👉ఆడపిల్లల జోలికి వెళ్లినా, నేరాలు చేసినా నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం : సీఎం చంద్రబాబు..👉మన గ్యాస్ మన చమురు వనరులపై ఏపీ ప్రజల హక్కుగా కాపాడాలని 23 న కాకినాడలో సదస్సు..* తూగో జిల్లాలో పట్టుబడ్డ నకిలీ నోట్ల తయారీ ముఠా.. *రూ.5 కోట్ల బంగారం చోరీ.. 👉వైసీపీకి బిగ్ షాక్.. ఒకేసారి టీడీపీలోకి మరో ఆరుగురు, ఇప్పటికే నలుగురు చేరిక..!!!*ఖమ్మంలో *ఈనెల 18న మిర్చి రైతుల మహాధర్నా..*పెద్దపల్లిలో లారీ ఓనర్ నిరసన..*గుంటూరు జిల్లాలో దొంగ నోట్లు ముఠా…*వినుకొండ వైసీపీ నేతల అంతర్గత సమావేశం..*విజయవాడ *సితార సెంటర్ లో షాపులు మాఫియా.. ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది..*పాలకుర్తి మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎఎస్ ఐ రాజీ రెడ్డి ప్రజల పై జులుం*.. 👉లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన*..👉బుస్సాపూర్‌లో ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు

👉ఆడపిల్లల జోలికి వెళ్లినా, నేరాలు చేసినా నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం : సీఎం చంద్రబాబు

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం..రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి..వీటిపై ప్రభుత్వం యుద్దం చేస్తుంది….గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ” ఈగల్ ” ను ఏర్పాటు చేశాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

👉కర్ణాటకలో 6 నెలల్లో రెండోసారి కూలిన బ్రిడ్జి.. ఉత్తర కన్నడ జిల్లాలోని కాళీ నదిపై ఉన్న బ్రిడ్జి గత ఆగస్టు నెలలో కుప్పకూలగా రిపేర్లు చేస్తుండగా మరోసారి కూలింది.

👉వైసీపీకి బిగ్ షాక్.. ఒకేసారి టీడీపీలోకి మరో ఆరుగురు, ఇప్పటికే నలుగురు చేరిక..!!!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీని వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతల దగ్గరి నుంచి గ్రామ స్థాయి వరకు అంతా పార్టీని వీడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా.. సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు కూడా జగన్‌కు షాక్ ఇచ్చారు. తాజాగా ఒకేసారి ఆరుగురు నేతలు.. వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు, మాజీ మంత్రుల దగ్గరి నుంచి సామాన్య కార్యకర్తల వరకు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు మొత్తం.. ఫ్యాన్‌ పార్టీని వదిలేసి.. సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో ఆరుగురు కౌన్సిలర్లు కూడా అదే బాటలో టీడీపీలో చేరిపోయారు. దీంతో తుని మున్సిపాలిటీలో పట్టుసాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తుని మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. గతంలో జరిగిన తుని మున్సిపాలిటీ ఎన్నికల్లో 30 స్థానాలకు 30 సీట్లు.. వైసీపీ దక్కించుకుని క్లీన్‌స్వీప్ చేసింది. అయితే అందులో ఒక కౌన్సిలర్ మరణించగా.. ప్రస్తుతం 29 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. తాజాగా మరో ఆరుగురు కౌన్సిలర్లు కూడా అదే బాట పట్టారు. శనివారం తేటగుంట టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు.. ఆరుగురు కౌన్సిలర్లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో తుని మున్సిపాలిటీలో వైసీపీ బలం 19కి తగ్గగా.. టీడీపీకి 10 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ పార్టీలో చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత రాజా అశోక్‌బాబు.. తుని పట్టణ టీడీపీ అధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్‌, కుక్కడపు బాలాజీ సహా పలువురు పాల్గొన్నారు.

