👉 కోటి విలువ గల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు..👉జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి! ..👉మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్ *..మాజీ సిఎం జగన్ తో మరో ఏడుగురు పై కేసు నమోదు..*శ్రీవారి సన్నిదిలో టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు..*పోర్టు కబ్జాలో మాజీ ఏజీ, సుప్రీం రిటైర్డ్ జడ్జిని ఇరికిస్తున్న జగన్ గ్రూప్ !..*మార్కాపురం జిల్లా ఏర్పాటు కలేనా !!!

👉 కోటి రూ, విలువ గల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ.. జిటి ఎక్స్ప్రెస్ లో అగ్రా నుండి విజయవాడకి తీసుకొచ్చిన 107 కేజీలు వెండి .. బిల్లు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామన్న రైల్వే పోలీసులు

👉 *జీబీఎస్‌తో గుంటూరులో మరో మహిళ మృతి*.. గులియన్‌ బారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌)తో బాధపడుతూ గుంటూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మరొకరు బుధవారం మృతి చెందారు.. జీబీఎస్‌  లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన షేక్‌ గౌహర్‌ జాన్‌ బుధవారం మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ ఇదే వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యాధి బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండడంతో కలకలం రేగుతోంది. జీబీఎస్‌తో మరి కొందరు బాధితులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు..

👉మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్.. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి ఖండించారు. ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.

👉*పోర్టు కబ్జాలో మాజీ ఏజీ, సుప్రీం రిటైర్డ్ జడ్జిని ఇరికిస్తున్న జగన్ గ్రూప్ !*

జగన్ మోహన్ రెడ్డి క్రిమినాలిజీ ఎంత భయంకరంగా ఉంటుందో..ఆయన ఇతరులను వాడుకునే విధంగా ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో మరోసారి బయటపడింది. కాకినాడ పోర్టును అధికారం అడ్డం పెట్టుకుని మాఫియాలాగా కబ్జా చేసిన వ్యవహారంలోకి మాజీ ఏజీ. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా వారి పేర్లు వాడేశారు.. పోర్టును కబ్జా చేయడానికి ముందుగా ఓ ప్రైవేటు ఆడిటింగ్ సంస్థను దింపి.. అక్రమాలకు పాల్పడ్డారని రూ. 965 కోట్లు జరిమానా వేశారు. తర్వాత డీల్ పూర్తయిన తర్వాత దాన్ని 9 కోట్లుగా మార్చారు. ఇక్కడే అసలు గ్యాంబ్లింగ్ జరిగింది. ఎందుకు ఇలా చేశారని.. అంటే.. ఇప్పుడు మాజీ ఏజీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సలహా తీసుకుని అలా తగ్గించామని .. జగన్ గ్రూపు తరపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. అసలు ఇలాంటి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో వారికేం సంబంధం?.. అంటే.. పోర్టును కబ్జా చేయడానికి ఓ ప్రణాళిక ప్రకారం వారిని కూడా ఉపయోగించుకున్నారు. ఏదైనా తేడా వస్తే వారిని కూడా ఇరికించేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారన్నమాట. అడ్జగోలు దోపిడీ చేసింది కాకుండా.. జగన్ పంచన చేరినందుకు ఏజీని.. సుప్రీంకోర్టు రిటైల్డ్ జడ్జీని కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇంతకీ ఆ ఏజీ.. సుప్రీం రిటైర్డ్ జడ్జిలు ఎవరన్నది సస్పెన్స్ గా మారింది.

👉 థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ తిరుమలలో బూతు పురాణం.. శ్రీవారి సన్నిదిలో టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌..

మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌, అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు..అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సమాధానమిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ థర్డ్ క్లాస్ నా కొడుకువి, నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఏయ్‌ ముందు నువ్వు బయటకు పో అంటూ ఉద్యోగిని బూతులు తిట్టాడు…

👉ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశారని మాజీ సిఎం జగన్ తో మరో ఏడుగురు పై కేసు నమోదు..గుంటూరు.. ఎన్నికల కోడ్ .పోలిస్ యాక్ట్ నీ ఉల్లంఘన చేశారని వెస్ట్ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శ్రీనివాస్ నల్ల పాడు పోలిస్ స్టేషన్లో పిర్యాదు..మాజీ మంత్రులు అంబటి రాంబాబు .పెర్ని నాని .కొడాలి నాని .తో పాటు మేయర్ కావటి మనోహర్ మాజీ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. మో దు గుల వేణుగోపాల్ రెడ్డి మరి కొంత పై కేసు నమోదు.. ఎన్నికల కోడ్ ఉండగానే “ఈ సి “నుంచి అనుమతులు తీసుకోకుండానే పర్యటన పై చర్యలు.. మిర్చి యార్డు లో కి వెళ్ళే రైతులను అసౌకర్యం.ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో వెల్లడి.. ఎన్నికల నిబంధనలు పాటించని కారణంగా చర్యలు తీసుకోవాలని అధికారులు పిర్యాదు..

👉ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన ఎప్పుడు…..!?
*విభజన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో ఏర్పాటు, ఆ తర్వాత 26 జిల్లాలుగా మార్పు….*చిరకాలంగా డిమాండ్ వున్నా… మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి పట్టించుకోని ప్రభుత్వాలు …?2024 అసెంబ్లీ ఎన్నికల సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ నెరవేరేది ఎన్నడో…?? ప్రజల ఆకాంక్ష నెరవేరేది ఎప్పుడో???

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 13 జిల్లాలతో ఏర్పడింది. మొదటి ఐదేళ్లు అధికారంలో వున్న టీడీపీ కొత్త జిల్లాల ఏర్పాటు జోలికి పోలేదు.. ఆ తరువాత, 2019 ఎన్నికల సమయంలో పరిపాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రకటించింది.కానీ, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా వైసీపీ అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది.

*కొత్త జిల్లాల ఏర్పాటు సక్రమంగా లేదని మార్కాపురం, రాజంపేట, మదనపల్లి తదితర అనేక చోట్ల ప్రజల నుంచి తీవ్రంగా అభ్యంతరాలు, ఉద్యమాలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.ముఖ్యంగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్లో వున్న గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని ప్రాంతాలు జిల్లా కేంద్రం ఒంగోలుకు 100 కి. మీ.పైగా వున్నాయి.ఈ కారణంగా మార్కాపురం డివిజన్ ప్రాంత ప్రజలకు జిల్లా విభజనతో ఏ విధంగా కూడా ఉపయోగం లేదు.. ఇతర అనేక జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాలు ఇప్పటికీ చాలా దూరంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు..ఈ కారణంగా , ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలను పునర్విభజన చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు 2024 – ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు..టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు..ఈ మేరకు, అంతర్గతంగా కూడా కూటమి ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన పై చర్చ జరుగుతూనే వుంది..పోలవరం ముంపు మండలాలను కలిపి ఓక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అలాగే మార్కాపురం, డోన్, మదనపల్లె పట్టణాలు ” జిల్లా కేంద్రాలు” గా కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలనే డిమాండ్ ఉంది. ప్రజల డిమాండ్స్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిన రాజకీయ అవసరం, భాద్యత కూటమి పార్టీలపై వుంది.. జిల్లాల పునర్విభజనను 2025 లోనే పూర్తి చేస్తారని, దాదాపు 32 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని మరో వైపు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ భూభాగం,జనాభా ఉన్న తెలంగాణలో (Telangana) 33 జిల్లాలుండగా…..ఆంధ్రప్రదేశ్ లో 32 జిల్లాలు ఉండడం సబబే అని వివిధ వర్గాలకు చెందిన మేధావులు, సామాజిక, ప్రజా సంఘాల వారు వాదిస్తున్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..