‘భారత్ లో నిశ్శబ్దం.. అమెరికాలో వ్యక్తిగత విషయం..’
గౌతమ్ అదానీ లంచం కేసును అమెరికాలో వ్యక్తిగత విషయంగా అభివర్ణించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. “మీరు భారతదేశంలో ప్రశ్నలు అడిగితే నిశ్శబ్దంగా ఉంటారు. మీరు విదేశాలలో అడిగితే, అది వ్యక్తిగత విషయం అంటారు. అమెరికాలో కూడా మోదీజీ అదానీ అవినీతిని కప్పిపుచ్చారు” అని రాహుల్ ట్వీట్ చేశారు.
👉బీజేపీకి అలక ‘రాజా’ బై.. బై..? బీజేపీపై అలకబూనిన రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కావడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేస్తాం అన్నంత ఊపు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీకి త్వరలో పెద్ద కుదుపు ఎదురవనుందా..? మొన్న మిస్సయింది..
వచ్చేసారి మాత్రం మాదే సీఎం పీఠం అంటున్న కాషాయ పార్టీకి అసలు సిసలు కమలం నేత గుడ్ బై కొట్టబోతున్నారా? హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీలో గుర్తింపు దక్కడం లేదనే ఆవేదనలో ఉన్న నాయకుడు కమలం గూటిని వీడనున్నారా? వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో 2014 నుంచి బీజేపీ గెలుస్తున్న సీటు గోషామహల్. పాత బస్తీతో కొంత కలిసి ఉండే ఈ స్థానంలో రాజాసింగ్ బలమైన నేతగా ఎదిగారు. వరుసగా మూడుసార్లు గెలిచారు. స్థానిక ప్రత్యర్థి మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచారు. అయితే, 2023 ఎన్నికల్లో గెలిచన తర్వాత తనకు బీజేపీ శాసన సభా పక్ష నేత పదవి వస్తుందని ఆయన ఆశించారు. ఆ తర్వాత పార్టీ పదవిపైనా ఆశ పెట్టుకున్నారని చెబుతున్నారు. కానీ, రాజాసింగ్ కు ఉన్న ప్రతికూలతల రీత్యా పార్టీ ఆయన ఆశలను నెరవేర్చలేదు. కీలక సమావేశాలకూ దూరం బీజేపీపై అలకబూనిన రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కావడంలేదు. మరోవైపు ఆయన కొన్నాళ్లు అసలు కనిపించనే లేదు. తాజాగా రాజాసింగ్ తెరపైకి వచ్చారు. 2014 నుంచి వేధింపులు భరిస్తున్నానని, ఇక తనవల్ల కాదని అన్నారు. ‘‘పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్లిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని వ్యాఖ్యలు చేశారు. *గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీలకు ఇవ్వాలని తాను కొన్ని పేర్లు ఇవ్వగా.. వారిని కాదని ఎంఐఎంతో తిరిగే వారికి ఇచ్చారని ఆరోపించారు. పార్టీలోని కీలక నేతకు ఫోన్ చేసి ఇదే అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారని…దీంతో తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందని పేరొకనానరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తో యుద్ధం చేసినవాడినని, సొంత పార్టీలోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం అని అన్నారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇస్తారని, కానీ, తన సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలిని రాజింగ్ డిమాండ్ చేశారు. ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నానని, పార్టీలో కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం నేర్చుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. వారి వల్లనే ఈ రోజు పార్టీ వెనుకబడింది. వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ భాజపా ప్రభుత్వం రాదు’’ అని వ్యాఖ్యానించారు.
👉 అన్నదమ్ముల ఘర్షణ తమ్ముడు మృతి…* ప్రకాశం జిల్లా కంభం గ్రామంలోని మేదర వీధిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఘర్షణలో తమ్ముడు శ్యామ్ 34 సంవత్సరాలు మృతి చెందగా మృతదేహాన్ని ముక్కలుగా కోసి కాలువలో పడేసిన వైనం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది……….
