👉మణిపూర్‌ లో మళ్లీ ఉద్రిక్తత ! ఒకరి మృతి ! 40 మందికి గాయాలు !..👉 ఏపీకి చంద్రబాబు అడ్వాంటేజ్ – ఇండియా టుడే కాంక్లేవ్ లో నారా లోకేష్..👉 తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. 👉నవమాసాల్లో నవమోసాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం: ఆర్కే రోజా..👉 వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అరెస్ట్..👉యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేస్తున్న కర్నూలు పోలీసులు ..* కంభం లో జకాత్ కిట్ల పంపిణీ.. 👉మై జీవన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 150 మంది నిరుపేద ముస్లింలకు ఉచిత బియ్యం పంపిణీ మరియు చలివేంద్రం ఏర్పాటు*….

👉మణిపూర్‌ లో మళ్లీ ఉద్రిక్తత ! ఒకరి మృతి ! 40 మందికి గాయాలు ! మణిపూర్‌ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ తెగ నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకు శనివారం నుంచి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిచ్చారు. అయితే తమకు ప్రత్యేక పరిపాలన కల్పించే డిమాండ్‌ నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దంటున్న కుకీలు కాంగ్‌ పోక్పి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించగా… 40 మంది వరకు గాయాలపాలయ్యారు. వీరిలో 16 మంది స్థానికులు కాగా, 27 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి కుకి జో ప్రాంతంలో నిరవధిక బంద్‌కు కుకి జో మండలి పిలుపునిచ్చింది. కుకీల ప్రాబల్యం ఉన్న చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు వాహనాలపై రాళ్లు రువ్వడమేకాకుండా రోడ్లను తవ్వారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో దాదాపు 114 ఆయుధాలు, ఐఈడీలు, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు సీజ్‌ చేశాయి.ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చిందని చెప్పారు.

👉ఏపీకి చంద్రబాబు అడ్వాంటేజ్ – ఇండియా టుడే కాంక్లేవ్ లో నారా లోకేష్కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు  అడ్వాంటేజ్ అని నారా లోకేష్ చెప్పారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చిందని తెలిపారు. బర్నింగ్ ఇష్యూపై రాజ్ దీప్ లోకేష్ పలుప్రశ్నలు అడిగారు.త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదని స్పష్టం చేశారు. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం. స్థానిక భాష తెలుగు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతారని భావించడం లేదన్నారు. వైసీపీ హయాంలో తనపై 23 కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు కూడా పెట్టారన్నారు. వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అప్పట్లో బయటకు విపక్షాలను రానివ్వలేదని ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు. నేడు డిప్యూటీ సీఎం కంటే జగన్ కు భద్రత ఎక్కువని గుర్తుచేశారు. 1990ల్లో అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగేవి. నేడు అలాంటి చర్చలు లేకపోవడం బాధాకరం. జగన్ రెడ్డి వైసీపీకి నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం. మేం చట్టాలను గౌరవిస్తాం. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తామని లోకేష్ ప్రశఅనించారు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందని మంగళగిరి నుంచి పోటీచేసి 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశాను. 2024 ఎన్నికల్లో పోరాడి 91వేల భారీ మెజార్టీతో గెలిచాను. ఏపీలో ఇది మూడో అత్యధిక మెజార్టీ. కష్టమైన హెచ్ ఆర్డీ శాఖను ఎంచుకున్నానన్నారు. తన భార్య బ్రాహ్మణి తన క్రెడిట్ కార్డు బిల్లు పే చేస్తుందని, మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు …ప్రతిరోజూ జరుపుకోవాలని అన్నారు.

👉నవమాసాల్లో నవమోసాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం.. ఆర్కే రోజా, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి…మహిళ బాగుంటే ఇల్లు బాగుంటుంది..అందుకే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి పథకం మహిళ పేరు మీద ఇచ్చారు. జగనన్న సహకారంతో మహిళలు సాధికారత దిశగా అడుగులు వేశారు. మహిళల భద్రత కోసం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. నవమాసాల్లో నవమోసాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం.

👉 వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అరెస్ట్.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాకేశ్ గాంధీ అరెస్ట్ అయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతేడాది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.

👉యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేస్తున్న కర్నూలు పోలీసులు … కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈవ్‌ టీజింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడే వారి పై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని ఆయా పాఠశాలలు, కళాశాలల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ , ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్ధిని, విద్యార్దులకు అవగాహన చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాంటీ ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్ ను కొత్తగా అమలులోకి తీసుకొచ్చారు. వివిధ కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.  ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈవ్ టీజింగ్ పాల్పడే వారి పై నిఘా ఉంచి 2,818 మందిని జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలలో, పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సిలింగ్ చేశారు.

👉న్యూయార్క్‌లో కార్చిచ్చు.. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు…లాంగ్ ఐలాండ్‌లోని హోంఫ్టన్స్ లో భారీగా మంటలు.. కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో హైవేలు మూసివేత…తీవ్రంగా శ్రమిస్తూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది_

👉 తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..

ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి.. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్..ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్.. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు.

👉జమాతే ఇస్లామి హింద్ కంభం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంజాన్ పర్వదినం సందర్భంగా వంద మంది పేదలకు జకాత్ కిట్లను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షులు ఎస్ఎండి రఫీ మాజీ జిల్లా అధ్యక్షులు గౌస్ ఖాన్ జమాతే ఉలమా కంభం ముఫ్తీ యాసిన్ సాహెబ్ స్థానిక ఎస్సై ఓ అధ్యక్షులు చాన్ బాషా, కార్యదర్శి వసీం, విశ్రాంత ఉపాధ్యాయులు జలీల్, లెక్చరర్ నాయక్ రసూల్ ఫరూక్, జమాతే ఇస్లామి హింద్ సభ్యులు ఆసిఫ్, అబ్దుల్లా అల్తాఫ్, ఎస్ ఐ ఒ సభ్యులు బాజిత్ సిద్దిక్ రవుఫ్ తదితరులు పాల్గొన్నారు.

👉మై జీవన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 150 మంది నిరుపేద ముస్లింలకు ఉచిత బియ్యం పంపిణీ మరియు చలివేంద్రం ఏర్పాటు*…. పవిత్ర రంజాన్ మాసంలో కంభం పట్టణానికి చెందిన కీ ” శే ” షేక్ మహబూబ్ బాషా జ్ఞాపకార్థం వారి కుమారులు షేక్ బాజీద్ భాష, డాక్టర్ లతీఫ్ ల ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్ష రూపాయల విలువగల బియ్యం ప్యాకెట్లను 150 నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వేసవి తాపానికి బాటసారుల దాహం తీర్చడానికి వారి స్వగృహం నందు రంగస్వామి దేవస్థానం  సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ తండ్రి వర్ధంతి నాడు ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేయడం తమకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన పలువురు మహబూబ్ బాషా  కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..