపీ రఘునందన్ రావు….

👉చీదేళ్ల వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా..

*యర్రగొండపాలెం టౌన్ స్థానిక టి.టి.డి కళ్యాణమండపం నందు చీదేళ్ల నాగేశ్వరరావు,వెంకట సునీత గార్ల కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన శ్రావణి,చరణ్ రాజ్ గార్ల ను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు..

👉అయితా వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా*

*మార్కాపురం టౌన్ స్థానిక సౌజన్య ఫంక్షన్ హాల్ నందు అయితా శ్రీనివాసులు,అనసూయ గార్ల కుమారుడు వివాహ మహోత్సవనికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన అవినాష్,మౌనిక లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

👉చలివేంద్రంను ప్రారంభించిన కంభం ఎస్సై బి. నరసింహారావు * *ప్రకాశం జిల్లా కంభంలోని కందులాపురం సెంటర్లో కందులాపురం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను కంభం మండలం ఎస్సై బి.నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్సై నరసింహారావు మాట్లాడుతూ వేసవి కాలం సమయంలో ప్రయాణికులు, వృద్ధులు నీటి సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. తర్వాత ప్రతి ఒక ఆటో డ్రైవర్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి మద్యం తాగి ఆటో నడపటం నేరం అని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించే చలానాలు పెంచారని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రామినేని శ్రీను,ఎన్. రాజు, సహచర ఆటో యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..