👉 *పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు!..హైదరాబాద్: ఫిబ్రవరి 03
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది..బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.
పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణతో పాటు రెండో పిటిషన్‌పై విచారణ చేస్తామని తాజా పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
👉 లోక్ సభ తొక్కిసలాట ఘటనపై నిరసనలు.. స్పీకర్ ఆగ్రహం..లోక్ సభ కుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను పార్లమెంట్లో విపక్షాలు లేవనెత్తాయి. ఉభయ సభలు ప్రారంభం అయిన వెంటనే పెద్దఎత్తున నిరనసలు చేపట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను లోక్ సభ స్పీకర్ తీవ్రంగా ఖండించారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.
👉మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: మంత్రి పొన్నం..తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల్లోని BC నాయకులు, మేధావులు, కాంగ్రెస్ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేను రేపు కేబినెట్, ఆ తర్వాత అసెంబ్లీలో ఉంచుతామన్నారు. KCR కుటుంబంలో కవిత మాత్రమే సర్వేలో తమ కుటుంబ వివరాలు ఇచ్చారని తెలిపారు.
👉మాజీ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రామ్మోహన్ సవాల్
మాజీ మంత్రి కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ సవాల్ విసిరారు. కేటీఆర్, కేసీఆర్కు దమ్ముంటే శివారెడ్డిపల్లి రావాలని అన్నారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత మాఫీ అయ్యిందో చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ చేశారు. పరిగి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల రుణమాఫీ అయ్యిందని అన్నారు. సోషల్మీడియాలో ఎంత బురదచల్లినా జనం నమ్మరని.. కేటీఆర్, హరీష్, కవిత లాటరీ బ్యాచ్ అని MLA రామ్మోహన్ ఎద్దేవా చేశారు.
👉పాకాలలో 13 కేజీల గంజాయి స్వాధీనం*
పాకాల రైల్వే స్టేషన్’లో 13 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సిఐ సుదర్శన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరుకు చెందిన విష్ణు మోహన్ రెడ్డి, తమిళనాడుకు చెందిన పాండియన్లు ఇద్దరు కలిసి విజయవాడ నుంచి మదురైకి గంజాయి తరలిస్తున్నారని వచ్చిన సమాచారంతో అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 13 కేజీల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
👉నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్ గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు గారు అన్నారు..
👉కోర్టులోనే తిట్టుకున్న మోహన్ బాబు, మనోజ్..గొడవలకు సంబంధించి రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరైన మంచు మోహన్ బాబు, మనోజ్… మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్ మోహన్ బాబు పరస్పరం దూషించుకున్నట్లు సమాచారం
👉పులివెందులకు ఉప ఎన్నిక: డిప్యూటీ స్పీకర్ రఘురామ.*..వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.*ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజులపాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని రఘురామ అన్నారు.*జగన్ అసెంబ్లీకి రాకపోయిన అతనిపై అనర్హత వేటుతో పాటు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని అన్నారు.* జగన్ కి అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలను చెప్పుకోవాలని సూచించారు.*
👉తిరుపతి. ఇరువురు దారిదోపిడి దొంగలు అరెస్ట్.
24 గ్రాముల బంగారపు చైను, దోపిడీకి పాల్పడిన 2 ఆటోలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం..గత నెల 12న అలిపిరి- చెర్లోపల్లి మార్గంలోని సైన్స్ సెంటర్ సమీపంలో దారిదోపిడి జరిగిన విషయం తెలిసిందే..తమిళనాడు రాష్ట్రం, వేలూరు కు చెందిన బాధితుడు సురేష్ బాబు వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు.
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి, డి.ఎస్.పి శ్రీలత ఆదేశాలతో.. కేసులో పురోగతి సాధించి, నిందితులను అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు. A1 .చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, జంగాలపల్లి కి చెందిన నిందితుడు శివాజీ దామినేడు ప్రాంతంలో నివాసం , A2.చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, జంగాలపల్లి కి చెందిన కిరణ్ చెన్నారెడ్డి కాలనీలో ప్రస్తుత నివాసం.ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ పంపిన వెస్ట్ సీఐ మురళీమోహన్.
