👉 పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో వణుకు? సుప్రీం సూచనలతో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా గతంలోనే మరో ముగ్గురిపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తోంది. ఈ నెల 10న ఈ రెండు పిటిషన్లు కలిపి విచారించనుంది. ఈలోగా ఎమ్మెల్యేల వివరణ తీసుకోవాలని భావించి నోటీసులు జారీచేసింది. మరోవైపు సుప్రీం సూచనలతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా ఎమ్మెల్యేల వివరణ కోరుతూ నోటీసులిచ్చారు. ఇటు అసెంబ్లీ కార్యదర్శి, అటు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న పది మంది వలస ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. తాను అందుబాటులో లేకపోవడం వల్ల రేపు అందరం కలవాలని అనుకున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు. రేపు పది మంది ఎమ్మెల్యేలు ఓ చోట సమావేశమై ఉమ్మడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొందరు.. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు. అయితే బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. మొత్తం పది మందిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు నోటీసులతో తదుపరి నిర్ణయం తీసుకోడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకచోట సమావేశం కావాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. పార్టీ మారిన వారిలో మాజీ మంత్రులు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు) అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల క్రిష్ణమోహన్ (గద్వాల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), తెల్లం వెంకట్రావు భద్రాచలం ఉన్నారు. వీరిలో కడియం కుమార్తె కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో తమ న్యాయపోరాటానికి తిరుగులేని ఆధారాలు లభించాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు ఏం చెబుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.
👉వివేకా కేసులో మరో ట్విస్ట్ ఇచ్చిన దస్తగిరి!😲😲మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తూ సీరియల్ మాదిరిగా ఏళ్ల తరబడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తూ సీరియల్ మాదిరిగా ఏళ్ల తరబడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన చిన్నాన్నను చంపిన హంతకులకు శిక్ష పడేలా చేయడంలో విఫలమయ్యారని వివేకా కూతురు సునీతా రెడ్డి పలుమార్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇక, ఆ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆయనను మాత్రం అరెస్ట్ చేసి విచారణ జరపకపోవడాన్ని కూడా ఆమె విమర్శించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు గురించి సీఎం చంద్రబాబును సునీత కలిశారు. ఆ తర్వాత కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గతంలో సంచలన ఆరోపణలు చేశాడు. కడప సెంట్రల్ జైల్లో తాను ఉన్నప్పుడు చైతన్య తనను కలిసి మభ్యపెట్టారని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్య రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులపై తాజాగా కేసు నమోదైంది. 2023 నవంబర్‌లో జైలులో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన చైతన్య రెడ్డి తనను బెదిరించారని దస్తగిరి ఆరోపించారు. బాధితుల ఒత్తిడి వల్ల అప్రూవర్‌గా మారి అబద్దాలు చెప్పాల్సి వచ్చిందని, అలా చెప్పమని చైతన్య ఒత్తిడి తెచ్చాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు. తాము చెప్పినట్లు చేస్త రూ.20 కోట్లు ఇస్తామని చైతన్య ఆఫర్ ఇచ్చారని ఫిర్యాదు చేశారు. నిందితులకు మద్దతుగా ఉండాలని కొందరు పోలీసులు కూడా తనపై ఒత్తిడి తెచ్చారని దస్తగిరి కంప్లయింట్ ఇచ్చారు. దీంతో, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, సెంట్రల్ జైలు సూపరెండెంట్ ప్రకాష్‌లపై కూడా కేసు నమోదైంది. దస్తగిరిని బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య రెడ్డికి గతంలో సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే, జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లానని, దస్తగిరిని బెదిరించలేదని చైతన్య రెడ్డి చెప్పారు. ఏది ఏమైనా..తాజా పరిణామాలు చూస్తుంటే వివేకా కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
👉”ఈ సారి జగన్ 2.Oని చూడబోతున్నారు. 2.O వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా.
గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టినవారిపై ప్రైవేట్ కేసులు వేస్తా. చట్టం ముందు నిలబెడతాం – మాజీ సిఎం వైఎస్ జగన్*..*”ఎవడు కూడా వైఎస్సార్ సిపి కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు. నన్ను 16 నెలలు జైలులో పెట్టారు, ఏమైంది? బయటకు రాలేదా.. సీఎం అవ్వలేదా అనే ఎదురు ప్రశ్న వేశారు.
