జగన్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకివ్వట్లేదు?👉రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్👉 లక్ష్మితో భూమన కుమారుడు రూ. 10 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు: కిరణ్ రాయల్ ..*గోశాలకు ఆవుల తరలింపు (మార్కాపురం)..👉 ఏపి. కోళ్ల లను తెలంగాణ లోకి రాకుండా చేక్ పోస్టు ఏర్పాటు*..విలేఖరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఏడుగురిపై కేసు నమోదు👉ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ముత్తుముల*

👉జగన్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకివ్వట్లేదు?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్ మీద ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పదే పదే దాడి చేస్తున్నట్లుగా వైసీపీ వైపు నుంచి ఆరోపణలు వినిపించాయి. అంతకుముందు జరిగిన చిన్న చిన్న సంఘటనల గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇటీవల జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరగడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పారు..జగన్ మీద కక్ష గట్టిన టీడీపీ, జనసేన మద్దతుదారుల పనే ఇదని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్ ఇక్కడ పెద్దగా ఉంటున్నది లేకపోయినా.. ఆయన భద్రత పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది కూడా…కాగా జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడగ్గా.. అటు వైపు నుంచి సరైన సమాధానం రావట్లేదని సమాచారం. జగన్ ఇంటి మేనేజ్మెంట్ చూసుకునే వ్యక్తులు.. ఇంటి బయట పెట్టినవి డమ్మీ సీసీటీవీ కెమెరాలని.. వాటి విజువల్స్ లేవని సమాధానం ఇస్తున్నారట. జగన్ ఎనిమిది నెలల ముందు వరకు ముఖ్యమంత్రి. ఆయన ఇంటి ముందు ఇలా డమ్మీ కెమెరాలు పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి…జగన్ సీఎం కుర్చీ నుంచి దిగిపోయిన తర్వాత అయినా సరే.. అలాంటి కెమెరాలను ఎలా పెడతారన్నది సందేహం. ఇది అగ్ని ప్రమాదాం విషయంలో అనేక సందేహాలకు తావిస్తోంది. జగన్ మీద సానుభూతి కోసం అగ్ని ప్రమాదం డ్రామా నడిపారని.. ఇది ఐప్యాక్ స్క్రిప్టే అని.. లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది అని టీడీపీ, జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలాో వైసీపీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి అటు నుంచి ఏం సమాధానం వస్తుందో చూడాలి.

👉మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్‌*..బ్రెజిల్‌లో చోటు చేసుకున్న ఘటన..*భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలిన ఫోన్*..ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలు*సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు*

👉 తిరుపతిలో సాధువుల ఆమరణ దీక్ష ..టీటీడీ పరిపాలన భవనం ముందు దీక్ష చేపట్టిన స్వాములు.. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం ..హోటల్ నిర్మాణం వెంటనే ఆపాలని శ్రీనివాసానంద స్వామి పోరాటం.. తిరుమల ప్రక్షాళన అన్న చంద్రబాబు, సనాతన ధర్మం అన్న పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్..

“సువర్ణభూమి”ని నమ్మిన వాళ్లంతా నట్టేట మునిగినట్లే !?.. సువర్ణ భూమి పేరుతో కొంత కాలం కిందటి వరకూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి చాలా మంది ఆకర్షితులయ్యారు. కానీ ఇప్పుడు దాన్ని నమ్మిన వాళ్లు పట్టే మునిగారు. పెద్దగా విలువలేని భూముల్ని బైబ్యాక్ పేరుతో అంటగట్టి పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారు. ఇప్పుడీ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. లాభాలు ఆశ చూపిన సువర్ణ భూమి రిల్‌ సంస్థ కోట్లు వసూలు చేసింది.. స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ సంస్థ.. భారీ ఎత్తున ప్రచారం చేసి ఘరానా మోసానికి పాల్పడినట్లుగా పలు కేసులు నమోదయ్యాయి. బైబ్యాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట ఒక్కొక్కరి వద్ద నుంచి 30 లక్షల నుంచి రెండు కోట్ల వరకు స్వాహా చేసింది పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తరువాత 24 శాతం లాభాలు ఇస్తామని ఆశ కల్పించి చివరికి చెల్లని చెక్కులు ఇచ్చింది..గతేడాది డిసెంబర్‌లో సువర్ణభూమి ఎండీ శ్రీధర్‌, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల నుంచి సువర్ణభూమి డైరెక్టర్లు మోసం చేస్తున్నారని, చెల్లని చెక్కలు ఇచ్చి, వారి కార్యాలయల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు కేసు పెట్టారు. ప్రముఖ సినీ హీరోలు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని, 200 మంది భాధితులు ఉన్నామని, రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మోసం జరిగిందని అంటున్నారు. సువర్ణ భూమి మోసాల చిట్టా పెద్దగా ఉండటంతో.. ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు..రియల్ ఎస్టేట్‌లో బైబ్యాక్ పేరుతో గుట్టుగా చేసిన మోసాల్లో సువర్ణభూమి సంస్థ చేసింది అతి పెద్దదిగా భావిస్తున్నారు.

