👉కుంభమేళాలో తొక్కిసలాటపై హేమా మాలిని షాకింగ్ కామెంట్స్😲😲😲..
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు, పర్యాటకులు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలో… గత నెల 29న కుంభమేళలోని మౌనీ అమావాస్య రోజున తెల్లవారుజామున భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. *ఈ ఘటనలో సుమారు 30 మంది చనిపోగా.. దాదాపు 60 మందివరకూ తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. దీంతో… ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా మరిగణించిన యోగి సర్కార్… దీనిపై జ్యుడీషియల్ కమిటీని నియమించింది. ఈ ఘటనలో కుట్రకోణం ఉందని ఆరోపించింది.. మరోపక్క ఈ తొక్కిసలాట ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా.. కుంభమేళాలో జరుగుతున్న విషయాల గురించి చెబుతున్న సర్కార్.. తొక్కిసలాట ఘటనలో జరిగిన విషయాలను ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికీ ఈ ఘటనలో చనిపోయినవారి సంఖ్య విషయంలో క్లారిటీ లేదని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన అఖిలేష్ యాదవ్… యోగి సర్కార్ ఈ మరణాలను దాచిపెడుతుందని అన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉంటే.. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని.. ఇదే సమయంలో కుంభమేళా బాధ్యతల్ని ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోపక్క.. ఈ ఘటనపై జయాబచ్చన్ స్పందించారు. *ఇందులో భాగంగా… తొక్కిసలాట అనంతరం శవాలను నదిలోకి విసిరేశారంటూ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కుంభమేళా త్రివేణీ సంగమం పూర్తిగా కాలుష్య కూపంగా మారిపోయిందని తెలిపారు. ఈ సమయంలో బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. మరణాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. *అవును… కుంభమేళా ఘటనలో 30 మంది చనిపోవడం స్పందించిన బీజేపీ ఎంపీ హేమామాలిని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని అంటూనే.. ఇది అంత పెద్ద సంఘటన కాదు.. దీన్నీ అతిశయోక్తి చేసి చెబుతున్నారు.. కుంభమేళా ఘనంగా జరుగుతోంది.. చాలా మంది వస్తున్నారు అని తెలిపారు… సమాజ్ వాదీ పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. దీంతో.. హేమామాలిని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఒక్కరు గాయపడినా అది తప్పే అని.. అలాంటిది 30 మంది మరణిస్తే అది అంత పెద్ద విషయం కాదని అనడం ఏమిటని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ తారిఖ్.. హేమా మాలిని కుంభమేళాలో వీఐపీ ట్రీట్ మెంట్ తో పాల్గొన్నారని.. అక్కడ పరిస్థితులు బాగా దిగజారిపోయాయని.. ఇక్కడ పోలీసులు, అధికారులు వీఐపీల కోసమే చూస్తున్నారని.. సామాన్య ప్రజల భద్రతను గాలికి వదిలేశారని.. ఆమె వ్యాఖ్యలు బాధితులను ఎగతాళి చేయడమే అని ఫైర్ అయ్యారు.
👉 ఒంగోలు లో పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లు పంపిణీ చేసిన జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా .
👉డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం..* భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య…*ఏలూరు సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. సదరు వ్యక్తి ఒంటిపై ఏదైనా మెటల్‌కు సంబంధించిన వస్తువులు ఉంటే రేడియేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఎమ్మారై కోసం వచ్చిన వారి ఒంటిపై ఎలాంటి వస్తువులు లేకుండా చూస్తారు డయోగ్నొస్టిక్ సిబ్బంది. కానీ ఏలూరులోని సుస్మితా డయోగ్నొస్టిక్ సెంటర్‌లో మహిళ పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. స్కానింగ్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.***ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్ళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్‌ను అమర్చారు. గత కొన్ని రోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో మహిళ డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు ఎమ్మారై తీయించుకోవాల్సిందిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏలూరులోని సుష్మిత డయాగ్నొస్టిక్ సెంటర్‌కు డాక్టర్ రిఫర్ చేశారు. కానీ ఇక్కడే డియాగ్నస్టిక్ సిబ్బంది చేసి తప్పిదంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఎమ్మారై స్నానింగ్‌కు ముందు మెటల్ డిటెక్టర్‌తో మహిళకు చెక్ చేయకుండానే స్కానింగ్ మిషన్‌లోకి మహిళను పంపించారు ఆస్పత్రి సిబ్బంది. మిషన్‌లోకి వెళ్లిన వెంటనే రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ కొట్టుమిట్టాడింది. చివరకు రేడియేషన్ ఎఫెక్ట్‌తో స్కానింగ్ మిషన్‌లోనే ప్రాణాలు విడిచింది మహిళ.అయితే స్కానింగ్ మిషన్‌లో భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని భర్త కోటేశ్వరరావు గుర్తించాడు. వెంటనే స్కానింగ్‌ను ఆపాలని సిబ్బందిని కోరారు. అయినప్పటికీ సదరు ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. మహిళ స్కానింగ్ మిషన్‌లో కొట్టుమిట్టాతుండగానే స్కానింగ్‌ను కొనసాగించారు. దీంతో రేడియేషన్‌ను తాళలేక మహిళ మరణించింది. ఎమ్మారై స్కానింగ్ చేస్తున్న సమయంలోనే తన భార్య తన కళ్ళ ఎదుటే మృతి చెందిందంటున్న భర్త కోటేశ్వరరావు విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టేలా చేసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షపు ధోరణిపట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నొస్టిక్ సెంటర్ వద్ద భర్త ఆందోళనకు దిగారు. మరోవైపు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో స్కానింగ్ సెంటర్‌లో మహిళ చనిపోయిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
👉బాబు నేషనల్.. లోకేశ్ లోకల్.. : జేసీ సంచలన వ్యాఖ్యలు..* ఆంధ్రప్రదేశ్లోనాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లు పదవిలో కొనసాగరా? ఆయన స్థానంలో మరొకరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే కచ్చితంగా అదే జరుగుతుందని అంటున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి.వయసు, ఆరోగ్యం రీత్యా గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి జేసీ.. అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. తన రాజకీయ అనుభవంతో రాష్ట్ర రాజకీయాలపై అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతారంటూ జేసీ అభిప్రాయపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తోంది. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మనుగా ఉండగా, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే. ఇక వీరి మేనల్లుడు దీపక్ రెడ్డి సీడాప్ చైర్మనుగా వ్యవహరిస్తున్నారు. దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జేసీ కుటుంబం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు దివాకర్ రెడ్డి. కానీ, అప్పుడప్పుడు మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై తన విశ్లేషణలు వినిపిస్తుంటారు.
తాజాగా తన అనుభవంతో చెబుతున్నానని, త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు చోటుచేసుకోబోందని విశ్లేషించారు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానంలో ఆయన కుమారుడు లోకేశ్ సీఎం అవుతారని దివాకర్ రెడ్డి అంచనా వేశారు. తాను ఇలా చెబుతున్నది చంద్రబాబు బలవంతంగా వైదొలగమని కాదని, ఆయన అనుభవం జాతీయ రాజకీయాలకు అవసరమని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు జాతీయ రాజకీయాలు నడిపే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయని జేసీ చెప్పారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందు ఈ మార్పు జరగొచ్చని తాను అంచనా వేస్తున్నట్లు తెలిపారు.ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యానించేందుకు జేసీ నిరాకరించారు. తనకు పవన్ కల్యాణ్ తో అంతగా వ్యక్తిగత సంబంధాలు లేవని, ఆయన రాజకీయ భవిష్యత్ కోసం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని చెప్పారు. కాగా, ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం విషయమై టీడీపీ, జనసేన మధ్య పెద్ద దుమారమే లేచింది. ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని రెండు పార్టీలు కార్యకర్తలకు సూచించగా, మంత్రి టీజీ భరత్ కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ వ్యాఖ్యానించి చంద్రబాబుతో చీవాట్లు తిన్నారు. ఇప్పుడు సీనియర్ నేత దివాకర్ రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. తన సమకాలీకుడైన జీసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
👉నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్యారా నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులో! తీసుకున్నారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డుకు చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
👉 ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలు..ప్రశాంత్ కిషోర్తో మంత్రి నారా లోకేష్….రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ప్రశాంత్ కిషోర్తో లోకేష్ చర్చించినట్లుగా సమాచారం. పార్టీ బలోపేతంపై ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం.
