👉రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ ..* జగన్ లైన్ లోనే కవిత వ్యాఖ్యలు!!!..👉త్వరలో వైయస్సార్సీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలు👉 దేశంలోనే మార్గదర్శి అతి పెద్ద స్కామ్: మిథున్ రెడ్డి👉తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు..!👉పౌల్ట్రీల లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ:👉జగన్ లైన్ లోనే కవిత వ్యాఖ్యలు!!! ..👉మదనపల్లెలో టీడీపీ నేత ఫ్యాన్సీ స్టోర్ ధ్వంసం*..*హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజినీ..*స్కూల్ బాలికపై యువకుడు అత్యాచారం..*న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో లో పోలీసులను కోరిన యువతి ..*మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత..*కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కబ్జా (నాయుడుపేట)* 👉తమిళ రాజకీయాల్లో పెను సంచలనం?.

👉తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు…అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన..సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని కోరిన పోలీసులు…సీసీ కెమెరా డేటా,పార్కి్ంగ్‌లోని వాహనాల వివరాలతో..ఉ.10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలన్న పోలీసులు.

👉 ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి విడదల రజినీ…సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు వేధించారని..కోటి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు…ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన రజినీ.నేడు విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు.

👉 బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తు విద్యార్థులను వేధిస్తున్న ప్రిన్సిపల్…మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ శ్రీ బ్రీలియంట్ టెక్నో హై స్కూల్ లో రవీందర్ రావు అనే ప్రిన్సిపల్ 9th,10th బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నాడని విద్యార్థుల ఆరోపణ..స్కూల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులు, విద్యార్థి సంఘాలు..అయితే ప్రిన్సిపల్ రవీంద్రరావు మాట్లాడుతూ పిల్లలను సక్రమమైన మార్గంలో ఉంచాలని పిల్లల తల్లిదండ్రులు కోరినట్లు చెప్పారు..దానితో విద్యార్థులను పిలిచి మందలించే క్రమంలో టై, ప్యాంటు పట్టుకున్నానని అంతేగాని ఎలాంటి వేరే ఆలోచన నాకు లేదని తెలిపిన ప్రిన్సిపల్ రవీందర్ రావు…

👉త్వరలో వైయస్సార్సీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు(నాడు తండ్రితో ప్రయాణం …నేడు కొడుకుకి తోడుగా ప్రయాణించేందుకు సిద్ధం)1.పళ్ళం రాజు ( మాజీ కేంద్రమంత్రి)2.రఘువీరారెడ్డి (మాజీ మంత్రి)3.జి.వి. హర్షకుమార్ (మాజీ ఎంపీ)4, ఉండవల్లి అరుణ్ కుమార్( మాజీ కేంద్రమంత్రి )5.సుంకర పద్మ శ్రీ (లేడీ ఫైర్ బ్రాండ్)

👉మదనపల్లెలో టీడీపీ నేత ఫ్యాన్సీ స్టోర్ ధ్వంసం*

మదనపల్లెలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పై ఓ వర్గం రాత్రి దాడికి యత్నించిన ఘటన మరువకనే నీరుగట్టువారిపల్లె, మాయాబజార్ లో ఉండే టీడీపీ రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి నడుపుతున్న ఫ్యాన్సీ స్టోర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

    👉 భార్యతో గొడవ.. పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న భర్త.. భార్యతో గొడవ.. పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న భర్త..
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. శ్రావణ్‌ అనే వ్యక్తి తన భార్య పని చేస్తే ఓ వస్త్ర దుకాణంలో కస్టమర్ల ముందే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వస్త్ర దుకాణం వద్ద భార్యతో గొడవపడి.. కోపంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మీద పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. కాగా పోలీసులు అక్కడికి చేరుకుని శ్రావణ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
👉 స్కూల్ బాలికపై యువకుడు అత్యాచారం.. ఆపై ఆటో డ్రైవర్..
ఆంధ్రప్రదేశ్ : స్కూల్ బాలికపై ఓ యువకుడితో పాటు ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. గత నెల 29న ఆటో డ్రైవర్ సునీల్ బాలికను స్కూల్‌కు ఆటోలో తీసుకెళ్తుండగా.. సతీష్ బైక్‌తో అనుసరించాడు. దారిలో బాలికకు వాంతి కాగా.. ఆమెను ఇంటికి తీసుకెళ్తానని సతీష్‌ బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బాలికపై లైంగికదాడి చేశాడు. సాయంత్రం స్కూల్‌కి తీసుకొచ్చి పాఠశాల ఆటోలో ఎక్కించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సునీల్ కూడా బెదిరించి లైంగికదాడికి ఒడిగట్టాడు.
👉 సెల్ఫీ వీడియో విడుదల చేసిన యువతి
తనకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో లో పోలీసులను కోరిన యువతి

