👉సిక్కు అల్లర్ల కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీకి మరణశిక్ష..*👉 తిరుమల అన్నదాన సత్రంలో బాలుడి మృతిపై టీటీడీ ప్రకటన..👉 మళ్ళీ టిడిపి పార్టీలోకి జివి రెడ్డి !?…👉విచారణకు ఆదేశిస్తారా? రాజీనామా చేస్తారా? వీసీల వివాదంపై లోకేష్‌కు వైసీపీ సవాల్..*చీటీల పేరుతో మోసం..👉రుణం కట్టలేదని రైతు బైక్‌ను లాక్కెళ్లిన బ్యాంక్‌ అధికారులు..*మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య*..👉 వ్యవసాయ రంగంలోనూ AI వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్… 👉 సినీ నటి మాధవీలతపై కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు..👉 దారుణం.. *ఒకేసారి ఐదుగురు బాలికలపై సామూహిక అత్యాచారం..👉 బాలింతలు, గర్భిణులకు సైబర్ నేరగాళ్ల బురిడీ..👉దారుణం.. *తల్లి అయిన పదో తరగతి బాలిక…

👉సిక్కు అల్లర్ల కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీకి మరణశిక్ష..
సిక్కు అల్లర్ల కేసు.. కాంగ్రెస్ మాజీ ఎంపీకి మరణశిక్ష!
ఢిల్లీలో జరిగిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ నాయకుడు సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలని సిక్కు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ అల్లర్లలో తండ్రి, కొడుకు హత్యలకు పాల్పడినందుకు గతంలో దోషిగా తేలిన సజ్జన్‌కు మరణశిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. విషాదకరమైన సంఘటనలు జరిగి 40 సంవత్సరాలకు పైగా గడిచిందని, న్యాయం జరగాలని వారు నొక్కి చెప్పారు.
👉మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య*
భువనగిరి పట్టణంలోని విద్యానగర్లో విషాదం చోటుచేసుకుంది. మహిళా ఏఆర్ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా కోయడకు చెందిన కే అనూష 2020లో ఏఆర్ కానిస్టేబుల్కు ఎంపికై యాదాద్రి జిల్లాలోని హెడ్క్వార్టర్లో విధులు నిర్వహిస్తుంది. కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెళ్లి నిర్ణయించారని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
👉 తిరుమల అన్నదాన సత్రంలో బాలుడి మృతిపై టీటీడీ ప్రకటన..
సీసీ ఫుటేజ్‌ని విడుదల చేసిన అదనపు ఈవో..
తిరుమలలో తొక్కిసలాటకు ఆస్కారం లేదు..
బాలుడికి గతంలోనే గుండె ఆపరేషన్ జరిగింది.
ర్యాంప్‌పై పరిగెడుతూ బాలుడు పడిపోయాడు..
వెంటనే సీపీఆర్‌ చేశారు-టీటీడీ అడిషనల్‌ ఈవో…
బాలుడు చనిపోవడం దురదృష్టకరం..
టీటీడీపై బురదజల్లే కార్యక్రమం మానుకోవాలి..
-టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
👉శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి *
👉 మళ్ళీ టిడిపి పార్టీలోకి జివి రెడ్డి !?…
దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయా …
కార్యకర్తల్లో వ్యతిరేకతను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది! కొందరు నేతలు లోకేష్ తో, కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం! మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం!..
జివి రెడ్డి కొన్ని నిర్ణయాలు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్లే సమస్య ఇంత దాకా వచ్చినట్లు తెలుస్తోంది! చంద్రబాబు దృష్టికి సమస్య వెళ్లినా, దానికి ముందు మూడు నెలలుగా జరుగుతున్న తంతు అసలు పేచీకి కారణమని తెలుస్తోంది! IAS అధికారులకు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో వుండే రాజకీయ నాయకులకు మొదటి నుంచి పొసగదు! కొందరు సర్దుకుపోతుంటారు! కొందరు రాజీపడిపోతుంటారు! కొందరు మార్చేసుకుంటారు! మాట వినే వారిని తెచ్చుకోవడం పరిపాటి!
