👉 వాయిదా పడనున్న మోడీ అమెరికా పర్యటన.. మోడీ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10న ట్రంప్‌తో భేటీ అవుతారు. అనంతరం.. ఇండియన్ డయాస్పోరాలో భారత సంతతి పౌరులతోనూ ప్రధాని సంభాషిస్తారు. అనంతరం.. ప్రముఖ వ్యాపార వేత్తలతోనూ.. భేటీ అయి పెట్టుబడు లపై చర్చించాల్సి ఉంది. ఇక, 13న టెస్లా దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తోనూ ప్రధాని భేటీ అయి.. పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. టెస్లా ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేయాలని మస్క్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా ఇది ఖరారవుతుందని అధికారులు కూడా తెలిపారు. అయితే.. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను విడతల వారీగా ట్రంప్ పంపేస్తున్నారు. ఇలా పంపే క్రమంలో భారతీయుల చేతులకు, కాళ్లకు కూడా బేడీలు వేస్తున్నారు. దీనిని సమర్థించుకునేందుకు మోడీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా.. విపక్షాల నుంచి తీవ్ర సెగ తగులుతోంది. గురువారం రోజు రోజంతా .. పార్లమెంటు ఉభయ సభల్లో ఇదే విషయంపై సర్కారుకు సెగ తగిలింది. విపక్షాలు తీవ్ర స్తాయిలో మోడీ పాలనపై విరుచుకుపడ్డాయి. ప్రియ మిత్రుడైన ట్రంప్‌కు ఆమాత్రం విజ్ఞప్తి చేయలేరా? అంటూ కాంగ్రెస్ సభ్యులు నిప్పులు చెరిగారు. భారతీయులను అవమానిస్తున్నా.. మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఈ పరిణామాలకు తోడు.. అంతర్జాతీయ మీడియా సహా.. భారతీయులకు సంకెళ్లు వేసే పంపించారని నిర్ధారించింది. దీంతో ముందు కాదని చెప్పినా.. తర్వాత.. నిజాలు వెలుగులోకి రావడంతో మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి సమయంలో మరోనాలుగు రోజుల్లో అమెరికా పర్యటన పెట్టుకోవడం సరికాదని భావిస్తూ.. దానిని రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
👉”లిక్కర్ కేసులో ‘పెద్ద’రెడ్డి, మిథున్ రెడ్డి” పై జగన్ కీలక వ్యాఖ్యలు! ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ ఏపీలో మద్యం విధానంపై దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఏపీలో గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీ విషయంలో అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని కూటమిలోని పార్టీల పెద్దలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ ఏపీలో మద్యం విధానంపై దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. మరోపక్క జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ.. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏమిటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా? అని టీడీపీ ప్రశ్నించింది. దీంతో.. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి, “పెద్ద” రెడ్డికి ప్రమేయం ఉందంటూ వచ్చిన కథనాలపైనా ఆ పత్రిక పేరు చెబుతూ ఘాటుగా స్పందించారు. అవును… ఏపీ రాజకీయాల్లో లిక్కర్ కేసు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పేరు చేర్చుతూ మీడియాలో వచ్చిన కథనాలపై జగన్ స్పందించారు. అసలు.. లిక్కర్ కేసుకీ మిథున్ రెడ్డికి ఏమిటి సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. మిథున్ రెడ్డి పార్లమెంటులో ఫ్లోర్ లీడర్, ఆయన తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకూ మధ్యానికీ సంబంధం ఏమిటి? అని జగన్ ప్రశ్నించారు. “ఎవరైనా ఈ వ్యవహారంలో ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు పెంచామా..? మద్యం బేసిక్ రేట్లు పెంచి, సరఫరా తగ్గించినందుకు నాకు లంచాలు ఇస్తారా.. రేట్లు పెంచి, సరఫరా పెంచిన చంద్రబాబుకు మామూళ్లు ఇస్తారా?” అని జగన్ ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా ఎవరో ఒకర్ని కేసుల్లో ఇరికించడం, కేసులు పెట్టడం వాళ్లకు అలవాటేనని జగన్ అన్నారు. తన లాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని చెప్పిన జగన్.. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామని.. కమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరని అన్నారు.