తాజాగా తుని మున్సిపాలిటీలోని 12వ వార్డు కౌన్సిలర్‌ బి.వెంకటదారేష్‌.. 19వ వార్డు ఆచంట సురేష్‌.. 24వ వార్డు కౌన్సిలర్‌ పులి సత్యనారాయణ.. 29వ వార్డు కౌన్సిలర్‌ దాశపర్తి రాజేశ్వరి.. 30వ వార్డు కౌన్సిలర్‌ సిద్దిరెడ్డి గౌరీ వనజ.. 20వ వార్డు కౌన్సిలర్‌ రాసబోయిన అప్పయ్యమ్మ ఉన్నారు. అయితే ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారు 23వ వార్డు కౌన్సిలర్‌ కర్రి శ్రీదేవి.. 28వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల భారతి.. 4వ వార్డు కౌన్సిలర్‌ తుమ్మలపల్లి సుశీల.. 8వ వార్డు కౌన్సిలర్‌ నార్ల భువనేశ్వరి.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు.

👉మన గ్యాస్ మన చమురు వనరులపై ఏపీ ప్రజల హక్కుగా కాపాడాలని 23 న కాకినాడలో సదస్సు..

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు..మన సహజ వనరులను అదానీ, అంబానీ లకు దోచి పెడుతున్న పాలకులు..సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్..

కాకినాడ, పిబ్రవరి 15: మన చమురు, సహజ వాయువు ఖనిజాలు ప్రకృతి వనరుల పై ఏపీ ప్రజల హక్కుగా కాపాడుకోవాలని కోరుతూ ఈ నెల 23 న కాకినాడ లో జరిగే సదస్సును విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఆదివారము ఉదయం స్థానిక ఎస్టీయూ భవన్ లో సీపీఐ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రన్ని ఆదుకోవాలంటే గ్యాస్ వాటా కోసము అందరం ఉద్యమించాలన్నారు..కాకినాడ సముద్ర తీరంలో ఏర్పడిన చమురు గ్యాస్ నిక్షేపలు మన గ్యాస్ మన రాష్ట్రానకే దక్కాలని అప్పుల్లో వున్నా రాష్ట్రం అభివృద్ధి సాధించండానకి గ్యాస్ వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు వివిధ ప్రజాసంఘాలు ఏకమై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.

కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి 2024, జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందిని ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి.ని ఆయన అన్నారు మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న విషయం అందరకు తెలిసిందేనని అన్నారు. ప్రపంచంలో ఏప్రాంతంలో నైనా స్దానికంగా లభ్యమయ్యే సహజవనరులను ఉపయోగించుకునే హక్కు ఆప్రాంతానికే వుంటుందనేది సహజ న్యాయ సూత్రం. సహజవనరులు ఏ రాష్ట్రంలో వుంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో 50 శాతం కేటాయించాలని 12 వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందిని ముప్పాళ్ల అన్నారు . మన అవసరాలు తీర్చకుండానే 1500 కి.మీ. దూరానవున్న గుజరాత్, మహారాష్ట్ర కు మన తీరం నుండి గ్యాస్ ను అక్రమంగా తరలిస్తూ ఆంద్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.

ఆంధ్ర ప్రాంతానికి న్యాయమైన గ్యాస్ కేటాయింపుల కోసం , న్యాయమైన ధర కోసం, న్యాయమైన 50 శాతం లాభం వాటా కోసం వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. అయినా గ్యాస్ కేటాయింపులు, ఆదాయం లో సగం పొందలేకపోయాం. అన్నారు

గోదావరి కృష్ణ బేసిన్ లో ఈ నిక్షేపాలు 70000 చ.కి మీ విస్తీర్ణంలో వ్యాప్తించి ఉన్నాయిని అన్నారు ప్రముఖ ఆయిల్ సహజ వాయువు ఉత్తప్తి దేశమైన కువైట్ కన్నా మన దేశం లోనే బాంబే హై కన్నా మన గోదావరి బేసిన్ లోన్ ఎక్కువ నిల్వలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి అని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు

