నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ.. 👉వాచ్ మన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. 👉నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..👉 డీజీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..👉బిల్లులు రాలేదని పంచాయితీ ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్..👉బాలికల హాస్టల్‌లో రహస్య కెమెరాల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు.. *మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి:జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు…* సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహ..▪️ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బు, బంగారం స్వాహా చేసిన నిందితుడి అరెస్టు*

👉పోరాడదాం రండి.. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం భేటీ.. రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజ`పాటు లోక్ సభ ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్ర రుణ భారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్పై చర్చించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను రూపొందిస్తారు.

👉ఉద్యోగులకు GOOD NEWS 😱😱😱

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వారికి APR నుంచి ప్రతినెలా ₹500-600 కోట్ల చొప్పున ₹8,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. ఇకపై కొత్త బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు. ఉద్యోగులు బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికేతర అంశాలను సబ్ కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని వెల్లడించారు.

👉వాచ్ మన్ రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న.. ఊపిరితిత్తుల వ్యాధితో తన భర్త మరణించాడని రంగన్న భార్య వెల్లడి.. ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం, రంగన్న మృతిపై మంత్రివర్గంలో చర్చ.. గతంలో పరిటాల హత్య కేసులోనూ సాక్షులు ఇలాగే మరణిస్తూ వచ్చారన్న చంద్రబాబు.. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. రంగన్న ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడని ఆయన భార్య చెబుతున్నప్పటికీ, పలు వైపుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అనంతరం వాచ్ మన్ రంగన్న మృతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇదే విధంగా మరణిస్తూ వచ్చారని… ఇప్పుడు వివేకా హత్య కేసులో అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు…కాగా, వివేకా హత్య జరిగినప్పుడు జగన్, వైఎస్ భారతిలను కారులో హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడన్న విషయం, వివేకా హత్య గురించి కారులో జగన్, భారతి మాట్లాడుకున్న మాటలను ఆ డ్రైవర్ విన్నాడని, ఆ తర్వాత అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ గతంలో జరిగిన ప్రచారంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. వివేకా వ్యవహారానికి సంబంధించి ఇప్పటిదాకా ఏడుగురు మరణించారని కూడా చర్చ జరిగింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ… జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను అనేకసార్లు చెబుతున్నానని గుర్తుచేశారు. కాగా, వాచ్ మన్ రంగన్న మృతి వెనుక పోలీసుల హస్తం ఉందంటూ వచ్చిన వార్తలపై డీజీపీ స్పందించారు. డీజీపీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రంగన్న మృతిలో అనుమానాలు ఉన్న మాట నిజమేనని, పోలీసుల విచారణలోనూ ఆ విషయం స్పష్టమైందని అన్నారు.

*క్యాంపస్ సెలక్షన్ లో 22 మంది ఎంపిక.. చిలకలూరిపేట:  స్థానిక డి ఆర్. ఎన్. ఎస్. సి. వి. ఎస్ కళాశాల ఆధ్వర్యంలో మల్టీ నేషనల్ కంపెనీలు అయినటువంటి కనెక్ట్ సొల్యూషన్ , ఆల్డిజీ వారిచే కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరా సుజాత తెలిపారు . కనెక్ట్ సొల్యూషన్ , హెచ్ ఆర్ అజయ్ గోవిందరాజు కోఆర్డినేటర్ సలీంలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 150 మంది విద్యార్థులు పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కలిగిన 22 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో  చిలకలూరిపేట విద్యా సంఘం అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు , వైస్ ప్రెసిడెంట్ కందిమళ్ల సాంబశివరావు , సెక్రటరీ ఎంవీఎస్ కుమార్ జాయింట్ సెక్రెటరీ బేతంచర్ల రామకోటేశ్వరరావు కోశాధికారి బి రామలింగేశ్వర రావు , ప్రిన్సిపాల్ డాక్టర్ బైరా సుజాత , ఏవో చుండి వెంకన్న రావులు , పాల్గొని ఎంపిక అయిన విద్యార్థులను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు .

👉నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమం పాల్గొననున్న సీఎం చంద్రబాబు, మంత్రులు..వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి..అనంతరం డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం..2 లక్షల మందికి కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్న సీఎం..

