👉*అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు*!!…ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలోభద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు.. సిబ్బందికి దిశా *నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ *వి.విద్యాసాగర్ నాయుడు *ఐపీఎస్ కాన్వాయి రిహార్సల్ *నిర్వహణ.. సంబేపల్లి* *మండలంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన*..రాయచోటి…ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా, చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు…సంబేపల్లి మండలంలో, ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను జిల్లా ఎస్పీ .వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ పరిశీలించారు.హెలిప్యాడ్, మరియూ సంబేపల్లి లోని ఎన్టీఆర్ విగ్రహం, ముఖ్యమంత్రి పర్యటించనున్న పలు ప్రాంతాలను అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ .వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్ ) యం.వెంకటాద్రి రాజంపేట ఏఎస్పి శ్రీ.మనోజ్ రామనాధ్ హెగ్డే ఐపీఎస్ , సీఎం సెక్యూరిటీ వింగ్ అధికారులు, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐలు,పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము*
*ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు* ..రాష్ట్ర డి.జి.పి కార్యాలయం నందు హరీష్ కుమార్ గుప్తా నూతన డి. జి. పి గా బాధ్యతలు స్వీకరించినారు.అనంతరం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, నూతన డి. జి. పి గా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.
👉ప్రకాశంజిల్లా కంభం మండలం కంభం పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.అశోక్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయం అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో వాసవీ విద్యా సంస్థల అధినేత గోళ్ళ.బాబు,జడ్పీటీసీ కొత్తపల్లి.జ్యోతి శ్రీనివాస్,మాజీ ప్రజా ప్రతినిధులు, టిడిపి ప్రజా ప్రతి నిధులు, ఆర్యవైశ్య కమిటీ ,ఆర్యవైశ్య సోదరులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, భక్తులు, పాల్గొన్నారు.
👉 జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్.. బాపట్ల జిల్లా*..*క్రీడా స్ఫూర్తి కనబరుస్తూ మెరుగైన ప్రదర్శన చెయ్యాలి*…*పని ఒత్తిడిని జయించడానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహద పడతాయి*
బాపట్ల జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ శుక్రవారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో జెండా ఎగురవేసి ప్రారంభించారు. బాపట్ల, చీరాల, రేపల్లె సబ్ డివిజన్స్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు అధికారులు సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహించి అడిషనల్ ఎస్పీకి గౌరవవందనం సమర్పించారు..
👉స్రెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు)..విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎన్‌డిఎ నమ్మక ద్రోహం..విశాఖ స్టీల్‌ను ప్రైవేట్‌కు అప్పగించడానికే ‘‘ప్యాకేజీ’’
జనవరి 29 న ఢల్లీిలో మీడియా మీట్‌లో కేంద్ర స్టీల్ మంత్రి శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్‌కు కేటాయించిన రివైవల్ ప్యాకేజ్ రూ.11440 కోట్ల విధి విధానాలను ప్రకటించారు. అందులో ప్యాకేజి మొత్తం ను ముడిసరుకుకుగాని, కార్మికుల జీతాల బకాయిలకు కాకుండా ఇతర బకాయిలకు మాత్రమే చెల్లిస్తారు. ఇప్పటికే బ్యాంకులకు చెల్లించిన రూ.1640 కోట్లు పోను మిగిలిన రూ.9800 కోట్లు కూడా బకాయిలకే చెల్లిస్తారు. సెయిల్ విలీనం సాధ్యంకాదని కూడా స్పష్టంచేశారు.
