👉ప్రజాస్వామ్యన్ని బలహీన పరుస్తున్నారు: ప్రియాంక గాంధీ..*సాయి సాధన చిట్ ఫండ్ బాధితుల నిరసన..తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం..* నెల్లూరులో యువకుడు దారుణ హత్య*👉: తండ్రిని చంపి ముక్కలుగా కోసిన కొడుకు.. 👉దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు..👉 రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ .. కాల్పుల కలకలం !..👉బేస్తవారిపేట లో రేషన్ బియ్యం గోల్ మాల్*

👉ప్రజాస్వామ్యన్ని బలహీన పరుస్తున్నారు: ప్రియాంక గాంధీ..కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పనిలో మన కేంద్రం ఉంది. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి. ప్రస్తుతం మనం చేస్తున్న పోరాటం మన సొంత రాజకీయాల కోసం కాదు. దేశ రక్షణ కోసమని మీరు గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు.

👉*ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో రూ.23 లక్షల బ్యాగ్ పోయింది?*నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద బస్సులో రూ.23లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ చోరీ కలకలం రేపింది,ఆదివారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును టిఫిన్‌ చేసేందుకు నార్కెట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఆపారు.అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్‌ను బస్సులో ఉంచి టిఫిన్‌ చేసేందుకు దిగారు. తిరిగి వచ్చి చూసి నగదు మాయమైనట్లు గుర్తించారు.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

👉నగరంలో యువకుడు దారుణ హత్య**నెల్లూరు*
ఉడ్ హౌస్ సంఘంలో కళ్యాణ్ అనే వ్యక్తిపై పలువురు విచక్షణ రహితంగా దాడి*
కత్తులతో జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన కళ్యాణ్..
ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన స్నేహితులు..
అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు.ఘటనపై కేసు నమోదు చేసిన నవాబ్ పేట పోలీసులు