* తిరుపతి…లక్ష్మీపై మరో కేసు..తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో టి. లక్ష్మీ పై ఎఫ్ ఐ ఆర్ ..జనసేన నేత కిరణ్ రాయల్ సంబంధించిన ఫోటోలను లక్ష్మి,పసుపులేటి సురేష్ తో కలిసి మార్ఫింగ్ చేశారని…. లక్ష్మికి ఇవ్వవలసిన 35 లక్షలు ఇచ్చినను మరో 90 ఇవ్వాలని … లేకపోతే పరువు తీస్తానని బెదిరిస్తుందని కిరణ్ రాయల్ ఫిర్యాదు..కిరణ్ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 69/ 2025 ,308(3),351(2) ఐపీసీ సెక్షన్ లతోపాటు బి.ఎన్.ఎస్ యాక్ట్ ,66(D) ఐ టి యాక్ట్..కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు.
👉 *తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదు* ..లక్ష్మి రెడ్డి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు*
*క్రైమ్ నెంబర్ 22/2025, 420,417,506 ఐపీసీ సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు*
*నమ్మించి మాయ మాటలు చెప్పి మోసం చేయడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు లక్ష్మి రెడ్డి*
👉నా సొంత చెల్లిగా భావిస్తున్నా… యాసిడ్ బాధితురాలి తండ్రికి మంత్రి లోకేశ్ ఫోన్..ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు.. తలపై కత్తితో పొడిచి, నోట్ల యాసిడ్ పోసి… అత్యాచారం.. చికిత్స పొందుతున్న బాధితురాలు .. బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్ కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆయనకు పూర్తి భరోసా ఇచ్చారు. “చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడిచేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం, అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను” అంటూ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.. అక్కడే ఉన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తో కూడా మాట్లాడిన లోకేశ్… బాధితురాలు కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.
* యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు. యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
* యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి ఆగ్రహం..
అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. SPతో మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
**శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. నిందితులకు వైద్యపరీక్షలు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్టయిన నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. నిందితులు ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్, భోలేబాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీవైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయాకాంత్ చావ్లాను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలు రాబట్టనున్నారు…
👉వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణా బాబు పాయింట్స్ ..గుంటూరు ..జి బి ఎస్ సిండ్రోమ్ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ..జి బి ఎస్ సిండ్రోమ్ వచ్చిన వారికి కోసం రెండు లక్షల మేర ఖర్చు చేస్తున్నాము….రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలో. చంద్ర బాబు నాయుడు ఖర్చు విషయంలో వెనకడ వద్దని చెప్పారు…గుంటూరు జి జి హెచ్ కి వివిధ ప్రాంతాల్లో నుంచి 7 కేసులు నమోదు అయ్యాయి..కాళ్ళు చచ్చుబడటం .పెరలసిస్ లాంటి లక్షణాలు వీటిలో కన్పిస్తాయి..దేశంలో 1 లక్ష మందిలో ఒకరికి జి బి ఎస్ సిండ్రోమ్ కలిగి ఉంటున్నారు ..జి జి హెచ్ లో జి బి ఎస్ సిండ్రోమ్ వచ్చిన బాధితులను పరామర్శించిన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు
*మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిక … ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.*
👉మూల్యం చెల్లించక తప్పదు: జగన్ వార్నింగ్ .. వల్లభనేని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని YS జగన్ మండిపడ్డారు. తనతో తప్పుడు కేసు పెట్టించారని యువకుడు వాంగ్మూలం ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారని దుయ్య బట్టారు. అలాగే డ్రైవర్ను TDP MLA చింతమనేని బూతులు తిడితే మాజీ MLA అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. కూటమి తప్పులను ప్రజలే డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
*లంచం లంచం లంచం*.హైదరాబాద్
గచ్చిబౌలి లోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఎసిబి సోదాలు..
70 వేల రూపాయలు లంచం తీసుకుని పట్టుబడ్డ గచ్చిబౌలి డివిజన్ ఎడిఇ సతీష్ కుమార్..కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల తనిఖీలు.

