👉సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా… తేలిపోతారా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొత్త చిక్కుముడి ఎదురైంది. ఇప్పటికే తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం పార్టీని ఇబ్బంది పెడుతుంటే తాజాగా సుగాలి ప్రీతి కేసులో దర్యాప్తు చేయడానికి తమ వద్ద వనరులు లేవంటూ సిబిఐ చేతులెత్తేయడం పవన్ ఇమేజ్‌కు వ్యక్తిగతంగా సవాల్ విసిరుతోంది.
ఎవరీ సుగాలి ప్రీతి ? .. కర్నూలు పట్టణ శివార్లలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ అక్కడ హాస్టల్‌లో ఉంటున్న సుగాలి ప్రీతి తన హాస్టల్ రూమ్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన 2017లో జరిగింది. గిరిజన తండాకు చెందిన ఆమె తల్లిదండ్రులు సుగాలి ప్రీతిది హత్యే అని ఆరోపించడంతో అప్పటి టిడిపి ప్రభుత్వంలో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరగాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లోపు గవర్నమెంట్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా పవన్ సుగాలి ప్రీతి కేసుపై గట్టిగానే పోరాడారు. దానితో జగన్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకు అప్పజెప్పింది.
*సుగాలి ప్రీతి ఉరి వేసుకున్న ఫ్యాన్ రెక్కలు ఎందుకు వంగి పోలేదు, ఆమె శరీరంపై గాయాలు ఎందుకు ఉన్నాయి*. ఇలాంటి అనుమానాల్ని ఆమె తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతీ దేవి మీడియా ముందు ఉంచారు. దీనిపై ముందుగా త్రిసభ్య కమిటీ, ఆపై 5గురు సభ్యులతో మరో కమిటీ వేశారు అప్పటి జిల్లా కలెక్టర్. కమిటీ రిపోర్ట్‌లో కూడా ఇది లైంగిక దాడితో కూడిన హత్యే అనే అనుమానాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
సుగాలి ప్రీతి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన వైద్యులు సైతం తమ ప్రాథమిక రిపోర్ట్‌లో దీన్ని హత్య అన్నట్టు పేర్కొన్నారని ప్రచారం జరిగింది. కాలేజీ యాజమాని, అతని కుమారులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నా త్వరగానే వాళ్లకి బెయిల్ దొరికింది. దాంతో తమ కుమార్తెను పాడు చేసి చంపేసిన హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు..అధికారంలోకి రాగానే సుగాలి కేసుపై దృష్టి పెడతాను అన్న పవన్ ..ఎన్నికల సమయంలో పవన్ సుగాలి ప్రీతి కేసుపై పూర్తిగా దృష్టి పెడతానని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ కేసును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కంటికి దెబ్బ తగిలిన సంఘటన ఉదాహరిస్తూ ‘ జగన్ కంటిపై చిన్న దెబ్బ తగిలితే హడావుడి చేస్తున్నారు మరి సుగాలి ప్రీతి హత్య కేసుపై ఎందుకు దృష్టి పెట్టలేదు అంటూ’ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ సుగాలి ప్రీతి కేసును పూర్తిగా పక్కన పెట్టేశారు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. వంద రోజుల్లో పరిష్కరిస్తామన్న ఈ కేసు 8 నెలలైనా కొలిక్కి రాకపోవడంపై పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి సీబీఐ నిర్ణయం కూడా తోడుకానుంది. సుగాలి ప్రీతి కేసు తాము పరిష్కరించాల్సినంత సంక్లిష్టమైన కేసు కాదని, దానికి తగినన్ని వనరులు తమ వద్ద లేవంటూ కోర్టుకు సిబిఐ స్పష్టం చేసింది. తాము వేరే కేసుల్లో బిజీగా ఉన్నామని కూడా చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉపముఖ్యమంత్రి పవన్ వైపు మళ్ళింది. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ ప్రకారం పవన్ ఇప్పుడు ఈ కేసుపై దృష్టి పెట్టి ఆ తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తారా లేదా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ చిత్తశుద్ధికి సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ఒక పరీక్షలా మారింది. మరి పవన్ ఈ చిక్కుముడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
👉తెలుగు వారు ఉన్న దేశాలు రాష్ట్రాలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి :ఏపీ సీఎం చంద్రబాబు..దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజంది ప్రత్యేక పాత్ర. టెక్నాలజీ వినియోగంతో మరింత ముందుకెళ్లాలి. దేవాలయాల నిర్వహణలో సాంకేతికతను వినియోగించాలి.ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ఎందరో భక్తులు రూ.కోట్ల విరాళాలు ఇస్తున్నారు. ఆ విరాళాలను పేదల శ్రేయస్సు కోసం ఖర్చు చేస్తున్నాం.
ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో, ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఎక్కడ తెలుగు వారు అంటే, ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి. ఈ దిశగా టీటీడీ పని చేసి, దేవాలయాలు నిర్మిస్తుంది.పీ-4 విధానంలో దేశంలో మౌలిక వసతులు మరింత పెరగాలి. దేవుడి సేవ మాత్రమే కాదు, మానవ సేవ కూడా ఎంతో ముఖ్యం.ఏడు నెలల్లోనే ఏపీలోని ఆలయాలకు రూ.134 కోట్లు ఖర్చు చేశాం. అర్చకులకు జీతాలు పెంచాం, వేద పాఠశాలలకు నిధులు ఇస్తున్నాం..తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.
👉 కొత్త సీఈసీ ఎంపిక ఇప్పుడే వద్దు: రాహుల్..
కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక కోసం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కొత్త CEC పేరు ప్రతిపాదనను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో కేసు తేలేవరకు సీఈసీ నియామకం వద్దని వారించారు. కాగా ప్రస్తుతం సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది. తదుపరి సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ను నియమించాలని కేంద్రం భావిస్తోంది.
👉ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై విద్యార్ధి ఆత్మహత్య*
ఆన్ లైన్ గేమ్స్ ఆడి లక్షలు రూపాయలు పోగొట్టుకున్న అరవింద్ (23)…డిగ్రీ చదువుతున్న అరవింద్…మాదాపూర్ ఖానామెట్ లో తల్లి కుటుంబ సభ్యుల తో నివాసముంటున్న అరవింద్…గతంలో అన్ లైన్ డబ్బులు పోవడంతో ఇంట్లో నుంచి పారిపోయిన యువకుడు…వెతికి అరవింద్ తన ఇంటికి తెచ్చిన తల్లిదండ్రులు… నిన్న రాత్రి కూడా ఆన్ లైన్ గేమ్ లో మరో అరవై వేలు పోగొట్టిన అరవింద్…మనస్తాపానికి గురైన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ అరవింద్…స్థానిక ఏరియా హాస్పిటల్ తరలించిన తల్లిదండ్రులు…అప్పటికే చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు.
👉సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై JNTU కొరడా..
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు JNTU సన్నద్ధమైంది. తాజాగా గోకరాజు గంగరాజు కళాశాలకు యూనివర్సిటీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు JNTU వెబ్సైట్ పోర్టల్ నుంచి కానీ, పీఏ టూ రిజిస్ట్రార్క ఇ-మెయిల్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు.:
👉 వైసీపీ నేతలకు లుకౌట్ నోటీసులు?
తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో బోలేబాబా డెయిరీతో పాటు వైష్ణవి, AR డెయిరీ డైరెక్టర్లు, CEOలను సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు.. గతంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేతలు భూమన, వైవీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వారు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
👉సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?
సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్య మాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.
👉విజయవాడ శివారుల్లో గంజాయి స్వాధీనం: సీఐ
విజయవాడ శివారు జక్కంపూడిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ కొండలరావు తెలిపిన సమాచారం మేరకు.. జక్కంపూడిలో డెక్క రాజేష్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసామన్నారు. ఈ దాడిలో అతని వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ కొండలరావు చెప్పారు.
👉 సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై JNTU కొరడా : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు JNTU సన్నద్ధమైంది. తాజాగా గోకరాజు గంగరాజు కళాశాలకు యూనివర్సిటీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు JNTU వెబ్సైట్ పోర్టల్ నుంచి కానీ, పీఏ టూ రిజిస్ట్రార్క ఇ-మెయిల్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు.
👉 ఓ మహిళ చీటీ పాట పేరుతో ఘరానా మోసం చేసిందంటూ బాధితులు ఆరోపణ……*
*చీటీ పాట పేరుతో మోసం చేసిన మహిళ రాత్రి రాత్రి ఎక్కడ పరార్ అవుతుందోనని ఆ మహిళను నిర్బంధించిన బాధితులు*
*పొదిలి విశ్వనాధపురంలో ఓ మహిళ చీటీపాట పేరుతో సుమారు 50 లక్షలకు పైగా ఘరానా మోసం చేసిందంటున్న బాధితులు*
2019 నుండి చీటీల పేరుతో తమ దగ్గర లక్షలు దడుకుందని మహిళలపై ఆవేదనతో ఆరోపిస్తున్న బాధితులు….చీటీలు కట్టించుకున్న మహిళ తన షాప్ ఖాళీ చేస్తుందని తెలుసుకొని ఆ మహిళను షాపులో నిర్బంధించిన చీటీపాట బాధితులు….మహిళ ఎక్కడ రాత్రికిరాత్రే ఉడయిస్తుందో అనే అనుమానంతో ఆ మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించిన చీటీ పాట బాధితులు…..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు….తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల ముందు మోరపెట్టుకున్న బాధితులు….ఇంకా పెరగనున్న చీటీ పాట కట్టిన బాధితులు….