23 న జరగ తలపెట్టిన సదస్సు ను ఉపాధ్యాయలు విద్యార్థులు కార్మికులు రైతులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ మన తీర ప్రాంతంలో ఉన్న సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలు దాసోహం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర భూభాగం నుండి వేల కిలోమీటర్ల పైపు లైన్ ద్వారా రాష్ట్ర వెలువలకు తరలించే క్రమంలో పలు పర్యాయాలు గ్యాస్ లీకేజీ అయ్యి ప్రజలు పశువుల ప్రాణాలు కోల్పోతున్నారని పంటలు తోటలు నాశనం అవుతున్నాయని ఆయన ఆరోపించారు మన గ్యాస్ మనకే దక్కాలని చేస్తున్న పోరాటాన్ని ముందుకు తీసుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇంకా ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్తిబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ప్రముఖ విద్యావేత్తలు ఆలపాటి శ్రీనివాస్, కె ఆది

👉 రికార్డులు సృష్టించి.. డబ్బులుడ్రా చేసి..!!బుస్సాపూర్‌లో ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు

అందినకాడికి దోచుకుతిన్న మాజీ సర్పంచ్‌..పనులు చేయకున్నా చేసినట్లు రికార్డులు..కుటుంబసభ్యుల పేర్లమీద ఈజీఎస్‌ బిల్లులు డ్రా..గ్రామానికి 7 కల్లాలు మంజూరైతే 6 తన కుటుంబానికే కేటాయింపు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని బుస్సాపూర్‌ గ్రామస్తుల డిమాండ్‌…

సిద్దిపేట, ఫిబ్రవరి 15 సర్పంచ్‌గా గ్రామాభివృద్ధికి కృషిచేయాల్సిన ఆయన సొంతింటిని చక్కబెట్టుకున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్‌) పనుల్లో అందిన కాడికి దోచుకుని సొమ్ముచేసుకున్నారు. సిద్దిపేట రూరల్‌ మండల బుస్సాపూర్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్‌) పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తాజా మాజీ సర్పంచ్‌ సదాశివరెడ్డి తన కుటుంబసభ్యుల పేర్ల మీద పనులు చేయకున్నా చేసినట్టు రికార్డులు చేయించి అక్రమంగా బిల్లులు డ్రా చేసుకున్నారు. క్యాటిల్‌ షెడ్‌, అవెన్యూ ప్లాంటేషన్‌, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలు, గ్రామంలో చేపట్టిన ప్రతి పనిలో అక్రమాలు జరిగాయి.

*కుటుంబ సభ్యుల పేర్లమీద డబ్బులు డ్రా.._*

బుస్సాపూర్‌ తాజా గ్రామ మాజీ సర్పంచ్‌ సదాశివరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు. పదవిలో ఉండగా ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు పనులు చేయకపోయినా చేసినట్లు రికార్డు చేయించి వారి పేర్ల మీద డబ్బులు డ్రా చేశారు. ఆయన భార్య సిద్దిపేటలో ఉంటుంది. ఏనాడు గ్రామంలో ఉపాధిహామీ పనులకు హాజరు కాలేదు. కానీ, ఆమె పేరిట గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌, వివిధ పనులు చేపట్టినట్లు ఐడీ నెంబర్‌ (010714) మీద బిల్లు రికార్డు చేసి రూ. 57,303 డబ్బులు తీసుకున్నారు. సర్పంచ్‌ పెద్దన్న రాజిరెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆయన కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన పేరిట గ్రామంలో ప్లాంటేషన్‌, కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, ఇతర పనులు చేసినట్లు ఐడీ నెంబర్‌ (010718) మీద పనిదినాలు రికార్డు చేసి బిల్లులు చేశారు. ఈయన ఎప్పుడు కూడా ఉపాధిహామీ పనికి పోయింది లేదు.ఈయన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ. 30,376 జమయ్యాయి. ఇక మాజీ సర్పంచ్‌ తండ్రి సత్యనారాయణరెడ్డి గ్రామంలోనే ఉంటారు. ఆయన ఉపాధిహామీ పనులకు పోడు. కానీ, గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో ఈయన ఐడీ 010251 మీద ఎంపీపీఎస్‌ బుస్సాపూర్‌ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణ పనులు చేసినట్లు రికార్డు చేశారు. ఈయన పేరిట రూ. 19,490 డ్రా చేసుకున్నారు. తల్లి జయమ్మ పేరు మీద ఐడీ నెంబర్‌ 010679 మీద రూ. 11,149 తో పాటు సీసీ నిర్మాణంలో పని చేసినట్లు డబ్బులు డ్రా చేసుకున్నారు. గ్రామంలో పాత కిచెన్‌ షెడ్డు మీద బిల్లులు డ్రా చేశారు. ఇలా ఒకటి ఏమిటి ఏది దొరికితే దాని మీద కుటుంబ సభ్యుల పేర్ల మీద రికార్డులు చేయించి మాజీ సర్పంచ్‌ బిల్లులు తీసుకున్నారు. గ్రామంలో చేపట్టిన ప్రతి పనిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