విశాఖ స్టీల్ ప్యాకేజి విధి విధానాలను ప్రకటించిన తర్వాత ఈ ప్యాకేజీ విశాఖస్టీల్‌ను ప్రైవేటు చేయడానికేనని స్పష్టంగా అర్ధం అవుతున్నది. అప్పులు తీర్చడానికి ప్యాకేజీలో సొమ్మును ఖర్చుపెట్టి, ప్లాంట్‌కు లాభాలు రాలేదని ప్రైవేట్‌కు అప్పగించే పనిలో కేంద్ర యన్డ్‌ఎ ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తున్నది. ప్రైవేట్‌కు విశాఖ స్టీల్‌ను అప్పగించే ముందు అప్పులభారం ప్రైవేట్‌కు లేకుండా చేయడానికే ఈ ప్యాకేజి ప్రకటించారని స్పష్టం అవుతున్నది. భూషణ్ స్టీల్ రూ.10971 కోట్లు, భూషణ్ పవర్ Ê స్టీల్ రూ.27808 కోట్లు బ్యాంకు అప్పులు చెల్లించకుండా దివాళా ప్రకటించారు. వీరందరినీ మించి అలోక్ ఇండస్ట్రీస్, ఎస్సాఆర్ స్టీల్స్ బ్యాంకులకు దివాళా ప్రకటించాయి. కాని విశాఖ స్టీల్ 1990 నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు నూరుశాతం చెల్లించింది. లాభాల్లో ఉన్న విశాఖస్టీల్‌ను కేంద్రప్రభుత్వం గత మూడుసంవత్సరాలు ఉత్పత్తి జరగకుండా ఆటంకాలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ముడి సరుకు రాకుండా, రవాణాకు రైల్వే ర్యాక్‌లు ఇవ్వకుండా, అదాని గంగవరం పోర్టు నుంచి విదేశాల నుంచి వచ్చిన కోకింగ్ కోల్‌ను ప్లాంట్‌కు రాకుండా కావాలని నష్టాల్లోకి నెట్టింది.
ఎన్‌డిఎ విశాఖస్టీల్‌కు కావాలని నష్టాలు రప్పించింది. ఎన్డ్‌ఎ ప్రభుత్వమే భవిష్యత్‌లో విశాఖ స్టీల్‌ను ఎప్పుడూ లాభాల్లోకి రానివ్వరు. లాభాల్లోకి రాకుండా ఎలా అడ్డుపడాలో కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు సంకల్పంతో బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చినట్లు బాకా ఊది ప్రచారం చేసుకుంటున్నారు. లాభాలు రాకుండా చేసి కార్మికులపై నెపం పెట్టి ప్రైవేటీకరణ చేఆయలని బిజేపి, టిడిపి, జనసేనలు ప్రచారం చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. విశాఖ స్టీల్ మూడు నెలల నుంచి కార్మికులకు జీతాలు చెల్లించకపోయినా నూరుశాతం పైగా ఉత్పత్తి సాధించారు. ప్యాకేజీలో ఇచ్చిన సొమ్ముతో కార్మికుల జీతాలు పూర్తిగా ఇవ్వం అంటున్నారు. కాని ఉద్యోగాల నుంచి తొలగించడానికి విఆర్‌ఎస్‌కు చెల్లిస్తామని చెబుతున్నారు.
విశాఖ స్టీల్‌ను ప్రైవేట్‌కు ఇవ్వడానికే సెయిల్‌లో కలపడం సాధ్యం కాదని స్టీల్ మంత్రి శ్రీనివాస వర్మ ప్రకటించారు. విశాఖస్టీల్‌ను సెయిల్‌లో విలీనానికి సెయిల్ బోర్డు అంగీకరించలేదని స్టీల్ మంత్రి వంకగా చూపుతున్నారు. గతంలో నష్టాల్లోని అనేక ప్రభుత్వరంగ పరిశ్రమలను ఎలా విలీనం చేశారు? విశాఖ స్టీల్‌కు స్వంత గనులు సమకూర్చడం విశాఖ స్టీల్ ప్లాంట్ హక్కు. విశాఖ స్టీల్‌కు స్వంత గనులు కేటాయిస్తే దేశంలోనే నెం.1 స్టీల్ ప్లాంట్‌గా విశాఖ స్టీల్ ప్లాంట్ వుంటుంది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావించడం కూడాలేదు. విశాఖ స్టీల్‌కు స్వంత గనులు కేటాయించి విశాఖస్టీల్ సమస్యనను శాశ్వితంగా పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌చేస్తున్నది. (ఏ.వి.నాగేశ్వరరావు) అధ్యక్షులు, (సి.హెచ్.నరసింగరావు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
👉*నకిలీ టాస్క్ ఫోర్స్ అధికారి అవతారమెత్తిన హోమ్ గార్డ్ ఘరానా మోసం. చివరికి కటకటాల్లోకి!*
బాపట్ల జిల్లా రేపల్లె చోడాయిపాలెం గ్రామానికి చెందిన చిక్కాల సుమన్ అను అతను 2006 సంవత్సరం నుండి హోంగార్డుగా పనిచేస్తు విధులు నిర్వహిస్తున్నాడు.
