👉నూజెండ్ల:భారీగా రేషన్ బియ్యం స్వాధీనం* …
నూజెండ్ల మండలంలో సివిల్ సప్లై అధికారులు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు మండలంలోని కొత్త నాగిరెడ్డిపల్లి గ్రామంలో రైస్ మిల్లులో అధికారులు బుధవారం జరిపిన దాడులు లో 527 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని 6A కేసు నమోదు చేశారు రేషన్ బియ్యం ను సివిల్ సప్లై గోదాoకు తరలించారు ఈ తనిఖీల్లో డీఎస్ఓ సుశీల, తహసిల్దార్ రమేష్ కుమార్, డిటి బాల వెంకటేశ్వర్లు, వీఆర్వో ఆనంద్ తదితరులు పాల్గొన్నారు
👉లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు..జనగామ – పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు
👉సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వి రాజ్..ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృద్విని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు..గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఫిర్యాదు చేసిన పృథ్వి రాజ్
👉గిరిజనుల రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేసిన కూటమి ప్రభుత్వం .. పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి…వైయస్‌ఆర్‌సీపీ నేతలతో కలిసి గిరిజన సంఘాలు ఉద్యమించడంతో వెనక్కి తగ్గి.. 1/70 చట్టంలో మార్పులు చేయమని చంద్రబాబు మొక్కుబడి ప్రకటన. గిరిజనులంటే అంత చులకనా.. నోటితో ఆ మాట ఎందుకు చెప్పడం లేదు?
👉రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు!!!..
వక్ఫ్ సవరణ బిల్లు రేపు లోక్‌సభ ముందుకు రానుంది. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ ఎదుట సమర్పించిన సాక్ష్యాల రికార్డును కూడా ప్రవేశపెట్టనున్నారు. కాగా ఇప్పటికే 15-11 మెజారిటీతో జేపీసీ ఆమోదించిన ఈ బిల్లు నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.
👉మహా కుంభమేళా తొక్కిసలాటపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణ.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా కుంభమేళాలో చాలా మంది మరణించినప్పటికీ యూపీ ప్రభుత్వం సరైన సంఖ్యని చెప్పడం లేదని ఆరోపించారు. భక్తులకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో యోగి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని దుయ్యబట్టారు.
👉 మెడికల్ కాస్ట్ తగ్గాలి. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్ధికంగా చితికి పోతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉంది. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో, సమాజ సేవ కూడా అంతే ముఖ్యం. అనవసరంగా హాస్పిటల్ లో ఉంచి రూం బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా, అవసరమైతేనే హాస్పిటల్ కు పేషంట్ ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా అలోచించి, వైద్య ఖర్చులు తగ్గించాలి…
👉 టిడిపి బుక్ ఓపెన్ లో వల్లభనేని వంశీ వైఎస్ఆర్సిపి ..వంశీని అరెస్టు చేసిన విజయవాడ పటమట పోలీసులు..BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు..వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు..వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు..వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
👉సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మన్యం నర్సింహారెడ్డి, “పట్టా భూమిని ఒకదానికొకటి వారసత్వంగా ఇవ్వడానికి” అధికారిక అనుకూలంగా చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ACB అధికారులు పట్టుకున్నారు..
👉సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య ..రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి దారుణం హత్య ..రాళ్లతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి..మృతుడి చేతిపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉందని, మెడలోకి కూడా ఆంజనేయస్వామి లాకెట్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ..ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించిన సికింద్రాబాద్ రైల్వే జి అర్ పి పోలీసులు..కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీసులు
👉నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ..
నిన్న రాత్రి హిమాయత్ నగర్ మినర్వ హోటల్ గల్లీ లో ఓ ఇంట్లో చోరీ..ఇంట్లో పని చేస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తి చోరీ చేసి పరార్..సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం , డైమెండ్స్ , గోల్డ్ దొంగతనం..ఇంటి యజమాని దుబాయ్ లో ఉండటంతో , అతని వద్ద పని చేసే అభయ్ కెడియా పోలీసులకు ఫిర్యాదు..అతని ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ పోలీసులు
👉ఏలూరు జిల్లాలో మనిషికి కూడా చోకిన బర్డ్ ఫ్లూ..
ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ.. బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో అప్రమత్తమయిన జిల్లా వైద్య శాఖ..కోళ్లఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో సాంపిల్స్ సేకరించిన అధికారులు..బర్డ్ ఫ్లూగా నిర్ధారణ రావడంతో మేడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాని అప్రమత్తం చేసిన అధికారులు..బర్డ్ ఫ్లూ తొలికేసు నమోదు అయిందని తెలుపిన ..జిల్లా వైద్యశాఖధికారిణి.విజయవాడకు తరలిస్తున్న పోలీసులు.