👉రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్. కోయ ప్రవీణ్ , జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుతో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. .నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.. పెండింగ్ కేసుల వివరాలు, స్టేషన్ రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిధిలోని నేరాల సంఖ్య, స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు..సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకున్నారు.. పోలీసులకు తగిన సూచనలు, సలహాలు చేశారు..కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు..ఫిర్యాదు దారులతో గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తూ, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని పోలీసులకు సూచించారు..ప్రతివారం మహిళా పోలీసులతో కలిసి పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాలలో మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలు, మహిళలపై జరిగే నేరాలు, ఆన్ లైన్, సైబర్ మోసాలు,వైట్ కాలర్ నేరాలు తదితర విషయాలపై అవగాహన సదస్సులునిర్వహించాలన్నారు. అపార్ట్మెంట్ లు, షాపుల్లో సి.సి కెమెరాల ప్రాముఖ్యత వివరించి వాటిని అమర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు..పోలీసు అధికారులు , మహిళా పోలీసులు బాగా పనిచేసి లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కేసులు రాజీ, పరిష్కారం అయ్యే విధంగా చూడాలని సూచించారు..ట్రాఫిక్ , ఈ చలాన్ ల పెండెన్సీ ని తగ్గించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) .యం.వెంకటాద్రి , రాయచోటి రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్, వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి.రాజా రమేష్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ తులసిరామ్, రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, నరసింహారెడ్డి, అబ్దుల్ జహీర్, శ్రీనివాస్ నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

👉 లక్ష్మితో భూమన కుమారుడు రూ. 10 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు: కిరణ్ రాయల్….కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ ఆరోపణలు..అది భూమన చేయించిన మనీ ట్రాప్ అన్న కిరణ్ రాయల్…జిరాక్స్ షాప్ పెట్టుకున్న భూమనకు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్న .. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రాయల్ స్పందిస్తూ తనపై విష ప్రచారం చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా వంద కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. తనను తప్పుగా చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ వస్తే తప్పుడు ప్రచారం చేసేందుకు లక్ష్మితో రూ. 10 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు.  జిరాక్స్ షాపు పెట్టుకున్న భూమన కరుణాకర్ రెడ్డికి వందల కోట్లు ఎలా వచ్చాయని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. భూమన కుటుంబాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. లక్ష్మిది హనీ ట్రాప్ కాదని… భూమన కరుణాకర్ రెడ్డి చేయించిన మనీ ట్రాప్ అని అన్నారు. మహిళను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం వీరికే చెల్లిందని చెప్పారు.

👉 ఏపి. కోళ్ల లను తెలంగాణ లోకి రాకుండా చేక్ పోస్టు ఏర్పాటు*అలంపూర్..జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామం దగ్గర ఏపీలో బ్లడ్ ఫ్లూ వైరస్ కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయన్న కారణంగా ఏపీ నుండి తెలంగాణ లోకి కోళ్ల లోడుతో వస్తున్న లారీలను రాకుండా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన పోలీసులు, అడ్డుకొని వెనక్కి జిల్లా వెటర్నరీ అధికారులు అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు.ఇంక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