జివి రెడ్డి నిజాయితీగల నాయకుడే అయినా కొంత రాజకీయ పరిజ్ఞానం తక్కువేనని చెప్పాలి! ఎక్కడా ప్రజల ద్వారా ఎంపికైన వ్యక్తి కాదు! ఎమ్మెల్యే అయిన నాయకుడు కాదు! అందుకే రాజకీయ పదవి పై అవగాహన లేక తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసినట్లు పార్టీ దృష్టికి వచ్చింది! రాజకీయ రంగంలో తనే గొప్ప రాజనీతిజ్ఞ అని భావించడం కూడా ఈ సమస్య ఇంత వరకు వచ్చిందనేది పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం!
జివి రెడ్డి చంద్రబాబును కలసినప్పుడు ఆయన దృష్టికి సమస్య తీసుకువచ్చినప్పుడు “సర్దుకు పోవాలి. నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందాం” అన్నారు. అప్పటికే ప్రెస్ లో రావడం, IAS అసోసియేషన్ భగ్గుమనడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అప్పటికే నివేదిక సమర్పించమని ఫైబర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను ఆదేశించారు. ఆ విషయమే జివి రెడ్డి కి చెప్పడంతో ఆయనకు కోపం వచ్చింది! తనకు తెలియకుండా నివేదిక కోరడం అంటే, తనపై చంద్రబాబుకు నమ్మకం లేదనే నిర్ణయానికి వచ్చారు! అధినేత తనను నమ్మనప్పుడు పార్టీలో ఉండటం అనవసరం అని భావించారు. నేరుగా తన కార్యాలయానికి వచ్చి రాజీనామా చేశారు.
జివి రెడ్డి మంచి సబ్జెక్ట్ వున్న విలక్షణ నాయకుడు! ఇందులో నో డౌట్! కానీ, రాజకీయ రంగం ఒక చదరంగం! రాజకీయ పార్టీ నడపడం అంత వీజీ కాదు! ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా అందరినీ కలుపుకు పోవాల్సి ఉంటుంది! అనేక ఒత్తిళ్ళు ఉంటాయి! కొందరు అధినేతలు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు! చంద్రబాబు కొంత ఆచి తూచి అడుగు వేస్తుంటారు! అదే జివి రెడ్డి కి అర్ధం కాలేదు! అంతు పట్టలేదు! పర్యవసానం… రాజీనామా!
ఇప్పటికే చంద్రబాబు ఒక మెట్టు దిగారు! జివి రెడ్డి ఆవేశంగా తీసుకున్న రాజీనామాను వెంటనే ఆమోదం తెలిపారు! కారణం పార్టీలో పదవుల్లో వున్న వారికి చెప్పకనే ఒక హెచ్చరిక చేశారు! ఎవ్వరూ తోపులు కారు! పార్టీలో అందరూ సమానులే అని చెప్పడానికి తక్షణమే ఆమోదించారు! మరో వైపు సమస్య ను ఇంత దూరం తెచ్చిన ఫైబర్ గ్రిడ్ ఎండి దినేష్ కుమార్ పై వేటు వేశారు!
