👉కేసీఆర్ అలా చేయకపోయి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేది: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు* …👉తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ రైతులపై దాడి చేసిన పోలీసులు…👉డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఎన్ హెచ్ ఆర్ సి ఆగ్రహం(తిరుపతి)..👉ఏపీలో త్వరలో మహిళల రక్షణకు “సురక్ష” యాప్*..👉డీజీ అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ అదేశాలు*.. ఐఏఎస్ లు ఫైర్ అవుతున్నారంట !!..*పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నా

👉*కేసీఆర్ అలా చేయకపోయి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేది: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు*

జగన్‌కు కేసీఆర్ పంచభక్ష పరమాన్నం పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శ… తెలంగాణ జల దోపిడీకి అక్కడే అంకురార్పణ జరిగందన్న ముఖ్యమంత్రి… కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే పంచాయితీ ఉండకపోయేదన్న రేవంత్ రెడ్డి

కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో జగన్‌ను అధికార లాంఛనాలతో ఆహ్వానించి, పంచభక్ష పరమాన్నం పెట్టారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ జల దోపిడీకి అక్కడే అంకురార్పణ జరిగిందని ఆరోపించారు. “ఈ పాపం మీది కాదా కేసీఆర్” అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పులు మోసింది, ఊడిగం చేసింది కేసీఆర్ కాదా అన్నారు.

నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ వేల కోట్ల రూపాయలు మింగారని ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టు కడితే అది కూలిపోయిందని మండిపడ్డారు. లగచర్లలో గొడవ పెట్టాలని చూశారని, కలెక్టర్‌ను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. మా పాలమూరు ప్రాంతానికి పరిశ్రమలు రావొద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

గట్టిగా కొడతానని కేసీఆర్ ఇటీవల అంటున్నారని, కొట్టడానికి అదేమైనా ఫుల్లా? హాఫా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొట్టాల్సింది తనను కాదని, తప్పు చేస్తున్న ఆయన కొడుకు, అల్లుడిని కొట్టాలని వ్యాఖ్యానించారు. గట్టిగా కొడితే తమ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్‌కు ఎంపీ పదవి పాలమూరు ప్రజల బిక్షే అన్నారు.

*ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో దోపిడీకి పాల్పడ్డారు*

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీకి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోటే ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, అందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, డబుల్ బెడ్రూంలు ఉన్న చోట బీఆర్ఎస్ అడగడానికి సిద్ధమా? అని సవాల్ చేశారు. పాలమూరు పేదరికాన్ని చూపించి కేసీఆర్ మార్కెటింగ్ చేసుకున్నారని ఆరోపించారు. తనపై కోపంతో కేసీఆర్ పాలమూరుపై కక్ష కట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులపై తాను దృష్టి సారించానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవలేదని, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఒక్కటి కూడా రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు, అదో పార్టీయా అని ఎద్దేవా చేశారు.

*మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే పంచాయితీ పెట్టాలని చూస్తున్నారు*

మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే కొంతమంది పంచాయితీ పెట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. పాలమూరుకు ముఖ్యమంత్రి రూపంలో ఒక అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. మన ఇంటి బిడ్డకు అవకాశమొస్తే కడుపులో కత్తులు పెట్టి చంపాలని చూస్తున్నారని విమర్శించారు.

అలాంటి వారికి పాలమూరు యువత బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పనులు చేసే బాధ్యత తనదని, తనను కాపాడుకునే బాధ్యత మాత్రం పాలమూరు ప్రజలదే అన్నారు. మనకు మళ్లీ ఇలాంటి అవకాశం రాదని ఆయన అన్నారు. మనకు అవకాశం వచ్చినప్పుడే ప్రాజెక్టులు పూర్తి చేసుకుందామని అన్నారు. కొడంగల్‌లో ప్రాజెక్టులు తెచ్చి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన అన్నారు.

*భూసేకరణను అడ్డుకోవద్దని విజ్ఞప్తి*

పాలమూరు ప్రజలు భూసేకరణను అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇస్తామని అన్నారు. ఇక్కడ మీ బిడ్డ, మీ సోదరుడు ఉన్నాడని, కాబట్టి పరిహారం తప్పకుండా ఇస్తామన్నారు. నష్టపరిహారం ఇచ్చి, ఉద్దండపూర్ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రజల కష్టాలను తీర్చకుంటే మీ బిడ్డ అధికారంలో ఉండి ఏం లాభమని వ్యాఖ్యానించారు.
👉తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ రైతులపై దాడి చేసిన పోలీసులు…అటవీ భూములను సాగు చేస్తున్నారని దాడి .. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు..ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి, బూటు కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు

తాత ముత్తాతల నుంచి 11 మంది రైతులం 25 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని, ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలిసి కూడా వచ్చి దాడి చేశారని.. నిన్న జిల్లా ఆటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి 150 మంది పోలీసులతో వచ్చి తమను బూటు కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దారని.. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మహిళా రైతులు తెలిపారు .కొండి శారద, పొదిళ్ల శ్రీను, పొదిల్లా రజిత అనే రైతులను తాళ్లతో కట్టేసి అధికారులు వారి వాహనాల్లో తీసుకువెళ్ళారు ..వారి ఆచూకీ తెలిపి, గత నాలుగేండ్లుగా తమ దగ్గర డబ్బులు తీసుకుంటూనే, తమ కొడుకులపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు

