👉”హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోం”: ప్రొఫెసర్ కోదండరాం..👉ప్రీతి కేసును వాడుకుని పవన్ బాగుపడ్డారు : శ్రావణకుమార్..👉పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి నారా లోకేష్..👉విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి?* .. చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి భరోసా…👉రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ డిజిటల్‌ అక్షరాస్యుడిగా మారేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు..👉 వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి: మంత్రి గొట్టిపాటి 👉విజయసాయికి అడ్వాన్స్ కంగ్రాట్స్…ఆ పదవి ఖాయమా ?* ..👉పోసాని కృష్ణమురళిపై వరుస పిటి వారెంట్ లు..* నాగమణి పేరుతో రెండు లక్షల టోకర…👉బెట్టింగ్ ముఠా పై మెరుపు దాడి…చాకచక్యంగా వ్యవహరించిన సిఐ పి. దొరరాజు బృందం…

👉ఉద్యోగులు ఎక్కువ గంటల పాటు పనిచేయాలంటూ కార్పొరేట్‌ సంస్థలు చేస్తున్న ప్రకటనలపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ ఘాటుగా స్పందించారు. ఉద్యోగులు మనుషులని భావిస్తున్నారా, రోబోలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మనుషులను బదులు రోబోలను పెట్టుకోవడానికే ఇలాం టి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రముఖులు కొందరు వారానికి 70 గంటలు, వారానికి 90 గంటలు ఉద్యోగులు పని చేయాలని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోని వారే ఇలాంటి సలహాలు ఇస్తుంటారని విమర్శించారు. ఎక్కువ గంటల పాటు పనిచేస్తే ఉత్పాదకత పెరగదని, మనస్ఫూర్తిగా, పూర్తి సమర్థతతో పనిచేసినప్పుడు మాత్రమే పెరుగుతుం దని చెప్పారు.వినోదం మనుషుల్లో పునరుత్తేజాన్ని కలిగిస్తుందని, దానివల్లనే నాణ్యత పెరుగుతుందని, అది గుర్తించని వారే ఇలాంటి సలహాలు ఇస్తుంటారన్నారు. 👉రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లను ఆదుకుంటామని, పెండింగ్‌ బిల్లులపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసానిచ్చారు. సోమవారం బిల్డర్స్‌ అసోసియేషన్‌ మాజీ చైర్మన్లు డి.వి.ఎన్‌ రెడ్డి, దేవేందర్‌ రెడ్డి, చిన్న కాంట్రాక్టర్లు కొంతమంది మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏళ్ల తరబడి బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు మంత్రికి తెలిపారు. కొత్త పనులు కూడా చేయలేకపోతున్నామని వివరించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. చిన్న కాంట్రాక్టర్ల బిల్లుల విషయంపై సీఎంతో చర్చించి, ఈనెల చివరి వారంలో బిల్లులు చెల్లించేలా చూస్తామని హామీనిచ్చారు. అయితే పెండింగ్‌ బిల్లులు రావడంలేదన్న కారణంగా ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో జాప్యం ఉండకూడదని మంత్రి సూచించారు. ప్రజలకు రహదారులే ప్రాథమిక అవసరమని, కాంట్రాక్టర్లు ఈ విషయాన్ని మరవకూడదని, దానిని దృష్టిలో ఉంచుకుని పనులు చేయాలన్నారు.

👉రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.

👉చిట్ ఫండ్ బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు..పల్నాడు జిల్లాలో కరకట్టపై సాయి సాధన చిట్ ఫండ్ బాధితులను చూసి చంద్రబాబు కాన్వాయ్ ఆపారు. సాయి సాధన చిట్ ఫండ్ లో జరిగిన మోసాన్ని బాధితులు సీఎంకు వివరించారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లు సీఎంకి తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

👉ప్రీతి కేసును వాడుకుని పవన్ బాగుపడ్డారు : శ్రావణకుమార్…  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుగాలి ప్రీతి కేసును వాడుకుని రాజకీయంగా బాగుపడ్డారని అన్నారు. ‘పవన్కు నిబద్ధత,నిలకడలేదు. రాజకీయాల కోసమే సుగాలిప్రీతి కేసును వాడుకున్నారు. సుగాలిప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నాడు.. ఏమైంది?. ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.’ అని అన్నారు.

