*బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఆందోళన బాట పట్టిన విద్యార్థులు..*గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు..👉 ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ,.👉తిరుమలలో దంపతుల ఆత్మహత్య*👉 భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ధర్నా ..*వివేకాను చంపించిన జగన్*: దస్తగిరి…* షర్మిల సంచలన వ్యాఖ్యలు*నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం..*మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!..*ఆర్జీవీ పై రాజకీయ ప్రతీకారమా ?…👉 మాజీ మంత్రి విడదల రజినిపై అట్రాసిటీ కేసు నమోదు..*పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహణ…*నంద్యాల ఎస్పీ రాణా

👉బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు భారీ షాక్ ఇచ్చిన ట్విట్టర్*

*తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారి మీద సోషల్ మీడియా లో అసభ్యకరమైన మార్ఫెడ్ ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్లు చేసిన అరవింద్ ధర్మపురి ఆర్మీ హ్యాండిల్ ను సస్పెండ్ చేసిన ట్విట్టర్*ఈ రోజు అధికారికంగా సస్పెండ్ చేసిన ట్విట్టర్*

👉ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా?సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యులు.డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపని వైద్యులు..నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా.. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని గర్భిణులను తిడుతున్న డాక్టర్లు..బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణీని మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకున్నావా? అక్కడ నొప్పులు రాలేదా? సినిమాలు ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వైద్యురాలు ప్రమీలారాణి కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేసారు.. ఆ తర్వాత ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు.. రిజిస్టర్లో మా పేర్లు కూడా తప్పుగా రాశారంటూ, పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని, రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాలింత..

👉ఎన్టీఆర్ జిల్లా విజయవాడ  శివారు ఎనికెపాడు లో భారీ చోరీ ..ఐఫోన్ గోడౌన్ రేకు పగలగొట్టి 372 ఐఫోన్ చోరీచేసిన దుండగులు ..2 కోట్ల 50 లక్షలు విలువ గల ఫోన్లు చోరి  ..కేసు నమో చేసి దర్యాప్తు చేస్తున్న పడమట పోలీసులు

👉 ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ,.ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా సమావేశమయ్యారు. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గేతో చర్చించే అవకాశం ఉంది.

👉 మాజీ మంత్రి విడదల రజినిపై అట్రాసిటీ కేసు నమోదు..ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో గత ప్రభుత్వంలో తనను వేధించిన అంశంలో విడదల రజినిపై కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన పిల్లి కోటి..పిల్లి కోటి పిటిషన్ పరిశీలించి చర్యలు చేపట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ..హైకోర్టు ఆదేశాలు నేపథ్యంలో విడదల రజినిపై కేసు నమోదు చేసిన చిలకలూరిపేట పట్టణ పోలీసులు

👉 అన్నక్యాంటీన్‌కు రూ.5 లక్షల విరాళం.. అన్నక్యాంటీన్‌కు రూ.5 లక్షల విరాళం అందించిన విజయవాడ కానూరుకు చెందిన శ్రీ గుమ్మడి నాగేశ్వరరావు..కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి విరాళం చెక్కు అందజేత

👉బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి ఆందోళన బాట పట్టిన విద్యార్థులు..సెకండ్ సెమిస్టర్ లో పరీక్ష పేపర్ వ్యాల్యూషన్లో పారదర్శకంగా లేదంటూ విద్యార్థుల ఆరోపణ..బ్యాక్ లాగ్ పేపర్ల రీవాల్యుయేషన్లో బయటపడ్డ అధికారుల పొరపాట్లు..నిన్న క్యాంపస్లో అధికారులను నిలదీసిన విద్యార్థులు..తమకు న్యాయం చేయాలని డిమాండ్

👉తిరుమలలో దంపతుల ఆత్మహత్య* తిరుమల: తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆయన భార్య అరుణ (55) తిరుమల శ్రీవారి దర్శానికి వచ్చారు. నందకం అతిథి గృహంలోని గది నెంబర్ 203ను అద్దెకు తీసుకున్నారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో ఆత్మహత్య చేసుకోవటం, అందులోనూ భార్యాభర్తలు ఇలా తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పిల్లలు, బంధువులు కొండకు వచ్చి పోలీస్ విచారణకు హాజరయ్యారు.