👉ఆ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్..గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను TDP లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో TDP నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి.. ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, TDP స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు.వైజాగ్ లో టీసీఎస్ కార్యకలాపాలు 2నెలల్లో ప్రారంభమవుతాయి.* *దాని శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూ అన్వేషణ జరుగుతోంది..*కాగ్నిజెంట్ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వస్తుంది.**ఏడాదిలో రాష్ట్రంలో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటూ వెళ్తాం.మంత్రి లోకేష్.*
👉వరంగల్ జిల్లా: రాయపర్తి మండల కేంద్రములో గంజాయి పట్టివేత…ఖమ్మం నుండి వరంగల్ వైపుకు వెళ్తున్న క్రమంలో రాయపర్తి లో ఆర్టిసి బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్సై శ్రవణ్ కుమార్ మరియు సిబ్బంది.ఒరిస్సా రాష్టానికి చెందిన ఆ వ్యక్తి నుండి సుమారు 2.5కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొన్న పోలీసులు…వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులు…
👉 గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలపై మేయర్ స్పందన..కార్పొరేషన్‌లో వైసీపీకి మెజార్టీ ఉన్నా..6 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది..స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. నన్ను కూడా పార్టీ మారమని కూటమి నేతలు అడుగుతున్నారు.నేను చివరి వరకు జగన్ వెంటే ఉంటా..గుంటూరు మేయర్ కావటి మనోహర్
👉BJP పార్టీని రెడ్డి సంఘం గా మార్చారంటు యాదవ్ సంఘం ఆరోపించింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సంఘం ఈరోజు తెలంగాణ BJP ఆఫీస్ ముట్టడితో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది .BJP ప్రకటించిన జిల్లాల అద్యక్షులలో ఒక్క యాదవ్ కి కూడా పదవులు ఇవ్వలేదని యాదవ సంఘాలు ఆరోపించాయి ..తెలంగాణలో వున్న 16 % శాతం యాదవులు రానున్న స్తానిక ఎన్నికల్లో తమ ఓటుద్వార BJP కి తగిన బుద్దిచెబుతారని జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ హెచ్చరించారు.
👉ఏలూరు నియోజకవర్గం..ఏలూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడులు…ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారిణి కావ్య ని వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు…15వేలు నగదు స్వాధీనం…అధికారితో పాటు ఆఫీస్ సబార్డినేట్ పుల్లారావు అరెస్ట్…దాడిలో పాల్గొన్న ఏసీబీ డీఎస్పీ…..
👉 *అయిజ పట్టణం లో యువకుడి పై కత్తి తో హత్య యత్నానికి దాడి*
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర నర్సప్ప గుడి పక్కన నివాసం ఉంటున్న,చేనేత కార్మికుడు నేష మాస్ (19) వారి ఇంట్లో కి దూరి గూడు బాషా అనే వ్యక్తి అతి దారుణంగా కత్తి తో పొడిచిచాడు,తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు,హత్యాయత్నానికి గల కారణాలు తెలియల్సింది…..
