👉నిర్మలమ్మ బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో మైనార్టీలు దళితులు మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని, కానీ బడ్జెట్‌లో మహిళల భద్రత ఊసెత్తలేదని అన్నారు.ఆంధ్ర, బీహార్ కు ప్రకటించిన దాంట్లో తెలంగాణకు 25 శాతం కూడా ప్రకటించలేదు ..వారికి ఎందుకిచ్చారని మేము అడగటం లేదు మాకు కూడా న్యాయం చేసి సమానంగా నిధులు ప్రకటించి వుంటే బాగుండేది..ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణను మరోసారి విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇండియన్ ఐఐఎం, ట్రిపుల్ ఐటీ సంస్థలను కేటయించాలని ఎప్పటినుంచో అడుగుతున్నామన్నారు బడ్జెట్‌లో కూడా కేటాయించలేదన్నారు. జిల్లాకో నవోదయ విద్యాలయం కేటయించాలన్న మా వినతిని పెడచెవినపెట్టారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి.. తెలంగాణ ఈ బడ్జెట్‌లో కూడా సైనిక్ స్కూల్‌కు నోచుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి దక్కిందేమీ లేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీయాలి. రాజ్యసభలో మా సభ్యులు తెలంగాణకు దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంపై పోరాడుతున్నారు.త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికలుంటేనే రాష్ట్రాలను పట్టించుకుంటామన్న వైఖరి సరికాదని, మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు.కానీ అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడడం లేదని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలకు ఇన్‌కమ్ టాక్స్‌లో ఊరటనివ్వడాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయానికి గతంతో పోలిస్తే కొంత తోడ్పాటు లభించిందని, అయినా ఇది సరిపోదన్నారు.పదేళ్లుగా మోడీ పేద, మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, కొంతమంది దగ్గరే సంపద కేంద్రీకృతమైన ధోరణి పెరుగుతోందని వెల్లడించారు.బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.
👉కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం*… ఎన్డీయే భాగస్వాములుగా చంద్రబాబు,పవన్ సాధించిందేమిటి? పోలవరం ప్రాజెక్టు లక్ష్యం దెబ్బతింటున్నా కూటమి నాయకులకు పట్టదా? ..వ్యవసారంగానికి ఊతమిచ్చే ప్రకటన ఏది? .. బీహార్‌ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్రంపై ఒడ్తిడి తీసుకురండి …మాజీ ఎంపీ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి.. అనంతపురం..
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసినా కూటమి నాయకులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడడానికి ఏపీ, బీహార్ ఎంపీలే కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో బీహార్‌కు ఒకలా.. ఆంధ్రప్రదేశ్‌కు ఒకలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. ఏపీకి కొత్త ప్రాజెక్టులు సాధించుకోవడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారని అన్నారు. బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలోని జేడీయూ, బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం ఉందన్నారు. ఈ ఏడాదిలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో వరాలు కురిపించారని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వాములుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు సాధించింది ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా బీహార్‌ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏపీ ప్రయోజనాలు కాపాడాలని సూచించారు.
🔹ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా ని జనవరి 31న విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కలను అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు..*
👉ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా*..*ఏపీ డీజీపీగా నిన్న సాయంకాలం బాధ్యత స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా*
👉 తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. నగరంలో వెలసిన ఫ్లెక్సీలు ..నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్…TELANGANA GETS ZERO IN UNION BUDGET అంటూ ఫ్లెక్సీలు …ZEROలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో
👉*ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు నియామకం..*రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న వెంకటేశ్వరరావు..*ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం*
👉ఫీజు రీయింబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజం… కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్ చెప్పిన రోజా… ఫిబ్రవరి 5 లోపల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి..
*చంద్రబాబు సీఎం ఏడు నెలలైనా సూపర్ సిక్స్ కి అతిగతి లేదు..తల్లికి వందనం కోసం 80 లక్షల మంది పిల్లలు ఎదురుచూపు..వారి తల్లుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది..టిడిపి నాయకులకు పరిస్థితి ఎలా ఉందంటే ?..ఆఖరికి వీళ్ళు ఇంట్లో వాళ్లకు జలుబు చేసి తుమ్ములు వచ్చిన దానికి జగనన్నే కారణం అనేలా ఉన్నారు..ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చంద్రబాబు దుష్ప్రచారం చేశారు..14 లక్షల కోట్ల అప్పులు ఉన్న అమలు చేస్తామని సూపర్ సిక్స్ హామీలను.. అందులో అప్పులు సగం అప్పు ఉన్నప్పుడు ఎందుకు హామీలను అమలు చేయలేరు..
