👉ప్రజావ్యతిరేక బడ్జెట్ ను సవరించాలి… అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి.. వైఎస్ షర్మిల… 👉రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్…👉 అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి.. వైఎస్ షర్మిల..👉మాజీ సీఎం గుంటూరు రాకపై భగ్గుమన్న మంత్రులు..👉శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా  ర్యాలీలో ఘర్షణ (పల్నాడు జిల్లా దాచేపల్లి)*రాయచోటి లో కుక్కల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి..👉మహిళా సాధికారతే లక్ష్యం : గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*

👉ప్రజావ్యతిరేక బడ్జెట్ ను సవరించాలి….

కార్పొరేట్ ల ప్రయోజనం కోసం రూపొందిన కేంద్ర బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు ధర్నా చేపట్టాయి. ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు దోహదపడేందుకు రూపొందించిన కేంద్ర బడ్జెట్ ను సవరించాలని వక్తలు డిమాండ్ చేశారు. కార్పొరేట్ల పై 2%, సంపద పై 2% పన్ను విధించాలని డిమాండ్ చేశారు.విద్య, వైద్యం, ఉపాధి,సంక్షేమానికినిధులు  పెంచుతూ బడ్జెట్ సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సిపిఐ పట్టణ శ్రీరామ్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ,, సిపిఎంఎల్  న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్,సిపిఎంఎల్ జిల్లా నాయకులు ఆర్ వెంకట్రావు, తదితరులు మాట్లాడారు.కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్…

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధం..ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు.. సౌదీ అరేబియా వేదికగా కీలక సంప్రదింపులు..ఇందులో భాగంగానే.. అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు మొదలు.. ఈ నేపథ్యంలోనే.. జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమంటూ రష్యా నుంచి స్పందన..తాను అధికారంలోకి వస్తే.. యుద్ధాన్ని ఆపుతానంటూ హామీ ఇచ్చిన ట్రంప్..తాను చెప్పినట్టుగానే.. యుద్ధ ముగింపు కోసం అధికారికంగా చర్చలు ప్రారంభం

👉 అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకుంటే రాజీనామా చేయండి.. వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదని విమర్శిస్తూ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

“ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత నిర్వర్తించాలి!”

షర్మిల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాట్లాడుతూ, “ఈ సారి అయినా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని” వైసీపీని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఆరోపిస్తూ, “ప్రతీ హామీకి 90 కారణాలు చెబుతున్నారు, కానీ అమలు మాత్రం లేదు” అని ఆమె విమర్శించారు.

“సూపర్ సిక్స్ కోసం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి!”

ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల కోసం పూర్తిస్థాయి నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

“జగన్‌కు ప్రజల సమస్యలు పట్టవా?” .. షర్మిల మరోసారి తన అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. “నేరస్థులను పరామర్శించేందుకు సమయం ఉంది, కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీయడానికి మాత్రం మొహం చెల్లదు” అంటూ జగన్‌పై విమర్శలు చేశారు.. “ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీలో లేకపోవడం సరికాదు!”..”ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మౌనం పాటిస్తున్న వైసీపీ నేతలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని” షర్మిల ఫైర్ అయ్యారు.

👉రాయచోటి లో కుక్కల బెడద నుంచి మమ్మల్ని కాపాడండి.. అన్నమయ్య జిల్లా రాయచోటి ఉమర్ మసీద్ దగ్గర కుక్కలు ఇద్దరికీ కరవడం జరిగింది. దీనికి అధికారుల నిర్లక్ష్యమని అని ప్రజలు అంటున్నారు. గతంలో కూడా చాలా వార్డులలో కుక్కలు కరవడం పిల్లలు, పెద్దలు క్రమక్రమంగా ఆసుపత్రులకు రావడం జరుగుతూనే ఉంది . ఇప్పుడైనా మునిసిపల్ అధికారులు చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్యను దూరం చేయాలని రాయచోటి ప్రజలందరూ కోరుకుంటున్నారు.

👉మాజీ సీఎం గుంటూరు రాకపై భగ్గుమన్న మంత్రులు..

రైతుల మీద జగన్‌కు నిజంగా చిత్తశుద్ది ఉంటే 14 వేల మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద సమాధానం చెప్పగలరా? భారత దేశంలో ఆత్మహత్యలకు 3వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది.. దానికి కారణం జగన్ కాదా? – కొల్లు రవీంద్ర.. ప్రజలు నవ్వుకుంటారేమో అని కూడా ఆలోచించకుండా జగన్ మాట్లాడుతున్నారు.    గుంటూరు మిర్చి యార్డు చరిత్ర తెలుసుకోకుండా జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారు.  పనికిమాలిన పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది జగన్ అవివేకం – మంత్రి అచ్చెన్నాయుడు.

👉మహిళా సాధికారతే లక్ష్యం..గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*…స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధించటమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి  అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయంలో నిర్వహించిన SLF రిసోర్స్ పర్సన్స్ సమీక్షా సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా వారికీ మెప్మా సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు మహిళలు ఆర్ధికంగా ముందుకు వెళ్లాలనే దిశగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళా చైతన్యానికి పునాదులు వేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని గుర్తు చేశారు. మహిళల అభ్యున్నత కోసం ప్రభుత్వం ఎల్లపుడు ముందుంటుందని, సున్నా వడ్డీకే రుణాలు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందించటం జరిగిందని, మహిళా సంక్షేమానికి ఎన్దీయే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉపాధి రుణాల విషయంలో బ్యాంకర్లతో ఎటువంటి సమస్యలు ఉన్న తన ద్రుష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తానన్నారు. మెప్మా కార్యాలయంలో మరమ్మతులు, మంచినీటి సౌకర్యం కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, కమిషనర్ వెంకటదాసు, మెప్మా CMM ప్రసాద్, స్థానిక కౌన్సిలర్ పెద్దవలి, మరియు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

👉ప్రజల వద్దకే పాలన – అర్ధవీడు ప్రజా దర్భార్ లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రజల వద్దకే పాలన ద్వారా ప్రజా సమస్యలను పరిష్కారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం అర్ధవీడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ” ప్రజాదర్భార్” కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  మండలంలోని గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనుచున్న రెవిన్యూ, విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్య సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గ్రామాల్లోని సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ నరసయ్య, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మండల అధికారులు, మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు  పాల్గోన్నారు.

👉శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా  ర్యాలీలో ఘర్షణ .. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఘర్షణ వాతావరణం….దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లైబ్రరీ సెంటర్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీ చేరుకోగానే అక్కడ ఉన్న ముస్లింలకి మరియు హిందువులకు మధ్య ఘర్షణ….ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలు…కర్రలు , రాళ్లతో హిందువుల ర్యాలీపై దాడి చేసిన యువకులు

👉 వైయస్సార్ జిల్లా …సిద్ధవటం మండలంలో భారీగా చోరీ … నిర్మలగిరి కాలనీ వీరభద్రయ్య నివాసంలో భారీగా బంగారం, నగదు అపహరణ …దాదాపుగా 35 తులాల బంగారం, రెండు లక్షల రూపాయలు నగదు చోరీకి గురైనట్లు వీరభద్రయ్య కుటుంబ సభ్యుల వెల్లడి …నివాసంలో ఎవరు లేని సమయాన్ని గుర్తించి దోచుకెళ్లిన దుండగులు …సంఘటన స్థలానికి చేరుకున్న క్రైమ్ సీఐ భాస్కర్ రెడ్డి, ఒంటిమిట్ట సీఐ బాబు …కుటుంబ సభ్యుల నుండి వివరాలను సేకరిస్తున్న పోలీసులు …

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..