👉హాసన్ పర్తి..వరంగల్ అర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బీసీ రాజకీయ యుద్ధ బేరి సభ లో వరంగల్ , నల్లగొండ, ఖమ్మం , పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి కులం మీద తీవ్ర పదజలంతో కించ పరుస్తూ మాట్లాడిన వాఖ్యలు వెనక్కి తీసుకోని బేషరతుగా క్షమాపణ చెప్పాలని హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మండలం లోని ముచ్చేర్ల రెడ్డి సంఘం సభ్యులు పెద్ది ఇంద్ర సేనా రెడ్డి, పెద్ది మహేందర్ రెడ్డి, చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, కంచనకుంట్ల హరి ప్రసాద్ రెడ్డి, కంచన కుంట్ల దేవల్ రెడ్డి, బండ సాయి రెడ్డి, ఓరుగంటి ఇంద్ర సేన రెడ్డి, వీసం శ్రీనివాస్ రెడ్డి, చల్లా పవన్ కుమార్ రెడ్డి, చల్లా కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
👉ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను అరికట్టండి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు…
ధర్మవరం ఫిబ్రవరి 05.. సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బజాజ్, శ్రీరామ్ చిట్, టీవీఎస్ ప్రైవేట్ ఫైనాన్స్ లాంటి కంపెనీల ఆగడాలను అరికట్టాలని కోరుతూ డి.ఎస్.పి హేమంత్ కుమార్ కు వినతి పత్రాన్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూధర్మవరం పట్టణంలో పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్లు కస్టమర్లతో ఇష్టానుసారంగా అవలంబిస్తున్నారు అని,ఒక కంతు పెండింగ్ ఉన్న దాడులు చేయడం, దుర్భాషలాడడం ఇంటి దగ్గరికి వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతున్నది అని తెలిపారు.వారి ఏజెంట్లు ఓ గ్రూప్ ముఠాగా తయారై అమాయకమైన ప్రజల ఇంటి దగ్గరికి వెళ్లి వారి ఆర్థిక ఇబ్బందులు ఆసరాగా చేసుకుని, వారే లోన్ కల్పించి, వడ్డీ మీద వడ్డీ వేసి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు.ఒకటి రెండు కంతులు పెండింగ్ ఉండడంతో ఈ ముఠా సభ్యులంతా కలిసి వారిపై దాడి చేయడం, వారి ఇంట్లో వస్తువులను తీసుకురావడం, ఆడవారిని అసభ్యంగా ప్రవర్తించడం పట్టణంలో చాలా జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే చేనేత పరిశ్రమ పరిస్థితి తీవ్ర సంక్షేమంలో కూరుకుపోవడంతో చేనేత కార్మికులునే టార్గెట్ చేసుకొని ప్రైవేట్ ఫైనాన్స్ వారు ఇష్టానుసారంగా అవలంబిస్తున్నారు అని మండిపడ్డారు. వీరు చేస్తున్న దోపిడీకి చాలామంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడుతోందని బాధని వ్యక్తం చేశారు.చాలా మంది ఏజెంట్లు వారి కస్టమర్ తో కంతు అమౌంట్ కట్టించుకొని ఫైనాన్స్ కంపెనీకి కట్టకుండా, కట్టినట్టుగా వారి కస్టమర్ కి కట్టాము అని రసీదు కూడా ఇవ్వకుండా మభ్యపెట్టి, కంపెనీ నుండి కాల్స్ రాకుండా చేసి కస్టమర్స్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని తెలిపారు. ఇన్ని జరుగుతున్న కూడా ఏజెంట్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని మండిపడ్డారు.ఇప్పటికైనా సరే వారు ఉన్నటువంటి నామ్స్ ను లీగల్ ద్వారా పరిశీలించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు పొలాల లక్ష్మీనారాయణ, జిల్లా గౌరవాధ్యక్షులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
👉 కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు..
నారాయణ్ పేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం బాపూర్లో చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత..
భూసర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు, రైతులు..తమకు తెలియకుండా ముందస్తు నోటీసులివ్వకుండా భూసర్వే చేసి ఎలా హద్దులు పాతుతారని అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు..కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు వచ్చి సర్వే చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డ రైతులు..అధికారులు – స్థానికుల మధ్య తీవ్రవాగ్వాదంతో కొద్దిసేపు నెలకొన్న ఉద్రిక వాతావరణం..చివరకు చేసేది లేక భూసర్వే చేయకుండానే వెనుతిరిగిన అధికారులు….
👉 తోర్రుర్ పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం..మహాబూబాబాద్ :-
వైద్యం వికటించి దాసరోజు సిద్దు (16) అనే యువకుడు మృతి ..జలుబు వస్తుంది అని వస్తే ఇంజెక్షన్ వేసిన వెంటనే వైద్యం వికటించి మృతి..
