👉దారుణం.. కొడుకుని కొట్టి గాయాలపై కారం చల్లిన మారు తండ్రి..ఏలూరు – జంగారెడ్డిగూడెంలో ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన మారు తండ్రి
ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన మారు తండ్రి కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు రాహుల్
👉ప్రకాశం …-పించన్ డబ్బులతో పరారీ..మార్కాపురం మున్సిపల్ వార్డు కార్యదర్శి (ఎమినిటీ ) పాలడుగు వెంకటేశ్వర్లు పింఛన్ డబ్బుతో పరార్..నిన్న పింఛన్ డబ్బులు 2.60 లక్షలు తీసుకునీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన (ఎమినిటీ ) వెంకటేశ్వర్లు..పెన్షన్ లబ్ధిదారుల నుండి అధికారులకు సమాచారం రావడంతో మార్కాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మున్సిపల్ కమిషనర్..
👉తిరుపతిలో భారీ చోరీ..దాదాపు 1.48 కిలో బంగారు అపహరణ ..తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాలో ఘటన..వరుసగా4ఇళ్లలో చేతివాటం ప్రదర్శించిన చోరి గ్యాంగ్.సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి, ఆపై విల్లా ఇళ్లలోకి ప్రవేశించిన చోరులు..80,81,82,83 వరుస ఇండ్లను బద్దలు కొట్టిన దొంగలు. .81 లో ….మేఘనాధ రెడ్డి ఇంటిలో పైన నిద్రిస్తుండగా కింద అంతస్తు లో1 కేజీ బంగారం ఆపహరణ..82లో… దొర ప్లాస్టిక్ కేశవులనాయుడు అల్లుడు ఇంటిలో 48 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ..80,83 … ఇండ్లను గెస్ట్ హౌస్ గా వినియోగించుకుంటున్న ఇండ్ల యజమానులు. సంఘటన స్థలానికి క్రైమ్ పోలీసులు చేరుకొని విచారణ. క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరణ.. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న క్రైమ్ పోలీసులు.
👉కడప జిల్లా*.యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ డీఎస్పీ గా భవాని.మూడు వారాలపాటు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందనున్నారు. గత ఏడాది గ్రూప్ 2 పరీక్షలలో భవాని డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఆర్టిపీపీ కి చెందిన భవాని గతంలో చాపాడు మండలంలోని డిప్యూటీ తహసిల్దారుగా విధులు నిర్వహిస్తూ డిఎస్పీగా ఎంపిక అయ్యారు.
*ముద్రగడ నివాసానికి వచ్చి కారునుధ్వంసం చేసిన జనసేన కార్యకర్త* కిర్లంపూడి ఫాస్ట్ న్యూస్ ఏపీలో కూటమి పాలనలో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార సిపి నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.ఆదివారం ఉదయం తాజాగా వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి ట్రాక్టర్తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు.
వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీ ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద జనసేన కార్యకర్త హల్చల్ చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. అనంతరం, అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు. కాగా ఈ సంఘటన పట్ల పలువురు ఖండించారు.
👉మోడీ ప్రభుత్వ బడ్జెట్ ఎప్పటివలే కార్పొరేట్ అనుకూలమైనది! ..ఇది ప్రధానంగా రైతు, కార్మిక, కూలీ శ్రామిక వర్గాలకు పచ్చి వ్యతిరేకమైనది! ..*సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ..మోడీ ప్రభుత్వ బడ్జెట్ ఎప్పటివలే కార్పొరేట్ అనుకూలమైనదని .. ప్రధానంగా రైతు, కార్మిక, కూలీ శ్రామిక వర్గాలకు పచ్చి వ్యతిరేకమైనదనీ *సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పి ప్రసాద్ చిట్టి పార్టీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ఆరోపించారు…విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు అంకితం చేసే బడ్జెట్గా చెప్పొచ్చు!..వాస్తవ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే సంక్షేమరంగ కేటాయింపులకు పది నుండి పదిహేను శాతం సబ్సిడీలని పెంచాలి. కానీ అలా పెంచకపోగా కరెన్సీ రూపంలో కొన్నింటికి కోత పెట్టింది. ఉదాహరణకు ఆహార సబ్సిడీ రూ. 2.05 లక్షల కోట్లకు కనీసం పది శాతం పెంచితే నిరుటి వాస్తవ కేటాయింపుకి సమానం అవుతుంది. కానీ 2.03కి తగ్గించింది. ఎరువుల సబ్సిడీని రూ. 1.64 లక్షల కోట్ల నుండి 1.67కి సర్దుబాటు చేసి నికర కోత పెట్టింది. ఇందన సబ్సిడీని కూడా నికర కోత పెట్టింది. ఈ మూడు రంగాలు అశేష శ్రామికజన జీవితాలతో ముడి పడినవే. ఇంకా గ్రామీణాభివృద్ధి కోసం సబ్సిడీ కేటాయింపు రూ.2.65 లక్షల కోట్లను కరెన్సీ రూపంలో దాదాపు యధావిధిగా రూ.2.66 లక్షల కోట్ల వద్దే ఉంచింది. అంటే నికర ద్రవ్యోల్బణం ప్రకారం పది శాతం పైనే కోత పెట్టింది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు రూ. 1.51 లక్షల కోట్ల నుండి 1.71 లక్షల కోట్లకు పెంచినా, ఆ పేరిట ఆ అనుబంధ రంగాల్లో కార్పొరేట్లకి సబ్సిడీగా మారుతుంది. ఇవన్నీ రైతంగానికి హాని కలిగించే విధానాలే కారణమని ఆరోపించారు.