7 కల్లాల్లో 6 కుటుంబ సభ్యులకే…ఉపాధిహామీ పథకంలో వ్యవసాయ బావుల వద్ద కల్లాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బుస్సాపూర్‌ గ్రామానికి 7కల్లాలు మంజూరయ్యాయి. గ్రామంలో ఏ రైతుకు ఇవ్వకుండా మాజీ సర్పంచ్‌ సదాశివరెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్ల మీదనే 6 కల్లాలు మంజూరు చేయించుకొని నిర్మాణం చేసుకున్నారు. ఒకటి మాత్రమే ఇతర రైతుకు కేటాయించారు. దీనిపై గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ధాన్యం పోద్దామంటే కల్లాలు లేక రోడ్ల మీద పోసుకుంటున్నామని రైతులు తెలిపారు. తాజా మాజీ సర్పంచ్‌ తన అధికారంతో గ్రామానికి వచ్చిన పనులన్నీ తన కుటుంబ సభ్యులకే కేటాయించారని ఆరోపించారు. గ్రామంలో విద్యుత్‌ దీపాల బిల్లుల్లో సైతం భారీగా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఫిజికల్‌గా ఒకటి చూపించి రికార్డులో మరోటి చూపి వేల రూపాయలు కాజేసినట్లు తెలిసింది. తన ఇంట్లో పెట్టుకున్న బల్బులు రికార్డులో చూపించారు. విద్యుత్‌ బిల్లులపైనే దాదాపుగా వేల రూపాయల కుంభకోణం జరిగింది. గ్రామంలో ఈ మధ్య కాలంలో జరిగిన వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

👉లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన*

*పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన*..ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారిపైన అక్రమ కేసు పెట్టారని, నెలకు ఒక్కో లారీ నుండి రూ.8000 లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్*

👉విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడ్డ హెడ్మాస్టర్.. చితకబాదిన పేరెంట్స్..!*తల్లి,తండ్రి, గురవు, దైవం అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత రెండో స్థానం గురువులకే కేటాయించారు. ప్రేమతో పాఠాలు చెప్పాల్సిన అలాంటి టీచర్స్ విచక్షణ కోల్పోతున్నారు. స్కూల్స్‌లో కూడా చిన్నారులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు.

నంధ్యాల జిల్లా పాణ్యం మండలం అలమూరు అప్పర్ ప్రైమరీ స్కూల్ చెందిన హెడ్ మాస్టర్ బరితెగించాడు. కళ్లు మూసుకుపోయిన విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు మూకుమ్మడిగా స్కూల్ వద్ద చేరుకుని హెడ్ మాస్టర్ ప్రవర్తనపై నిలదీశారు. అందరు కలిసి సదరు హెడ్ మాస్టర్‌కు దేహశుద్ధి చేశారు..

గత కొంత కాలంగా విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూన్నాడంటు హెడ్ మాస్టర్ మల్లేశ్వర్‌ను చితకబాదారు‌. పరిస్థితి విషమించడంతో సహచర ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్‌ను అక్కడి నుంచి తప్పించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అందోళన చేపట్టారు. హెడ్ మాస్టార్ మల్లేశ్వర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

👉వ్యాన్ రిపేర్ చేయించుకుని మెకానిక్‌కు డబ్బులిచ్చారు..అక్కడే అడ్డంగా దొరికిపోయారు….పంగణామాలు పెట్టాలనుకున్నారు… కటకటాల్లోకి వెళ్లారు….అసలు స్టోరీ ఏంటి అంటే! ..*మీకు ఎదుటివారు ఇచ్చే కరెన్సీ నోటు కరెక్టేనా కాదో చెక్ చేసుకోండి….లేదా అడ్డం గా బుక్ అవుతారు….