*నారా లోకేష్ మాట ఏమైంది?…సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడగండి అన్నారు…అయ్యా లోకేష్ ఏవి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు ఏ కాలర్ పట్టుకుని అడగాలి రైట్ కాలరా లెఫ్ట్ కాలరా ప్రశ్నించిన రోజా…రామానాయుడు సైకిల్ పట్టుకుని మీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 18000 అని చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు చెప్పావు కదా..మీ నాయకుడు చంద్రబాబు గతంలో బటన్ నొక్కడం ఏమైనా గొప్ప.. మూలనున్న ముసలమ్మ నొక్కుతుందన్నావు..మూలం ఉన్న ముసలమ్మ నొక్క కలిగినప్పుడు 73 సంవత్సరాలు వయసోడివి మీరు ఎందుకు నొక్కలేకపోతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు రోజా…. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో బాబు హామీలకు నాది గ్యారెంటీ వారంటీ అన్నారు…మరి చంద్రబాబు చేతులెత్తేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు సమాధానం చెప్పాలి…ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం రైతు భరోసా నిరుద్యోగ భృతి ఫ్రీ బస్ ఆడబిడ్డ నిధి మీరు ఇస్తారా? లేక మీ చంద్రబాబు ఇస్తారా? సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నించారు.
👉వీళ్ళు మనుషులా…సమగ్ర విచారణ జరపాలి..వీరీని వెంటనే అరెస్టు చెయాలి.. వీరిపై ఫోక్సో చట్టం… బాల హక్కుల సంరక్షణ చట్టం క్రింద కేసులు నమోదు చేయాలని PAAP డిమాండ్ ..
-రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలలో మా బిడ్డ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మండల జిల్లాస్థాయిలో ప్రభుత్వ విభాగాలతో దర్యాప్తు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి… దర్యాప్తు నివేదిక శ్వేత పత్రం విడుదల చేయాలసి PAAP రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. శానిటరీ ప్యాడ్స్ అడిగితే పీరియడ్స్ వచ్చినట్లు ఆధారం చూపించమంటున్నారు’.. కేజీబీవీ విద్యార్థినిలు …అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకోవడం, స్కూల్లో తమను వేధిస్తున్నారని ఆరోపించడం కలకలం సృష్టించింది. *నెలసరి సమయంలో అమ్మాయిలకు 5 ప్యాడ్లు ఇస్తున్నట్లు రిజిస్టర్‌లో రాస్తున్నారు. కానీ, తమకు రెండు మాత్రమే ఇస్తున్నట్లు పిల్లలు చెబుతున్నారు. *నెలసరి వచ్చినప్పుడు తలస్నానం చేసే సమయంలో ప్రతి విద్యార్థిని నుంచి రూ. 100 అడుగుతున్నారని తెలిసింది. ఆహారంలో నాణ్యత ఉండట్లేదు. ఎవరైనా తనిఖీలకు వచ్చిన సమయంలో మాత్రమే బాగా వండుతున్నారు. మిగిలిన సమయంలో సరిగా ఉండటం లేదు. మెనూ ప్రకారం కూడా పెట్టడం లేదు” అని సరిత తెలిపారు.*ఒకవేళ విద్యార్థినుల్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని వేధిస్తున్నారంటూ స్కూల్లో చదివే బాలికలు తమకు చెప్పారని సరిత అన్నారు…*పిల్లలకి ఆరోగ్యం బాలేకపోతే, ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే టాబ్లెట్ ఇస్తున్నారు. *ఏఎన్ఎం తమను కొడతారని, తిడతారని పిల్లలు ఫిర్యాదు చేశారు. *ఒకసారి ఒకమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు సూది లోపలే ఉండిపోవడంతో ఆమె ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. తర్వాత, ఇంటికి వెళ్లి ఆమె చికిత్స తీసుకున్నారు. ఏమైనా వీరు కేవలం పారాసిటమాల్ ఇస్తారని పిల్లలు మాతో చెప్పారు” అని సరిత వివరించారు.ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, *కుటుంబీకులు కూడా ఇవే ఆరోపణలు చేశారు. పిల్లలకు ఆరోగ్యం బాలేకపోతే తమతో స్కూల్ సిబ్బంది చెప్పనివ్వరని, ఏ సమస్య అయినా బాగా ముదిరిన తర్వాత తమ వరకు వస్తుందని ఒక విద్యార్థిని నాన్నమ్మ సుబ్బమ్మ చెప్పారు.* ”పిల్లలకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోరు. ఒక మాత్ర ఇస్తారు. మాకు చెప్పరు. ఫోన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంది అంటారు. మేం కలవడానికి వెళ్లినప్పుడు బిడ్డ కుమిలిపోయింది. ఇంటికి తీసుకెళ్లి రూ.3000 ఖర్చు పెట్టి ఆసుపత్రిలో చూపించాం. తిండి కూడా సరిగా పెట్టరు. మేం స్నాక్స్ ఇచ్చి వెళ్తుంటాం. ఏ సౌకర్యం లేనప్పుడు ఈ హాస్టల్ ఎందుకు? దయచేసి ఆడబిడ్డల భవిష్యత్తు నిలపండి” అని ఆమె అన్నారు…. *భోజనం సరిగా లేదని చెబితే, మీ ఇంట్లో ఇంకా బాగా పెడతారా అని పిల్లలపై కోప్పడతారని, కొట్టడానికి వస్తారని తన మనవరాలు చెప్పిందని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.