లేబర్ కోడ్లు అమలు చేయొద్దన్న కార్మిక సంఘాల విజ్ఞప్తులకు అవకాశం ఇవ్వలేదు. ఉపాధి అవకాశాలు లేవు. నిరుద్యోగ సమస్య పరిష్కార అవకాశం లేదు. విశాఖ ఉక్కుపై స్పందన లేదు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్ల క్రమబద్దీకరణ చర్యలు లేవు. కోటి మందికి పైగా స్కీం ఉద్యోగ, శ్రామిక వర్గానికి ఉపశమనం లేదు. ఆదివాసీ ప్రజల సమస్యలపై చర్యలు లేవు. ఇంకా వివిధ బాధిత వర్గాల ప్రజల సమస్యలపై స్పందన లేదన్నారు. మధ్యతరగతి ప్రజలకి ఆదాయం పన్ను రాయితీ రూపంలో ఉపశమన చర్య చేపట్టింది. అది ఉద్యోగుల్లో తక్కువ శాతం మందికి వర్తించే ఏటా ఏడు లక్షల పైగా ఆదాయం గడించే వారికి కల్పించింది. నెలకు రూ.60 వేలు లోవు గడించే వారికి వర్తించదు. ఇది కూడా ఇటీవల క్రమంగా బీజేపీ మధ్యతరగతి ప్రజల్లో కోల్పోతున్న పట్టు, ఢిల్లీ ఎన్నికల్లో అవసరం కల్సి మధ్యతరగతిలో ఈ కొద్ది శాతం మందికి వల విసిరింది. ఇది షుగర్ కోటింగ్ విషగుళికను మధ్యతరగతి ప్రజలతో మింగించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పై రాజకీయ మనుగడ ఆధారపడి వున్న మోడీ ప్రభుత్వం ఏ.పి.కి మొండిచేయి చూపింది. గత హామీల ఊసు లేదు. ఇప్పుడు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వలేదు. కానీ బీహార్కి వరాల జల్లు కురిపించింది. ఇది చంద్రబాబు ముందస్తు కుమ్మక్కు ఉందని సూచిస్తున్నది. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విదేశీ, స్వదేశీ కార్పొరేట్ అనుకూల, సర్వ శ్రామిక ప్రజలకు వ్యతిరేక బడ్జెట్ని వ్యతిరేకించాలని అన్ని వర్గాల ప్రజలకు మా సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదన్నారు.