👉కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం..జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని మిస్సింగ్..నిన్న సాయంత్రం నుండి కనిపించకుండా పోయిన విద్యార్థిని..కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు…
👉అమెరికా నుండి మరో 104 మంది అక్రమ వలసదారుల తరలింపు..అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు..అందులో 33 మంది గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తింపు….
👉ప్రయాగ్‌రాజ్ బ్రేకింగ్… మహా కుంభమేళా ప్రాంతంలో సెక్టార్ 18 లో మళ్ళీ మంటలు చెలరేగాయి, మంటలను అదుపులోకి తెచ్చారు, అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
👉మరో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు విద్యార్థులకు వాంతులు, విరోచనాలు..చికిత్స నిమిత్తం గుడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
👉హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్..!!!
రంగారెడ్డి ..నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం..పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లితండ్రులు .. యువకులను అదుపులోకి తీసుకొని పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నర్సింగి పోలీసులు
👉పల్నాడు జిల్లా ..నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో * అనుమతులు లేకుండా* నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ల పై తనిఖీ.. చిలకలూరిపేట రోడ్ లోని ఎల్ టి నగర్ మొదట లైన్లో ఉన్న మసాజ్ సెంటరను చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారనే స్థానికుల సమాచారంతో తనిఖీ చేసి నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటు ముగ్గురు యువతలను అదుపులోకి తీసుకొని అరెస్టు.. సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ ..
👉మా భూమిని జైభీమ్ రావ్ భారత్ పార్టీ వాళ్లు ఆక్రమించారు…న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు *అనంతపురం:నగరంలోని లెక్చరర్స్ కాలనీలో ఉన్న తమ భూమిని జైభీమ్ రావ్ భారత్ పార్టీ పేరుతో కొంత మంది ఆక్రమించారని భూ యజమాని కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బాధితులు మీడియాతో మాట్లాడారు.*
*జైభీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ గారు దళితులకు న్యాయం చేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలపై డిబేట్లో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారు*
*అనంతపురం జిల్లాలో జడ శ్రావణ్ కుమార్ గారి పేరును చెడ్డపేరు తెచ్చే విధంగా వారి పార్టీ జెండాలను అడ్డుపెట్టుకుని కొంతమంది పార్టీ నాయకులు ఇలా మా భూమిని ఆక్రమించుకొని గుడిసెలను వేయడం ఎంతవరకు న్యాయమని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.*
*సర్వే నంబర్ 95/1, 2లో ఉన్న భూమిని తమ తండ్రి 1965లో కొనుగోలు చేశారని కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని పేదల పేరుతో*
*జైభీమ్ రావ్ భారత్ పార్టీ వాళ్లు గుడిసెలు వేసి ఆక్రమించారని ఆరోపించారు. ప్రీకాస్ట్ ఫెన్సింగ్ వేసిన భూమిలో ఫెన్సింగ్ ధ్వంసం చేసి.. గుడిసెలు వేసుకున్నారని వాపోయారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామన్నారు.*
*తమ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా, తమను దుర్భాషలాడుతూ.. రెచ్చగొడుతూ,*
*మా వెనకాల హైకోర్టు జడ్జి జడ శ్రావణ్ కుమార్ ఉన్నాడు అంటూ తమపైన కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పిత్రార్జితంగా వచ్చిన భూమిలోనే జైభీమ్ రావ్ భారత్ పార్టీ వాళ్లు గుడిసెలు వేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని తమ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని బాధితులు కసిరెడ్డి శ్రీనివాసులు రెడ్డితోపాటు కసిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కసిరెడ్డి కృష్ణారెడ్డి, తదితరులు వేడుకున్నారు.*
👉ఇంద్రకీలాద్రిలో ఐదుగురిపై EO వేటు..*విజయవాడ*