👉మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి… జిల్లా ఎస్పీ  టి . శ్రీనివాస రావు… జోగులాంబ గద్వాల జిల్లా ( మార్చి 07):మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పి టి .శ్రీనివాస రావు అన్నారు.శనివారం అంతర్జతీయ మహిళ దినోత్సవం మార్చి-8 ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని జిల్లా ఎస్పీ మహిళ అధికారులలో ప్రత్యేక సమావేశం అయ్యారు.ఈ సంద్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎస్సై నుండి హోమ్ గార్డ్ అధికారి వరకు మహిళ అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు బయటకు రాని కాలంలో రుద్రమ దేవి లాంటి వారు రాజ్యాలను పాలించారని, సరోజని దేవి లాంటి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, మహిళలకు రాజకీయాలు అంటే తెలియని కాలంలో ఇందిరా గాంధీ గారు దేశాన్ని పాలించారని , జిల్లాకు సైతం కలెక్టర్,ఎస్పి గా వచ్చిన మహిళ అధికారులు మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడున్న మహిళ అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి ఏంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చారని ఎందరో మహిళలకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు అని అన్నారు. ప్రతి మహిళ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఇంట బయట చక్కగా రాణించగలగాలని, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని అన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ఇప్పటికి చాలా మంది మహిళలు బయపడుతారని ఆ భయాన్ని తొలగించాలని , ప్రజలలో పోలీస్ పై మరింత నమ్మకాన్ని కల్గించాలని తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని ఎస్పీ సుచించారు. పోలీస్ ఉద్యోగం రావాలంటే ఏంతో అదృష్టం ఉండాలనీ , రాజ్యాంగం కల్పించిన గురుతర బాధ్యతను పారదర్శకంగా అమలయ్యేలా విధులు ఉండాలనీ , మహిళ అధికారులు జిల్లా పోలీస్ పేరు ప్రతిష్టను మరింత పెంచేలా కృషి చెయ్యాలని ఆకాంక్షించారు. అనంతరం అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ మహిళల చేత కెక్ కట్ చేయించి మహిళ అధికారులందరికి ప్రశంస పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సాయుధ దళ డి.ఎస్పి నరేందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అర్ ఐ వెంకటేష్, ఐటీ, డీసీ ఆర్బి, ఎస్బి ఇంచార్జి ఎస్సై రజిత, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల మహిళ పోలీస్ అధికారులు, అన్ని విభాగాల పోలీస్ అధికారులు, భరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

* సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహ..

సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సన్ ప్రీత్ సింగ్ డీఐజీగా ప్రమోషన్ రావడంతో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ అయ్యారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఎంతో కృషి చేశారు.

