👉*సూర్యాపేట జిల్లాలో ఆరుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతుంది..* అసలు విద్యార్థులు ఎటు వెళ్లారా అని ఉపాధ్యాయులు వెతుకుతున్నారు. అసలు విద్యార్థులు వెళ్లిపోవడానికి గల కారణాలపై ఉపాధ్యాయులు ఆరా తీశారు. వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. *కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించడం లేదు.*
రెండు రోజుల క్రితం పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. అయితే పార్టీలో పదిమంది విద్యార్థులు గొడవకు దిగారు. విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించడంతో ఎవరికి చెప్పకుండా పరారయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గరి నుంచి కనిపించకుండా పోయారు. విద్యార్థులు ఎటు వెళ్లారోనని ఉపాధ్యాయులు వెతికారు. ఎంతకు వారి ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు పాఠశాలలో కనిపించడం లేదని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తీవ్రఆందోళనకు గురయ్యారు. ఎక్కడికి వెళ్లారో తెలియక భయాందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కోదాడ రూరల్ పొలీసులకు ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు.
⭐సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, ఐపీఎస్..పతకాలు సాధించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు…కరాటేలో బంగారు పతకం, పవర్ లిఫ్టింగ్‌లో రజత పతకం, బాడీ బిల్డింగ్‌లో రజత పతకం, టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ, ఐపీఎస్, అభినందించారు…ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో తమ విధులను నిర్వర్తించడంతో పాటు రాణించడం ద్వారా పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. కమిషనరేట్ పరిధిలోని అధికారులు మరియు సిబ్బంది రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని అనురాధ ఆకాంక్షించారు.ఇదిలా ఉండగా, కరీంనగర్‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ మరియు స్పోర్ట్స్ మీట్‌లో, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న విష్ణు ప్రసాద్/ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, రాజేష్/ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, రాజేష్/ లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. టెన్నిస్ ఓపెన్ డబుల్స్‌లో రాజేష్/ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పవర్ లిఫ్టింగ్ లో రోహిత్/ ఆర్ఎస్ఐ రజత పతకం గెలుచుకుంది… అదేవిధంగా, కరాటేలో ప్రసాద్/ ఎఆర్ కానిస్టేబుల్ బంగారు పతకం గెలుచుకుంది. బాడీ బిల్డింగ్ లో లక్ష్మణ్/ ఎఆర్ కానిస్టేబుల్ వెండి పతకం గెలుచుకుంది….ఖో ఖో క్రీడలో, ఎఆర్ కానిస్టేబుల్స్ బి. రాకేష్, కె శ్రీకాంత్, షేక్ బాబాతో పాటు సివిల్ కానిస్టేబుల్ డి లింగం కాంస్య పతకాలు గెలుచుకున్నారు.పతకాలు గెలుచుకున్న అధికారులు మరియు సిబ్బందిని అభినందించడానికి ఎఆర్ అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, మరియు రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
⭐*పోలీసుల అదుపులో మహిళ అఘోరి?*