తెలుగు రాష్ట్రాలను దొంగ నోట్ల ముఠాలు హడలెత్తిస్తున్నాయి. కోట్ల విలువైన నకిలీ నోట్లను సర్క్యులేషన్‌లోకి పంపిస్తున్నాయి. పోలీసులు తీగ లాగితే… ఎక్కడెక్కడో.. ఈ దొంగ యవ్వారం బయటపడుతుంది. దొంగ నోట్ల తయారీని కుటీర పరిశ్రమలా నడుపుతున్నారు కేటుగాళ్లు..

ఇండియాని పట్టిపీడిస్తున్న సమస్యల్లో నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫేక్‌ కరెన్సీ మోసాలు తగ్గడం లేదు. నకిలీ నోట్లు ముద్రించినా , చెలామణి చేసినా.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా ఏమాత్రం జంకడం లేదు నకిలీగాళ్లు. ఇచ్చట అచ్చమైన, స్వచ్ఛమైన 500 రూపాయల నోట్లు తయారు చేయబడును. సరసమైన ధరలకు అమ్మబడును అంటూ ఆఫర్లు ఇస్తున్నారు డూప్లికేట్‌ బ్యాచ్‌. కోట్ల రూపాయల టర్నోవర్‌తో చీకటి దందాకు తెరలేపుతున్నారు..

తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది. నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు… వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు..

అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్‌ రిపేరులో భాగంగా మెకానిక్‌కి దొంగ నోట్లు ఇచ్చారు. దీంతో ఆరా తీస్తే ముఠా గుట్టు రట్టయింది. ఒక లక్షకి మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నారు. గుంటూరు బాలాజీనగర్ స్లమ్‌ను డెన్‌గా ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్‌ చేశాడు మధు అనే వ్యక్తి. విజయవాడకు చెందిన మధుబాబు మరో వ్యక్తి మణికుమార్‌తో కలిసి నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. కాగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

👉ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి*

_న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 18 మంది చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు._

👉రూ.5 కోట్ల బంగారం చోరీ..*4 కేజీల 900 గ్రాముల బంగారంతో స్కూటీపై విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న నాగరాజు**మార్గ మధ్యలో బంగారం మాయం*విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ లోని డీవీఆర్ జ్యూవెలరీస్ లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న నాగరాజు*..స్కూటీపై వెళ్తుండగా.. టూవీలర్ పై వచ్చిన ఇద్దరు దొంగలు బంగారం ఎత్తుకెళ్లారని అంటున్న నాగరాజు*..విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు నాగరాజు తరలింపు*..తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేసి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న నాగరాజు భార్య*

👉 ఖమ్మంలో ఈనెల 18న మిర్చి రైతుల మహాధర్నా..

మిర్చికి కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ..ఖమ్మంలో ఈనెల 18న మహాధర్నాకు పిలుపునిచ్చిన మిర్చి రైతులు.

👉 పెద్దపల్లిలో లారీ ఓనర్ నిరసన..

కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు..పెద్దపల్లి ఆర్డీవో లంచం ఇవ్వాలని వేధిస్తున్నారని ఆరోపణలు..లంచం ఇవ్వకపోవడంతో మూడు లారీలు సీజ్ చేసారంటూ ఆరోపణ..ఆర్డీవో కార్యాలయం ఎదుట లారీ టాప్ ఎక్కి కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు..