*రాత్రి పూట తాళాలు వేసిన ఇళ్లె టార్గెట్*..బంగారు వస్తువులు లను దొంగతనం చేయు నేరస్తులను అరెస్టు చేసిన షాద్ నగర్ పోలీసులు .. రాత్రిపూట తాళాలు వేసిన ఇట్లనే టార్గెట్ చేస్తూ విలువైన బంగారు వస్తువులను దొంగతనం చేయు నేరస్తులను అరెస్టు చేసినట్టు షాద్నగర్ పోలీసులు తెలిపారు. షాద్నగర్ ప్రశాంత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శానముని నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీన సమయం 5 గంటలకు ఫిర్యాదారుడు తన సొంత తమ్ముడు వివాహము ఉన్నందున తన సొంత గ్రామము ఐన అంతారం, నందిగామ మండలము కి వాళ్ళు ఉంటున్న ఇల్లు కి తాళము వేసి కుటుంబం తో సహ వెళ్ళినారని అయితే ఫిబ్రవరి 26వ తేదీ నాడు నాడు ఉదయం 8 గంటల సమయం లో అదే కాలనీ లో ఉండే విష్ణు మూర్తి అనే వ్యక్తి ఫిర్యాదారుని కి ఫోన్ చేసి ఫిర్యాదారుని యొక్క ఇల్లు డోర్ లు తెరిచి ఉన్నాయి అని చెప్పగా ఫిర్యాదుదారుడు వెంటనే వచ్చి చూడగా మెయిన్ డోర్ తాళము విర్రగొట్టబడి ఉన్నది మరియు లోపలికి వెళ్ళి చూడగా బీరువా యొక్క తాళము విర్రగొట్టబడి ఉండి బీరువా లో ఉన్నబంగారు వస్తువులు 1) బంగారు పూస్తేల తాడు-3 తులము, 2) బంగారు చైన్ ఒక తులము 3) రెండు చేతి ఉంగరాలు కలిపి ఒక తులము మరియు కొంత నగదు కంపడటం లేదు అని ఫిర్యాదారుడు షాద్ నగర్ పోలీసు స్టేషన్ కి వచ్చి ఫిబ్రవరి 26వ తేదీ నాడే ఫిర్యాదు చేయగా ఇట్టి విషయం లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు లో బాగంగా మార్చి 5వ తేదీ నాడు నాడు ఇట్టి కేసును షాద్ నగర్ పోలీసు వారు సాంకేతిక సాక్ష్యం ఆదారంగా కేసును ఛేదించి నిందితులు అయిన ప్రదీప్ సూర్యవంశీ మరియు అమిత్ చౌహాన్ లను అరెస్టు చేసి విచారించగా నిందితులు రాత్రిపూట తాళాలు వేసిన ఇండ్లను చూసి చుట్టుపక్కల ఎవరు లేనిది చూసి అట్టి ఇండ్ల యొక్క తాళము లను విర్రగొట్టి ఇండ్ల లలో నుండి విలువైన వస్తువులు దొంగలించుకొని పారిపోతాము అని ఒప్పుకునారు. నిందితుని వద్ద నుండి షాద్ నగర్ పోలీసులు షాద్ నగర్ కేసు కు సంబoధించిన గోల్డ్ రెండు నల్లపూసల దండ, ఒక జత 1 గ్రాము గోల్డ్ గాజులు, ఒక 1 గ్రాము గోల్డ్ ఉంగరము, ఒక 1 గ్రాము గోల్డ్ చైన్, కొన్ని చిల్లర పైసలు, వెండి మూత నిందితుల వద్ద నుండి స్వాదీనపర్చుకొని నిందితుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించనైనది. ఈ కేసు లక్ష్య చేదనలో శంషాబాద్ డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ శ్రీ నరసింహ గౌడ్ ఐపీఎస్, మరియు షాద్ నగర్ ఏసీపీ సిహెచ్. రంగస్వామి పర్యవేక్షణలో, శ్రీ కె విజయ్ కుమార్, ఇన్.స్పెక్టర్, ఎస్‌ వెంకటేశ్వర్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ల ఆధ్వర్యంలో కేసు విచారణాదికారి, క్రైం డిప్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ జి శివ రెడ్డి మరియు నేర విభాగం కానిస్టేబుల్ లైన మోహన్, కర్ణాకర్, జాకీర్, రాజు మరియు రఫీ కేసు ను ఛేదించడం లో కీలక పాత్రపోషిoచినారు. మరియు వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.

*▪️ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ…లక్షల్లో డబ్బు, బంగారం స్వాహా చేసిన నిందితుడి అరెస్టు..

*ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ, అలాగే నిట్‌ లాంటి కళాశాలలో సీటు ఇప్పిస్తున్నాను అంటూ బాధితుల నుండి లక్షల్లో డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను స్వాహా చేసిన మోసగాడిని హన్మకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు సుమారు ఐదు లక్షల పదివేల రూపాయల విలువ గల గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 2లక్షల 68 వేల రూపాయల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను, IDFC డెబిట్ కార్డు ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసిపి దేవేందర్‌ రెడ్డి వివరాలను వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడప జిల్లా, వీరపునాయునిపల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నిందితుడు కొమ్మ వివేకానంద రెడ్డి ఆలియాస్‌ కిషోర్‌ రెడ్డి (37) కొద్ది కాలం ప్రవైయిట్‌ టీచర్‌గా పనిచేస్తూ వచ్చిన జీతం డబ్బు తన జల్సాలకు ఖర్చు కావడంతో తన తోటి ఉపాద్యాయులతో స్నేహంగా మంచివాడిగా నటిస్తూనే వారి వద్ద త్వరలోనే తిరిగి ఇస్తానని డబ్బులు, బంగారు నగలను తీసుకొని వారికి తిరిగి ఇవ్వకుండా సహోద్యోగులను మోసం చేసిన సంఘటనలో నిందితుడుపై ఆంధ్రప్రదేశ్‌లో మూడు కేసులు నమోదు కావడంతో నిందితుడు రెండు నెలలు జైలు జీవితం గడిపిన అనంతరం నిందితుడు తన మకాంను హన్మకొండకు మార్చుకున్నాడు. ఇక్కడ నిందితుడు కొత్త పేరుతో ఓ ప్రవైయిట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాక కొద్ది రోజుల అనంతరం నిందితుడు అందులో పనిచేసే మరో మహిళా ఉపాధ్యాయురాలి పరిచయం చేసుకొన్నాడు. తనకు వరంగల్‌ ఎన్‌.ఐ.టి లో పరిచయస్తులు వున్నారని ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని సదరు మహిళా ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆమెవద్ద ఎనిమిది లక్షల రూపాయలతో పాటు ఆమె కొడుకు ఎన్‌.ఐ.టిలో సీటు ఇప్పిస్తానని 60 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడి మకాం మార్చాడు. ఇదే రీతిలో నిందితుడు పేరు మార్చుకొని మరో ముగ్గురు బాధితుల నుండి ఇదే తరహలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసారు. నిందితుడు మోసంతో దోచుకున్న సోమ్ముతో జల్సాలు చేయడంతో పాటు, ఇంటి గృహోపరకరణాలు, బంగారు ఆభరణాలు చేయించుకున్నాడు. ఈ రోజు తాను నివాసం వుంటున్న కిరాయి ఇంటినుండి సామాను తరలిస్తుండుగా పోలీసులు నిందితుడి పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ పోలీస్‌ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏసిపి అభినందించారు. అదే విదంగా ప్రైవేట్ పాఠశాల యాజమానులను ఉద్దేశించి కొత్తగా జాయిన్ అయ్యే టీచర్ల యొక్క పూర్తి వివరాలు మరియు వారు ఎక్కడ పని చేసి వచ్చారో, వారి పై ఏమైనా కేసులు ఉన్నాయో విచారించిన తర్వాతనే స్కూల్ లో జాయిన్ చేసుకోగలరని ఏసీపీ గారు విజ్ఞప్తి చేసారు.

👉పల్నాడు జిల్లా….దాచేపల్లి సమాచారం..దాచేపల్లి పట్టణ పంచాయతీ సంక్షేమ కార్యదర్శి సాంపతి లక్ష్మీ ప్రసాద్‌ను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో దాచేపల్లి పోలీసులు అరెస్టు చేశారు.28.02.2025న రూ. 34,18,000/- బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసిన నిందితుడు, రూ. 11,12,500/- మాయం చేసి పరారయ్యాడు. 01.03.2025న కార్యాలయానికి హాజరు కాలేదు మరియు ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహితా (BNS) సెక్షన్ 316(5), 318(4) ప్రకారం దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. దాచేపల్లి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని దాచేపల్లి సీఐ పి. భాస్కర్ , ఎస్‌ఐ పాపారావు  వెల్లడించారు.

👉బాలికల హాస్టల్‌లో రహస్య కెమెరాల కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు..సంగారెడ్డి: లేడీస్‌ హాస్టల్‌లో రహస్య కెమెరాలు అమర్చిన యజమాని. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధి పటేల్‌గూడలో ఘటన.. బాలిక ఫిర్యాదుతో హాస్టల్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. హాస్టల్‌ యజమాని మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

👉బిల్లులు రాలేదని పంచాయితీ ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామంలో తన బిల్లులు రాలేదని గ్రామ పంచాయితీ ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్..తాను సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ట్రాక్టర్‌ను ఫైనాన్స్‌కి తెచ్చానని, పంచాయితీ కార్యదర్శి కిస్తీలు కట్టక పోవడంతో తన సిబిల్ స్కోర్ పోతుందని ఆవేదన..గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..