👉సకాలంలో ఉద్యోగులకు DA లు, PRC లు ఇవ్వనప్పుడు టాక్స్ లు ఎందుకు కట్టాలి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CPS ఎంప్లాయిస్ అసోసియేషన్*చీర్ల కిరణ్*
దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యయులంతా ప్రజలకు సేవ చేస్తున్న వాళ్లే ప్రభుత్వ పధకాలు, చట్టాలు అమలు చేయడానికి కీలక పాత్ర పోషిస్తున్న వారే, అలాంటి ఉద్యోగికి జీతం నిత్యావసర వస్తువులు, ఇంటి అద్దెలు, పిల్లలు స్కూల్ ఫీజ్ లు అన్ని PRC, DA ల ఆధారంగా ఇస్తున్నవే అయినప్పుడు ప్రశత్యేకించి ఉద్యోగులు ఆదాయపు పన్ను ఎందుకు కట్టాలని ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ ప్రశ్నించారు. సంవత్సరంలో 12 నెలలు జీతం ఇస్తున్న ఆదాయపు పన్ను కారణంగా ఒక నెల జీతం టాక్స్ రూపంలో పోతుందని అంటే 11 నెలలు జీతం ఇస్తున్నట్టేనని, అందులోను జీతాలు PRC, DA తో పాటు అన్ని ఆర్ధిక విషయాల్లో ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తున్నారని, ప్రస్తుతం ఉద్యోగుల జీవనం అత్యంత ఇబ్బందిగా ఉందని తెలిపారు. ప్రతి నెల జీతంలో ప్రొఫెషనల్ టాక్స్ వృత్తి పన్ను , కొన్న వస్తువులు పై టాక్స్, ఆదాయపు పన్ను , రిటైరు అయ్యాక వచ్చే డబ్బులో కూడా టాక్స్ కట్టించుకుంటున్నారన్నారు. ఇది ఒక రకమైన దోపిడీ కాదా అని, నాలుగు వైపులా పన్ను కట్టేది కేవలం ఉద్యోగులే మాత్రమే అని, పోనీ సకాలంలో ఏమైనా PRC, DA, PF లు వస్తున్నాయా అని ప్రశ్నించారు. చివరకి జీతాలు కోసం ఎదురు చూసే దుస్థితికి తెచ్చారని వాపోయారు. ఇప్పుడు టాక్స్ ల పేరుతో ఈ దోపిడీ ఏంటని, మధ్య తరగతి ఉద్యోగుల జీవితాలు అత్యంత ఆందోళనలో ఉన్నాయని, తక్షణమే ఈ బడ్జెట్ సంవత్సరం నుండి ఉద్యోగ, ఉపాధ్యాయులుకు ఆదాయపు పన్ను నుండి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాని APCPSEA రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు.
👉రైల్వే లిఫ్టులో చిక్కుకున్న ప్రయాణికులు*
ప్రకాశం జిల్లా :ఏపీ లోని ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్ లిఫ్టులో ప్రయాణికులు చిక్కుకున్నారు. ఒక ప్లాట్ఫారం నుంచి మారేందుకు 14 మంది లిఫ్టు ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్టు ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులో ఇబ్బందులు పడ్డారు. టెక్నీషియన్లు లేకపోవడంతో రైల్వే పోలీసులు తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు.
👉వర్సీటీ యాజమాన్యం పోలీస్ విచారణకు హాజరు కావాలని నోటిసులు*.. తాడేపల్లి పరిదిలోని ఓ ప్రముఖ యూనివర్సిటీ తన స్థలంను కబ్జా చేసిందని విజయవాడకు చెందిన వ్యక్తి పిర్యాదు*..దీనిపై 2020 లో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు*.. న్యాయం చేయాలని భాదితుడు పోరాటం*… నిన్న తాడేపల్లి పోలీసులు సదరు వర్సీటీ వర్గాలకు నోటిసులు జారీ* నేడు తాడేపల్లి పోలీసుల ముందు సాక్షాలతో హాజరు కావాలని నోటిసులు జారీ చేశారు* ..
👉నల్గొండలో ఏకంగా సీఐనే బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకర్ల ముఠా😱😱😱
నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠా ఒకటి పోలీసులను టార్గెట్ చేసింది. అక్రమాలు బయటపెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. వీరి డిమాండ్లకు ఓ సీఐ తలొగ్గడం గమనార్హం. రూ.5 లక్షలు ఇవ్వాలని సదరు ముఠా డిమాండ్ చేయగా.. వారి ఆగడాలు తట్టుకోలేక సీఐ తన మిత్రుడి ద్వారా రూ 1.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ ముఠా బెదిరింపులు ఆగలేదు. తాము డిమాండ్ చేసిన సొమ్ములో మిగతా రూ.4 లక్షలు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించింది. ఈ ముఠా ఆగడాలు భరించలేక సదరు సీఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఆ ముఠాలోని ఒక నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
👉 బాబా రాందేవ్ పై అరెస్ట్ వారెంట్..పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై కూడా..తప్పుడు ప్రకటనల కేసులో కోర్టు ఆదేశాలు.. ఈ నెల 15న మరోసారి కేసు విచారించనున్న కేరళ కోర్టు !!!
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పై కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బాబా రాందేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పైనా వారెంట్ ఇష్యూ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కేరళ డ్రగ్ ఇన్ స్పెక్టర్ వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పాలక్కాడ్ కోర్టు బాబా రాందేవ్ కు, ఆచార్య బాలకృష్ణకు గతంలో నోటీసులు పంపించింది.
ఈ నెల 1న విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. అయితే, శనివారం జరిగిన విచారణకు వారిద్దరూ హాజరుకాలేదు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 15న విచారిస్తామని చెబుతూ వాయిదా వేసింది. కాగా, పతంజలి అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీకి చెందిన పది ఉత్పత్తులపై ప్రభుత్వం గతంలోనే వేటు వేసింది. ఆ ఉత్పత్తులకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో విడుదల చేసిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంటూ వాటి తయారీ లైసెన్స్ ను రద్దు చేసింది.