👉క్రీడల్లో నేర్చుకునే పోరాట స్ఫూర్తి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఉపయోగపడుతుంది..*పోలీసు క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి: సీపీ సుధీర్ బాబు *
ఇటీవల కరీంనగర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ మూడవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 లో రాచకొండ కమీషనరేట్ తరపున పాల్గొని పలు విభాగాల్లో బహుమతులు గెలుచుకున్న రాచకొండ అధికారులు మరియు సిబ్బందికి ఈ రోజు నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
👉కాంగ్రెస్‌లో కుంపటి.. ఓ మంత్రి వసూళ్ల దందాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ప్రధానంగా అసంతృప్త ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలిసింది.10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సమాచారం..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్రా అనుమానాలు…సొంత ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి..కొందరు మంత్రుల వ్యవహారశైలి పైనా ఆగ్రహం …పోరాటంలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని నిర్ణయం..ఎమ్మెల్యేల భేటీ వెనుక ఓ కీలక నేత ప్రోద్బలం?
తెలంగాణలో పలువురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పక్కా పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగర శివారులోని ఒక యువ ఎమ్మెల్యేకు చెందిన ఫాంహౌస్‌లో జరిగిన సీక్రెట్ డిన్నర్‌లో వీరంతా కలిసినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీ వెనుక కాంగ్రెస్ పార్టీకే చెందిన ఒక కీలక నేత ప్రోద్బలం ఉండి ఉండవచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ప్రధానంగా అసంతృప్త ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని, ఎమ్మెల్యేల వ్యాపార లావాదేవీల్లోనూ ముఖ్యనేత సోదరులతోపాటు కీలక మంత్రులు వాటాల కోసం వేధిస్తున్నారని, కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 14% కమీషన్లు లేకుండా ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదనే అంశాలు ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా చర్చించినట్టు సమాచారం. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వారితో సాన్నిహిత్యం ఉన్న ఎమ్మెల్యేలు వీలును బట్టి వారిని కలుస్తూ అభిప్రాయాలు తీసుకోవాలని, కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
40% వాటాలు,14% కమీషన్లుఇటీవల ప్రైమ్ ప్రాంతంలో ఉన్న భూ వివాదం కేసు విషయంలో రికార్డుల పరమైన పరిష్కారాల కోసం నంబర్-2గా చెప్పుకుంటున్న దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రిని కలవగా, సద రు మంత్రి 40% వాటా అడిగారని ఒక ఎమ్మెల్యే వాపోయినట్టు తెలిసింది. తాను ఇవ్వడానికి నిరాకరించడంతో ఇంత భూమిని నువ్వొక్కనివే ఏం చేసుకుంటావంటూ ఎదురు ప్రశ్నించారని, ఆ మంత్రి తమ వ్యాపార లావాదేవీల్లో కూడా 40% వాటా అడుగుతున్నారనే విషయాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా ఎంతోకొంత చూసి ఇవ్వుపోరాదా? అని చెప్పారంటూ ఆ ఎమ్మె ల్యే తన
👉జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో రుజువైంది : కేటీఆర్
జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కులను, జాతి ప్రయోజనాలను కాపాడగలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాట ఈ రోజు మరోసారి గుర్తుకు వస్తుందన్నారు. లోక్ సభలో తెలంగాణ పార్టీ అయినా బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, తెలంగాణ నుంచి డీల్లీకి మూటలు మోసేందుకేనని ఈ రోజు తెలిపోయిందన్నారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్- చోటే భాయ్ అనుబందంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందన్నారు.
