👉 ఆడబిడ్డలను మోసగిస్తే తాటతీస్తాం: చంద్రబాబు….
హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని సిఎం చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు.
👉 *వరి, జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి*
*అమరావతి మార్చి 11*.. వరి, జొన్నపంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న క్రమంలో.. మద్దతు ధర ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విన్నవించడం జరిగింది. నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని, మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి.. నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య కలిసి నంద్యాల జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరించారు.. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా నాయకులు తీసుకురావడం జరిగింది.. ప్రస్తుతం జిల్లాలో క్వింటా జొన్నలకు రూ. 2400 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లిస్తున్నారని, కాబట్టి మద్దతు ధరను రూ. 3400 కు పెంచి జొన్న రైతులను ఆదుకోవాలన్నారు.. అలాగే ప్రస్తుతం జిల్లాలో క్వింటా వరి పంటకు రూ. 1200 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లిస్తున్నారని, గిట్టుబాటు ధరను రూ. 1800 కు పెంచి వరి పండించే రైతులను సైతం ఆదుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు… ఈ సందర్భంగా వరి, జొన్న పంటల గిట్టుబాటు ధర పెంపుపై నంద్యాల జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది.. నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటకు మద్దతు ధర పెంపుపై మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
👉మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి: షర్మిల..ఏపీలో ఆందోళనల బాటపడుతున్న అంగన్వాడీలు..అంగన్వాడీల తరఫున గళం వినిపించిన షర్మిల..అంగన్వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవని స్పష్టీకరణ..
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఆందోళనల బాటపడుతుండడం పట్ల ఆమె స్పందించారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని, తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వారి గొంతు నొక్కి, ఆందోళనలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వ చేష్టలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు…నెలకు గౌరవ వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.గ్రాట్యూటీ చెల్లింపు హామీని అమలు చేయాలి.మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి.హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలి. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.
👉*పోసానికి బిగ్ రిలీఫ్..* నేడు ఆదోని, విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరు..*ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు.. మిగతా కేసుల్లో BNS చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం..*గతంలో నాలుగు కేసుల్లో పోసానికి రిమాండ్..*ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి..*అన్ని కేసుల్లో రిలీఫ్ రావటంతో రేపు విడుదల అయ్యే అవకాశం
👉*జొన్నపంటకు మద్దతు ధర కల్పించాలి* *వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి* నంద్యాల జిల్లా రైతుల సమస్యను వివరించిన మంత్రులు ఫరూక్, బిసి, ఎమ్మెల్యేలు బుడ్డా,గౌరు, గిత్తా, భూమా అఖిల ప్రియ*. అమరావతి మార్చి 11*
*నంద్యాల జిల్లాలో జొన్న పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కే. అచ్చెన్నాయుడు దృష్టికి నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు తీసుకువెళ్లారు.మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడుని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య లు కలిశారు. నంద్యాల జిల్లాలో జొన్న పంట సాగు విస్తీర్ణం విస్తారంగా ఉందని పేర్కొన్నారు. క్వింటా జొన్నలకు రూ. 2400 మాత్రమే చెల్లిస్తున్నారని, రూ.3400 కు మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ మంత్రిని మంత్రులు ఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోరారు. జొన్న రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనపై మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చి సానుకూలంగా స్పందించారు.
👉రైతులకు మద్దతు ధర కల్పించండి*…ముఖ్యమంత్రిని కలిసిన నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు…*నంద్యాల జిల్లాలో వరి, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి*
• నంద్యాల జిల్లాలో ప్రస్తుతం క్వింటా జొన్నలు ధర రూ. 2400* … • వరి మద్దతు ధరను రూ. 3400 కు పెంచి రైతులను ఆదుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు* *నంద్యాల జిల్లాలో ప్రస్తుతం క్వింటా వరి ధర రూ. 1800**మద్దతు ధరను రూ. 1800 కు పెంచి రైతులను ఆదుకోవాలని కోరిన ప్రజాప్రతినిధులు*
👉ఎస్ఐబి నరసింహారావు మంగళవారం కంభం మరియు తురిమెళ్ళ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద చేసిన భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
👉గిద్దలూరు, శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాల లో 19 న జాబ్ మేళా…ఈ జాబ్ మేళాలలో (Greentech Industries,Apollo Pharmacy Limited,Hetero Labs Ltd )కంపెనీలు పాల్గొంటారని డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జె .రవితేజ యాదవ్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులు పదో తరగతి నుంచి పీజీ అర్హత కలిగి 19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు హాజరు కావచ్చని తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీడ్ ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో* ఈ నెల 19 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జె .రవితేజ యాదవ్ తెలిపారు. మరిన్ని వివరములకు ఈ క్రింద తెలుపబడిన నెంబర్లను సంప్రదించగలరు.7997151082,8019311043,90149 16791