రాజన్న జిల్లా ఫిబ్రవరి 03..వేములవాడ రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తామన్న అఘోరి, తన శపథం నెరవేర్చుకో వడంలో విఫలమైంది, ఆలయం వైపు బయలుదేరిన అఘోరిని, తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో ఈరోజు సాయంత్రం పోలీసులు ఆపివేశారు.తను కారులో నుంచి దిగకపోవడంతో పోలీసులు మహిళా అఘోరి వాహనాన్ని టోయింగ్ వ్యాన్ తో బంధించి హైదరాబాద్ రూట్లో పోలీసులు తరలించారు. దర్గాను కూల్చి వేస్తానని అఘోరి ముందే చెప్పారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ పట్టణానికి నలువైపులా పోలీసులు మోహరించారు. పోలీసులకు తలనొప్పిగా మారిన మహిళా అఘోరీ వ్యవహారం, రోజురోజుకు మితిమీరి పోతుంది, రోజు ఏదో ఒక ఊరికి వెళ్లడం స్థానికులతో గొడవ పడడం గ్రామస్తుల తో వాగ్వాదం పెట్టుకోవడం…రచ్చ రచ్చ చేయడంతో అఘోరి పై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
⭐ కృష్ణాజిల్లా.పామర్రు నియోజకవర్గం..తోట్లవల్లూరు మండలం..చిన్న పులిపాక గ్రామంలో మరో పుష్ప..3. తగ్గేదే లేదంటున్న కలప మాఫియా డాన్..చెట్టు కనబడితే… కొమ్మలు కూడా వదలని కంత్రి గాడు… చెరువు గట్ల మీద ఇరిగేషన్ స్థలాల్లో చెట్లు నరికేస్తే…. అడిగే దిక్కులేదు..సంఘటనా స్థలానికి చేరుకొని ఇరిగేషన్ అధికారులు ఫోటోలు, వీడియోలు ,తీస్తే… ఫోన్ లాక్కోని బెదిరించి మరి వీడియోలు డిలీట్ చేయించాడు.. మీకు దిక్కున చోట చెప్పుకోండి అంటూ వార్నింగ్..రేపు ఉదయం విచారణ చేపట్టి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్న ఇరిగేషన్ అధికారులు..కాటూరు రోడ్లో కడవకల్లు సమీపంలో చెట్లు నరికిన వారిపై ఫిర్యాదులే పరిమితమైన ఇరిగేషన్ అధికారులు… ఎఫ్ఐఆర్ కట్టొద్దంటూ వేడుకోవడంలో అంతర్యం ఏమిటో…?ఈ చిన్న పులిపాక పుష్పా పై ఫిర్యాదు చేసి వాల్టా చట్టం కింద కేసు నమోదు చేయిస్తారా… లేక తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంటారా..?రేపు ఉదయం పూర్తి వివరాలు… వాయిస్ రికార్డు ఆధారంగా..
👉కూటమిలో ఏకపక్ష నిర్ణయాలుండవు: లోకేశ్.. కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని.. చర్చలు, సంప్రదింపుల ద్వారానే నిర్ణయాలు తీసుకుంటామని నారా లోకేశ్ అన్నారు. సంస్కరణలు అమలుచేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇవాళ ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి లోకేశ్ వారికి సూచించారు..
👉 విలేకరి పేరుతో టోపీ.. ఇలాంటి వారితో జాగ్రత్త.. నమస్తే సార్. నా పేరు ఉమామహేశ్వరరావు రిపోర్టర్ సార్…94907 38360 ఈ నెంబర్కు 2000 అమౌంట్ వేయండి మీకు 15000 వేస్తాం వెంటనే అని ఒక న్యూస్ గ్రూప్లో ఓ వ్యక్తి పెడుతున్నాడు. అలా అమౌంట్ వేసిన వెంటనే ఆ గ్రూపు నుండి అమౌంట్ వేసిన వ్యక్తిని రిమూవ్ చేస్తున్నాడు. ఈ సమస్యల జరిగిందని మనం ఆ గ్రూపులో పెట్టడానికి వీలు లేకుండా రిమూవ్ చేస్తున్నాడు. ఇలా ఆ గ్రూపులో ఉన్న వ్యక్తులందరూ 2000 చెప్పున వేస్తే చాలామంది మోసపోతారు. అలా మోసం చేసే వ్యక్తి నెంబర్..94907 38360..ఈ నెంబర్కు అమౌంట్ వేయించుకొని మోసం చేస్తున్నాడు. ఈ నెంబరు గల వ్యక్తి ఎవరికైనా తెలిస్తే తెలియజేయండి. ఏదైనా గ్రూపులో ఉంటే రిమూవ్ చేయండి.