👉గత నాలుగు రోజులుగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని అన్ని పోలీస్ స్టేషన్ లను విస్తృతంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ *..త్రిపురాంతకం, కురిచేడు,దొనకొండ పోలీసు స్టేషన్ లు మరియు త్రిపురాంతకం సర్కిల్ ఆఫీస్ లను తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ *…పోలీసు స్టేషన్ రికార్డులను పరిశీలించి కీలక కేసులు సమీక్షించిన ఎస్పీ *…సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన, నేర నియంత్రణకు కృషి చెయ్యాలి.*..మహిళలు, చిన్నారులు, వద్ధులపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి*.రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై చర్యలు తీసుకోవాలి*..హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు ప్రాణానికి రక్షణ:జిల్లా ఎస్పీ*
*డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్ సేఫ్టీ పై ప్రజలు/విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా ఎస్పీ…గత నాలుగు రోజులుగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పశ్చిమ ప్రాంతం జిల్లా హెడ్ క్వార్టర్ నుండి సుమారు150 కిలోమీటర్ల దూరంపైగా ఉన్న పలు సర్కిల్ ఆఫీసులు మరియు పోలీస్ స్టేషన్ లు, సబ్ డివిజన్ ఆఫీస్ లను విస్తృతంగా తనిఖీ చేసారు. త్రిపురాంతకం, కురిచేడు,దొనకొండ పోలీసు స్టేషన్ లు మరియు త్రిపురాంతకం సర్కిల్ ఆఫీస్ లను బుధవారం తనిఖీ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్, లాకప్, కంప్యూటర్ గది, రైటర్ గది పరిశీలించి, పాత పోలీస్ క్వార్టర్స్, పోలీస్ శాఖకు సంబంధించిన స్థలాలు, పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను క్షుణంగా తనిఖీ చేసినారు. పోలీసు స్టేషన్ ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నారని…ఇలానే కొనసాగించాలన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పోలీస్ స్టేషన్ లలో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే పిర్యదుదారులకు పరిష్కారం అందించాలని, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు/చిన్నారులపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవాలని, ప్రతి గ్రామంలోనూ సీసీ/డ్రోన్ కెమెరాల ఆవశ్యకత గురించి ప్రతి ఒక్క కానిస్టేబుల్ గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలను మరియు వ్యాపారవేత్తలను ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలను నెలకొల్పడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఏర్పాటు చేసిన ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే పరిష్కారం చేయాలని అక్కడే అధికారులను ఆదేశించారు. ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణ పోలీసుల వల్ల కలుగుతుందని, ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే పోలీసులు స్పందిస్తారనే భావం ప్రజలందరిలో ఉన్నదని, ఆ అభిప్రాయం పెరిగే విధంగా మనమందరం దానిని కొనసాగించవలసిందిగా ఎస్పీ సూచించారు.పోలీసు స్టేషన్ల లోని సిబ్బందితో మాట్లాడి వారి పని తీరు, వారు ఏ ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు, అక్కడ ఏటువంటి పరిస్థితులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు/పిల్లలు సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.ముందుగా త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారు మరియు శ్రీమత్ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవార్ల దేవస్థానములను జిల్లా ఎస్పీ ముందుగా సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న శివరాత్రి పండగ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ వెంట దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, త్రిపురాంతకం సిఐ అస్సాన్, త్రిపురాంతకం ఎస్సై శివబసవరాజు, కురిచేడు ఎస్సై శివ మరియు సిబ్బంది ఉన్నారు.
👉క్లస్టర్ రీ ఆర్గనైజేషన్ పై కసరత్తు*
కంభం మండలంలో క్లస్టర్స్ పునర్నిర్మాణంపై స్థానిక ఎంఈవో కార్యాలయంలో సమాలోచనలు చేశారు ఈ సందర్బంగా బుధవారం ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంఈవో మాల్యాద్రి మాట్లాడుతూ జీఓ 117 రద్దు నేపథ్యంలో పాఠశాలలను శాటిలైట్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరి,హై స్కూల్స్ గా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. విషయాన్ని తల్లిదండ్రులకు,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు వివరించి పాఠశాల వారీగా అభ్యంతరాలను,అంగీకారాలను తీసుకోవాలన్నారు. అనంతరం డొక్కా. సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాల నాణ్యత,నిర్వహణ, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర వినియోగంపై ఆరా తీశారు.పాఠశాలల అభివృద్ధి,విద్యా ప్రణాళికలపై ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో క్లస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గని. వెంకటేశ్వర్లు, పి.ఎన్ కాల్వ జెడ్పి ఉన్నత పాఠశాల హెచ్ఎం శామ్యూల్,రాచర్ల ఎంఈఓ లు కోటేశ్వరరావు, గిరిధర శర్మ తదితరులు పాల్గొన్నారు.
