👉ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరమన్న జైశంకర్ …👉వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు..*జగన్‌కు బిగ్ షాక్.. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!..*వల్లభనేని వంశీ పై భూ కబ్జా కేసు*..*గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు…👉డాక్టరమ్మ సేవలు మరువలేనివి!! ..👉 రాచర్లలో మహిళపై దాడి.

👉ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరమన్న జైశంకర్ !!! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. భారత ఎన్నికల్లో అమెరికా నిధులు వెచ్చించారన్న ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. భారత ఎన్నికల్లో అమెరికా నిధులు వెచ్చించారన్న ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయని, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. – జైశంకర్ స్పందన ఇదీ జైశంకర్ మాట్లాడుతూ “ట్రంప్ వ్యాఖ్యలు మనకు ఆందోళన కలిగించే అంశమే. భారత ఎన్నికలు దేశీయ వ్యవహారం. ఎవరైనా ఏవైనా ఆరోపణలు చేస్తే, అవి ఆధారాలపై ఉండాలి. USAID నిధుల అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. అన్ని వివరాలను సేకరించిన తర్వాత దీనిపై మరింత స్పష్టత ఇస్తాం” అని తెలిపారు. ట్రంప్ ఆరోపణలు ఇవీ ట్రంప్ తన ఓప్రల్ ప్రచారంలో మాట్లాడుతూ భారత ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వం నిధులను వినియోగించిందని ఆరోపించారు. ఈ నిధుల ద్వారా కొందరు అభ్యర్థులకు మద్దతు అందించినట్లు వ్యాఖ్యానించారు. కొందరినీ గెలిపించాలని ఈ భారీ నిధులు పంపారని ఆరోపించారు. అయితే ఆయన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. – భారత ప్రభుత్వ వైఖరి భారత ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. విదేశీ జోక్యాన్ని భారత ప్రజలు సహించరని, ఎలాంటి అవాస్తవ ఆరోపణలకూ ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. USAID వివరణ: USAID (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ) ద్వారా అభివృద్ధి సహాయ నిధులు అందిన మాట వాస్తవమే. అయితే వీటిని ప్రభుత్వ పరంగా అభివృద్ధి ప్రాజెక్టులకే వినియోగించబడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత ఎన్నికల వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ట్రంప్ ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. అయితే, భారత ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి, నిజాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపింది. రాజకీయ ఆరోపణలు ఏవైనా నిజానిజాలు నిర్ధారణ తర్వాతే విశ్వసించాలనే అభిప్రాయాన్ని విదేశాంగ శాఖ వ్యక్తం చేసింది.

👉 ప్రతిపక్ష హోదా– జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు* ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు నినాదాలు చేస్తూ..

కాసేపటికి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సభలో వైసీపీ వ్యవహారశైలిపై మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ.. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. గవర్నర్‌కు ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాల గురించి చెప్పారని తెలిపారు. ఆరోగ్యం బాగాపోయినా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగిస్తే వైసీపీ అడ్డుకోవాలనుకోవటం హేయమని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు.

*అలా ఎలా ఊహిస్తారు..*

ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైసీపీకి వచ్చేదన్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైసీపీ గుర్తించాలన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని.. అది నిశ్చయం అయిపోయిందని స్పష్టం చేశారు. ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని హితవుపలికారు. హోదా అనేది సీఎం , స్పీకర్ ఇచ్చేది కాదన్నారు. వైసీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వైసీపీ నేతలు సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు.

*జర్మనీ వెళ్లిపోవచ్చు.. ఇక్కడైతే కుదరదు*

”డిప్యూటీ సీఎంగా నేనేమీ బ్రేక్ చేయడం లేదు. ఉదయం గవర్నర్‌ను ఆహ్వానించే సమయంలో నన్ను పిలిచినా ప్రోటోకాల్ కాదని నేను సున్నితంగా తిరస్కరించా. ఓట్లు శాతం గురించి మాట్లాడే వైసీపీ నాయకులు జర్మనీకి వెళ్లిపోవచ్చు. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు ” అని స్పష్టం చేశారు.