👉తిరుపతి వైస్సార్సీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్ అహ్మద్ ను సమీప బంధువైన కౌశిక్ రెడ్డి, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసూయాదవ్ పై దాడి..*కౌశిక్ రెడ్డి మరియు అహ్మద్, వాసూయాదవ్ తీవ్ర గాయాలు, కూటమి నాయకులపై కంప్లైంట్ తీసుకోని పోలీసులు..*పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అనంతరం వారు అదృశ్యం, కొనసాగుతున్న కిడ్నాప్ ల పర్వం.*వైస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్న కూటమి గుండాలు..*
👉 కులాల కుంపటి: ఢిల్లీ ఎన్నికల వేళ.. బీజేపీకి ‘గోపీ’ చిచ్చు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన సురేష్ గోపి.. గిరిజన మంత్రి త్వ శాఖను కేవలం గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఎంపీలకే కేటాయిస్తుండడాన్ని తప్పుబట్టారు..
బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలవి. గెలుపు గుర్రం ఎక్కడమే లక్ష్యంగా పెట్టుకుని కమల నాథు లు చమటోడుస్తున్న ఎన్నికలివి. తాము ఒకవైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు ఎన్డీయే కూటమి పార్టీల తరఫున ఆయా పార్టీల నేతలతోనూ ప్రచారాన్ని దుమ్మురేపుతున్న తరుణమిది. మంగళవారంతో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. బలమైన ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించి.. ఎట్టిపరిస్థితిలోనూ హస్తనను కైవసం చేసుకునేందుకు కమల నాథులు చేస్తున్న ప్రయత్నాలు ఇవి.. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ తరఫున ప్రచారం చేసిన కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయిన మలయాళ హీరో సురేష్ గోపి.. వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ గ్రాఫ్‌ను మింగేసే ప్రయత్నం చేశారు. కేంద్రంలోని గిరిజన మంత్రిత్వ శాఖ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీ యంగా బీజేపీకి సెగ పెంచాయి. ప్రతిపక్షాల నుంచి భారీ ఎత్తున పార్టీకి, అటు ఎంపీకి కూడా సెగ తగులు తోంది. ఆయనను రాజీనామా చేయించాలని కేరళకు చెందిన విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన సురేష్ గోపి.. గిరిజన మంత్రి త్వ శాఖను కేవలం గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఎంపీలకే కేటాయిస్తుండడాన్ని తప్పుబట్టారు. అగ్రవర్ణాలకు చెందిన బ్రాహ్మణ, లేదా నాయుడు సామాజిక వర్గాలకు ఈ శాఖను కేటాయించి.. మంత్రిని చేయడం ద్వారా.. గిరిజనులకు న్యా యం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు గిరిజనులకు మంత్రులుగా ఉన్న వారు ఏమీ చేయలేదని.. అందుకే గిరిజనులు వెనుకబడిపోయారన్న అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. అయితే.. గోపి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా.. కీలకమైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఉద్దే శించి ఆయన వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా రాజకీయాలు రాజుకున్నాయి. బీజేపీ మనసులో మాటనే గోపి చెప్పారంటూ. కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు. మరోవైపు కేరళకు చెందిన మరికొందరు సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు.. ఇది గిరిజనులను అవమానించడమేనని.. ఆయనను తక్షణం పదవి నుంచి దించేయాలని డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. మరి ఈ వివాదంపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