జివి రెడ్డికి నచ్చ చెప్పి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయనకు దగ్గర మిత్రులకు బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది! అయితే పార్టీలోకి వచ్చినా జాతీయ అధికార ప్రతినిధి పదవి కొనసాగుతుంది! ప్రస్తుతానికి ఏ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించరు! మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకుండా ఆ తరువాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ లలో ఒక స్థానాన్ని కేటాయించే అవకాశం ఉంది! జివి రెడ్డి ఆత్మాభిమానం దెబ్బతిని ఉండొచ్చు! కానీ, అహానికి పోకుండా ఒక మెట్టు దిగి మళ్ళీ పార్టీ కండువా కప్పుకుంటే పార్టీ శ్రేణులు హర్షిస్తారు! ఎందుకంటే ఆయన రాజీనామా చేసినప్పుడు బాధపడింది పార్టీ కార్యకర్తలే! కార్యకర్తల అభిప్రాయాన్ని పార్టీ గౌరవించింది! పార్టీ అభిప్రాయాన్ని జివి రెడ్డి గౌరవిస్తే భవిష్యత్ లో మంచి రాజకీయవేత్తగా ఎదిగే అవకాశం ఉంటుంది!
👉 రాచకొండకమిషనర్ సుధీర్ బాబు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, స్టేషన్ రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి_భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళాభద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
👉 ఏలూరు జిల్లా. ముసునూరు మండలం. శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో భారీ బందోబస్తు ఏర్పాటు. ఎన్నడూ లేని విధంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు డిఎస్పి ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ముసునూరు ఎస్సై చిరంజీవి 250 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా డ్రోన్ కెమెరాల నిఘా నీడలో నిఘా నీడలో బలివే గ్రామం పూర్తిగా పోలీసు ఆధీనంలో ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ పార్టీ స్పెషల్ పార్టీ సిబ్బందితో సిఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఎస్సై చిరంజీవి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.. ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్ లతోపాటు 14 మంది ఎస్ఐలు ఈ బందోబస్తు కార్యక్రమంలో ఉన్నట్లు నూజివీడు డిఎస్పి ప్రసాద్ తెలిపారు
👉 కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు..చీటీల పేరుతో మోసం..?
15 కోట్ల వరకు టోకరా.. 300 మంది వరకు బాధితులు..?భారీ సంఖ్యలో క్యూ కడుతున్న బాధితులు…?..అనధికారకంగా చీటీలు నిర్వహణ…. ఒక లిక్కర్ సిండికేట్ యజమానికి… 43 లక్షల వరకు బాకీ అని సమాచారం..?…బాధితుల్లో ఓ పోలీస్ అధికారి…? ..అంతా బ్లాక్ మనీ యేనా…?…బాధితులకు న్యాయం జరిగేనా..?
👉 క్రిప్టో కరెన్సీ మాటున భారీ మోసం.. దేశంలోని 60 చోట్ల సీబీఐ దాడులు..
ఓ గ్యారంటీలేదు. ప్రభుత్వాల మద్దతు లేదు. బ్యాంకుల సపోర్ట్ లేదు. అయినా సరే దాని దూకుడు ముందు వజ్రం కూడా వెలవెలబోతోంది. దాని ఊపు ముందు.. బంగారం కూడా ఉసూరుమంటోంది. అరపైసాతో మొదలైన దాని ప్రస్తానం.. కోట్లరూపాయలకు చేరుతోంది. కంప్యూటర్‌లో పుట్టిన డిజిటల్ కరెన్సీగా ఎదిగి.. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తోంది…కనిపించవు కానీ…కాసులు కురిపిస్తాయి. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సంపాదిస్తే, సాధిస్తే లైఫ్ సెటిల్..అంతే.. కన్ఫ్యూజింగ్ గా ఉన్నా క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అన్ని రికార్డులను చెరిపేసి దూసుకెళుతోంది…ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన సీబీఐ రంగంలోకి దిగింది. దీని వెనుక జరుగుతున్న అసలు మోసాన్ని బట్టబయలు చేసింది..క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన కేసుల్లో దేశవ్యాప్తంగా 60 చోట్ల సీబీఐ దాడులు చేసింది. ఢిల్లీ NCR, పూణే, చండీగఢ్, నాందేడ్, కొల్హాపూర్, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.