హోంగార్డ్ సుమన్ చెడు వ్యసనాలకు, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి డబ్బును పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇతగాడు ఈ మధ్యకాలంలో హోంగార్డు డిప్యూటేషన్ పై జి ఆర్ పి ఎఫ్ విజయవాడ లో విధులు నిర్వహిస్తున్నారు. ఏ విధంగానైనా సరే సంపాదించాలనే దురుద్దేశంతో గూగుల్లో కొంతమంది సర్పంచుల ఫోన్ నెంబర్లు సేకరించి వారి ద్వారా ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపుల వివరాలు వారి ఫోన్ నెంబర్లు తెలుసుకున్నాడు. సదరు వైన్ షాప్ కు చెందిన వ్యక్తులకు ఫోన్లు చేసి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ఇటీవల కాలంలో మచిలీపట్నం తాళ్లపాలెం పంచాయతీలో గల వసుధ వైన్స్ కు ఫోన్ చేసి తాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ నుండి మాట్లాడుతున్నట్లు తనకు 6000 రూపాయలు ఫోన్ పే చేయమని లేదంటే వారి షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వసుధ వైన్స్ యాజమాన్య నుండి వద్ద నుండి 6000 రూపాయలు ఫోన్ పే లో డబ్బులు తీసుకున్నాడు. మరల రెండవ రోజు సుమారు 9 గంటల ప్రాంతంలో సదరు హోమ్ గార్డ్ పనిమీద మచిలీపట్నం వచ్చి వసుధ వైన్స్ యాజమానికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు అయితే తన అకౌంట్లో డబ్బులు లేవని కాష్ మాత్రమే ఉన్నదని చెప్పి క్యాష్ చేతికి ఇస్తానని హోంగార్డును బీచ్ రోడ్ లో గల ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు రమ్మని చెప్పాడు. వసుధా వైన్స్ యజమానికి అనుమానం వచ్చి పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. పోలీసులు వసుధ వైన్స్ యాజమాని ఇచిన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హోంగార్డు ను రిమాండ్ కి తరలించారు.
👉చంద్రగిరిలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..
జెసిబి లతో ఇసుకను తోడేస్తున్న వైనం.భారీగా డంపింగ్ యార్డులు. .రాత్రి సమయాలలో విచ్చలవిడిగా ఇసుకను దోచుకుంటున్న వైనం…టిప్పర్ లారీలతో ఓవర్ స్పీడ్ తో వెళ్తూ హల్చల్ చేస్తున్న వైనం..పొద్దునే స్కూలు కు వెళ్ళే పిల్లలు,వాహనాలు ఓవర్ స్పీడ్ వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి..రోడ్లను సైతం ఇసుక నుండి వచ్చే నీటితో జలమయం..అధికారులకు తెలిసే ఇదంతా జరుతుందా ..?ఎటువంటి చర్యలు చేపట్టిన రెవెన్యూ అధికారులు.. పేరుకేమో ఎన్టీఆర్ కాలనీ (ఇటీవల పేరు మార్చిన జగన్ కాలనీ ) సీసీ రోడ్లకు అని చెప్పి నాగల చెరువు గ్రామ సమీపంలో ఇటుకల బట్టిలో,పక్కనే మామిడి తోపు లో డంపింగ్ చేస్తున్న పట్టించుకోని అధికారులు.జెసిబి లాంటి యంత్రాలతో , టిప్పర్లతో రవాణా చేసే పర్మిషన్లు చంద్రగిరి రెవెన్యూ అధికారులు ఏమన్నా ఇచ్చారా….? అక్రమ ఇసుక రవాణాకు రెవెన్యూ యంత్రాంగం కొమ్ముకాస్తుందా…..? …గత ప్రభుత్వం ఇసుకను దోచుకుంటున్నారని రెడ్డివారిపల్లి సమీపంలో ధర్నాలు చేపట్టిన అప్పటి ప్రతిపక్షం. ఇప్పుడు అధికారపక్షంలో ఉంటున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్న వైనం. గత ప్రభుత్వంలో ఇసుక కోసం తవ్విన గుంతలలో ఓ బాలుడు పడి చనిపోయిన ఘటన, టవర్ క్లాక్ వద్ద నిరసనలు చేపట్టి అప్పటి ప్రతిపక్షం.అప్పుడు వాళ్లు దోచుకున్నారు ఇప్పుడు మేము దోచుకున్నాం అన్నట్లుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా.
