👉పవన్ కూడా ఆ తానులో ముక్కేనా ? చెగువీరా నుంచి స్పూర్తి పొంది జనసేనను స్థాపించానని పవన్ 2014లో చెప్పినపుడు ఆయన రాజకీయం ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు. సంప్రదాయ రాజకీయాలు అంటే జనాలకు వెగటు. ఎందుకంటే అందులో అంతా పాత చింతకాయ ఉంటుంది. వారసత్వం తో కూడిన రాజకీయాలతో పాటు కుటుంబ పార్టీల రాజ్యం నడుస్తుంది. నిజానికి అభ్యుదయగాములు అయితే ఇలాంటివి కోరుకోరు. *చెగువీరా నుంచి స్పూర్తి పొంది జనసేనను స్థాపించాను అని పవన్ 2014లో చెప్పినపుడు ఆయన రాజకీయం ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే పవన్ 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కాదు ఆల్టర్నేటివ్ సెక్షన్లతో కూడిన పాలిటిక్స్ కి తెర తీశారని అనుకున్నారు.
కానీ ఆ ముచ్చట మూడు నాళ్లే అయింది. ఓటమి పాలు కాగానే పవన్ 2020లో తిరిగి బీజేపీతో పొత్తుకు వచ్చారు. 2024 ఎన్నికలలో టీడీపీతో కలసి జనంలోకి వచ్చారు. ఈ రెండు పార్టీలను 2017 నుంచి 2019 దాకా తాను తీవ్రంగా విమర్శించాను అన్నది కూడా ఆయన చాలా కన్వీనియంట్ గా మరచిపోయారు అని అంటున్నారు.* ఇదిలా ఉంటే పవన్ సమ సమాజం అందరికీ అవకాశాలు అని నినదిస్తూ వచ్చారు కానీ ఆయన రాజకీయాలు కూడా సామాజిక బంధాల నుంచి దాటి వెళ్ళలేదని ఎన్నికల్లో టికెట్ల పంపిణీ నుంచి అనేక అంశాలలో నిరూపించారని విమర్శలు ఉన్నాయి. ఇక మంత్రి పదవులు చూస్తే జనసేనకు ముగ్గురు ఉంటే అందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇపుడు నాగబాబుని మంత్రిగా తీసుకుంటారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు అవుతారు. పైగా వారసత్వ రాజకీయాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. *దీని మీద అపుడే వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కామెంట్స్ కూడా చేశారు. అన్నదమ్ములు తండ్రీ కొడుకుల కూటం ప్రభుత్వం అని కామెంట్స్ చేశారు. అంటే చంద్రబాబు నారా లోకేష్ అలాగే పవన్ నాగబాబులను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిజానికి ప్రాంతీయ పార్టీలు మాత్రమే కాదు ఈ దేశంలో చాలా జాతీయ పార్టీలలో కుటుంబాల పెత్తనమే ఉంది. *ఏపీలో చూస్తే టీడీపీ వైసీపీ అలాగే ఉంటూ వచ్చాయి. కానీ జనసేన కొత్తరకం రాజకీయం చేస్తుందని అంతా ఆశిస్తున్నారు కానీ జరిగింది వేరుగా ఉంటోంది అని అంటున్నారు. జనసేనకు నాలుగో మంత్రి పదవి బీసీలకు ఇచ్చి ఉంటే ఆ పార్టీకి మరింత వన్నె చేకూరుతుందని అంటున్నారు. అలా కాకుండా నాగబాబుని మంత్రిగా చేస్తే మాత్రం జనసేనాని పవన్ కూడా ఆ తానులో ముక్కేనా అని అంటారు. మరి ఆ విమర్శలతో ప్రత్యర్ధులకు ఆయుధం ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉందా లేదా అన్నది కొద్ది రోజూల్లో తేలుతుంది అని అంటున్నారు.