*అన్నంలో పురుగులు వస్తున్నాయని చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఏఎన్ఎం మీద కూడా కంప్లైంట్ వచ్చింది. ప్యాడ్స్ అడిగితే ప్రూఫ్ ఏది చూపించు అని అడుగుతారంటా…..ఆడపిల్లని అలా అడగడం చాలా తప్పు. దీనిపై కూడా మేం ఫిర్యాదు చేశాం. అయినా మళ్లీ అలాగే జరుగుతోంది….*హాస్టల్ సిబ్బంది అభ్యంతరకర రీతిలో మాట్లాడతారని పిల్లలు చెబుతుంటారు…. *పిల్లలతో చెత్త తీయించడం, అంట్లు కడిగించడం వంటి పనులు చేయిస్తారు. వాళ్ల మాట వినకపోతే సరిగా చదవడం లేదని తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడం, కాళ్లు నొక్కించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడైనా న్యాయం చేయండి. హాస్టల్‌లో సిబ్బందిని మార్చండి” అని ఆవేదన చెందారు. *అన్నమయ్య జిల్లా మొలకల చెరువు సమీపం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తనిఖీకి వెళ్లిన అధికారులకు అక్కడ చదువుకుంటున్న విద్యార్థినులు కన్నీళ్లతో తమ బాధలు చెప్పుకోవడం, స్కూల్లో తమను సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపించడం పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని బోధన బోధనేతర సిబ్బంది ఫోక్సో చట్టం.. బాలల హక్కుల సంరక్షణ చట్టం కింద కేసులు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ..
👉జిల్లాకు ఉపకరించని బడ్జెట్….కేంద్ర బడ్జెట్ పై సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ కే మాబు
ప్రకాశం జిల్లా కు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్ కె మాబు విమర్శించారు. శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించకుండా తీవ్రంగా అన్యాయం చేశారని విమర్శించారు వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను గుర్తించిన కూడా నిధులు కేటాయింపు లేవన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎనుకబడిన జిల్లాగా గుర్తించాలని పోరాటాలు చేస్తే ఈ మధ్యకాలంలో గుర్తించారు కానీ నిధులు కేటాయించలేదని విమర్శించారు..జిల్లాలో అన్ని రంగాలు అభివృద్ధి కావాలంటే తక్షణం జిల్లాకు పదివేల కోట్లు కేటాయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వచ్చే సవరణ బడ్జెట్లో అయినా జిల్లాకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
👉మమతా కులకర్ణీకి బిగ్ షాక్… బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలే కారణమా?
ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసినిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెను కిన్నెర అఖాడా నుంచి బహిష్కరించారు. ఉత్తరప్రదేశ్ లోని రాజ్ ప్రయాగ్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సాధువులు, సన్యాసులు, అఘోరాలు, బాబాలు పాల్గొంటున్నారు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఈ విషయం చాలా మందికి సర్ ప్రైజ్ గా ఉంటే.. మరికొంతమందికి షాకింగ్ గా మారింది. ఈ సమయంలో ఆమె ప్రాపంచైక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారారు. కిన్నెర అఖాడాలో చేరారు. మాహామండలేశ్వర్ గా ఆమె దీక్షను చేపట్టారు. ఈ సమయంలో అమెకు తాజాగా ఆ కిన్నెర అఖాడా షాకిచ్చింది. అక్కడ నుంచి బహిష్కరించింది. అవును.. ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల సన్యాసినిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెను కిన్నెర అఖాడా నుంచి బహిష్కరించారు. ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశరు. కిన్నెర అఖాడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు. వాస్తవానికి ఆమె అఖాడాలో చేరిన అనంతరం.. పలువురు మతపెద్దలు నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీనికి తోడు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీంతో.. ఆమెతో పాటు ఆమెను చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠీని సైతం అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈమె కిన్నెర అఖాడాలో చేరడం ఒకెత్తు అయితే.. చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందడం మరొకెత్తు అంటూ పలువురు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బాబా రామ్ దేవ్ స్పందిస్తూ… మహా కుంభమేళా అనేది పవిత్ర కార్యక్రమంలో కొంతమంది వ్యక్తులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో… ఇప్పటివరకూ ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి.. మహామండలేశ్వర్ వంటి బిరుదులను పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పలు ప్రభావల ఫలితంగా ఆమెపై బహిష్కరణ వేటు వేసినట్లు చెబుతున్నారు.