[ప్రతి శనివారం మార్కాపురం లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,నిన్న జరిగిన రథసప్తమి వేడుకలు మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం చేశారని అన్నారు..ముఖ్యంగా వేడుకల్లో వేలాదిమంది ప్రజలు పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది కష్టించి పని చేసి లేకుండా రోడ్లను శుభ్రంగా ఉంచారని రాత్రి 12 గంటల వరకు కష్టపడుతూనే ఉన్నారని వారి శ్రమను అభినందించారు.పోలీస్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చేశారని కొనియాడారు.భవిష్యత్తులో కూడా మార్కాపురం పట్టణంలో ఏ వేడుకలు జరిగిన ఇదేవిధంగా దిగ్విజయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.త్వరలోనే ప్రతి శనివారం మార్కాపురం పట్టణంలో, వివిధ మండల కార్యాలయాలలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఈ ప్రజా దర్బార్లో అధికారులు నాయకులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఏక్కడికిక్కడే పరిష్కరిస్తారని అన్నారు.త్వరలోనే మార్కాపురం పట్టణంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా చేస్తామని దీనికి రెండు మూడు రోజుల్లో టెండర్లు కూడా ఆహ్వానిస్తున్నామని ప్రజలందరూ నిశ్చింతగా ఉండాలని అన్నారు.త్వరలోనే మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పడుతుందని గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు నిన్న తెలియజేశారని త్వరలోనే ప్రత్యేక జిల్లా కూడా సహకారం అవుతుందని అన్నారు.వచ్చే బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కేటాయించాలని అది నాయకులను, అధికారులను కోరుతామని వచ్చే మూడేళ్లలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆయకట్టుకు మీరు అందిస్తామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
*అంగం నారాయణమ్మ మృతికి నివాళులర్పించిన మాజి ఎమ్మెల్యే అన్నా*..మార్కాపురం టౌన్ అంగం నారాయణమ్మ మృతి చెందగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు నారాయణమ్మ పార్ధీవదేహనికి పూలమాల వేసి నివాళులర్పించారు
*బాపట్ల, జిల్లాలో 0 నుండి 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలoదరికి ఆల్బ్oడ జోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశం హల్ లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా చేపట్టవలసిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారు లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు..*
👉ములుగు జిల్లాలో సిడిపిఓ, ధనలక్ష్మి ఆత్మహత్యయత్నం*
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సిడిపిఓగా విధులు నిర్వహి స్తున్న ధనలక్ష్మి ఈరోజు ఉదయం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది, అంగనవాడి కార్యకర్త పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుం దని, కావాలని అంగన్వాడి కార్యకర్త తనపై జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు తనను సస్పెండ్ చేశారని, దీంతో మనస్థాపానికి గురైన తాను ఆత్మహత్య ప్రయ త్నం చేసుకున్నట్టు తెలు స్తుంది,ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది.
👉 తిరుపతి..ఇరువురు దారిదోపిడి దొంగలు అరెస్ట్.