👉*జగిత్యాల జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్*
5 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్లు, కారు స్వాదీనం..
జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమార్ స్వామి, బుర్ర రాజేందర్..
బైక్ దొంగలు ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాల్లో ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులు చోరీ చేస్తున్నారు.
వీరంతా కలమడుగు, జన్నారం మండలం మంచిర్యాల జిల్లాకు చెందినవారు..
వీరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపిన డిఎస్పీ రఘు చందర్..
*పల్నాడు జిల్లా DRDA పిడీ బాలు నాయక్ పై వేటు*
అమరావతి, అచ్చంపేట మండలాల్లో మంజూరు చేసిన వెలుగు రుణాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు..
అమరావతి మండలంలో కోటి రూపాయలకు పైగా వెలుగు రుణాలు పక్కదారి పట్టాయని ఆరోపణలు..
అవినీతికి పాల్పడిన ఉద్యోగులకి అండగా ఉండటం, కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేయడం అనే ఆరోపణలతో వేటు..
పిడి బాలు నాయక్ ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా
డి ఆర్ ఓ మురళి ఆదేశాలు జారీ.
👉*బేస్తవారిపేట లో రేషన్ బియ్యం గోల్ మాల్*
ప్రకాశం జిల్లా….బేస్తవారిపేట మండల పరిధిలోని రేషన్ డీలర్ ముక్క సోమవారపేట గ్రామస్తుడైన రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాన్ని సోమవారపేట నారాయణకు అప్పగించడంతో రేషన్ బియ్యాన్ని ప్రతినెలా ఊరు వాడ రేషన్ బియ్యం వాహనంతో ఇంటింటికి సరఫరా చేస్తున్న నేపథ్యంలో నేడు పాపాయిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సున్నం అనిత రేషన్ బియ్యాన్ని నారాయణ నుంచి తీసుకోవడంతో 20 కేజీలకు గాను 1/1/2 కేజీలు తక్కువగా రావటంతో అవాక్కయింది. ఇది ఏంటి అని రేషన్ వాహనాన్ని నడుపుతున్న నారాయణను అడగగా 20 కేజీలకు రెండు కేజీలు తక్కువగా వస్తాయని మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదని ఖరాఖండిగా చెప్పటం కోసమెరుపు, ఈ నేపథ్యంలో టిడిపి మహిళా నాయకురాలు అనిత స్థానిక శాసనసభ్యులు, తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దారులకు ఫిర్యాదు చేసింది, ఈ మేరకు విచారణ జరుగుతామని రెవెన్యూ అధికారులు తెలియజేశారు, విశ్వాస్ న్యూస్ సీఈవో బొడిచర్ల సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అనితను వివరణ కోరగా రేషన్ డీలర్లు సిండికేట్ గా మారి రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు చేస్తూ పేదల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. తక్కువ ధరలకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అంతర్జాతీయ స్థాయిలో రేషన్ బియ్యం దందాను యదేచ్చగా చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రేషన్ బియ్యం దందాను అవినీతిని అరికట్టాలని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మీడియాకు తెలియజేశారు. నారయణ కుల సామాజిక వర్గం అనిత వద్దకీ వచ్చి కాళ్ల బేరము అడుచున్నారు,బేస్తవారిపేట ఎమ్మార్వో ఈ విషయపై చర్యలు తీసుకోంటారా లేక గాలికి వేలిది వేస్తావా అనేదే ప్రశ్నాగా మిగిలింది
👉: తండ్రిని చంపి ముక్కలుగా కోసిన కొడుకు..
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..
దొనకొండ మండలం ఇండ్ల రేవు గ్రామంలో పైడిపోగు యేసయ్య 64 సం,అనే వ్యక్తిని
అతడి కొడుకు మరియదాసు దారుణంగా హత్య చేశాడు..మద్యం మత్తులో తండ్రిని చంపి.. రంపం తో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు
మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది
👉దుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుకలు..
విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో వెంట్రుక..
కనిపించడం కలకలం రేపింది. ప్రసాదంలో నాణ్యత లేదని ఓ భక్తుడు సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్ట్ పెట్టాడు. ఉదయం ఓ లడ్డూలో, సాయంత్రం మరో లడ్డూలోనూ వెంట్రుకలు ఉండటంతో తాను నిర్ఘాంతపోయినట్లు అతడు మంత్రి ఆనంను ట్యాగ్ చేశారు. స్పందించిన మంత్రి భక్తుడికి క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే ఆలయాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు.
👉అమానవీయ ఘటన.. తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ సోకడంతో తమపై జరుగుతున్న అకృత్యాలను తల్లికి చెప్పిన యువతులు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు.
సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు.ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.
తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు..
ఇటీవల ఆ ప్రబుద్ధుడు వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది.. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చెప్పారు..
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లికూతుర్లు..
దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు
👉సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు.. నరసరావుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్నారు. రావిపాడు రోడ్డు నుండి ఎమ్మెల్యే కార్యాలయానికి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
👉 పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపిన తండ్రి..
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో దారుణంపాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొని ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) కొట్టి చంపిన తండ్రి సైదులు..పోస్టుమార్టం నిర్వహించకుండా ఖననం చేసే ప్రయత్నంలో కుటుంబసభ్యులు..భాను మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..పోలీసులకు, భాను కుటుంబ సభ్యుల మధ్య చోటుచేసుకుంటున్న వాగ్వాదం

👉 రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద ఇరువర్గాల ఘర్షణ .. కాల్పుల కలకలం !
కాల్పులు జరిపినట్లు ఆధారాలు లభించలేదన్న పోలీసులు
ఇరువర్గాల్లో ఎవరూ ఫిర్యాదులు చేయలేదన్న పోలీసులు..
విచారణ జరిపి ఘర్షణలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీస్ అధికారి బాలకృష్ణ

భూ వివాదానికి సంబంధించి హైదరాబాద్ టోలిచౌకీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. గోల్కొండకు చెందిన షకీల్ శనివారం రాత్రి కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవపడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి బాలకృష్ణ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు.
ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు జరిగాయన్న సమాచారంతో అక్తర్ వద్ద ఉన్న లైసెన్సు గల తుపాకీని పోలీసులు తనిఖీ చేశారు. కాల్పులు జరిపినట్లు ఎలాంటి అధారాలు లభించలేదని పోలీస్ అధికారి బాలకృష్ణ తెలిపారు. అయితే ఇరువర్గాల్లో ఎవరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు.
జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని, దీనిని సుమోటోగా తీసుకుని ఘర్షణలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..