భద్రాచలం: భద్రాచలం పట్టణం లోని మెడికల్ కాలనీ కి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే యువ న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన యువతిని నేనే అని ఎట్టకేలకు సదరు యువతి ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియో ను విడుదల చేసింది. అందులో తనకు కార్తీక్ తో పరిచయం ఎలా ఏర్పడింది, తనను కార్తీక్ పెళ్లి చేసుకుంటానని ఎలా మోసం చేసాడు, తదుపరిగా యువతి జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి జరిగిన విషయాన్ని వివరించినట్లుగా తెలిపింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం భద్రాచలం టౌన్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేసానని, అనంతరం కార్తిక్ ను టౌన్ పోలీసులు స్టేషన్ కి పిలిపించి జరిగిన విషయం పై వివరణ కోరి. ఇరువర్గాలు మాట్లాడుకొని విషయాన్ని సెటిల్ చేసుకోవాలని టౌన్ సీఐ తెలిపారని.పోలీసులు విషయాన్ని సెటిల్ చేసుకోమని చెప్పినప్పటికి కార్తిక్ అందుకు భిన్నంగా వ్యవహారిస్తూ ముందేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి, మొహం చాటేస్తా నేను పెళ్లి చేసుకోను.. నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని కార్తిక్ సదరు యువతీతో తెగించి చెప్పాడని, అందుకే త
👉: అక్రమముగా గంజాయిని రవాణా చేసే వ్యక్తులు అరెస్ట్
మంగళగిరి మండలం ఖాజా గ్రామానికి చెందిన గంజి బోయిన శశాంక్ @ శశి అను అతను మరియు మంగళగిరి పట్టణానికి చెందిన పెరుగు అనిల్ కుమార్ @ పెరుగు అనువారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల నుండి విశాఖపట్నం వెళ్లి అర్జున్ అను అతని వద్ద గంజాయిని కొనుగోలు చేసి మంగళగిరి తీసుకొని వచ్చి వాటిని చిన్న చిన్న పాలిథిన్ ప్యాకెట్ లో పెట్టి చుట్టుపక్కల గ్రామాలైన ఖాజా, మంగళగిరి కాకాని ఉప్పలపాడు ఇంకా మొదలైన గ్రామాలు ఉన్న గంజాయి తాగే వాళ్ళకి అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఈరోజు పెదకాకాని మండలం ఎమ్మార్వో గారి ఆధ్వర్యంలో పెదకాకాని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ నారాయణస్వామి గారిచే పై ఇరువురిని అరెస్ట్ అరెస్టు చేసి జైలుకు పంపడం అయినది….
👉ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం!!!

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి.. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణానికి పాల్పడ్డాడు

వసతి గృహంలో ఉంటున్న యువతిని ఫంక్షన్ ఉందని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్.. ఇంటికి వెళ్ళేసరికి హుస్సేన్ స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) ఇంట్లో ఉన్నారు.ఫంక్షన్ జరగట్లేదని గ్రహించిన యువతి హుస్సేన్ ను నిలదీసింది. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని పిలిచానని చెప్పి నమ్మించి, ఆ తర్వాత బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన హుస్సేన్.. హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా.. షేక్ గాలి సైదా గదిలోపలకి వచ్చి నువ్వు హుస్సేన్ దిగిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయని బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు .ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తూ శారీరకంగా గడపాలని హుస్సేన్, ప్రభుదాస్, గాలి సైదా వేధిస్తున్నారని యువతి తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు..కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