👉స్నేహ చికెన్ జలదోపిడీని అడ్డుకోండి..*కానాయపల్లి శంకరసముద్రం నుంచి యదేచ్చగా జలదోపిడి… *జలదోపిడీతో తీవ్రంగా నష్టపోతున్న కుడికాలువ ఆయకట్టు రైతాంగం *పరిశ్రమను మూసివేసి, సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి*.. దేవరకద్ర ఎమ్మెల్యేకు రాచాల వినతి*కొత్తకోట, వనపర్తి జిల్లా…*కొత్తకోట మండలం కానాయపల్లి శంకరసముద్రం రిజర్వాయర్ నుంచి అక్రమంగా జలదోపిడీ చేస్తున్న స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకుని, కుడి కాలువ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.ఈమేరకు సోమవారం కొత్తకోటలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా రాచాల మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులను విస్మరించి అడ్డాకుల స్నేహ కోళ్ల పరిశ్రమ దొంగతనంగా నీళ్లు తీసుకెళ్తుందని, దీంతో కుడి కాలువ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే జోక్యం చేసుకుని జలదోపిడీని అడ్డుకోవాలని ఎమ్మెల్యేని కోరారు.కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని కొత్తకోట పెద్దమందడి అడ్డాకుల కౌకుంట్ల మండలాల చెందిన 18 గ్రామాలలోని 8 వేల ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని, ఆయకట్టుకు నీరు అందించడం కోసం మోటార్లతో నీళ్లు ఎత్తిపోస్తున్న కూడా ఒకే పంట పండించుకుంటున్నారని, ఈ పంట పండించుకోవడానికి రైతులు ప్రతి రోజు శివరాత్రి జాగరణ చేయక తప్పడం లేదన్నారు.రైతులకు కష్టాలు తప్పాలంటే గ్రావెల్ ద్వారా కుడికాలువకు సాగునీరు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కొరారు.ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే స్నేహ కంపెనీ అక్రమాలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుని, రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వజగౌని వెంకటన్న గౌడ్, భీమన్న నాయుడు, అంజన్న యాదవ్, బత్తుల జితేందర్ గౌడ్, గుర్రం రాఘవేందర్, దేవర శివ, మ్యాదరి రాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
👉ఆదర్శ ఉపాధ్యాయుడు ”రసూల్ బేగ్” 
ఇటీవల పదవి విరమణ పొందిన రసూల్ బేగ్ఉపాధ్యాయులకు ఆదర్శ ప్రాయుడని పలువురు ఉపాధ్యాయులు ప్రశంసించారు. ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహించిన గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన విందు కార్యక్రమంలో తనకు సహకరించిన తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ రసూల్ బేగ్ ను ప్రశంసలతో ముంచెత్తారు . ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఆయన ఆ అవార్డుకు వన్నెతెచ్చారని కొనియాడారు.క్రమశిక్షణకు మారుపేరుగా, వృత్తి పట్ల అంకిత భావానికి నిదర్శనంగా పలువురిచే ప్రశంసలు అందుకున్నారన్నారు .అంతేకాక బోధన పద్ధతిలో వినూత్న విధానాలు అనుసరిస్తూ ఆయన అనేక మంది అధికారులతో సైతం ప్రశంసలందుకున్నారని, ఆయన అనుసరించిన బోధనా పద్ధతులను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అనుసరిస్తే విద్యార్థులకు ఎంతో ఉత్తమ బోధనను అందించగలమని అన్నారు .కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వరికుంట్ల వెంకటేశ్వర్లు కేశవ పాండురంగారావు, సునీల్, జలీల్ ,హబీబ్ ఖాన్, సయేర బేగం,రషీద్ ఖాన్,వేణుగోపాల చారి భాస్కర్ హరి గౌస్ ఖాన్ ఎస్ఎండి రఫీ,హైటెక్ హోటల్ ప్రోప్రైటర్ మున్వర్ అలీ బేగ్, మున్నా ఫైనాన్స్ ప్రోప్రైటర్ బాషా లాల్, డాక్టర్ అక్రమ్ బేగ్, టిడిపి నాయకులు అస్లాం బేగ్ తదితరులు పాల్గొన్నారు.
👉*గుండెపోటుతో జన్నారం ఎస్ఐ మృతి.*మంచిర్యాల జిల్లా : జన్నారం పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందారు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం ఏంద గ్రామం…
👉*జగిత్యాల జిల్లా లో విషాదం…*
గొల్లపల్లి మం. చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి.
గతంలో వెల్గటూర్, కోరుట్ల పోలీసు స్టేషన్ లోఎస్ ఐ గా విధులు నిర్వహించిన శ్వేత..
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…. స్టేట్ ఇంచార్జ్ రెహమాన్