👉డీజీ అంజనీ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ అదేశాలు* ..ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న అంజనీ కుమార్తె , మాజీ డీజీపీ గా పని చేసిన అంజనీ కుమార్అంజనీ కుమార్, అభిలాష బిస్త, అభిషేక్ మహంతిని వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశాలు_

👉డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఎన్ హెచ్ ఆర్ సి ఆగ్రహం…తిరుపతి ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన హ్యూమన్ రైట్స్.భద్రత కల్పించడంలో ఏం చేస్తున్నారంటూ నిలదీత.వైసిపి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పలువురి పై ఫిర్యాదు చేసిన ఎఫ్ ఐ ఆర్ లు ఎందుకు లేవో చెప్పాలంది.నాలుగు వారాల్లో తుది నివేదిక సమర్పించాలంటూ ఏపీ సీఎస్, డిజిపి కి నోటీసులు.

👉ఏపీలో త్వరలో మహిళల రక్షణకు “సురక్ష” యాప్*

ఏపీలో మహిళల రక్షణ కోసం ‘సురక్ష’ పేరుతో మహిళా దినోత్సవం(మార్చి 8వ తేదీ) నాటికల్లా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తేవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో ఆమె సమీక్షించారు. ప్రతి జిల్లాలో సురక్ష బృందాలను పెట్టి నిఘా పెంచాలని సూచించారు
👉 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్*
నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని ..
జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి …
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపిన సీఎం ..
సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించిన సీఎం ..
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆరెఫ్ టీం ను పంపిస్తామని సీఎంకు చెప్పిన ప్రధాని మోదీ ..
పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్ ..
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో SLBC టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని ..
జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోడీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి..
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపిన సీఎం …
సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించిన సీఎం ..సహాయక చర్యల కోసం వెంటనే NDRF టీంను పంపిస్తామని సీఎంకు చెప్పిన ప్రధాని మోడీ..పూర్తి స్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.

👉రాజద్రోహం లాంటిది అని జీ.వీ.రెడ్డి  నిన్న అన్నందుకు… ఐఏఎస్ లు ఫైర్ అవుతున్నారంట !!
బట్టలూడదీసి నిలబెడతాం అని జగన్రెడ్డి మొన్న అన్నందుకు… ఐపీఎస్ లు పెద్దగా ఫీల్ అయినట్టు లేరు !!..జగన్రెడ్డి ప్రభుత్వంలో 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష పడితే… వీళ్ళలో ఎవ్వరి మనోభావాలూ దెబ్బతినలేదు !!.. ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగులను తొలగించాలని సంస్థ చైర్మన్ ఆదేశించినా… ఆ నిర్ణయాన్ని 3 నెలలుగా బుట్టదాఖలు చేశారు !!
గ్రూప్ – 2 పరీక్షలు వాయిదా వేయాలని ఇవాళ సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అడిగినా… ఏపీపీఎస్సీ చైర్మన్, సెక్రటరీలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు !!
చంద్రబాబు  ప్రభుత్వంలో మాత్రమే… ఎవ్వరికైనా ఇట్టే మనోభావాలు దెబ్బతినేస్తూ ఉంటాయి విచిత్రంగా !!

ప్రభుత్వాల పట్ల ప్రజల్లో & ప్రభుత్వోద్యోగులలో వ్యతిరేకత రప్పించడంలో… ఈ మెజారిటీ బ్యూరోక్రాట్లు ముందు వరుసలో ఉంటారు !
బ్రిటీషర్ల కాలం నాటి ఈ కలెక్టర్ల వ్యవస్థ తొలగించనంత కాలం… ప్రొడక్టివ్ ప్రభుత్వాల జయాపజయాలు ఊగిసలాడుతూనే ఉంటాయి !!

👉కాసు వారి వివాహ మహోత్సవనికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*
*మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో కాసు వెంకటేశ్వరరెడ్డి,అనంతలక్ష్మీ గార్ల కుమార్తె వివాహానికి హాజరుఅయి నూతన వధువు అయిన లక్ష్మి పావని గారిని ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసన సభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయ కర్త అన్నా రాంబాబు  తదితరులు పాల్గొన్నారు.*


*పోరెడ్డి వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న వై.వి,అన్నా*
*ఒంగోలు టౌన్ లింగారెడ్డి కన్వెన్షన్ హాల్ నందు పోరెడ్డి వెంకటరెడ్డి,రాజేశ్వరి గార్ల కుమార్తె వివాహ మహోత్సవనికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన మౌనిక,రాజశేఖరరెడ్డి గార్లను ఆశీర్వదించిన రాజ్యసభసభ్యులు వై.వి.సుబ్బారెడ్డి,గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు  మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..