👉 గాయపడిన యువతికి సపర్యలు చేసి మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత – నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వైజంక్షన్ వద్ద బైక్ పైనుంచి కిందపడిన యువతి – బైక్ పై వెళ్తుండగా మూర్చ రావడంతో కిందపడిన యువతి – హోంమంత్రి అనిత రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తుండగా ఘటన – ప్రమాదాన్ని చూసి వెంటనే కాన్వాయ్ ఆపి బాధితుల వద్దకు వెళ్లిన హోంమంత్రి – గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేసిన హోంమంత్రి అనిత – హుటాహుటిన వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసిన హోంమంత్రి అనిత
👉 పెళ్ళి చేసుకుంటానని వికలాంగురాలిపై అత్యాచారం..
పెళ్లి చేసుకుంటానని వికలాంగురాలిపై అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ : ఓ వ్యక్తి వికలాంగురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి ఆమెను గర్భిణీని చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆలస్యంగా వెలుగుచూసింది. వికలాంగురాలు(20) తన నాన్నమ్మతో కలిసి ఉంటోంది. ఇంట్లో పనికి రమ్మన్న ఆమెను వరిశి భాస్కరరావు పెళ్లి చేసుకుంటానని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో రాజీకి ప్రయత్నించాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.
👉బీఆర్‌ఎస్‌పై టి.పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ ఫైర్..
ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు విపక్ష హోదా ఎందుకు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య దోస్తీ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి BRSకు అభ్యర్థులే లేరు.
8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే బడ్జెట్‌లో..
తెలంగాణకు వచ్చిన నిధులు గాడిద గుడ్డు.
కేటీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌, హరీష్‌, కవిత మధ్య..మూడు ముక్కలాటనడుస్తోంది-మహేష్‌కుమార్‌గౌడ్.

👉ఇద్దరు డీజిల్ దొంగలు అరెస్ట్.. కారు స్వాధీనం.. గుటూరు జిల్లా,డీజిల్ దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్న ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 5. 800 విలువగల డీజిల్ ఆయిల్, షిఫ్ట్ డిజైర్ కార్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాధనాల విజయ్ బాబు, కొలికొండ వెంకట రావు, అబ్బినేని వెంకట నరసయ్య గా గుర్తించి వీరిపై కేసు నమోదు చేసి త్వరలో కోర్టు హాజరు పరుస్తామని పెదకాకాని సీఐ నారాయణస్వామి మీడియాకు తెలిపారు..

👉ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్..ఏపీలో జనసేన పార్టీ నేతలపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యకర్త వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటన మరువక ముందే తాజాగా తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్ మీద ఓ మహిళ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు లక్ష్మి వీడియో సందేశాన్ని విడుదల చేశారు…ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా ఇప్పుడు మీ జనసేన ఇంఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది నాకు అండగా నిలబడవా అన్న! అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకోవడం తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్‌కి సరదా ఆ మహిళల వద్ద డబ్బులు అయిపోతే సైలెంట్‌గా జారుకుంటాడు. మొన్న మానస నేడు నేను (లక్ష్మి) రేపు ఇంకో అమ్మాయి. ఇలా ఇంకెంత మంది జీవితాల్ని నాశనం చేస్తావ్ కిరణ్ రాయల్?’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరింది.

👉 కడప జిల్లా..మైదుకూరు ఎమ్మార్వో ఆఫీస్ లో వీఆర్వోల గ్రూపు రాజకీయం దందా ..డబ్బులు ఇస్తేనే గౌరవం సామాన్య ప్రజల కు తిరస్కారం.వీఆర్వోలు గ్రూపులుగా ఏర్పడి అందిన కాడికి దోచుకుంటున్న వైనం..విఆర్వోల పంట పండిస్తున్న నేషనల్ హైవే..డబ్బు లేనిదే ఏ పని చేయని వీఆర్వోలు..ఎస్ మైదుకూరు వీఆర్వో ఆగడాలకు అంతే లేకుండా పోతుంది..ఎస్ మైదుకూరు విఆర్ఓ కు కాసుల పంట పండిస్తున్న నేషనల్ హైవే

👉 *ప్రభుత్వ స్థలంలో ఆకాశమంత భవనం..*కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలం కబ్జా*..*పర్మిషన్ ఎవరిచ్చారు*❓..*భవన నిర్మాణం అధికారులకి తెలియకుండా జరిగిందా*❓..*సామాన్యులకు 100 నిబంధనలు కబ్జాదారులకు నిబంధనలు వర్తించవా*❓*కబ్జాదారుల కొమ్ముకాస్తున్న అధికారులు ???

తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రొబిషన్ స్టేషన్ సమీపంలో గల సర్వే నంబర్ 66/5, 27 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కొందరు స్వార్ధపరులు అధికారులతో చేతులు కలిపి స్థలాన్ని కబ్జా చేసి భవనాన్ని కూడా నిర్మించారు. ఈ భవనా నిర్మాణానికి పర్మిషన్ ఎవరిచ్చారు.❓ సుమారు 15 అంకణాల స్థానాన్ని కబ్జా చేసి దర్జాగా భవన నిర్మాణం చేశారు. అధికారులు అనుకుంటే బమ్మిని తిమ్మిలా, తిమ్మిని బమ్మిల మార్చి భవనాన్ని నిర్మిస్తారా.❓ ఇదెక్కడి విడ్డూరం. అంటూ ప్రజలు నిర్గాంతపోతున్నారు.

👉బాటిళ్ల గరిష్ట ధర పెంపు పై స్పష్టత ఇచ్చిన ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్*

ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు. అసలు ధర పెంపు కేవలం ₹10 మాత్రమే అని ఆయన తెలిపారు. అలాగే, బ్రాండ్ లేదా పరిమాణం (క్వార్టర్/హాఫ్/ఫుల్ బాటిల్) అనేదానితో సంబంధం లేకుండా, అన్ని బాటిళ్లపై ₹10 మాత్రమే పెరిగిందని స్పష్టం చేశారు. కొంతమంది ₹15 లేదా ₹20 పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని తెలిపారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అపోహలకు గురి కాకూడదని విజ్ఞప్తి చేశారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. బీరు, రూ 99 మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదన్నారు.

👉తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు..!!!

లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో 4గురిని అరెస్టు చేసిన సిబిఐ దర్యాప్తు బృందం..భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేసిన దర్యాప్తు బృందం ..క్రై నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచిన దర్యాప్తు అధికారులు..దర్యాప్తులో అక్రమాలు బట్టబయలు….నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలు..ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు. ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపిన వైష్ణవి డైరీ.. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు..భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని విచారణలో తేల్చిన అధికారులు…సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం….మూడు డైరీలకు చెందిన 4గురు అరెస్టు..    ఇదీ కేసు నేపథ్యం:-

గత ప్రభుత్వ హాయంలో తిరుమల లడ్డూ లో అపవిత్ర పదార్థాలు..లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడడంతో దేశ వ్యాప్తంగా సంచలనం..వివాదంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు..ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు…దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, సీబీఐ తరఫున హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి తో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా..*సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు..గత ఏడాది విచారణ ప్రారంభించిన సిబిఐ అధికారులతో కూడిన దర్యాప్తు బృందం..తిరుమల లడ్డూల తయారీకి టీటీడీ రోజుకు 15 వేల కిలోల ఆవు నెయ్యి వినియోగం..తమిళనాడుకు చెందిన AR ఫుడ్స్ కిలో నెయ్యి రూ.320 చొప్పున సరఫరా చేసేలా టెండర్లు ఖరారు..జూలై 8న 8 ట్యాంకర్లు రాగా అందులో 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిన అధికారులు..అపవిత్ర పదార్థులు నెయ్యిలో కలిసినట్లు జులై 17వ తేదీన NDDB ల్యాబ్ నివేదిక..కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెలుగు చూసిన కల్తీ భాగోతం….దర్యాప్తు, అరెస్టులు

👉పౌల్ట్రీల లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: తూర్పు గోదావరి జిల్లా ..పెరవలి మండలం కానూరు పౌల్ట్రీల లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ..అధికారులతో కలెక్టర్ ప్రశాంతి అత్యవసర సమావేశం..కానూరులో కిలో మీటరు మేర రెడ్ జోన్.. 10 కిలోమీటర్ల పరిధి సర్వే లైన్స్ జోన్ గా ప్రకటన.. ఆయా పరిధిలో 144 సెక్షన్ 133 సెక్షన్ అమలు.. కానూరులో పది కిలోమీటర్ల లోపు ఇంటింటి సర్వే.. ప్రజల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు.