*నేనేంటో చూపిస్తా*

సనాతన ధర్మం కోసం తమిళనాడు ప్రభుత్వం కూడా పోరాడుతోందన్నారు. వక్స్ బోర్డు ఉన్నప్పుడు సనాతన ధర్మం బోర్డు ఉంటే తప్పా అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై మార్చి 14 న మాట్లాడతానని తెలిపారు. రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. తన యూపీ పర్యటనపై వస్తున్న ఆరోపణలపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ”వెనక ఉండి మాట్లాడటం కాదు నేరుగా ముందుకు వచ్చి మాట్లాడాలి. నేనేంటో చూపిస్తా . రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అన్నిటికీ సిద్ధపడి రావాలి” అని పవన్ పేర్కొన్నారు.

👉జగన్‌కు బిగ్ షాక్.. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!..జగన్‌కు బిగ్ షాక్.. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలింది. సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. స్వీకర్ అయ్యన్న పాత్రుడు వాటిపై సీరియస్ అయ్యారు. దీంతో సాక్షి పత్రిక, మీడియా పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండానే రూ. కోట్లు వెచ్చించారంటూ సాక్షి కథనాలు రాసుకొచ్చింది.

👉అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి*

ఓబులవారిపల్లె మండలం గుండాలకోన కు నడుచుకుంటూ వెళుతున్న భక్తుల పై ఏనుగుల గుంపు దాడి.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు.. వై.కోట నుండి గుండాలకోన కు వెళ్లే దారిలో ఘటన..రేపు మహాశివరాత్రి సందర్బంగా అడవిలో భక్తులు నడుచుకుంటూ వెళ్లే సమయంలో డాడిచేసిన ఏనుగుల గుంపు..

👉వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు..*పార్టీ నుంచి బహిష్కరించిన వైఎస్ జగన్..రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయిన శంకర్ నాయక్..పోలీసుల రైడ్ సమయంలో మంచం కింద దూరిన శంకర్ నాయక్..ఆ వీడియో వైరల్ కావడంతో శంకర్ నాయక్ ను పార్టీ నుంచి బహిష్కరించిన వైసీపీ..వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడుగా పని చేసిన శంకర్ నాయక్..

👉 రానున్న మార్చి ఒకటో తేదీ నుండి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు…కోనసీమ జిల్లా ఎల్పిజి గ్యాస్ విని యోగదారుల నుంచి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూలు పై జిల్లా నుండి 70 శాతం మంది నుంచి ఫిర్యాదులు…*డెలివరీ చార్జీలను రశీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి..*ఆదేశాలు పాటించని పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు పంపి ణీదారుల ను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సుల రద్దు…జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాoతి…

👉వల్లభనేని వంశీ పై భూ కబ్జా కేసు*… గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు..గన్నవరం లో గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్లు విలువైన స్థలం కబ్జా పై కేసు నమోదు చేసిన పోలీసులు….హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు….వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేయాలి అని ఫిర్యాదు….వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మంది పై ఫిర్యాదు చేసిన హైకోర్ట్ న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి….ఆ రోజు స్థలం కబ్జా పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదు.

👉డాక్టరమ్మ సేవలు మరువలేనివి!!*

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లో సంజీవ రావు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్న డాక్టర్

షేక్ .సుమయ కు మాస్టర్ ఆఫ్ సర్జరీ ( ప్రసూతి & గైనకాలజీ) విభాగంలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్తున్న సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది ఈరోజు ఘనంగా వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో ఒక మహిళ అయి కూడా ధైర్యంగా ముందుకు వెళ్లి తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎంతోమందికి పునర్జన్మ కల్పించింది. గిద్దలూరు మారుమూల ప్రాంతంలో పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రతి మహిళ మూర్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది .ఆమె చేసిన సేవలు గిద్దలూరు ప్రజలు ఇప్పటికీ మరువలేనివి. అనంతరం వైద్య సిబ్బంది అందరూ కలిసి డాక్టరమ్మకు ప్రత్యేకంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు

👉కరెంట్ హీటర్ తగిలి బాలిక మృతి*

ప్రకాశం జిల్లా కోమరోలు మండలం నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ధరణి తాటిచర్ల మోటు స్కూల్ బాల యేసు బడి లో 7.వ తరగతి చదువుతున్న ధరణి ప్రమాదవశాత్తు కరెంట్ హీటర్ తగిలి మరణించడం జరిగినది

👉 రాచర్లలో మహిళపై దాడి………! రాచర్ల బస్టాండ్ లో చిన్నపాటి హోటల్ నడుపుకుంటున్న బొంతల కుమారి అనే మహిళపై అక్కడే చికెన్ కొట్టు నడుపుకుంటున్న జాఫర్ (నంద్యాల సాహెబ్) అను వ్యక్తి దాడి చేయడంతో కుమారికి తలకు గాయమైనట్లు తెలిసింది ఇరువురి వ్యాపార కేంద్రాలు ప్రక్క ప్రక్కన అయినందున వ్యాపార పరంగా లావాదేవీల పరంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెపై దాడి అయితే జరిగింది గాయపడ్డ మహిళ రాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఇందుకు గల పూర్తి సమాచారం తెలియవలసి ఉంది

👉 పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో*

కంభం మండలం హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపీడీవో వీరభద్రాచారి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల వసతులు, సౌకర్యాలను,విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రంథాలయాన్ని,డిజిటల్ తరగతులను, పాఠశాల నిర్వహణ తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు సరోజను ఎంపీడీవో అభినందించారు.

జగన్‌కు బిగ్ షాక్.. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!..జగన్‌కు బిగ్ షాక్.. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలింది. సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. స్వీకర్ అయ్యన్న పాత్రుడు వాటిపై సీరియస్ అయ్యారు. దీంతో సాక్షి పత్రిక, మీడియా పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండానే రూ. కోట్లు వెచ్చించారంటూ సాక్షి కథనాలు రాసుకొచ్చింది.

👉అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి*

ఓబులవారిపల్లె మండలం గుండాలకోన కు నడుచుకుంటూ వెళుతున్న భక్తుల పై ఏనుగుల గుంపు దాడి.. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు.. వై.కోట నుండి గుండాలకోన కు వెళ్లే దారిలో ఘటన..రేపు మహాశివరాత్రి సందర్బంగా అడవిలో భక్తులు నడుచుకుంటూ వెళ్లే సమయంలో డాడిచేసిన ఏనుగుల గుంపు..

[వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు..*పార్టీ నుంచి బహిష్కరించిన వైఎస్ జగన్..రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయిన శంకర్ నాయక్..పోలీసుల రైడ్ సమయంలో మంచం కింద దూరిన శంకర్ నాయక్..ఆ వీడియో వైరల్ కావడంతో శంకర్ నాయక్ ను పార్టీ నుంచి బహిష్కరించిన వైసీపీ..వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడుగా పని చేసిన శంకర్ నాయక్..

[ రానున్న మార్చి ఒకటో తేదీ నుండి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు…కోనసీమ జిల్లా ఎల్పిజి గ్యాస్ విని యోగదారుల నుంచి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూలు పై జిల్లా నుండి 70 శాతం మంది నుంచి ఫిర్యాదులు…*డెలివరీ చార్జీలను రశీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి..*ఆదేశాలు పాటించని పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు పంపి ణీదారుల ను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సుల రద్దు…జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాoతి…

👉వల్లభనేని వంశీ పై భూ కబ్జా కేసు*… గన్నవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు..గన్నవరం లో గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్లు విలువైన స్థలం కబ్జా పై కేసు నమోదు చేసిన పోలీసులు….హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు….వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేయాలి అని ఫిర్యాదు….వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మంది పై ఫిర్యాదు చేసిన హైకోర్ట్ న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి….ఆ రోజు స్థలం కబ్జా పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..