డెడ్ బాడీతో ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న యువకుడి బంధువులు..డాక్టర్ పరిపోతుండగా పట్టుకొని చితక బాదిన మృతుని బంధువులు..పోలీసులు లే దగ్గర ఉండి డాక్టర్ ను బయటకు ఎలా పంపిస్తారని ఆరోపణ
హాస్పిటల్ కు చేరుకున్న సీఐ, నలుగురు ఎస్సైలు, పదిమంది కానిస్టేబుళ్లతో భారీ బందోబస్తు
👉చోరీకి గురైన 30 లక్షల విలువచేసే…. 392 ఫోన్లు రికవరీ చేసిన కృష్ణాజిల్లా పోలీసులు*
కృష్ణా జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సిసిఎస్ పోలీసులు రికవరీ చేశారు.
పోలీసుల రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఎస్పీ కార్యాలయంలో మీడియాకు చూపించారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఎస్పీ గంగాధర్ రావు చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గంగాధర రావు మాట్లాడుతూ…
ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ఉపయోచించి మొబైల్ ట్రాక్ ద్వారా ఫోన్ లో రికవరీ చేసినట్లు తెలియజేశారు. మొత్తం 30 లక్షలు విలువచేసే ,392 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు.మొబైల్ పోగొట్టుకున్న బాధితులు 9490617573 నంబర్ కి HI అని కానీ HELP అని కానీ మేసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంటే, సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గంగాధర రావు ప్రజలకు తెలియజేశారు.
👉 *డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫీవర్.*
*వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్.*
*జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్…*పవన్‌కు విశ్రాంతి అవసరమన్న వైద్యులు.*
*రేపటి కేబినెట్ భేటీకి పవన్ హాజరుపై సందిగ్ధత.*
👉రేషన్ పంపిణీలో కందిపప్పు మాయం!*
ఏపీలో ‘పేదల పొయ్యిపై పప్పు ఉడుకుతుంది’ అంటూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కింది. జనవరిలో సగం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేసిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్.. ఫిబ్రవరిలో బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసి చేతులెత్తేసింది.కందిపప్పు కావాలని అడుగుతున్న కార్డుదారులకు రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూ వాహనదారులు స్టాకు లేదని చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు నిరాశకు లోనవుతున్నారు.
👉వైద్యం వికటించి గర్భిణీ మృతి..😱😱😱
ప్రకాశం జిల్లా అర్థవీడుమండల కేంద్రమైన స్థానిక ప్రభుత్వ ప్రాధమిక వైద్య శాలలో ఏడు నెలల గర్భిణీ ఐరన్ ఇంజక్షన్ వికటించి మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పాపినేని పల్లె గ్రామానికి చెందిన మినిగా అల్లురమ్మ (43)చికిత్స కోసం అస్పటల్ లో చెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా వైద్యం వికటించటంతో మెరుగైన వెద్యం కోసం కంభం తరలిస్తుండగా మార్గమథ్యంలో మృతి చెందినది. మృతురాలికి ఏడు సంవత్సరాల కూతురు ..తల్లిని కోల్పోయిన చిన్నారిని చూసికన్నీటి పర్యంతమైనారు.
👉 టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం..
18 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించిన అధికారులు..చైర్మన్ BR నాయుడు ఆదేశాలతో మెమో జారీ..అన్యమత కార్యక్రమాల్లో పాల్గొంటున్న18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని.. లేకుంటే VRS ఇచ్చి పంపాలని టీటీడీ బోర్డు తీర్మానం
👉సహస్త్ర పాఠశాల భవనం బిల్డింగ్ పై నుండి కిందికి దూకి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.!*
*ప్రిన్సిపాల్ తిట్టాడని మనస్థాపన చెందిన విద్యార్థి నీరజ్..!..రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ సహాస్త్ర స్కూల్ భవనం పై నుండి అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నీరజ్ అనే విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నీరజ్ మల్లికార్జున కాలనీకి చెందిన మరో విద్యార్థి బాల్కనీలో సాయంత్రం సమయంలో ఏదో మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ ఇరువురిని తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో మనస్థాపానికి గురైన నీరజ్ టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి అక్కడే భవనం పైకి ఎక్కి మొదటి అంతస్తు నుండి దూకాడు. భవనం పై నుండి కింద పడిన అపస్మారక స్థితికి చేరుకున్నాడు అయితే విద్యార్థిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా నీరజ్ అప్పటికే చనిపోయాడు. ప్రస్తుతం సహాస్త్ర పాఠశాల వద్దకు కుటుంబ సభ్యులు, తదితరులు చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు ప్రిన్సిపల్ నిర్వాకం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ..