👉*శభాష్ ఖాకీ…ఇది కదా డ్యూటీ అంటే..” 6 నిమిషాల్లో అయినవిల్లి నుంచి అన్నవరం “.

సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెందిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు సిద్ధమైన వైనం…వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంకు చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు..ఆ తర్వాత తనకు కావలసిన బంధువులకి సెల్ఫీ వీడియో పెట్టి ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకున్న సమయంలో పి.గన్నవరం సీ.ఐ భీమరాజుకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే అతను ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు పంపించడం జరిగింది…వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ ను క్రెడియన్షియల్స్ ఉపయోగించి సెల్ ఐడి తో లాస్ట్ లొకేషన్ ను కనుగొన్న జాఫర్…వెంటనే ఆ లొకేషన్ ను సీ.ఐ భీమరాజుకు షేర్ చేయడం జరిగింది.వెంటనే ఆ లొకేషన్ చూసిన సీ.ఐ భీమరాజు కాకినాడ జిల్లా అన్నవరంలో లొకేషన్ రావడంతో వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరి గారిని లైన్ లోకి తీసుకోవడం జరిగింది.అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లొకేషన్ కి పంపించడంతోపాటు ఆ వీడియో వెనకాల ఉన్న రూమ్ లాడ్జి రూమ్ లాగా అనిపించడంతో అన్నవరంలో ఉన్న లాడ్జి ఓనర్స్ గ్రూపులో దాన్ని షేర్ చేసి వాళ్లందర్నీ కూడా అలెర్ట్ చేయడం జరిగింది.వెంటనే ఒక లాడ్జ్ యజమాని అతడిని గుర్తించి సరిగ్గా ఉరివేసుకొని సమయంలో తలుపు బద్దలు కొట్టి అతన్ని కాపాడడం జరిగింది.ఈ మొత్తం వ్యవహారం అంతా రాత్రి 11:21 నుంచి 11:27 మధ్యలో కేవలం ఆరు (6) నిమిషాల వ్యవధిలోనే జరగడంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది.ఈ యొక్క ప్రయత్నంలో విజయం సాధించి ఆ వ్యక్తిని కాపాడిన సీ.ఐ భీమరాజుకి కు, అన్నవరం ఎస్.ఐ శ్రీహరి కు,ఐ.టీ కోర్ కానిస్టేబుల్ జాఫర్ కు గ్రామస్తులు, సెటిజెన్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు…

👉జగన్ లైన్ లోనే కవిత వ్యాఖ్యలు!!!

రాజకీయ నాయకులు సినిమాటిక్ భాష వాడటం ఎప్పటి నుంచో ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో అయితే ఆ సమయంలో ఏవి పాపులర్, హిట్ సినిమాలో వాటిలో డైలాగులు వాడుతూ ప్రచారం కూడా చేసుకుంటారు. ప్రధాని మోడీ కూడా ఒకసారి బాహుబలి గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన 2.0 గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలం అయింది అని…ఈ సారి మాత్రం జగన్ 2.0 కచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పారు. జగన్ 2.0 లో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని వెల్లడించారు.

ఇది జరిగిన కొద్ది రోజులకే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా సోమవారం నాడు కచ్చితంగా బిఆర్ఎస్ 3.O వస్తది… కెసిఆర్ 3.0 వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఉద్యమకారులందరికి న్యాయం చేసే బాధ్యత తనది అని అన్నారు. తన చేతిలో ఎక్కడ ఎలాంటి అవకాశమున్నా ఉద్యమకారులకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఎవరూ దిక్కు లేనప్పుడు గులాబీ జెండా మోసిన ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందేనాని వ్యాఖ్యానించారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా..తెలంగాణ లో ఉన్న ఉద్యమకారులు అందరికి తాను మాట ఇస్తున్నట్లు తెలిపారు. మధ్యలో వచ్చినోళ్ళు మనోళ్లు కాదు అనటం లేదు అని…కానీ మొదటి నుంచి ఉన్న వాళ్లకు రావాల్సిన ప్రాధాన్యత రావాల్సిందే అన్నారు. జగన్ ఇటీవలే తన 2.0 గురించి చెపితే ..ఇప్పుడు కవిత కెసిఆర్, బిఆర్ఎస్ 3.O గురించి చెప్పారు.
👉 పంజాబ్లో రాకెట్ బాంబుల కలకలం