👉 భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ధర్నా ..భారతీయులను అమెరికా బహిష్కరించడం పై ఉభయసభల్లో సభలో చర్చకు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ అవరణలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జన్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ ధర్నా దిగారు. భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు.

👉అమెరికాలోని ప్రతిష్టాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం**ఐబీసీ-2025 సదస్సులో ముఖ్యఅతిథిగా ప్రసంగించాలని విజ్ఞప్తి*…*పదేళ్లలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం అద్భుతమని.. హైదరాబాద్‌ను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని ప్రశంస* తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అభినందనలు*

👉 *పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహణ…*నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా..  పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 10 మంది పోలీసు సిబ్బంది వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ గారు సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు. పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ సిబ్బంది సమస్యల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలియజేసుకోవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. విధినిర్వహణలో సిబ్బంది సతమత పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చెయ్యటమే లక్ష్యమని తెలియచేసినారు

👉 *వివేకాను చంపించిన జగన్*: దస్తగిరి

జగన్ వివేకాను చంపించి నారాసుర చరిత్ర అని రాశారని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. ఈ రోజు (శుక్రవారం) ఆయన కడప జైల్లో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ హయాంలో జైల్లో ఉన్న నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నన్ను ఇబ్బందిపెట్టిన వాళ్లపై కేసు పెట్టాను. వికేకాను జగన్ చంపించారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకి వస్తాయి. ‘ అని తెలిపారు.

👉అరవింద్ కేజ్రీవాల్‌కు ACB నోటీసులు

ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా..ఆపరేషన్‌ లోటస్‌ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు ..ఏసీబీ అధికారులను ఇంట్లోకి అనుమతించని కేజ్రీవాల్‌ లీగల్‌ టీమ్ .. అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం కేజ్రీవాల్‌ ఇంటి ముందు చాలా సేపు ఎదురుచూసి చివరికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయిన ఏసీబీ అధికారులు

👉ఇంటరెస్టింగ్!.. టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!

అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా చేసుకుపోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలియదు గానీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాగ్ చాల ఫ్రెండ్లీగా ఉంటారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉండగా.. నేరుగా జైలుకి వెళ్లి మరీ నాగ్ ఆయనను పరామర్శించారు. నాడు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. జగన్ తనకు మిత్రుడని… అలాగే జగన్ తో పాటు నాడు జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ కూడా తనకు మిత్రుడని కూడా నాగ్ చెప్పుకొచ్చారు…సీన్ కట్ చేస్తే… శుక్రవారం నాగ్ తన ఫామిలీ మెంబెర్స్ తో కలిసి టీడీపీ కార్యాలయంలో కనిపించారు. అది కూడా ఢిల్లీలోని పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన నాగ్.. అక్కడ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను బైరెడ్డి శబరీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో నాగ్ తో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, కోడలు శోభిత ఉన్నారు..ఢిల్లీ లో అది కూడా పార్లమెంట్ లో…టీడీపీపీ కార్యాలయానికి నాగ్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లడం, అక్కడ టీడీపీ ఎంపీ కనిపించగానే.. ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ తో స్నేహం ఉన్నా ఏనాడూ నాగ్ వైసీపీ ఆఫీస్ కి వెళ్లిన దాఖలా లేదు. అయితే… ఢిల్లీ వెళ్లిన నాగ్ ఇలా టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయినా.. నాగ్ తన ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ ఎందుకు వెళ్లారని ఆరా తీస్తే… తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుపై ఓ పుస్తకాన్నిఆవిష్కరించే కార్యక్రం ఉండటంతో… ఢిల్లీ వెళ్లిన నాగ్.. పనిలో పనిగా పలువురు రాజకీయ నేతలను కూడా కలిశారట. ఈ క్రమంలోనే.. నాగ్ ఆలా టీడీపీ ఆఫీస్ కి కూడా వెళ్లినట్టు సమాచారం.

👉 మెగా డీఎస్సీ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ కాలం సాగదీస్తుంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబుతో పాటు విద్యామంత్రి నారా లోకేష్ కూడా రోజుకో ప్రకటన ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ఆసక్తికర ప్రకటన చేశారు.

కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనాల్లోకి వెళ్లేలా కార్యచరణ రూపొందిచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అలాగే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.

రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని సీఎం తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని పెట్టుబడులు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.అలాగే సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేబినెట్‌లో చర్చ జరిపారు. మెనూలో చేసిన మార్పులపై సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోస పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సన్న బియ్యం తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

👉చంద్రబాబు దగ్గర రెడ్‌బుక్‌ ఉన్నంత వరకు వైసీపీ నాయకులపై కేసులు పెడుతూనే ఉంటారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త నగరాలు నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు.. మూడు రాజధానులపై మా స్టాండ్‌ ఏంటో త్వరలో చెప్తాం.. పవన్‌ కల్యాణ్‌కు ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు_అంబటి రాంబాబు_

👉 షర్మిలను పొలిటికల్‌గానూ టార్గెట్ చేస్తున్న జగన్ !

షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు తనకు ఎప్పటికైనా మైనస్సే అనుకుంటున్న జగన్ ముందుగా ఆమెను రాజకీయంగా బలహీనం చేసే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ లో ఇప్పటికీ మిగిలి ఉన్న కీలక నేతలకు ఆఫర్లు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. శైలజానాథ్ కు శింగనమల టిక్కెట్ హామీ ఇచ్చి..ఆర్థికంగా కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించారని అనంతపురం వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.చాలా మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వస్తారని ఆ తర్వాత శైలజానాథ్ ప్రకటించారు. ఆ చాలా మంది ఎవరో కానీ.. షర్మిల పై కొంత మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వారితో ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఎన్నికలుక ముందు వైసీపీ నుంచి చాలా మంది దళిత నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉన్న కొంత మంది సీనియర్లను కూడా సంప్రదిస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిలను రాజకీయంగా టార్గెట్ చేయకపోతే ఆమె ముందు ముందు బలం పుంజుకునే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లలేకపోవడం.. షర్మిల మాత్రం త్వరగా ప్రజల్లో కలిసిపోతూండటంతో వైసీపీ క్యాడర్ కు సమస్యగానే ఉంది. అయితే శైలజానాథ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి కనీస ప్రభావం చూపించలేకపోయారు. మరి ఆయనను చూసి ఎంత మంది వైసీపీలోకి వస్తారో వేచి చూడాల్సి ఉంది.

👉బిగ్ బ్రేకింగ్ – ఆర్జీవీ పై రాజకీయ ప్రతీకారమా ?……… డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఝలక్ ఇచ్చిన పోలీసులు.9 గంటల పాటు ఆర్జీవీ ని విచారించిన పోలీసులు.. మరో కేసులో కొత్త నోటిసులు జారీ చేశారు.ఒంగోలులో జరిగిన ఈ విచారణలో అధికారులు వివిధ అంశాలపై ఆర్జీవిని ప్రశ్నించారు.విచారణ ముగిసిన అనంతరం మరో కేసులో ఆర్జీవికి తాజా నోటీసులు అందజేశారు. అయితే, ఈ నోటీసులపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.విచారణ అనంతరం ఎటువంటి ప్రకటన చేయకుండా ఆర్జీవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

👉*జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు.. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం.*

*జగన్మోహన్ రెడ్డి వల్ల పడిన ఇబ్బందులు ఆయన చెప్పారు నా బిడ్డలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెబుతా.* షేర్స్ తనకే చెండాలంటూ నా మీద, నా తల్లి మీద కేసు వేశారు.. అందుకే నేను వైఎస్ ఆనాడు అన్న మాటలు చెప్పాను.*విజయసాయిరెడ్డితో జగనే ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధాలు అని చెప్పించారు.* ఆ తర్వాత సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అబద్ధమని విజయమ్మే లేఖ రాసి చెప్పారు.*  *ఆ తర్వాత కూడా జగన్.. విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారంట…ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు.*వైఎస్ఆర్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయారు.* నా క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారు.. క్యారెక్టర్ గురించి ఇటీవల పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన జగన్.. క్యారెక్టర్ అంటే ఏంటో మరచిపోయారు.* *వైఎస్ఆర్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు..పరువు పోతుంది.. వదిలేయండి అన్నా జగన్ ఊరుకోలేదు.* *ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే.. విజయసాయిరెడ్డి రాసుకున్నారంట..ఇదీ జగన్మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్.*  *మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ కుట్రలు చేశారు : వైఎస్ షర్మిల.*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..