👉మంత్రి లోకేశ్ ఫైర్ 😱: శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా వారిని బయటకు పంపిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా భక్తులు చేసిన ఫిర్యాదుపై ఆయన స్పందిస్తూ తక్షణ విచారణకు ఆదేశించారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకుని, బాధ్యులపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను హాని చేసే ఎటువంటి చర్యను కూడా తట్టుకోమని ఆయన చెప్పారు.
👉ఇంద్రకీలాద్రిపై మరోసారి బయటపడ్డ దళారుల దందా.* 😱😱😱*వీఐపీ దర్శనాల కోసం సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు.* ..ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేస్తున్న దళారులు.* ..ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు.*
👉సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..12 మంది విద్యార్థినులకు అస్వస్థత ..ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు….
👉 మాదాపూర్: ముసుగుతో స్నేహితుడి భార్యను బెదిరించి.. బంగారు గాజుల అపహరణ..మాదాపూర్: ముసుగుతో స్నేహితుడి భార్యను బెదిరించి.. బంగారు గాజుల అపహరణ… విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు ఓ ఐటీ ఉద్యోగి. ఈ నేపథ్యంలో ముసుగుతో స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి ఆమె వద్ద నుంచి రెండు బంగారు గాజులను అపహరించాడు. ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశారు.
👉జగన్ మాఫియా – బిగ్ బి అంటే బిగ్ బాస్ టీం !
జగన్ మాఫియా పాలన చేశారు. పోలీసు వ్యవస్థతో ఆయన ఇష్టం లేని వారిపై కేసులు పెట్టారు. కొట్టించారు. సెటిల్మెంట్లు చేయించారు. జత్వానీ లాంటి సామాన్యులపై వ్యవస్థను ప్రయోగించారు.ఇలా చెప్పుకుంటూ పోతే బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. బాబోయ్ ఇలా చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన పాలన చేశారు. ఇప్పుడు ఒక్కో విషయం బయటపడుతోంది. ఆయన తన బిగ్ బీ టీం పేరుతో నలుగుర్ని ఇలాంటి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసుకుని వారితో సమాలోచనలు చేసి అన్నీ చేసేవారు.
బిగ్ బి అనే ఓ టీం ఉండేదని..తాజాగా సీఐడీ అధికారులకు తెలిసింది. అది వాట్సాప్ గ్రూపుగా నడిచిందా.. మరో గ్రూపుగా నడిచిందా అన్నది తెలియదు కానీ.. ఈ నలుగురు బిగ్ బాస్ టీం. అంటే జగన్ టీం. వారు ఎప్పుడు ఎవర్ని అరెస్టు చేయాలి..ఎవర్ని కొట్టించాలి.. ఎక్కడ సెటిల్మెంట్స్ చేయాలి.. ఎక్కడ దోపిడీ చేయాలన్నది డిసైడ్ చేస్తారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఈ బిగ్ బి టీం గురించి వెలుగులోకి వచ్చింది. తులసిబాబు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
సీఐడీ పోలీసులు ఈ బిగ్ బీ టీంలో ఎవరెవరు ఉన్నారో .. వారేం చేశారో ఆరా తీస్తున్నారు. ఈ టీం వ్యవహారాలపై సమాచారం వెలుగులోకి వస్తే సీఎంవోను ఓ మాఫియా రాజ్యంగా ఎలా మార్చుకున్నారో స్పష్టమవుతుంది. ఈ అంశంపై సీఐడీ పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది. జగన్ రెడ్డి పై కూడా రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు నమోదు అయింది. ఈ దర్యాప్తులో తీగ లాగితే అసలు మాఫియా పాలన దందాలన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
👉పెద్దిరెడ్డి సవాల్ – ప్రభుత్వానిదే ఆలస్యం !
లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు కానీ చర్యలు తీసుకోవడం లేదు అని .. అక్రమార్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేస్తున్నారు. ఓ వైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అరాచకాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇసుక, మైనింగ్, మద్యం స్కాములే కాదు.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబీకులు చేసిన భూకబ్జాలపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లి పైల్స్ తగలబడినప్పుడు ఆయనపై వందల ఫిర్యాదులు వచ్చాయి.కానీ ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. అందుకే పెద్దిరెడ్డి సవాళ్లు చేస్తున్నారు. దమ్ముంటే చర్యలు తీసుకోవాలంటున్నారు.
అంగళ్లలో చంద్రబాబును చంపడానికి పెద్దిరెడ్డి భయంకరమైన కుట్ర చేశారు. రాళ్ల దాడులు చేయించారు. అక్కడ విఫలమయ్యే సరికి పుంగనూరులో దాడులకు పాల్పడ్డారు. అక్కడ టీడీపీ నేతలు తిరగబడ్డారు. దీంతో కొన్ని వందల మందిపై కేసులు పెట్టారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ప్రైవేటు సైన్యం చేసే అరాచకాలు ఎన్ని ఉండేవో అందరికీ తెలుసు. ఆయన సొంత ఇంటికి కూడా రూపాయి ఖర్చు పెట్టరు. ప్రజా ధనంతోనే రోడ్లు ఇతర పనులు చేయించుకుంటారు. ఆయన అక్రమాల గురించి లెక్క తీయాలంటే.. గంటల్లోనే పెద్ద పెద్ద పుస్తకాలు రెడీ అయిపోతాయి…ఆయనపై చర్యల విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో కానీ.. ఆయన కు కొంత మంది టీడీపీ ముఖ్యులతో.. సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో వారు తప్ప అందరూ ఓడిపోవడానికి.. టీడీపీ గెలవడానికి ఆయన పరోక్ష సహకారం ఉందని.. వైసీపీలోనూ చర్చించుకుంటున్నారు. ఇదంతా అబద్దమని ప్రజలకు సంకేతాలు ఇవ్వడానికైనా.. పెద్దిరెడ్డి పాపాలను బయటకు తీసి చర్యలు తీసుకోవాల్సిందే. ఆయన మాఫియా రాజ్యాన్ని అణిచి వేసి..కబ్జాల నుంచి ప్రజల్ని కాపాడాల్సిందే. లేకపోతే అది ప్రభుత్వ చేతకాని తనం అవుతందని చెప్పాల్సిన పని లేదు.
👉ఘట్‌కేసర్: రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి..
ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి అంకుషాపూర్‌లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాలలో సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో రాచకొండ భద్రతా మండలి సహకారంతో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
👉 వైఎస్ వెంకటరెడ్డి గనుల లీజ్ నిలిపివేత !😲😲
వైఎస్ జగన్‌కు సోదరుడి వరుస అయ్యే వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తికి పులివెందులలో మంజూరు అయిన బెరైటీస్ గనుల మైనింగ్ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. ఈ అంశంపై జరిగిన అవకతవకలపై నివేదిక తెప్పించుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జగన్ సోదరుడికి గనులు కేటాయించడం కడప జిల్లాలో సంచలనం అయింది. ఓ టీడీపీ నేత సూచన మేరకే ఈ గనులు అధికారులు కేటాయించారన్న ప్రచారం జరిగింది.
వైఎస్ వెంకటరెడ్డి చాలా ఏళ్ల కిందట గనుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేటాయించలేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఫైల్ ముందుకు కదిలింది. కానీ గనులు మాత్రం కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హఠాత్తుగా అధికారులు అందరూ సెలవులో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ హడావుడిలో ఉన్నప్పుడు లీజులు మంజూరయ్యాయి. దీతో ఆయన మైనింగ్ ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేశారు.
అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో వివాదం అయింది. జగన్ సోదరుడికి ఎలా మైనింగ్ ఇస్తారని.. చాలా మంది టీడీపీ సానుభూతిపరులు అక్కడ మైనింగ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారన్న ఫిర్యాదులు హైకమాండ్ కు వెళ్లాయి. ఈ అంశంపై పూర్తి వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం గనుల మంజూరు ఉత్తర్వులను నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
👉 *అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు..*నువ్వులేకపోతే నేను లేనంటూ ..*పెళ్లిచేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు.. *ఇదంతా నిజమేనని నమ్మింది ఆ బాధితురాలు.. *ప్రేమించినవాడి మాటలు నమ్మి.. తల్లిదండ్రులను సైతం కాదని గడప దాటింది.. *అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలయింది.. పోలీసుల దర్యాప్తు లో బయట పడ్డాయి అసలు విషయాలు*
ఆంద్రప్రదేశ్..అనకాపల్లి జిల్లా..పెద్దాపురం..పెద్దాపురం పట్టణానికి చెందిన నీలిమ..స్థానికంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆమెకు చందు అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపడం..తర్వాత వారిని తన తల్లికి అప్పగించడమే పనిగా పెట్టుకున్నాడు..ఆ కిరాతకుడు…17 ఏళ్ల బాలికను..ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకువచ్చాడు. వాడి ప్రేమ నిజమేనని నమ్మిన బాలిక. .తల్లిదండ్రులను సైతం కాదని వాడితో వచ్చేసింది. బాలికను నమ్మించేందుకు పెళ్లికూడా చేసుకున్నాడు చందు. అయితే అత్తింటికి వచ్చిన తర్వాతే ఆ బాలికకు అసలు విషయం తెలిసింది.
వ్యభిచార కూపంలోకి దిగాలంటూ బాలికను బలవంతం చేసింది..చందు తల్లి నీలిమ. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురవడంతో.. స్థానిక ఆర్‌ఎంపీతో వైద్యం చేయించింది. దీంతో బాధితురాలు మరింత అనారోగ్యానికి గురయింది. శారీరక బాధలతోపాటు తల్లి, కొడుకులు పెట్టే చిత్రహింసలు భరించలేక..గత నెల 28న చీమల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో చికిత్స కోసం బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక..కాళ్లు, చేతులు వంకర్లు పోయి కదలలేని స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు..ఆమెను ప్రస్తుతం విశాఖలోని విమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక మానసిక స్థితి కూడా క్షీణించడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా స్థానికంగా ఉన్న వ్యభిచార గృహాలపై పోలీసులు నిఘా పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు మామూళ్ల మత్తులో జోగడం వలనే అమాయకుల జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడుతున్నారు స్థానికులు. మరోవైపు వ్యభిచార గృహాలపై రెయిడ్స్ చేసే అధికారం కేవలం ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారికే ఉందన్న విషయం తెలిసీ..నిర్వాహకులు కిందిస్థాయి పోలీసులను పట్టించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికైనా పెద్దాపురంలో వ్యభిచార వృత్తిని కూకటివేళ్లతో పెకలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు…*ఏకంగా సీబీఐ నుంచి ఫోన్ కాల్… ఆలోచించి లిఫ్ట్ చేయగా సీన్ సితారయ్యింది…తిరుపతి జిల్లా పోలీసులును ఆశ్రయించగా వారి స్టైల్ లో విచారణ చేపట్టి..కటకటాల్లోకి పంపారు…జిల్లా పోలీస్ బాస్ లు*
👉డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠా ఆట కట్టించారు తిరుపతి జిల్లా పోలీసులు..ఆంద్రప్రదేశ్…తిరుపతి జిల్లా….ముంబై క్రైమ్ పోలీసులమని, సీబీఐ అధికారులమంటూ ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ ముఠాను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతికి చెందిన 65 ఏళ్ల మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్, వాట్సాప్ వీడియో కాల్స్ చేసి, ఢిల్లీ సీబీఐ అధికారులమని రూ 200 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. బాధితరాలు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని భయభ్రాంతులకు గురి చేసారు. వివిధ అకౌంట్లకు నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీలాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయ మాటలు చెప్పారు. ఇలా నమ్మించి ఆమె వద్ద నుంచి రూ 2.5 కోట్లు నగదును వివిధ అకౌంట్లలో జమ చేసుకున్న కేటుగాళ్లు ఆ తర్వాత స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు బాధిత మహిళ గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 13న తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే ఈ కేసులో రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ని అరెస్ట్ చేసి రూ 24.5 లక్షల నగదు, ఒక XUV 700 కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్‌లు, 16 గ్రాములు బంగారంతో పాటు సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లలో ఉన్న బాధిత మహిళకు చెందిన రూ 26 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేసారు.