నకిలీ వెబ్‌సైట్‌లు మరియు ఆన్‌లైన్ మోసం ద్వారా ఈ స్కామ్ జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఇందులో నిందితులు ప్రధాన క్రిప్టో ఎక్స్‌చేంజ్ వెబ్‌సైట్‌లను అనుకరించడం ద్వారా ప్రజలను మోసం చేసినట్లు నిర్ధారించారు..ఈ క్రిప్టోకరెన్సీ స్కామ్ 2015లో ప్రారంభమైంది. అమిత్ భరద్వాజ్ (మరణించిన వ్యక్తి), అజయ్ భరద్వాజ్, వారి ఏజెంట్లు దీనిని నిర్వహించారు. ఈ వ్యక్తులు GainBitcoin పేరుతో అనేక ఇతర పేర్లతో వెబ్‌సైట్‌లను సృష్టించారు.పోంజీ పథకం కింద ప్రజలను క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టేలా చేశారు. ఈ వెబ్‌సైట్‌లన్నీ వేరియబుల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
క్రిప్టోకరెన్సీ మోసానికి పాల్పడిన అమిత్ భరద్వాజ్ (మరణించిన), అజయ్ భరద్వాజ్, ఈ పథకంలో 18 నెలల పాటు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టమని పెట్టుబడిదారులను కోరారు..దానికి ప్రతిగా వారు 10 శాతం రాబడిని ఇస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడిదారులు ఎక్స్ఛేంజీల నుండి బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయమని, క్లౌడ్ మైనింగ్ కాంట్రాక్టుల ద్వారా గెయిన్‌బిట్‌కాయిన్‌తో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించారు.
👉 వ్యవసాయ రంగంలోనూ AI వినియోగం.. సత్య నాదెళ్ల వీడియో వైరల్..
వ్యవసాయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అద్భుతంగా ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో ఒక చిన్న పొలం దిగుబడిని పెంచడానికి AI వాడకాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన అధికారిక X హ్యాండిల్‌ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు.
రైతులకు AI నుండి చాలా సహాయం లభిస్తోంది:
ఇక్కడి చెరకు రైతుల కథను నాదెళ్ల వివరించారు. వారు కరువు, అప్పులు, పంటలను ప్రభావితం చేసే వివిధ వ్యాధులు, ఆత్మహత్యలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు AI వారి అదృష్టాన్ని మార్చేసింది. రసాయనాలను తక్కువగా ఉపయోగించడం ద్వారా పంట దిగుబడిని పెంచడానికి, నీటి వినియోగాన్ని మెరుగుపరచడానికి AI రైతుకు ఎలా సహాయపడుతుందో ఈ వీడియో వివరిస్తుంది..
AI రైతుల అదృష్టాన్ని మార్చిందని ఆయన అన్నారు. ఆయన షేర్ చేసిన వీడియోలో, చిన్న రైతులు AI యొక్క శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా పంటల దిగుబడిని ఎలా పెంచుతున్నారో చూడవచ్చు. వ్యవసాయంపై AI ప్రభావాన్ని సత్య నాదెళ్ల అద్భుతంగా అభివర్ణించారు.
రైతుల పంట ఉత్పత్తి పెంచుకోవడం:
మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో రైతులు ఈ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా వారు తమ పంటల దిగుబడిని పెంచుకున్నారని తెలిపారు. డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి పొందిన జియోస్పేషియల్ డేటాను ఉపయోగించి, రైతులకు తమ భూమి పరిస్థితి గురించి తెలుసుకోవడం ద్వారా వారికి ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ సాంకేతికత రైతుల భాషలో ఉండటం ద్వారా వారి పనులను మరింత సులభతరం చేస్తుందని ఆయన అన్నారు..
ఈ క్రమంలో ఏఐ వినియోగం వల్ల పంటలకు రసాయనాల వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దీంతోపాటు రైతులు వారి పొలాల గురించి తెలుసుకుని, తక్కువ నీటితో పంటలను పండించుకోవచ్చన్నారు. ఇలా చేయడం ద్వారా వారి పొలాల్లో నీటి ఉత్పత్తిని మెరుగుపరుచుకుని, అధిక దిగుబడిని సాధించవచ్చన్నారు. వ్యవసాయానికి ఏఐ ఎంతో భవిష్యత్తునిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
👉మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం..