*ఇంద్రకీలాద్రిపై ఇద్దరు పర్మినెంట్ ఎంప్లాయిస్ సస్పెండ్..‼️..**ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శాశ్వతంగా తొలగింపు..‼️*ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు చేయించి ఉద్యోగుల సొంత ఖాతాలో నగదు జమ చేసిన విషయంలో ఐదుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న EO..!! ఇటీవల తనిఖీల్లో ఒకరిని పట్టుకుని ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయాగా…అంతర్గత విచారణ జరిపి ఇద్దరు శాశ్వత ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు ప్రైవేటు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి ఇంకొంతమందిని తొలగించే యోచనలో అధికారులు..*తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో రామచంద్ర మోహన్….!!!*
👉కూతురిని వేధించిన వ్యక్తిని రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసిన తండ్రి..మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ హత్య.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని వేధించిన అలీ ఖాన్(36) అనే వ్యక్తి.. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు మళ్లీ ఆమెను వేధించిన అలీ ఖాన్దీంతో విషయం తెలుసుకుని.. నా కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేసిన తండ్రి అబ్దుల్ రహమాన్.. మృతదేహాన్ని తరలించిన పోలీసులు…
👉 మహబూబాబాద్ జిల్లా..మహబూబాబాద్ ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్.ఐ శివకుమార్ కి కేంద్ర స్థాయిలో ప్రతిష్టత్మక ఖాన్ బహదూర్ అజిజ్ల్హాక్ ట్రోపీ.
కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదిగా అందుకున్న ఎస్.ఐ శివ కుమార్.
ఢిల్లీ :
సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాలలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నియామకులైన పోలీస్ వారికి నిర్వహించే ఆల్ ఇండియా బోర్డు పరీక్షలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈద శివకుమార్ ఎస్ ఐ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇందుకు గాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలోని CFPB జనవరి 30- 31వ తేదీల్లో నిర్వహించిన 25వ అఖిల భారత ఫింగర్ ప్రింట్ బ్యూరో నిర్దేశకుల సమావేశం సందర్భంగా ప్రతిష్టాత్మక ఖాన్ బహదూర్ Azizul Haque ట్రోఫీనీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్న నిత్యానంద రాయ్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.
తెలంగాణ :ఆల్ ఇండియా బోర్డు పరీక్షలో మొదటి స్థానంలో నిలిచినందుకు నేర పరిశోధన విభాగ డీజీపీ శిఖా గోయల్ , రాష్ట్ర ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ M.D. తాతా రావు మరియు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ సబ్ ఇన్స్పెక్టర్ ను అభినందించారు.
👉హనుమకొండ డిటిసి పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు..‼️
ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ..
భీమారంలో …హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో పక్కా సమాచారంతో ఏసీబీ సోదాలు..
👉 అస్సలు తగ్గేదేలే అంటున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..ఆ మంత్రి చిట్టా అంతా ఫైల్స్ రూపంలో పట్టుకొచ్చిన అనిరుధ్ రెడ్డి..
సీక్రెట్ మీటింగ్ విషయంలోనే ఈ మీటింగ్ సీఎం రేవంత్ పెట్టినా, మీడియాలో ప్రజల్లో రాంగ్ సిగ్నల్ వెళ్తుందని దీనిని సీఎల్పీ మీటింగ్ గా అజెండా ఫిక్స్ చేసారు..
అయితే తాను యుద్ధం చేస్తుంది టాప్ 2 మినిష్టర్ తో అని ఎవరు చెప్పినా తగ్గని అనిరుద్ రెడ్డి..
ఈరోజు మీటింగ్ కు కూడా ఆ మినిష్టర్ చిట్టా అంతా ఫైల్స్ రూపంలో తీసుకొచ్చారని తెలుస్తోంది….
👉మరో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు విద్యార్థులకు వాంతులు, విరోచనాలు..
చికిత్స నిమిత్తం గుడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
👉 హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్..!!!
రంగారెడ్డి – నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం..
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లితండ్రులు..
యువకులను అదుపులోకి తీసుకొని పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నర్సింగి పోలీసులు