👉 ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వీధుల్లో వాహనదారులు, ప్రజలు మరియు దుకాణదారులు నిత్యం వీధి ఆవుల వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకున్న కమిషనర్ నారాయణరావు మరియు సిఐ సుబ్బారావు..ఆవులను మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గోశాలకు తరలిస్తున్న సిబ్బంది..ఆవుల యజమానులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సీఐ సుబ్బారావు, కమిషనర్ నారాయణరావు..ఆవులను రహదారులపైకి విడిచి పెడితే ఇక నుంచి ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామన్న సీఐ సుబ్బారావు.వీధుల్లో ఆవులపై ఇక నుంచి తప్పనిసరిగా నిఘా ఉంటుందని తెలిపిన మున్సిపల్ కమిషనర్ నారాయణరావు.

👉వేమనపల్లి మం. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేఖరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..మంచిర్యాల జిల్లా :నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90 వేల రూపాయల నగదు స్వాధీనం..ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్న ఏసీపీ వెంకటేశ్వర్లు..

👉ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ముత్తుముల*..  కంభంలో పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో “ప్రజా దర్భార్” కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ముత్తుముల*..ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకునే పద్దతికి స్వస్థి చెప్పాలి*..ప్రజల నుంచి వచ్చిన వినతులను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు..*పెన్షన్ మంజూరు కోసం వచ్చిన వృద్ధుడికి తన స్వంత నిధుల నుండి 4వేలు అందచేత*..ప్రభుత్వం నుంచి పెన్షన్ వచ్చేంత వరకు తానే పెన్షన్ నగదు 4వేలు అందచేస్తానని వృద్ధుడికి భరోసానిచ్చిన ఎమ్మెల్యే ముత్తుముల*

*గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. బుధవారం ఉదయం కంభం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో “ప్రజాదర్బార్” కార్యక్రమం నిర్వహించారు. కంభం మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి అందచేయగా వాటిని పరిశీలించి వెంటనే వాటిని పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. *కంభం పట్టణానికి చెందిన కృష్ణమూర్తి అనే వృద్దుడు తనకు పెన్షన్ రావటంలేదని ఎమ్మెల్యే కి అర్జీ అందచేయగా, వెంటనే స్పందించి ప్రభుత్వం నుండి సామాజిక పెన్షన్ మంజూరు అయ్యేంత వరకు, తన స్వంత నిధుల నుండి తనకు ప్రతి నెల రూ. 4వేలు అందచేస్తానని హామీ ఇచ్చి, తక్షణమే ఫిబ్రవరి నెల పెన్షన్ 4 వేల రూపాయల నగదును అతనికి అందచేశారు. అదే విధంగా ఒక చిన్నారి పూర్తి దివ్యంగుడై ఉన్నాడని ప్రస్తుతం 6 వేలు మాత్రమే పెన్షన వస్తుందని తన తల్లి తెలుపగా, వెంటనే స్పందించి రూ. 15 వేలు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీఓకి ఆదేశాలిచ్చారు.. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ గ్రామాల్లో ఎదుర్కొనుచున్న భూ సమస్యలు, రోడ్డు సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి అర్జీ రూపంలో తెలియచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్దీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాలనా సాగిస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొనుచున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేసే విధంగా అధికారులు సమాయత్తం కావాలని, ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పే పద్దతికి స్వస్థి చెప్పాలని ప్రజలు అర్జీ ఇచ్చిన నిర్ణిత సమయంలో వాటిని పరిష్కారం చేసి అర్జీదారునికి తెలియచేయాలన్నారు. ఇక నుంచి ప్రజలకు ఏ సమస్య వచ్చిన ప్రజల వద్దకే వెళ్లి ఆ సమస్యలను పరిష్కారం చేయాలని, నియోజకవర్గంలో ప్రజా దర్భార్ కార్యక్రమం ద్వారా తాను ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ప్రతి గ్రామానికి, మండలానికి వస్తానని ప్రజలు ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తెలియచేయవచ్చునన్నారు.* కార్యక్రమంలో మండల జడ్పీటీసీ కొత్తపల్లి జ్యోతి, ఎంపీపీ తులశమ్మ, ఎంపీడీఓ వీర భద్రాచారి, తహసీల్దార్ కిరణ్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అర్జీదారులు పాల్గోన్నారు.*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..