👉*ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల న్యూడ్ కాల్*😲😲😲
*బరితెగించిన సైబర్ నేరగాళ్లు*
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేశారు..క్షణాలపాటు దాన్ని స్కీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు.
ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలు, అభిమానులకు పంపారు.
దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
👉గుంటూరు పట్టణం వెంగాళయ పాలెం లో నకిలీ డ్వాక్రా గ్రూపు ల ఘరానా మోసం …😱😱😱
కోటి 50 లక్షలు రూపాయలు మోసం చేసిన11 నకిలీ గ్రూపు సంఘాలు..
నల్లపాడు జి డి సీసీ బ్యాంక్ నుంచి రుణం పొందిన వైనం..కోటి 50 లక్షలు రూపాయలు మోసం జరిగిందని నల్లపాడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన డి ఆర్ డీ ఏ పిడి విజయలక్ష్మి..మోసం చేసిన ఘటనలో 11 నకిలీ డ్వాక్రా గ్రూపు ఉన్నాయని పిర్యాదు లో పేర్కొన్న వైనం..
రుణం పొందిన గ్రూపు లు డీ ఆర్ డి ఎ,గ్రూప్.,మేప్మా గ్రూప్ సభ్యులు కాదని విజయలక్ష్మి వెల్లడి..
నకిలీ డ్వాక్రా గ్రూపు ల పై కేసు నమోదు చేసిన పోలీసులు..
11 నకిలీ గ్రూప్ ల పై చీటింగ్ కేసు.నమోదు..
నల్లపాడు జి డీ సి సి బ్రాంచ్ నుంచి లబ్ధి పొందిన11 నకిలీ డ్వాక్రా సంఘాలు…
కోటి 50 లక్షలు మోసం చేసిన ఘటనలో బ్యాంక్ అధికారుల పాత్ర అన్న కోణంలో విచారణ..
దర్యాప్తు చేస్తున్న నల్లపాడు పోలీసులు
👉 పెద్దఅంబర్ పేట్ లో మహిళా ప్రవైట్ టీచర్ కు దేహశుద్ధి..😱😱😱
తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రైవేట్ టీచర్ నీ చితకబాదిన భార్య…గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉన్న భర్త ను ఫాలో అవ్వడం తో బయటపడ్డ అక్రమ సంబంధం…
ఫోన్ లాక్కొని చెక్ చేయగా బయటపడ్డ చాటింగ్ లు ….
భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి లక్ష్మారెడ్డి పాలెం లోని మహిళ టీచర్ ఇంటికి వచ్చి భార్య…
భార్య మాటలు విని గోడ దూకి పరారైన భర్త…
తన దగ్గర ఉన్న 30 లక్షల రూపాయలు,కారు,స్కూటీ,
బంగారం తీసుకుని వెళ్లిన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకి ఇచ్చాడని ఆరోపిస్తున్న భార్య…
పోలీసులకు పిర్యాదు చేసిన భార్య…
👉 మే నెలలో ‘తల్లికి వందనం’ అమలు: మంత్రి లోకేశ్…తల్లికి వందనం’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. “తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం” అని లోకేశ్ చెప్పారు.

👉ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి సరఫరా .
పక్కా సమాచారంతో భువనేశ్వర్ రైల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు..
పోలీసులను చూసి అక్కడే గంజాయిని వదిలి పరారైన నిందితులు ..13 లక్షల విలువ చేసే 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్..
పరారైన నిందితులను పట్టుకునేందుకు సీసీఫుటేజ్‌ను పరిశీలిస్తున్న అధికారులు
👉 అనంతపురం : గుంతకల్లు మండలం కసాపురం గ్రామ శివారులో పరువు హత్య…
ప్రేమ వివాహం చేస్తుందని కుమార్తెను హత్య చేసే హతమార్చిన తండ్రి ..తన కుమార్తెను హత్య చేశానంటూ నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయిన ఓ తండ్రి ..
హంద్రీనీవా కాలువ పొడవునా వెతికి, మృతదేహం ఆచూకీ లేకపోవడంతో మతిస్థిమితం లేని వ్యక్తిగా భావించిన పోలీసులు.