పంజాబ్లో రాకెట్ బాంబులు కలకలం సృష్టించాయి. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఓ పాఠశాల సమీపంలోని చెత్తకుప్పలో ఏడు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల చుట్టుపక్కల పరిసరాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

అయితే ఒకే చోట ఏడు బాంబులు బయటపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 దేశంలోనే మార్గదర్శి అతి పెద్ద స్కామ్: మిథున్ రెడ్డి

దేశంలోనే మార్గదర్శి అతి పెద్ద స్కామ్: మిథున్ రెడ్డి
దేశంలో జరిగిన స్కామ్‌లలో మార్గదర్శి స్కామ్ అతి పెద్దదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా సేకరిస్తే.. ఈడీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.
👉తిరుపతి జిల్లా, గూడూరు..*గంటల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినుల జాడ గుర్తింపు*

*క్షేమంగా విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించిన రెండవ పట్టణ సీఐ శ్రీనివాసులు**కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులకు ఊరట**రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ ను శభాష్ అంటూ ప్రశంసల జల్లు*తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని గురుకుల పాఠశాలలో కలకలం సృష్టించిన ఇద్దరు విద్యార్థినుల మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు….శభాష్ పోలీస్ అనిపించేలా కేవలం గంటల వ్యవధిలోనే సీఐ శ్రీనివాస్ బాలికల జాడను గుర్తించి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించి వారి కళ్లలో ఆనందం నింపారు…గూడూరు జానకిరామ్ పేటలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న నెల్లూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన తిరుమలశెట్టి చందన (17), సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన మోపూరు జయశ్రీ (15) ఇద్దరు విద్యార్థినిలు సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయం నుండి అదృశ్యమయ్యారు…బాలికల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో….మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీనివాస్ తన సిబ్బందితో కలసి విచారణ చేపట్టారు…బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్, ఆటో స్టాండ్ , బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో విద్యార్ధినుల ఆచూకీ కోసం ఆరా తీస్తూ ముమ్మరంగా గాలించారు…ఆయా ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్ లను క్షుణ్ణంగా పరిశీలించారు… అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానాన్ని చురుకుగా వినియోగించారు…ఈ క్రమంలో ఎట్టకేలకు గంటల వ్యవధిలోనే బాలికల జాడను గుర్తించి అక్కడకు చేరుకుని వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు…అప్పటివరకూ ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఎక్కడికైనా వెళ్ళారా, అసలు ఏమైందో తెలియక తమ బిడ్డల ఆచూకీ కోసం కన్నీటి పర్యంతమవుతూ ఆవేదన , ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలను తీసుకొచ్చారు….గూడూరు రెండవ పట్టణ సీఐ శ్రీనివాస్ మిస్సింగ్ కేసును కొన్ని గంటల వ్యవధిలోనే చాకచక్యంగా ఛేదించిన తీరును విద్యార్ధినుల కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు శభాష్ సీఐ శ్రీనివాసులు అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి సీఐ ఊరికి ఒకరు ఉంటే చాలు శాంతి భద్రతలు సక్రంగా ఉంటాయని తెలియజేశారు…

👉రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ .. హెల్త్ మినిస్టర్ సీరియస్..!!*హైదరాబాద్ మియాపూర్ సిద్ధార్థ హస్పటల్ ఘటనపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు శవానికి ట్రీట్ మెంట్ చేయడంపై విచారణకు ఆదేశించారు.ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలంటూ అధికారులను ఆదేశించారు. మినిస్టర్ ఆదేశాలో ఫిబ్రవరి 10న ఆరోగ్యశాఖ అధికారులు మియాపూర్ లోని సిద్దార్థ్ హాస్పిటల్ కు వచ్చారు. హాస్పిటల్ లో తనిఖీలు చేశారు. అయితే సిద్దార్థ్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది మీడియాను లోపలికి అనుమతించలేదు.