👉 *అనుమతి ఉన్న లే అవుట్లనే కొనుగోలు చేయాలి: మంత్రి నారాయణ*
*త్వరలోనే అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై ప్రత్యేక యాప్*
అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తామని వాటినే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో నిబంధనలను ప్రజలకు అనుకూలమైన విధంగా సడలించామని వాటిని సద్వినియోగం చేసుకో వాల్సిందిగా కోరారు. గతంలో మాదిరి నిబంధనలను అతిక్రమించి లేఅవుట్లు ఇళ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే నిబంధనలను పాటించకుండా వేసినటువంటి వెంచర్ల విషయంలో రాబోయే రెండు నెలల్లో ప్రజలకు లేఔట్ నిర్మాణదారులకు ఇరువైపులా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త్వరలోనే అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై యాప్ ను సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు
👉*సత్తా చాటిన చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు*
*రెండు గంటల్లో చైన్ స్నాచర్లను పట్టుకున్న చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు. తిమ్మాపురంలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన చోరీ ఘటన. దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు. వెంటనే రంగంలోకి దిగిన సిఐ సుబ్బానాయుడు మరియు ఎడ్లపాడు ఎస్సై బాలకృష్ణలు మరియు వారి బృందం. గంటల వ్యవధిలో కేసును చేధించిన పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎఎస్సై రోశి బాబు, హెడ్ కానిస్టేబుల్ యిర్మీయా, కొరివి మధు బాబు, సాంబ, తదితరులు కేసును చేధించిన బృందంలో ఉన్నారు.*
👉 మరో పది రోజుల్లో ఎన్నికలు.. కూటమి ‘నాడి’ ఎలా ఉంది? అయితే.. ఈ మూడు స్థానాల్లోనూ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూటమిలోని టీడీపీనే తీసుకుంది. ఏపీలో మరో పది రోజుల్లో అంటే.. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కేవలం మూడు స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నా.. దాదాపు 70 శాతం జిల్లాల్లో ఈ ఎన్నికల ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నెల 27న జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే.. ఈ మూడు స్థానాల్లోనూ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూటమిలోని టీడీపీనే తీసుకుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరుజిల్లాల పరిధిలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కూడా టీడీపీ నాయకుడు, సీనియర్ నేత పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు కూటమికి.. మరీ ముఖ్యంగా టీడీపీకి అత్యంత కీలకంగా మారింది. దీంతో సీఎం చంద్రబాబు ఇప్పటికి ఐదారుసార్లుగా.. మన వాళ్లను గెలిపించేందుకు కృషి చేయండి అని నాయకులు, మంత్రులకు కూడా తేల్చి చెప్పారు. ఇక, క్షేత్రస్థాయిలో పరిస్తితిని గమనిస్తే.. కూటమికి కొంత సెగ తగిలే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో విద్యాధికులు(గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు) ఓటేయనున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులు కూడా ఉన్నారు. అయితే.. వీరిపై కూటమి ప్రభుత్వ ప్రభావం ఆధారంగానే ఈ ఓటు బ్యాంకు టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో వ్యతిరేకత కనిపిస్తున్నట్టు తాజాగా సర్వేల్లో స్పష్టమైంది. ఉద్యోగులు తమ బకాయిలు 257 కోట్ల రూపాయలను ఇవ్వాలని గత రెండు మాసాలుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సర్కారు నిర్లిప్తంగా ఉంది. అదేసమయంలో 11వ పీఆర్సీ వేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనా సర్కారు ఏమీ తేల్చలేక పోతోంది. దీంతో ఉద్యోగులు.. కూటమి వచ్చినా..తమకు కష్టాలు తప్పలేదని అంటున్నారు. ఇక, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ.. డీఎస్సీ సహా ఉద్యోగ కల్పన వంటివి కూడా ముందుకు సాగలేదు. సీఎం చంద్రబాబు మలి సంతకంగా.. డీఎస్సీపైనే చేసినా.. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో వారు కూడా రగులుతున్నారన్నది తాజాగా సర్కారుకు అందిన సమాచారం. ఇక, టీచర్లు మాత్రం మిశ్రమంగా ఉన్నారు. వారి బదిలీలవిషయంలో సర్కారు సానుకూలంగా ఉండడం ఒక్కటే కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మేరకు కూటమి ప్రభావం చూపు తుందనేది ఆసక్తిగా మారింది.