కేసు దర్యాప్తులో భాగంగా మరింత పురోగతి సాధించిన పోలీసులు బుధవారం ఆరుగుర్ని అరెస్ట్ చేసారు. మరో రూ 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్‌లు, 2 ల్యాప్‌టాప్, ఒక సిమ్ మొడ్యుల్స్, 8 రూటర్లు అకౌంట్‌లలో ఉన్న బాధితురాలి డబ్బు రూ 10 లక్షల నగదు ఫ్రీజ్ చేసారు…ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులుగా అవతారం ఎత్తి అడ్డంగా బుక్ అయ్యారు. మీడియేటర్ సహాయంతో కంబోడియాకు వెళ్ళి అక్కడ కస్టమర్ సపోర్ట్‌గా పని చేస్తూ, టెక్నాలజీ ఉపయోగించి సైబర్ క్రైమ్‌పై అవగాహన పెంచుకున్న విశాఖపట్నంకు చెందిన ముఠా సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు…విశాఖపట్నంలో ఒక రూమ్‌ను అద్దెకు తీసుకుని సైబర్ నేరానికి ఉపయోగపడేలా ఏర్పాట్లు చేసుకుని ఈ తతంగం నడిపించారు. సిమ్ మోడ్యూల్, రూటర్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటిదాకా ఈ కేసులో ఈ నెల 21న ఒకర్ని, బుధవారం మరో 6 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు రూ.57 లక్షల నగదు, రూ 38 లక్షల విలువ చేసే బంగారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న బాధిత మహిళకు చెందిన రూ 36 లక్షల నగదును కూడా ఫ్రీజ్ చేసారు. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల కేసుల సంఖ్య పెరుగుతూ ఉందన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. తెలియని నెంబర్ల నుంచి వాట్సప్ వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దన్నారు ఎస్పీ. సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదంటే 112, తిరుపతి పోలీసు వాట్సాప్ నెంబర్ 80999 99977కు ఫోన్ చేసి సాయం పొందాలన్నారు.
👉.రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి ని చంపేశాడు వీడు మనిషేనా… పోలీసుల విచారణ లో తేలిన నమ్మలేని నిజాలు! ..*ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా…. కనురెప్పే కాటేసింది.. రక్షించాల్సిన సోదరుడే కర్కశంగా చంపేశాడు.. అదీ ప్లాన్ చేసి మరీ హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్ళాడు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్‌రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు.. సంధ్య (25) కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది.. పునుగోడులోని తన అన్న అశోక్‌రెడ్డితో కలిసి ఉంటోంది. అశోక్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అప్పులు చేసి పీకల్లోతు ఆర్దిక కష్టాల్లో ఉన్నాడు. ఒకవైపు భర్తకు దూరమై తన ఇంట్లో ఉన్న చెల్లెలు, మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు అశోక్‌రెడ్డిని రాక్షుసుడిలా మార్చాయి. ఇటు చెల్లెల్ని వదిలించుకోవడమే కాకుండా ఆర్ధికంగా లబ్ది పొందవచ్చన్న దురాలోచనలతో పన్నాగం పన్నాడు..