*కుంభమేళా వెళ్లే ప్రయాణికులను రోడ్డు మీద వదిలేసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డ్రైవర్..మెహిదీపట్నంలో బస్ ఎక్కించుకొని మేడ్చల్‌లో బస్సు చెడిపోయిందని పక్కకు ఆపి పారిపోయిన బస్ డ్రైవర్ ..దీంతో మ.3 గంటల నుంచి రోడ్డు మీదనే ప్రయాణికులు పడిగాపులులీసులకు సమాచారం ఇచ్చినా పరిష్కారం కాని సమస్య ..న్యూ ధనుంజయ ట్రావెల్స్ పై కఠినంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన ప్రయాణికులు
👉దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో సీబీఐ మెరుపు దాడులు..ఏకకాలంలో 20 విద్యాసంస్థల్లో సీబీఐ సోదాలు..గుంటూరులోని కేఎల్ వర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు..NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణ..మొత్తం 14 మందిపై ఎఫ్‌ఐఆర్, 10 మంది అరెస్ట్..NAAC ఇన్‌స్పెక్షన్ టీమ్ చైర్మన్ సమరేంద్ర సహా..ఏడుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.నిందితుల జాబితాలో వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ..NACC మాజీ డిప్యూటీ అడ్వైజర్ మంజునాథరావు,.NACC అడ్వైజర్ శ్యామ్ సుందర్, డైరెక్టర్ హనుమంతప్ప..నిందితుల్లో నలుగురు మినహా 10 మంది అరెస్ట్ ..రూ.37 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు స్వాధీనం.
👉 కంభం, బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ *.. పలు రికార్డులు, ఫైల్స్ తనిఖీ… సిబ్బంది పని తీరుపై ఆరా..*పెండింగ్ కేసులపై అధిక దృష్టి సారించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి: *విధుల పట్ల అంకితభావంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి*…*సైబర్ నేరాలను చేధించటం కంటే నివారణ ఉత్తమ మార్గం*..

పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి కంభం మరియు బేస్తవారపేట పోలీస్ స్టేషన్ లను ఆదివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా స్టేషన్ పరిసరాలు, వివిధ గదులు, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, డ్యూటీల కేటాయింపు, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ విధానం, రికార్డ్స్, సీడీ ఫైల్స్, పోలీస్ క్వార్టర్స్, ప్రాపర్టీ రికవరీ, స్టేషన్ పరిధిలోని మ్యాప్ మరియు తదితర అంశాలను పరిశీలించి, రికార్డ్స్ నిర్వహణలో సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ లో మొక్కల నాటి, ఆవరణ పరిశుభ్రంగా, పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు…పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. పెండింగ్ కేసులలో విచారణ త్వరగతిన పూర్తి చేయాలని, కేసుల విచారణకు చేపట్టవలసిన విధానం గురించి దిశానిర్దేశం చేశారు. నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని, కేసుల పరిష్కారంలో జాప్యం వహించే కొలది బాధితులకు సత్వర న్యాయం అందించలేమని కనుక దానికి అనుగుణంగా పోలీస్ స్టేషన్ యొక్క నిర్వహణ ఉండాలని సూచనలు చేశారు…నేరాల కట్టడికి గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర గస్తీ నిర్వహించేటట్లు, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్న సిబ్బందిని తరచూ అప్రమత్తంగా చెయ్యాలని, డయల్-112 ఫిర్యాదులు రాగానే వెంటనే స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలని, విరివిగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, స్టేషన్ లో వివిధ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల పట్ల అంకితభావంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.. ప్రజలకు సిసి కెమెరాల పట్ల అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు..గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ పై విస్తృతంగా స్కూల్/కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి, సైబర్ నేరాలపై ప్రజలు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు…అనంతరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరితో మాట్లాడుతూ అందరి యొక్క ఆరోగ్య పరిస్థితులను గూర్చి ఆరా తీశారు. వృత్తిపరంగా, ఆరోగ్యవరంగా, కుటుంబ వరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నది, మొదలైన విషయాలను వారితో ముఖాముఖి మాట్లాడారు. సిబ్బంది సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయుటకు వచ్చే ఫిర్యాదులుదారులు పట్ల, మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్య తెలుసుకొని వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కంభం సీఐ మల్లికార్జున రావు, కంభం ఎస్సై నరసింహారావు, బివి పేట ఎస్సై రవీంద్ర బాబు మరియు సిబ్బంది ఉన్నారు.