👉కంచికచర్ల :పరిటాలకు చెందిన జమలయ్య అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత పోస్టులు పెట్టడంతో శుక్రవారం అతనిని అరెస్టు చేసినట్లు ఎస్సై బోనగిరి రాజు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
👉ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం తెలంగాణ : నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కన శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన మెట్రో సిబ్బంది స్టేషన్‌లో లిఫ్ట్‌ను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు.. రిపోర్టర్ అమీర్
👉 కామన్ మాన్ ఛానెల్ అధినేత పాల్లూరి రమణ అరెస్టు…అర్ధరాత్రి రమణ ఇంటికి పోలీసులు… ఇటీవల మంత్రులు ఫరూక్… టీజీ భరత్ పై యూ ట్యూబ్ లో అడ్వర్స్ న్యూస్ ఇచ్చిన రమణ
👉”కేజ్రీవాల్ అవినీతిపరుడు.. కాదు, మోడీనే అవినీతిపరులకు అవినీతిపరుడు!” అసలు ఈ దేశంలో అవినీతి పరులకు అవినీతి పరుడు మోడీనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. నువ్వు అవినీతి పరుడివి.. అని ఒకరంటే.. కాదు, నువ్వే అవినీతి పరుడివి.. అంటూ ప్రత్యర్తులు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం ప్రధాని మోడీ ఢిల్లీలోని ద్వారకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. అసలు ఈ దేశంలో అవినీతి పరులకు అవినీతి పరుడు మోడీనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ”నేను పదేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇది ప్రజల ఆశీర్వాదం. కానీ, సొంతానికి ఒక ఇల్లు కాదు కదా.. ఒక్క గది కూడా నిర్మిం చుకోలేదు. కానీ, ఇక్కడ ఓ పెద్ద మనిషి(కేజ్రీవాల్) ఉన్నారు. ఆయన అనునిత్యం పేదల కోసం తపిస్తానని మాటలు చెబుతారు. పేదల పార్టీ, పేదల పక్షం అంటూ మాటల కోటలు కడతారు. కానీ, వెనుక చూస్తే.. తనకు సొంతగా ప్రజల కష్టంతో వచ్చిన ప్రభుత్వ సొమ్ముతో అద్దాల మేడ(శీష్ మహల్)ను నిర్మించుకున్నారు. ఆయన ఎంత అవినీతి పరుడు కాకపోతే.. ఇలా కట్టుకుంటారు. మాకు అధికారం ఇవ్వండి. తొలి అసెంబ్లీ సెషన్‌లోనే ఆయన అవినీతిని మీకు పరిచయం చేస్తాం. కాగ్ నివేదికను ప్రవేశ పెడతాం” అని ప్రధాని మోడీ అన్నారు. మోడీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేజ్రీవాల్ సైతం పదునైన విమర్శలు గుప్పించారు. ”దేశంలో పారిశ్రామిక వేత్తలను పోషిస్తున్న వారు.. ఎవరో ప్రపంచ స్థాయిలో దేశం పరువును తీస్తున్నవారు ఎవరో అందరికీ తెలిసిందే. ఆయన అవినీతి పరులకే అవినీతి పరుడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వేధింపులకు దిగుతున్నారు. ఈడీ, సీబీఐ,ఐటీ వంటి ఆయుధాలను మాపై ప్రయోగిస్తూ.. అవినీతి పరులను కాపాడుతున్నారు. ఆయనకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలి” అని వ్యాఖ్యానించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రెండు పార్టీలపైనా ఉమ్మడిగా విమర్శలు గుప్పించడం విశేషం. ”ఇరు పార్టీల రంగు తేలిపోయింది. వారిద్దరూ అవినీతి పరులే. మేం 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించాం. ఎక్కడా రూపాయి అవినీతి జరగలేదు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ అవినీతి పార్టీలే. ఒకరు అద్దాల మేడ కట్టుకున్నారు. మరొకరు అవినీతి పరులైన స్నేహితులను పోషిస్తున్నారు. ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు” అని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. కాగా, మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. వచ్చే నెల 5న 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
👉 *ఐర్లాండ్‌లో విషాదం.. ఇద్దరు ఏపీ విద్యార్థులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..రోడ్డు ప్రమాదంలో భార్గవ్, సురేష్ దుర్మరణం..ఒకరిది ఎన్టీఆర్ జిల్లా,మరొకరు పల్నాడు జిల్లా.. మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలు…. ఐర్లాండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిని ఏలూరు జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ (24), పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ (25)లుగా గుర్తించారు.