తెలంగాణ నుంచి మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా.. వారితో కూడా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే అన్నారు. కేవలం ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప.. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌కు తెలంగాణకు రావాల్సిన వాటా గురించి పోరాడిన దాఖలు లేకపోవడం వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు నిధులు తేస్తామంటూ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ గెలిచినా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు ఒక్క నయా పైసా తీసుకురాలేకపోయారన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తుంటే.. తెలంగాణ బీజేపీ ఎంపీలు, నిస్సహాయ మంత్రులు చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
👉ఎప్పటి మాదిరే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి *బండి రమేష్* విమర్శించారు. మోడీ దేశానికి ప్రధానమంత్రి లా కాకుండా ఇంకా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భావిస్తున్నారని రమేష్ గారు ధ్వజమెత్తారు ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రతిసారి మొండి చేయి చూపటం మోడీకి అలవాటుగా మారిందన్నారు. మోడీ చేతుల్లో కీలు బొమ్మగా మారిన నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కనీస స్థాయిలో కూడా నిధులు విదల్చలేదని విమర్శించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేసి పోయిందని అలాంటి పరిస్థితుల్లో మోడీ రాష్ట్రానికి పెద్దన్నలా ఉండి నిధులు కేటాయించి ఆదుకోవాల్సింది పోయి పెద్ద మొండి చేయి చూపించారని రమేష్ గారు తీవ్రంగా విమర్శించారు. భవిష్యత్తులోనైనా మోడీ ఇలాంటి పక్షపాత ధోరణిని విడనాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఈ బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుందని ఆశలన్నీ అడియాసల య్యాయన్నారు. ఏ ఒక్క శాఖకు కనీస స్థాయిలో నిధులు కేటాయింపు జరగలేదని పేర్కొన్నారు.
👉*అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డి..రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలందరికి రూ.12,000 వేశానని అంటున్నాడు.. ఎవరికైనా పడ్డాయా? కేసీఆర్ రూ.28 వేల కోట్లతో రుణమాఫీ చేశాడని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి.. మళ్లీ నిన్న మాట మార్చి రూ.12 వేల కోట్లే చేశాడని పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు – కేటీఆర్…
చావుకి ఎదురెళ్లి తెలంగాణను సాధించింది కేసీఆర్ * గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చూసి దేశమే ఆశ్చర్యపోయింది.. * రైతు బంధు పథకం దేశంలోనే పెద్ద సంస్కరణ..* కేసీఆర్ ని విమర్శించే స్థాయి, అర్హత రేవంత్ కి లేదు..* ప్రజలు ప్రతీ కాంగ్రెస్ నాయకుడిని గల్లా పట్టుకుని నిలదీయండి… ఆనాడు నాట్లు వేసే సమయానికే.. ‘టింగు టింగు’మని రైతు బంధు పడుతుండే అని విమర్శించారు…
👉*విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ *
*విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి… డ్రగ్స్ ని దరి చేరనియ్యరాదు…*ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ఉన్నత లక్ష్యాలు సాధించేలా తమ వంతు కృషి చెయ్యాలి..
అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ అండ్ కాలేజీ (బాయ్స్) ప్రత్యేక సమావేశానికి ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు హాజరయ్యారు. పదవ తరగతి మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కొరకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
ఆయన మాట్లాడుతూ చదువుల్లో క్రమశిక్షణ ఎంత అవసరమని క్రమశిక్షణ లేకపోతే బంగారు భవిష్యత్తుకు బాటలు ఉండవని, విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని,డ్రగ్స్ ని వారి దరి చేరనియ్యరాదని, ఒకసారి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలు పెంచుకొని శారీరక మరియు మానసిక దృఢత్వాన్ని అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించుటకు అవిశ్రాంతముగా కృషి చేయాలని విద్యార్థుల్లో స్ఫూర్తి రగిలించారు.
కార్యక్రమంలో ఆయన వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంభం సిఐ మల్లికార్జున రావు, అర్ధవీడు ఎస్సై సుదర్శన్,కంభం ఎస్ఐ నరసింహారావు, బీవీ పేట ఎస్ఐ రవీంద్రబాబు, కాలేజీ ప్రిన్సిపాల్ బండి బాలరామిరెడ్డి మరియు సిబ్బంది ఉన్నారు.