కడప జిల్లాకు చెందిన సుహాసిని(26) కండ్లు తిరిగి పడిపోవడంతో నెల రోజుల క్రితం సిద్దార్థ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. అయితే చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారని, ఇంకా డబ్బులుకట్టలేని పరిస్థితి రావడంతో నిమ్స్కు తీసుకెళ్లాలని చెప్పారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు. నిమ్స్ కు తరలించగా సుహాసిని అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని పేర్కొన్నారు. దీంతో శనివారం సుహాసిని ఫ్యామిలీ మెంబర్స్సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయినా తమకు సమాచారం ఇవ్వకుండా ట్రీట్మెంట్ పేరుతో డ్రామాలాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
👉యాసిడ్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ :*
*సికింద్రాబాద్​ ఓల్డ్​ బోయిన్​పల్లిలో ‘సోనీ జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌’ పేరిట 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తూ పట్టుబడ్డ మహ్మద్​ షఖీల్ అహ్మద్‌. అల్లం వెల్లుల్లి పేస్ట్​లో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ ​యాసిడ్​, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వినియోగిస్తూ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు….*
*మహ్మద్​ షఖీల్ అహ్మద్‌ తో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసారు టాస్క్​ఫోర్స్ పోలీసులు..
తక్కువ రేట్ కి వస్తున్నాయ్ అని కొనుక్కొని ప్రాణాలు పోగొట్టుకోకండి…
👉తమిళ రాజకీయాల్లో పెను సంచలనం? దళపతికి పీకే మాస్టర్ స్కెచ్ తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకు సహాయం చేయాల్సిందిగా విజయ్ పీకేను కోరినట్లు సమాచారం. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు డిమాండ్ తగ్గడం లేదు. తన వృత్తికి విశ్రాంతినిచ్చేసినట్లు పీకే చెబుతున్నా, పొలిటికల్ పార్టీలు మాత్రం ఆయనను వదలడం లేదు.

ఇటీవలే ఢిల్లీలో ఏపీ మంత్రి లోకేశ్ తో భేటీ అయిన పీకే.. తాజాగా తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ హీరో దళపతి విజయ్ తో భేటీ అయ్యారు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకు సహాయం చేయాల్సిందిగా విజయ్ పీకేను కోరినట్లు సమాచారం.

సర్కార్ సినిమాలో పీకే పాత్రను పోషించిన దళపతి విజయ్ తన రాజకీయ జీవితంలో పీకే సాయం కోరినట్లు తెలుస్తోంది. గతంలో తమిళనాడులోని డీఎంకే పార్టీ విజయానికి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కు ఆ రాష్ట్ర రాజకీయాలపై అవగాహన ఉంది. దీంతో పీకే ను తాను ఎంగేజ్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సక్సెస్ అవుతానని దళపతి విజయ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పీకే సలహా ప్రకారం త్వరలో తమిళనాడులో బస్సు యాత్ర లేదా పాదయాత్ర చేసేందుకు దళపతి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో వర్క్ అవుట్ అయిన పాదయాత్రను తమిళనాట పరిచయం చేయాలని పీకే చూస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించిన దళపతి విజయ్ ఈ మధ్యే ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇక వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా జరుగుతున్న రాజకీయాన్ని తనవైపు టర్న్ చేయాలని లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు దళపతి. మరోవైపు బీజేపీ కూడా తమిళనాడులో ఎదగాలని చూస్తోంది. ఈ పరిణామాల మధ్య పీకే ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దేశంలోనే టాప్ మోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా పీకే గుర్తింపు తెచ్చుకున్నారు. ఐ ప్యాక్ సంస్థను ప్రారంభించి దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు విజయాలను అందించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ కోసం పనిచేసిన పీకే బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ, త్రుణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు సేవలందించారు. ఏపీలో గత ఎన్నికల ముందు టీడీపీకి ఆయన సహకరించారని అంటారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ లను ఆయన ప్రత్యేకంగా కలిశారు. కాగా, తన సొంత రాష్ట్రం బిహార్ లో రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్న పీకే.. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. కానీ, ఆయన సేవలను కోరుకుంటున్న నేతలు మాత్రం.. తాను తన వృత్తికి దూరంగా ఉన్నానని చెబుతున్నా వదలడం లేదు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..