క్రమంలో చిట్టూరి భార్గవ్, చెరుకూరి సురేష్‌లు మరో ఇద్దరితో కలిసి కారులో ట్రిప్‌కు వెళ్తుండగా రాతో అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారీగా మంచు కురవడంతో కారు చెట్టును ఢీకొట్టడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. ఈ ఘటనలో భార్గవ్, సురేష్‌లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు.భారీగా మంచు కురవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు… ఐర్లాండ్ నుంచి భార్గవ్ భౌతికకాయాన్ని తెప్పించాలని కోరగా.. నెట్టెం రఘురాం వెంటనే స్పందించి మంత్రి నారా లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు వెంటనే స్పందించి ఐర్లాండ్‌లో భారత రాయబారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐర్లాండ్‌లో పూర్తి చేయాల్సిన లాంఛనాలు త్వరగా పూర్తిచేసి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇద్దరు విద్యార్థుల మరణంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు.
👉అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట కోసం జిల్లాలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు..అనంతపురం :జిల్లా ఎస్పీ పి.జగదీష్*జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని పలు సమస్యాత్మక గ్రామాలలో ఆకస్మికంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు..*ఆయా సి.ఐ లు/ ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాలకు వెళ్లి పాత కేసుల్లోని నేరస్తులు, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్ల ఇళ్లు, పరిసరాలలో క్షుణ్ణంగా తనిఖీలు..*గంజాయి, తదితర మత్తు పదార్థాలు, అక్రమ మద్యం కోసం ఇళ్లతో పాటు దుకాణాలు, పాడు బడిన ఇళ్లు, తోటలు, కల్లం దొడ్లు, తదితర ప్రదేశాలలో విస్తృతంగా సోదాలు…ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్.. పోలీస్ స్టేషన్ లకు తరలింపు..
*గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ మరియు ప్రజలతో సమావేశమయ్యారు. చెడు నడత కల్గిన వారిని సత్ప్రవర్తనతో జీవించాలని కౌన్సిలింగ్ చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా… ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలు తావులేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. రౌడీ షీట్లు…చెడు ప్రవర్తన కల్గిన వ్యక్తులు పాత పంథా వదలాలని సూచించారు..
👉*ఆళ్లగడ్డలో హీటెక్కిన రాజకీయం* …సవాల్లు ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం..భూమా కిషోర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు.. ఎమ్మెల్యే అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ కిషోర్ సవాల్.. వైసీపీ నేతల సవాల్ కు సిద్ధమన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. సవాల్ చేసినవారి ఇంట్లోనే చర్చకు సిద్ధమన్న అఖిలప్రియ
👉 రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నగిరి డిఎస్పి మహమ్మద్ ఆజీజ్ సారథ్యంలో కార్వేటినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా హనుమంతప్ప మరియు కార్వేటి నగరం ఎస్సై రాజ్ కుమార్, ఎస్ఆర్ పురం సుమన్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బ య్య మరియు సిబ్బందితోపాటు వెదురుకుప్పం మండలం, నక్కలాంపల్లి గ్రామం నందు కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ చేసి రికార్డ్స్ లేని 42 మోటార్ సైకిల్ లను సీజ్ చేయడమైనది. అదేవిధంగా నక్కలంపల్లి గ్రామ ఫారెస్ట్ ఏరియాలో నాటు సారా కాస్తున్నారని సమాచారం ఉంది. నాటు సారా తాగడం వలన కలిగే ఆరోగ్య సమస్యలు మీద మరియు గతంలో నాటు సారా కాసే వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తూ ఎవరైనా చట్ట వ్యతిరేకపరమైన చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకొనబడతాయి అని హెచ్చరించడమైనది.