అమరావతి: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అన్నారు.. అన్ని సీట్లు ఇచ్చి సీఎం చేస్తే ఎందుకు హోదా తేలేకపోయారని వైసీపీ సభ్యులను ఏపీ మంత్రి నారా లోకేష్ నిలదీశారు. అయిదేళ్లు కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతూ ఓటేయడాన్ని ప్రశ్నించారు.
నష్టపోయిన ఏపీని గాడిన పెట్టేందుకు ఏపీలో టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పాం. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ఏపీకి రూ.13 వేల కోట్లు తీసుకొచ్చాం..
దాంతోపాటు రాజధాని అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల గుండె చప్పుడు అయిన విశాఖ ఉక్కు కార్మాగారాన్ని కాపాడుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్ సాధించామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
👉విచారణకు ఆదేశిస్తారా? రాజీనామా చేస్తారా? వీసీల వివాదంపై లోకేష్‌కు వైసీపీ సవాల్..
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీ కంటే మండలిలోనే చర్చలు ఆసక్తిగా మారుతున్నాయి. మంగళవారం ఉదయం యూనివర్శీటల వీసీలపై హీటెక్కించే చర్చ నడిచింది. దీనిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని దాని ఆధారంగా కచ్చితంగా విచారణకు ఆదేశిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సవాల్ చేశారు. దీనికి స్పందించిన వైసీపీ వీసీ రాసిన లెటర్‌ను బయట పెట్టింది.
గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన వైసీపీ రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే వీసీలను బెదిరించి భయపెట్టి రాజీనామా చేయించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీలు. దీని మంత్రి నారా లోకేష్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి అసత్య ఆరోపణలు చేయొద్దని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు.
లోకేష్‌ కామెంట్స్‌పై రియాక్ట్ అయిన వైసీపీ, 19 మంది వీసీల్లో 17 మంది ఒకేసారి రిజైన్ చేస్తే ఏమని అర్థం చేసుకోవాలని వాదించింది. దీనిపై అనుమానాలు ఉన్నాయని అధికార పక్షంపై ఎదురు దాడి చేసింది. ఇంత మంది ఒక్కసారి రాజీనామా చేస్తే ఏం జరుగుతుందో అని విచారణ చేయాలా వద్దా అని ప్రశ్నించింది. మళ్లీ మంత్రి నారా లోకేష్ లేచి… ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్న ప్రతి అంశానికి విచారణ చేస్తూ వెళ్లలేమని పేర్కొన్నారు. మంత్రులుకానీ, అధికారులు కానీ లేదా ఇంకా ఎవరైనా బెదిరించినట్టు వైసీపీ వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. ఒక్క ఆధారం ఉన్నా సరే విచారణకు ఆదేశిస్తామన్నారు. ఈ అంశంపైనే కాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో విచారించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఏదో పేపర్ క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ఆరోపణలు చేస్తే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు. అందుకే వారు ఆధారాలతో వస్తే విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఇంతలో వాళ్లు చేసిన ఆరోపణలను రికార్టుల
నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆరోపణలు చేసేసిన తర్వాత చివరకు తమ సమాధానాలు వినకుండానే వాకౌట్ చేసేస్తున్నారని అన్నారు. అందుకే ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు రికార్డుల్లో నుంచి తొలగించాలని అన్నారు. ఈ గందరగోళం మధ్యే సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు ఛైర్మన్.
👉 సినీ నటి మాధవీలతపై కేసు నమోదు చేసిన తాడిపత్రి పోలీసులు..