గత కొంత కాలంగా రోడ్డు టాక్స్, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ కట్టకుండా తిరుగుతున్న లారీలు..ఉన్నత అధికారుల‌ ఆదేశాల‌ మేరకు స్పెషల్ డ్రైవ్..నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న మూడు లారీలు సీజ్..స్పెషల్ చెకింగ్ చేస్తున్న ఆర్డీవోను బ్లాక్ మెయిల్ చేసిన లారీ ఓనర్..రోడ్డు టాక్స్, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ లేకపోవడం తో కేసు రాయడానికి సిద్దపడ్డ అధికారి..అధికారిని అడ్డుకున్న లారీ ఓనర్. వాహనం ముందు బైఠాయించి బెదిరింపులు. గంటపాటు ఆర్డీవో ను అడ్డుకున్న లారీ ఓనర్.స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

👉 *గుంటూరు జిల్లాలో దొంగ నోట్లు ముఠా…*5 గురు అరెస్ట్…*1.06 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం..*గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు*ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు, అనపర్తి పోలీసులు…*రూ.1.06 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నా పోలీసులు* కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*..ప్రింటింగ్ సామగ్రి, జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు.*

👉5 రూపాయల కోసం కక్కుర్తిపడితే రూ.5లక్షల 20వేలు కట్టాల్సి వచ్చిందిగా…వినియోగదారుల ఫోరం తో పెట్టుకుంటే దూల తీరిపోయిద్ది…..ఇంట్రెస్టింగ్ స్టోరీ*

కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు..రూ.5 కేసులో రూ.5లక్షల 20వేలు ఫైన్ వేసిన వైనం..

కాకినాడ జిల్లా, అన్నవరం దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుము వసూలు చేస్తున్న మొబైల్ డిపాజిట్ కౌంటర్‌ కాంట్రాక్టర్‌కు రూ.5లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు వెల్లడించింది. గతేడాది నవంబర్‌ 3న కాకినాడకు చెందిన న్యాయవాది జల్లిగంపల లక్ష్మీనారాయణ అన్నవరం వెళ్లారు. ఆలయంలోని ఓ డిపాజిట్‌ కేంద్రంలో మొబైల్ ఉంచారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మొబైల్ తీసుకునేందుకు డిపాజిట్ కేంద్రం దగ్గరకు వెళ్లారు.

అక్కడి డిపాజిట్ కేంద్రంలో రూ.10 చెల్లించాలని సిబ్బంది చెప్పారు. అయితే అక్కడ రూ.10 అని బోర్డుపై ఎందుకు రాయలేదని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.. వారి నుంచి స్పందన లేకపోవడంతో డిసెంబర్‌ 4న కాకినాడ జిల్లా వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశారు. అయితే రూ.5 వసూలు చేసేందుకే అనుమతి ఉన్నట్లు గుర్తించారు. విచారణ జరిపిన వినియోగదారుల ఫోరమ్.. లక్ష్మీనారాయణ దగ్గర నుంచి అదనంగా వసూలు చేసిన రూ.5తో పాటు మానసిక క్షోభకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు. సదరు గుత్తేదారు.. అన్నవరం దేవస్థానానికి రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు సీహెచ్‌.రఘుపతి వసంతకుమార్, సభ్యులు చెక్కా సుశీ, చాగంటి నాగేశ్వరరావు తీర్పు ఇచ్చారు.

👉పల్నాడు జిల్లా..వినుకొండ వైసీపీ నేతల అంతర్గత సమావేశం…..బొల్లా మాకొద్దు అంటూ సొంత పార్టీ నేతల తిరుగుబావుటా..వినుకొండలోని ఓ గెస్ట్ హౌస్ లో బొల్లా అసమ్మతి వర్గం రహస్య భేటీ..మరోసారి సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రటించే ఛాన్స్.. అధినేత జగన్ ని కలిసి తమ అసంతృప్తి తెలియజేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం..అసమ్మతి నేతల రహస్య భేటీతో డైలమాలో పడ్డ బోల్లా అనుకూల వర్గం. వినుకొండలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన రహస్య భేటీ వ్యవహారం.

👉విజయవాడ సితార సెంటర్ లో షాపులు మాఫియా.. ఒక్క లైసెన్స్ తో మూడు కోట్లు నడుపుతూ మున్సిపల్ శాఖ వారిని మోసం చేస్తున్నారు..!