👉”హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోం”: హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకునేదే లేదని.. జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లి పరిస్థితి రావొచ్చన్నారు. దీనికి బదులు హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని.. పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు. విదేశీ కంపెనీలు ఒక్క గుజరాత్, మహారాష్ట్రలకే కాకుండా అన్ని రాష్ట్రాలకు రావాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

👉పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌, జీవో 117కు ప్రత్యామ్నాయం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఉండవల్లిలోని నివాసంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుందనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, దేశంలోనే ఏపీ విద్యా వ్యవస్థను నంబర్‌ 1 చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. తాను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు జీవో 117 వల్ల కలిగిన దుష్ఫలితాల గురించి అనేక మంది తన దృష్టికి తెచ్చారని గుర్తుచేశారు. జీవో 117 పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారని, వారంతా ప్రైవేటు పాఠశాలల్లో చేరారని చెప్పారు. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పాఠశాల విద్యలో ఎక్కువ అభ్యసన అంతరం ఏర్పడిందన్నారు. 3వ తరగతి విద్యార్థుల్లో.. భాషా సబ్జెక్టుల్లో 57శాతం మంది, గణితంలో 54శాతం మంది మాత్రమే అంచనా మేరకు మెరుగ్గా ఉన్నారన్నారు. ఇది జాతీయ సగటుతో పోలిస్తే 5 నుంచి 8శాతం తక్కువని చెప్పారు. పైతరగతుల్లో ఈ అంతరం ఇంకా ఎక్కువగా ఉందన్నారు. అసర్‌-2024 నివేదిక రాష్ట్రంలో ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీలో లోపాలను బహిర్గతం చేసిందన్నారు. పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం టీచర్‌ విద్య శిక్షణలో ఏపీ 60 పాయింట్లు సాధించిందన్నారు.

👉బెట్టింగ్ ముఠా పై మెరుపు దాడి…చాకచక్యంగా వ్యవహరించిన సిఐ పి. దొరరాజు బృందం…

రాయవరం, మండలం సోమేశ్వరం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో రూరల్ సీఐ పి దొర రాజు ఆధ్వర్యంలో మెరుపు వేగంతో ఎసై డి. సురేష్ బాబు బృందంతో కలసి ఆకస్మిక దాడి చేశారు. ఈ మేరకు సోమేశ్వరం గ్రామంలో వినాయక కాలనీలో లింగపు సతీష్ ఇంటి వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకుని విచారణ చేసినట్లు సతీష్ పరారైనట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న బెట్టింగ్ లైన్ బాక్స్, సెల్ ఫోన్స్, వారిచ్చిన అంగీకార వాంగ్మూలం ద్వారా రాజానగరం మండలం చక్రధరబంధం గ్రామంలో చంద్రిక – అవంతిక అపార్ట్మెంట్లో యమునా బ్లాక్ నందు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో ముఠాపే ఆకస్మిక తనిఖీ చేసి వారి వద్ద నుండి బెట్టింగ్ లైన్ బాక్సులు, సెల్ ఫోన్స్, లాప్ టాప్స్, ఎల్ఈడి టీవీలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని జుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపడం జరిగిందని తెలిపారు. తదుపరి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఈ కేసును చేధించడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి చాకచక్యంగా వ్యవహరించిన మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రాయవరం ఎసై డి.సురేష్ బాబు సిబ్బందిలను జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు డీఎస్పీ రఘువిర్ లు అభినందించారు.

👉 వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. గృహ, పారిశ్రామిక, వ్యాపారవర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్‌ అందించాలి’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ డిస్కమ్‌లను ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కలసి డిస్కమ్‌ల సీఎండీలు పృధ్వీతేజ్‌, భాస్కర్‌, సంతోశ్‌రావులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘వేసవిలో విద్యుత్తు కొరత రానివ్వకుండా చర్యలు చేపట్టాలి. రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ సిస్టమ్‌ (ఆర్‌డీఎ్‌సఎస్‌) పనులను వేగవంతం చేయాలి. వేసవి సమయంలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి సారించాలి. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.

👉 మహాకుంభమేళా సమయంలో ‘ఐఐటీ బాబా’గా ప్రాచుర్యం పొందిన అభయ్‌ సింగ్‌ను గంజాయి కేసులో రాజస్థాన్‌లోని జైపూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై మాదకద్రవ్యాలు, మానసిక వ్యసన పదార్థాల చట్టం (ఎన్‌డీపీఎస్‌) కింద కేసు నమోదు చేశారు. జైపూర్‌లోని ఓ హోటల్‌లో దిగిన అభయ్‌ సింగ్‌.. అక్కడ గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. అయన వద్ద నుంచి స్వల్ప మొత్తంలో గంజాయి స్వాఽధీనం చేసుకున్నారు. ఆయన వద్ద దొరికిన గంజాయి అనుమతించదగిన పరిమితిలోనే ఉండడంతో కొంత సేపు నిర్బంఽధం తర్వాత పోలీసులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల నిర్బంధం నుంచి బయటకొచ్చిన తర్వాత ఐఐటీ బాబా మీడియాతో మాట్లాడుతూ తన వద్ద దొరికింది ‘ప్రసాదం’ అని, కుంభ్‌లోని దాదాపు ప్రతి బాబా గంజాయిని ప్రసాదంగా స్వీకరిస్తారని పేర్కొన్నారు