👉నూతన మున్సిపల్ కమిషనర్ సునీతను సన్మానించిన కాంగ్రెస్ నేతలు*
షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం నూతన మున్సిపల్ కమిషనర్ సునీతను షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు సన్మానించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ,కాంగ్రెస్ మైనార్టీ నేత మహమ్మద్ ఇబ్రాహీం, మాజీ కౌన్సిలర్ సర్వర్ పాషా, శ్రీశైలం గౌడ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.ఆమేర్ తదితరులు శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఆమెను కోరారు.
*మదనపల్లెలో మహిళా పోలీస్ ఉరివేసుకుని ఆత్మ హత్య.. మదనపల్లెలో మహిళా పోలీస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మదనపల్లె రెండవ పట్టణ సిఐ రామచంద్ర ఏఎస్ఐ రమణ తెలిపారు. స్థానిక నిమ్మనపల్లి రోడ్డు, విద్యోదయ స్కూల్ వద్ద కాపురం ఉంటున్న ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ పిఎల్ రవికుమార్ భార్య రెడ్డిరోజా(35), అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గం, కలికిరి మండలం, పారపట్లలో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఈమె మదనపల్లిలో ఉంటున్న ఇంటిలో శనివారం సాయంత్రం చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందింది. పెళ్లయి 15 సంవత్సరాలు కావస్తున్న పిల్లలు పుట్టకపోవడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు, సమాచారం అందుకున్న ఏఎస్ఐ రమణ ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
👉*రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్ పరువు..*హోటల్ కు ఫైల్స్ తెప్పించుకొని సంతకాలు*.. విస్తుపోతున్న కదిరి వాసులు..😲😲😲* శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్టార్ శ్రీనివాసులు ఓ టీ కేఫ్ లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం దుమారం రేపుతోంది.* కార్యాలయంలోని తన ఛాంబర్ లో కూర్చొని దర్జాగా సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా హోటల్ లో.. బంకుల్లో కూర్చొని సంతకాలు చేయడం కలకలం రేపుతోంది. .సబ్ రిజిస్ట్రార్ తీరుతో ఆ శాఖ పరువుపోతోంది.
* హైదరాబాద్‌లొ కాల్పులు కలకలం**గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై ఓ దొంగ కాల్పులు జరిపాడు. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో దొంగ కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకట్రెడ్డి, బౌన్సర్కు గాయాలయ్యాయి. ఎట్టకేలకు దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*అందని పెన్షన్… ఇబ్బంది పడుతున్న బాధితులు….* ప్రకాశంజిల్లా పొదిలి బుగ్గచలం వాటర్ ట్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న గురున్నాదం రాములు,నాగులురి ప్రమీలకు అధికారులు పించన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు తమ లిస్ట్ లో వారి పేర్లు రాలేదని పై అధికారులను సంప్రదించాలని చెపుతున్నరని తెలిపారు. గురున్నాదం రాములు పుట్టకతోనే దివ్యాంగురాలు అంతేకాక అనుకొని కారణాలవల్ల ఎడమవైపు కిడ్ని తొలగించారు. ప్రస్తుతం ఒక కిడ్నిపై జీవనం కొనసాగిస్తుంది..అదే ప్రాంతంలో నివసిస్తున్న నాగులూరి ప్రమీల చిన్నారికి చిన్నప్పటినుండి మానసిక వికలాంగురాలు 90 శాతం దివ్యాంగురాలని వైద్యులు నిర్దారించారు… అధికారులు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని ప్రాదేయపడుతున్నారు._
*పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు* మర్రిపూడి మండలం కాకర్ల పొలాల్లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మికంగా దాడులు … ముగ్గురుని అదుపులోకి తీసుకొని మీరు వద్ద నుండి సుమారు పదివేల ఎనిమిది వందల నలభై రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన పోలీసులు