👉 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి షాకింగ్ ఫలితాలు ? దేశంలో బీజేపీ నాయకత్వంలో మూడవసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం పాలనకు ఎనిమిది నెలలు నిండాయి. దేశంలో బీజేపీ నాయకత్వంలో మూడవసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం పాలనకు ఎనిమిది నెలలు నిండాయి. ఇదే సమయంలో పలు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అందులో మెజారిటీ స్టేట్స్ బీజేపీ గెలుచుకుంది. తాజాగా ఢిల్లీ విజయంతో బీజేపీ గెలుపు గుర్రం హద్దులు లేని వేగంతో ప్రయాణిస్తోంది. రానున్న బీహార్ కానీ యూపీ పశ్చిమ బెంగాల్ కానీ ఇదే తీరున చరిత్ర సృష్టించాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది.
ఈ నేపధ్యంలో ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ నిర్వహించిన పోల్ చూస్తే బీజీపీకే షాక్ తినేలా ఫలితాలు వచ్చాయి. ఏ మెజారిటీ అయితే లేకుండా టీడీపీ జేడీయూ అన్న రెండు ఊతకర్రల మీద అధారపడి బీజేపీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడుపుతోందో ఆ బీజెపీకి కరవు తీరా పూర్తి మెజారిటీని ఇపుడు ఇచ్చేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే నివేదిక చెబుతోంది. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే కనుక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు 300 పై చిలుకు ఎంపీ సీట్లు దక్కుతాయని ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ తెలియచేస్తోంది. బీజేపీకి సొంతంగా 281 సీట్లు లభిస్తాయని చెప్పింది. అంటే 2024 ఎన్నికల్లో 240 దగ్గర ఆగిపోయిన బీజేపీ మరో 41 సీట్లను కేవలం ఈ ఎనిమిది నెలలలో పెంచుకుంది అన్న మాట. అదే ఎన్డీయే మిత్రులతో కలిస్తే 343 సీట్లు దక్కుతాయి. ప్రస్తుతం ఎండీయేకు లోక్ సభలో 293 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మరో యాభై సీట్లు అదనంగా వస్తాయని ఈ పోల్ సర్వే తేల్చింది. అంతే కాకుండా ఎండీయే ఓటు షేర్ 2024 కంటే మరో మూడు సాతం పెరిగి 47 శాతంగా వస్తుందని పేర్కొంది. ఇండియా కూటమికి ఒక శాతం ఓటు షేర్ తగ్గి సీట్లు కూడా 2024లో వచ్చిన 232 సీట్ల నుంచి 188కి పడిపోతుందని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ కి 2024లో 99 సీట్లు సొంతంగా వచ్చాయి. అవి కూడా ఏకంగా 78కి పడిపోతాయని చెప్పింది. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో జరిపిన ఈ పోల్ సర్వేలో దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన ఓటర్లు 1, 23, 123 మంది పాల్గొని తన అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు. దేశంలో కమలం హవా నానాటికీ పెరుగుతోందని ఇండియా కూటమి సహా కాంగ్రెస్ గాలి తగ్గుతోందని ఈ లేటెస్ట్ పోల్ సర్వే వ్యక్తం చేయడంతో రాజకీయంగా ఇది చర్చకు తావిస్తోంది. బీజేపీకి మూడు చాన్సులే కాదు మరిన్ని చాన్సులు దేశ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే చెబుతూంటే జమిలి ఎన్నికలకు కమలనాధులు సిద్ధం కాకుండా ఉంటారా అన్నదే చర్చగా ఉంది.
👉లెదర్ పార్క్ స్థల పరిశీలన చేసిన కొరియన్ బృందం.. *పల్నాడు జిల్లా.. *వినుకొండ* అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు *జీవీ ఆంజనేయులు * మరియు *ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు * సారథ్యంలో వినుకొండకు పరిశ్రమలు తెచ్చి వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీనిలో భాగంగా వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద సర్వేనెంబర్ 1లో 98.20 ఎకరాల భూమి లెదర్ పార్క్ APIIC కి కేటాయించారు. రీబక్, పుమా, నైక్ లాంటి ప్రముఖ కంపెనీల లెదర్ పరిశ్రమలు ఏర్పాటుకు బుధవారం జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కొరియన్ బృందం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బృందంతో *మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ,* మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, బిజెపి నాయకులు లెనిన్ గారు జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్ గారు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