👉*విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి?* ..  చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. విడదల రజని మంత్రిగా ఉండి చేసి అవినీతి, అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కావడం.. పదవిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు పెట్టడం వల్ల సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పటికే అన్ని ఆధారాలు ఉండటంతో కేసు నమోదుకు ఏసీబీ సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు గవర్నర్ కు కూడా అనుమతి కోసం లేఖ సమర్పించారు. విడదల రజని పై చేసిన ప్రాథమిక దర్యాప్తు, ఆధారాలను కూడా రాజ్ భవన్‌కు ఏసీబీ సమర్పించినట్లుగా తెలుస్తోంది.

విడదల రజని ఎమ్మెల్యేగానే కాదు.. మంత్రి అయిన తర్వాత చెలరేగిపోయారు. నియోజకవర్గంలో ఎవర్నీ వదలకుండా డబ్బులు వసూలు చేశారు. స్టోన్ క్రషర్ల యజమానుల దగ్గర అయితే కోట్లకు కోట్లు వసూలు చేశారు. ఓ స్టోన్ క్రషర్ యజమానికి యాభై కోట్లు ఫైన్ వేసి.. ఐదు కోట్లు కడితేనే వ్యాపారం చేయగలరని బెదిరించారు. పోలీసుల్ని పంపి హెచ్చరించారు. చివరికి రెండున్నర కోట్లకు బేరం కుదుర్చున్నారు. ఇలా వందల మంది దగ్గర వసూలు చేయడంతో వైసీపీ ఓడిపోవడంతోటే వారందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు అంశాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణలు జరిపి.. డబ్బులు ఎవరు వసూలు చేశారు.. ఎవరి ఖాతాలోకి వెళ్లాయో కూడా తెలుసుకున్నారు.గవర్నర్ అనుమతి రాగానే విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసి .. అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చిలుకలూరిపేటలో ఆమె చేసిన అక్రమాల కారణంగా ఓడిపోవడం ఖాయమన్న కారణంగా గుంటూరు నుంచి పోటీ చేయించారు. అక్కడా ఆమె అత్యంత ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ చిలుకలూరిపేటకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసి .. చాలెంజ్‌లు చేసి అంతు చూస్తామంటున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన అక్రమాలపై కేసులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

👉విజయసాయికి అడ్వాన్స్ కంగ్రాట్స్…ఆ పదవి ఖాయమా ?*

రాజకీయాల నుంచి దూరంగా జరిగాను అని సన్యాసం స్వీకరించిన వి విజయసాయిరెడ్డి తాజాగా హైదరాబాద్ వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ కూడా చేశారు.ఇక విజయసాయిరెడ్డి ఈ విధంగా ఒక అధికారిక కార్యక్రమంలో ఒక్కసారిగా మెరవడం విశేషం అయితే అదే సమయంలో అక్కడకు వచ్చిన వారిలో అనేక మంది అడ్వాన్స్ గా కంగ్రాట్స్ అని ఆయనకు చెప్పడం జరిగిందని ఒక ప్రచారం సాగుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమణ ప్రకటించిన విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు, ఏ విషయం మీద అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు.

విజయసాయిరెడ్డికి తొందర్లోనే రాజ్ భవన్ లో అడుగుపెట్టే యోగం ఉందని అంటున్నారు ఆయనను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తారు అన్న ప్రచారం జోరందుకుంది. అక్కడ గవర్నర్ రవి పదవీ కాలం తొందర్లో పూర్తి అవుతుందని ఆ ప్లేస్ లోకి విజయసాయిరెడ్డిని తీసుకుని వస్తారని అంటున్నారు.