జేసీ – మాధవీలత మధ్య వివాదం మరింత ముదురుతోంది. గతంలో మాధవీలత కామెంట్స్‌తో మొదలైన ఈ రచ్చ..జేసీ రియాక్షన్‌తో వేడెక్కింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం పోలీస్ స్టేషన్ల చుట్టూనే తిరుగుతోంది.ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరిచేలా మాట్లాడారని మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కమలమ్మ ఫిర్యాదు చేశారు.
దీంతో మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు.
👉 తాడిపత్రిలో రూ. 1.30 లక్షల నగదు స్వాధీనం… మట్కా బీటర్ అరెస్టు..జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసుల దాడులు😲

తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ పర్యవేక్షణలో అర్బన్ సి.ఐ సాయి ప్రసాద్ తన సిబ్బంది వెళ్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో తనిఖీలు చేశారు. తాడిపత్రి పట్టణానికి చెందిన అన్వర్ బాషా సదరు లాడ్జిలో మట్కా రాస్తూ పట్టుబడ్డాడు. ఇతని నుండీ రూ. 1.30 లక్షల నగదు మరియు మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు.
👉రుణం కట్టలేదని రైతు బైక్‌ను లాక్కెళ్లిన బ్యాంక్‌ అధికారులు..
రంగారెడ్డి – యాచారం మండలం గడ్డమల్లయ్యగూడలో రైతు రుణం కట్టలేదని బైక్‌ను లాక్కెళ్లిన సహకార బ్యాంక్‌ అధికారులు..మేడిపల్లి గ్రామంలో రైతు ఇక్కె పర్వతాలుకు చెందిన భూమిని ఫార్మాసిటీలో భాగంగా ప్రభుత్వం సేకరించింది.. అయితే ఆ సమయంలో రైతులకు భూమిపై ఎలాంటి రుణాలు ఉన్నా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చింది..కానీ ప్రభుత్వం ఇప్పుడు అవేమీ పట్టించుకోకపోవడంతో.. రైతులను బెదిరింపులకు గురి చేస్తూ బైక్‌ను లాకెళ్లిన బ్యాంక్ అధికారులు..దీంతో తమను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు….

👉 దారుణం.. ఒకేసారి ఐదుగురు బాలికలపై సామూహిక అత్యాచారం..
జార్ఖండ్ లోని కుంతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుభకార్యనికి వెళ్లొస్తున్న ఐదుగురు బాలికలపై కొందరు యువకులు ఒకేసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 18 మంది బాలురను అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జువైనల్ హోమ్ కు తరలించారు. 16 ఏళ్లపైబడిన వారిని అడల్ట్స్ గా గుర్తిస్తే ఇలాంటి దారుణాలు తగ్గుతాయని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు.
👉 బాలింతలు, గర్భిణులకు సైబర్ నేరగాళ్ల బురిడీ..
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిన పథకం ‘జనని ఆరోగ్య యోజన’. అయితే ముగ్గురు కేటుగాళ్లు అలాంటి వారినే టార్గెట్ చేసుకుని ఫోన్ చేసి ఆర్థిక సాయం అందిస్తామని డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా వారిని బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికీ 16 జిల్లాల్లో ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. దాదాపు రూ.42.61 లక్షల మేర దోచుకున్నట్లు విచారణలో వెల్లడించారు.
👉దారుణం.. తల్లి అయిన పదో తరగతి బాలిక..
ఒడిశాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మల్కానగిరి జిల్లా చిత్రకొండ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిని చదువుతున్న ఓ విద్యార్ధిని పాపకు జన్మనిచ్చింది. ఇందులో విచిత్రం ఏంటంటే గర్భిణి అయినట్లు సదరు బాలికకు తెలియదు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రి తీసుకెళ్లగా ప్రెగ్నెంట్ అతి తేలింది. చివరికి ఓ పాపకు జన్మనివ్వడం స్థానికంగా కలకలం రేపుతుంది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..