ఒక లైసెన్స్ తో ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది కానీ సామాన్యులకి రానివ్వకుండా దౌర్జన్యంగా మూడు బండ్లు నడుపుతున్నారు..! ఇంతకాలం ఎందుకు మున్సిపల్ శాఖ వారి స్పందించలేదు కనీసం 44 డివిజన్ కార్పొరేటర్ ఎందుకు స్పందించలేదు

మున్సిపల్ కమిషనర్ కి మున్సిపల్ శాఖ వారికి మరియు కార్పొరేటర్ కి వాళ్లు ఏమైనా మామూలు చెల్లిస్తున్నారా!..చిరు వ్యాపారులు అందరూ తమ వ్యాపారం చేసుకోవాలి కానీ దౌర్జన్యంగా ఎవరిని రానివ్వకుండా వాళ్లకి మూడు కోట్లు కి అనుమతి ఏ శాఖ వారు ఇచ్చారు..!..కేంద్ర ప్రభుత్వం ప్రకారం వారి ఆదాయం ప్రకారం సదర పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారా..!

తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించాలి ఆ మూడు షాపులలో రెండు షాపులకు చిరు వ్యాపారి పేదలకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా..ములకల హనుమాన్ MBA,MA,LLB,LLM..జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి..హైకోర్టు న్యాయవాది

👉 బీసీ హాస్టల్లో బాదుడే బాదుడు … ” గుడ్డు అడుగుతే …. గూబ గుయి ”

శ్రీ సత్య సాయి జిల్లా,మడకశిర నియోజకవర్గం:

▪️రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నియోజకవర్గం బీసీ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు ఆర్తనాదాలు..బిల్లులు కోసమే … బీసీ వెల్ఫేర్ హాస్టల్ …

*▪️విషయం బయటకు చెప్పితే చంపేస్తాను అంటున్న వార్డెన్ మరియు వర్కర్…*మడకశిర నియోజకవర్గం,గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థి చంప పగలగొట్టిన వర్కర్.▪️మెను ప్రకారం గుడ్డు అడిగినందుకు నానా మాటలు మాట్లాడి,దుర్భాషలాడి వర్కర్ నాగేంద్ర. విద్యార్థులు కొట్టే హక్కు ఎవరిచ్చారు వర్కర్లకు అంటు విద్యార్థులు కన్నీటి మున్నీరుగా విలపిస్తున్నారు.

▪️ఈ ఘటనపై ఉన్నత అధికారుల స్పందించి … వర్కర్ నాగేంద్ర పై తగిన చర్యలు తీసుకోవాలని అలాగే వార్డెన్ సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

▪️స్థానికంగా ఉండలేకపోతున్న వార్డెన్ … కేవలం బిల్స్ కోసం మాత్రమే మందలపల్లి కొచ్చే వార్డెన్..పిల్లలు మెను ప్రకారం భోజనం అడిగితే దౌర్జన్యం చేస్తున్న వార్డెన్.. గతంలో కూడా వార్డెన్ పై పలు అభియోగాలు … ఉన్నా కూడా ఏ చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు.

👉హృదయ విదారక ఘటన ..ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది

మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు..భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు..అయితే తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి నిరాకరించిన సిబ్బంది..ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళ.. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూష తల్లిని వడిలో పడుకోపెట్టుకుని సహాయం చేసే వారికోసం ఎదురు చూస్తున్న మహిళ…

👉*జనగామ జిల్లా:-*పాలకుర్తి మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎఎస్ ఐ రాజీ రెడ్డి ప్రజల పై జులుం*..పిర్యాదు ఇవ్వడానికి వచ్చిన బాధితుల పై జులుం ప్రదర్శిస్తున్న ఎఎస్ ఐ రాజీ రెడ్డి*..ఇదేనా ఫ్రెండ్లి పోలీసింగ్ అని ప్రశ్నిస్తున్నా బాధితుడు..*పిర్యాదు ఇవ్వడానికి వచ్చిన బాధితులపై బుతులతో తిట్టిన ఎఎస్ఐ రాజీ రెడ్డి*..పిర్యాదు ఇవ్వడానికి వస్తే తిడతారెందుకు అని పోలీసులతో వాగ్వాదం చేసిన బాధితుడు*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..