విజయసాయిరెడ్డ్ నెల్లూరు జిల్లా వాసి. తమిళనాడుకు దగ్గరవారు. పైగా పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. ఆయనకు ఈ కీలకమైన రాష్ట్రం బాధ్యతలు అప్పగిస్తే బీజేపీకి మేలు చేస్తారని భావిస్తున్నారుట. ఇక రాజకీయ వ్యూహాలలో మేధావితంబంలో విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దల మనసు చూరగొన్నారని అంటున్నారు.ఆయన తన రాజ్యసభ పదవీ కాలం మూడున్నరేళ్ళు పైగా ఉండగానే త్యాగం చేయడం వెనక కూడా బీజేపీ పెద్దల నుంచి ఈ తరహా అభయం ఉందని అంటున్నారు. రాజకీయాలకు సెలవు అని ఆయన అన్నారు అందుకే ఆయన రాజకీయ పదవులు చేపట్టబోరని అంటున్నారు. అదే సమయంలో గవర్నర్ వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవి. రాజ్యాంగబద్ధమైన పదవులు అవి.బహుశా ఈ కోణం నుంచి ఆలోచించే విజయసాయిరెడ్డి ఈ రకంగా రాజకీయాలకు చెక్ చెప్పారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ గా రెండు సార్లు కొనసాగినా వైసీపీలో ఆయనకు కొత్తగా దక్కే పదవులు ఏవీ లేవు. దానికి బదులుగా గవర్నర్ గా పనిచేస్తే ఆ హోదావే వేరు అని అంటున్నారు.అందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరించారా అన్న చర్చ ఉంది. ఇక విజయసాయిరెడ్డి తన ట్వీట్లను హిందీలో కూడా పెట్టడంతో చదవాల్సిన వారి కోసమే ఆయన అలా చేశారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కొద్ది కాలం ఆగితే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వంటి సంచలన ప్రకటన వెనక పరమార్ధం తెలుస్తుంది అని అంటున్నారు.

👉పోసాని కృష్ణమురళిపై వరుస పిటి వారెంట్ లు నిన్న పోసానిపై పిటి వారంట్ దాఖలు చేసిన అనంతపురం రూరల్ పోలీసులు.. గతేడాది నవంబర్ లో పోసానిపై ఫిర్యాదు చేసిన నాగరాజు అనే వ్యక్తి…టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు…వరుస పిటి వారెంట్ లతో పోసానికి బిగుస్తున్న ఉచ్చు..ఏపీలో పోసానిపై ఇప్పటివరకు 14 కేసులు

👉 *100 కోట్ల డబ్బుతో పాటు నాగమణి ఉంది అని ప్రచారం చేసుకున్న వైనం.. కష్టాల్లో ఉన్న దంపతులు వెళ్లి సాయం కోరారు..రెండు లక్షలు లాగేసింది… తీరా కట్ చేస్తే!..  అతనొక రిటైర్డ్ ఉద్యోగి…గుంటూరులోని రాజరాజేశ్వరీ కాలనీలో భార్య నాగేంద్రంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే నాగేశ్వరావుకు.. తన మరదలు భారతి ద్వారా పల్నాడు జిల్లా కేసానుపల్లికి చెందిన వెంకాయమ్మ అలియాస్ నాగమణి పరిచయం అయింది. కొద్ది రోజుల తర్వాత వెంకాయమ్మ వద్ద వంద కోట్ల రూపాయల డబ్బులున్నట్లు భారతి… నాగేశ్వరరావు, నాగేంద్రం దంపతులకు చెప్పింది…దీంతో తమ ఆర్థిక కష్టాలు తీరాలంటే వెంకాయమ్మను ఆశ్రయించడం ఒకటే మార్గమని భావించారు…ఈ క్రమంలోనే కొద్దీ రోజుల కిందట నాగేంద్రం కేశానుపల్లి వెళ్లి వెంకాయమ్మను కలిసి తమ పరిస్థితి వివరించింది‌. తమకు సాయం చేయాలని అడిగింది. అయితే నాగమణితో కూడిన డబ్బుల కట్టలు ఇవ్వాలంటే వాటికి పూజలు చేయాలని వెంకాయమ్మ నమ్మకంగా చెప్పింది. వెంకాయమ్మ మాటలు నమ్మిన నాగేశ్వరరావు, నాగేంద్రంలు మొదట లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మరొక లక్ష రూపాయలు ఇచ్చారు. అయితే నాగమణి ఉన్న డబ్బులు కట్టలు మీ ఇంటికి రావాలంటే మీ ఇంట్లో ఉన్న దిష్టి తీయాలని.. అందుకు మరికొన్ని పూజలు చేయాలని వెంకాయమ్మ చెప్పింది‌. దీంతో లక్షల రూపాయలు తెచ్చి వెంకాయమ్మకు ఆ దంపతులు ఇచ్చారు…కొద్ది కాలంపాటు పూజలతో కాలక్షేపం చేసిన వెంకాయమ్మ ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. దీంతో అనుమానం వచ్చిన దంపతులు తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు‌. అయినా వెంకాయమ్మ నుంచి స్పందన లేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులు వెంకాయమ్మ సంతానానికి అసలు విషయం చెప్పారు. అయితే తమ అమ్మ పరిస్థితి బాగోలేదని ఆమె ఏం చేసినా తమకు సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు. మొత్తం పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడంతో మరింత నష్టపోయిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..