ఇవాళ ఉదయం ప్రత్యేక బృందాలతో మృతదేహం కోసం అన్నిచోట్ల వెతికిన పోలీసులు..
గుంతకల్లు సమీపంలోని ఓ దర్గా వద్ద యువతి మృతదేహం లభ్యం ..
నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన గుంతకల్లు పోలీసులు..
👉 *ఏపీలో వారికి ప్రభుత్వ పథకాలు కట్???*
అమరావతి :
ఏపీలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.
👉ప్రైవేట్ ఆసుపత్రులలో పెరిగిన మందుల ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..*
*ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి..
*రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔషధాల ధరలు పెరిగాయి: సుప్రీం కోర్టు*
*ఆ ప్రైవేట్ ఆసుపత్రుల పై చర్యలు తీసుకోండి – సుప్రీం కోర్ట్*న్యూ ఢిల్లీ :
సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరేలా పరోక్షంగా ప్రేరేపించడమే అని పేర్కొంది. తమ ఫార్మసీలోనే మెడిసిన్ కొనాలనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై దాఖలైన పిల్పై విచారణ జరిపిన సుప్రీం ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్, తమిళనాడు , హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్లకు నోటీసులు జారీచేసింది.
👉గుంటూరు.. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు లేడీ అఘోరీ..*హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహేరా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరు కు వచ్చిన మహిళ అఘోరీ..
మహిళ అఘోరీకి బెహేరా అనిల్ కు గత కొద్దిరోజులుగా వివాదం.గుంటూరు కు వస్తున్న లేడి అఘోరీ ని అదుపులోకి తీసుకొని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చిన పోలీసులు..
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్ బెహేరా ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న లేడి అఘోరీ..
👉 తప్పుల నుంచి ఏం నేర్చుకున్నామో అదే ముఖ్యం: నారా లోకేష్ ..
పెన్షన్ డబ్బులతో పరారైన పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయ ఉద్యోగి లక్ష్మీ ప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆన్లైన్ బెట్టింగులతో మోసపోయానని, నెల రోజులు టైం ఇస్తే డబ్బులు చెల్లిస్తానన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మనుషులు తప్పులు చేస్తారని, వాటి నుంచి ఏం నేర్చుకున్నామనేది ముఖ్యమన్నారు.తనకు రక్షణ కల్పిస్తామని, ఒక అవకాశం కల్పిస్తున్నట్లు తాను తిరిగి క్షేమంగా ఇంటికి రావాలన్నారు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు..
👉 గుంటూరు* గోరంట్లలో క్రైస్తవుల గుడారాల పండుగను అడ్డుకునేందుకు కారులో మారణాయుధాలతో వచ్చిన శ్రీనివాస్ అలియాస్ అఘోరి..అప్రమతమైన పోలీసులు..
అఘోరిని గోరంట్ల నుండి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు..శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న తీరుపై శ్రీనివాస్ అలియాస్ అఘోరీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్..
👉వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో చోరీ కి గురైన ఎస్బిఐ బ్యాంకులో బంగారం ఖాతాదారుల ఆందోళన..బాధితులకు బంగారం విలువ కట్టిస్తానని చెప్పి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని బాధితుల ఆందోళన….పోయిన బంగారానికి తరుగు తీసి డబ్బులు చెల్లిస్తామని బాధితులకు చెప్తున్న బ్యాంక్ అధికారులు….
వాయిదాలు పెడుతూ బ్యాంక్ చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆందోళన…
మా బంగారానికి మార్కెట్ ధరను చెల్లించాలని బ్యాంక్ అధికారులను నిలదీసిన బాధితులు…
👉 సైబర్ నేరాలు, గ్రామ సమస్యలపై సీసీ కెమెరాలు ఏర్పాటు ఆవశ్యకతపై కంభం ఎస్ఐ బి నరసింహారావు బుధవారం రాత్రి మండలంలోని దర్గా గ్రామంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
👉కంభం మండలం తురిమెళ్ళ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టి.వెంకటేశ్వర్లు.వైద్యశాల రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.వైద్యశాల భవనం పాడుపడటంతో నూతన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.ఎన్ సి డి ప్రోగ్రాం మీద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పలు సలహాలు సూచనలు అందించారు.