24 గ్రాముల బంగారపు చైను, దోపిడీకి పాల్పడిన 2 ఆటోలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం .గత నెల 12న అలిపిరి- చెర్లోపల్లి మార్గంలోని సైన్స్ సెంటర్ సమీపంలో దారిదోపిడి జరిగిన విషయం తెలిసిందే.తమిళనాడు రాష్ట్రం, వేలూరు కు చెందిన బాధితుడు సురేష్ బాబు వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి, డి.ఎస్.పి శ్రీలత ఆదేశాలతో.. కేసులో పురోగతి సాధించి, నిందితులను అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు. A1 .చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, జంగాలపల్లి కి చెందిన నిందితుడు శివాజీ దామినేడు ప్రాంతంలో నివాసం , A2.చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, జంగాలపల్లి కి చెందిన కిరణ్ చెన్నారెడ్డి కాలనీలో ప్రస్తుత నివాసం. ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ పంపిన వెస్ట్ సీఐ మురళీమోహన్.
👉ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కొండపేటలో ఈరోజు రక్తపింజరి పాము కలకలం సృష్టించింది అది గమనించిన ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియపరచగా ఎఫ్ఆర్ఓ మధు ప్రియాంక ఆదేశాల మేరకు ప్రసాదు శివ కృష్ణ రెస్క్యూటివ్ అక్కడికి చేరుకొని చాకచక్యంగా రక్తపింజరి పాముని పట్టుకొని సురక్షితంగా స్థానిక అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టారు.
👉పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ, ఏ ఆర్. దామోదర్* ప్రకాశం జిల్లా….. పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీఆర్ దామోదర్ సందర్శించారు, తొలుత దోర్నాల ఎస్ఐV. మహేష్ పోలీస్ సిబ్బంది నుండి జిల్లా ఎస్పీ దామోదర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎస్ఐ క్వార్టర్స్ ను శిధిలావస్థకు చేరడంతో తొలగించిన ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. 1977వ సంవత్సరం అప్పటి హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రారంభోత్సవం చేసిన నివాసయోగ్యంగా లేని పోలీస్ క్వార్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి వాటి మరమ్మత్తుల గురించి ఎస్ఐ వి.మహేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లోని పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పలు రికార్డులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఏ ఆర్,ఆర్ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కేంద్రబిందువుగా ఉన్న దోర్నాల రాబోవు రోజుల్లో అభివృద్ధి చెందబోతుందని శ్రీశైల మల్లన్న దర్శనార్థం దేశం నలుమూలల నుండి మహాశివరాత్రికి భక్తులు పోటెత్తి అవకాశం ఉన్నందున రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంగించకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు కూడా శిరస్రాణం (హెల్మెట్) తప్పక ధరించాలన్నారు. తద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలియజేశారు. సైబర్ నీరగాలతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు ఫోన్ల ద్వారా బెదిరిస్తారని మీ అడ్రస్ తో గంజాయి పాములు తదితర వస్తువులు వస్తాయని బెదిరిస్తూ తమకు డబ్బు పంపించాలని డిమాండ్ చేస్తారని ఇలాంటి నేరగాళ్లపైన విచక్షణ కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్ ఇరుకుగా ఉండటంతో ఎస్ఐవీ. మహేష్ చొరవతో మరమ్మత్తులు నిర్వహించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, నూతన రంగులతో ఆధునికరించినందుకుగాను పెద్ద దోర్నాల ఎస్ఐవి మహేష్ ను ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు. కెమెరాకు దోర్నాల పట్టణం ఇప్పటికే సీసీ కెమెరాల వలయంలో ఉందని ఇంకా కొన్నిచోట్ల సీసీ కెమెరాలు అవసరం ఉందని దాతలు సహకరిస్తే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల శాతం తగ్గించేందుకు దోహదపడతాయని తెలియజేశారు. నేరాలు లేని దోర్నాలగా మనం చూడాలి అంటే దాతలు సహకరించి డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు బహూకరించాలని సూచించారు. కెమెరాలు ఉన్నట్లయితే త్వరితగతిన కేసులు చేదించడానికి అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి నాగరాజు, ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, పెద్ద దోర్నాల ఎస్ ఐ వి మహేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,