👉భారత్‌లో యూట్యూబర్లకు షాక్.. 29 లక్షల వీడియోలు, 48 లక్షల ఛానెళ్ల తొలగింపు … యూట్యూబ్.. దీని గురించి తెలియని వారంటూ ఉండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యూట్యూబ్ వాడంది ఉండరు. తాజాగా భారతదేశంలో యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. 29 లక్షల వీడియోలు, 48 లక్షల ఛానెళ్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీడియో కంటెంట్ పాలసీకి సంబంధించి YouTube పెద్ద చర్య తీసుకుంది. యూట్యూబ్ దాని ప్లాట్‌ఫామ్ నుండి 9.5 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించింది. కంటెంట్ ఉల్లంఘన కారణంగా Google వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈ వీడియోలను తీసివేసింది. అదే సమయంలో అక్టోబర్-డిసెంబర్ 2024 మధ్య యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు భారతదేశంలోని ప్లాట్‌ఫారమ్ నుండి 2.9 మిలియన్లకు పైగా (29 లక్షలు) వీడియోలు తొలగించింది. మార్గదర్శకాలను పాటించని ప్లాట్‌ఫారమ్‌లోని వీడియోలను గుర్తిస్తుంది. తొలగించిన వీడియోలలో ఎక్కువగా పిల్లలను ప్రమాదంలో పడేసే విన్యాసాలు, వేధింపులు వంటి కంటెంట్ ఉన్నట్లు గుర్తిచింది.ఈ కంటెంట్ తమ విధానానికి విరుద్ధమని యూట్యూబ్ పేర్కొంది. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించబడిన కంటెంట్‌లో ద్వేషపూరిత ప్రసంగం, పుకార్లు, వేధింపులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి.యూట్యూబ్ వీడియోలను తొలగించడమే కాకుండా, దాని ప్లాట్‌ఫామ్ నుండి 4.8 మిలియన్లకు పైగా అంటే 48 లక్షల ఛానెల్‌లను కూడా తొలగించింది. ఈ ఛానెల్‌లు స్పామ్ లేదా మోసానికి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాయని యూట్యూబ్ చెబుతోంది.
👉హైదరాబాద్: అఫ్జల్‌గంజ్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన నార్కోటిక్ టీమ్.. *ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. *కేసులో జియాగూడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త
👉*గిద్దలూరు అభివృద్దే లక్ష్యం* : *గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*గిద్దలూరు పట్టణ అభివృద్దే లక్ష్యంగా ఎన్దీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ముండ్లపాడు రోడ్డులో రూ. 10 కోట్లతో ఏర్పాటు చేయనున్న STP ప్రాజెక్ట్ (మురుగునీరు శుద్ధి కేంద్రం) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోని భూమి పూజా శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, గిద్దలూరు నగర పంచాయతీని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమన్నారు.. కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మున్సిపల్ శాఖ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గోన్నారు.*
👉CVN మౌనిక సిల్క్స్ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల, సినీనటి అనసూయ..
గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన CVN మౌళిక సిల్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, మరియు టాలీవుడ్ సినీనటి అనసూయ భరద్వాజ్ లు ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. మొదటగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, అనసూయ భరద్వాజ్ లు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.. ఈ సందర్బంగా సినీనటితో కలిసి, ఎమ్మెల్యే షాపింగ్ మాల్ ను సందర్శించి సందడి చేశారు.. గిద్దలూరు పట్టణంలో ప్రారంభించిన షాపింగ్ మాల్ మంచి లాభాలతో ప్రజల మన్ననలు పోందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు.*
👉 ఇఫ్తార్ విందులో పాల్గోన్న ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి .. గిద్దలూరు పట్టణం, 7వ వార్డులోని బిలాల్ మజీద్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా మసీదులో నిర్వహించిన ప్రార్థనలో పాల్గోని అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును వడ్డించారు.. ఈ సందర్భంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ముస్లిం మైనార్టీ సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బిల్లా రమేష్, తురిమెళ్ళ సురేష్, బద్రీనాథ్ వేములపాటి చెన్నయ్య, సంపత్ రెడ్డి, ప్రసాదవ్, మరియు ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.*
👉*దోపిడీదారులుగా మారుతున్న పోలీసులు*ఎన్టీఆర్ జిల్లా .. విజయవాడ*సామాన్యులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న కృష్ణలంక నైట్ గస్తీ బీట్ కానిస్టేబుళ్లు*వసూళ్లకు పాల్పడుతున్న మీరా, రమేష్ అనే ఇద్దరు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుళ్లు*ఒంటరిగా వెళ్లే సామాన్యులే టార్గెట్ గా కానిస్టేబుళ్ల దందా**గత రాత్రి ఓ వ్యక్తిని అడ్డగించి బెదిరించిన నైట్ బీట్ కానిస్టేబుళ్లు**ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు, సీఐ కు ఫోన్ చేసినా స్పందించని వైనం**పోలీస్ వ్యవస్థకు మచ్చ తెస్తున్న కానిస్టేబుళ్ల పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు*
👉దారుణం.. 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారం
యూపీ కాన్పూర్‌లో దారుణం జరిగింది. రంజాన్ మాసం కావడంతో అజార్, హుస్సేన్ అనే వ్యక్తుల పార్ట్‌నర్స్ శృంగారానికి నిరాకరించారని 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. డీసీపీ బ్రజేంద్ర ద్వివేది వివరాల ప్రకారం.. మార్చి 5న జిమ్‌కు వెళ్తున్న బాలుడిని నిందితులు కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తాడుతో గొంతు బిగించి చంపారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసినట్లు పేర్కొన్నారు. హుస్సేన్‌ను అరెస్ట్ చేయగా.. అజార్ పరారీలో ఉన్నాడు.