చెల్లెలి పేరుతో పలు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆమెకు 1.13 కోట్ల రూపాయల వరకు జీవిత భీమా చేయించాడు. ఆపై ఆమెను చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తే భీమా సొమ్ముతో అప్పులు తీర్చేయవచ్చన్న కుట్ర పన్నాడు. అనుకుందే తడవుగా ప్లాన్ అమల్లో పెట్టాడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెల్ని ఒంగోలులోని ఆసుపత్రిలో చికిత్స పేరుతో తీసుకెళ్ళాడు. ఏడాది క్రితం 2024 ఫిబ్రవరి 4న ఒంగోలులోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. తిరిగి స్వగ్రామం కనిగిరి మండలం పునుగోడుకు వచ్చే క్రమంలో దారి మద్యలో చెల్లెలు సంధ్యకు మత్తుబిళ్ళలు ఇచ్చి ఆపస్మారక స్థితికి వెళ్ళేలా చేశాడు. అనంతరం మార్గమధ్యంలో పొదిలి మండలం కాటూరివారిపాలెం దగ్గర కారును చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్ అయినట్టు మభ్యపెట్టాడు. మత్తులో ఉన్న చెల్లెలు గొంతునులిమి చంపేశాడు.. తనకు స్వల్ప గాయాలయ్యాయని గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు.
ఆ భయమే పట్టించింది.. కారు యాక్సిడెంట్‌లో తన చెల్లెలు సంధ్య చనిపోయినట్టు నమ్మబలికిన అశోక్‌రెడ్డి ఆ తరువాత పోస్టుమార్టంలో అసలు నిజం బయటపడుతుందని భయపడ్డాడు… తన స్నేహితుడు మాలకొండారెడ్డికి ఈ విషయం చెప్పి సాయం చేయమని కోరాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం తన చెల్లెలు సంధ్య యాక్సిడెంట్ కారణంగా చనిపోయిందని చిత్రీకరించేందుకు పోస్టుమార్టం విధుల్లో ఉన్న ఆసుపత్రి ఉద్యోగికి 3 లక్షలు లంచం ఇచ్చాడు. అనుకున్న ప్రకారం సంధ్య అవయవాలను మార్చి రిపోర్ట్ పంపేలా చేశాడు. అయితే ఈ అవయవాల రిపోర్ట్‌ను ఇచ్చేందుకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్న కారణంగా వైద్యులు తాత్సారం చేశారు. కొన్నాళ్ళు గడిచిన తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అశోక్‌రెడ్డి వైద్యులను వత్తిడి చేయడం ప్రారంభించాడు …అశోక్‌రెడ్డి ప్రవర్తనపై పోస్టుమార్టం చేసే వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అశోక్‌రెడ్డిపై నిఘాపెట్టారు. అశోక్‌రెడ్డికి తెలియకుండా విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో అశోక్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా భీమా డబ్బుల కోసం చెల్లెల్ని హత్యచేసినట్లు తేలడంతో అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌రెడ్డికి సహకరించిన అతని స్నేహితుడు మాలకొండారెడ్డి, లంచం తీసుకున్న ఆసుపత్రి ఉద్యోగి యూసుఫ్‌ల కోసం గాలిస్తున్నట్టు పొదిలి సిఐ టి. వెంకటేశ్వర్లు తెలిపారు
👉 ఏపీ ఎన్నికలను తలపిస్తున్న ఢిల్లీ ప్రచారం! 😲😲మరో వారం రోజుల్లో దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి నుంచి 5 రోజుల్లో ప్రచార పర్వం కూడా ముగియనుంది… మరో వారం రోజుల్లో దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి నుంచి 5 రోజుల్లో ప్రచార పర్వం కూడా ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కీలక పార్టీలైన.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు తారస్థాయికి చేరింది. పథకాల నుంచి విమర్శల వరకు.. నాయకులు ఎక్కడా తల ఒగ్గడం లేదు. ఎవరికివారు.. దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. యమునా నదిలో విషం కలుపుతున్నారంటూ.. ఢిల్లీ మాజీసీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, ఇదే యమునను అడ్డు పెట్టుకుని ప్రధాని మోడీ ఎదురుదాడి చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఏకంగా కేజ్రీ వాల్ ఆస్తుల పైనే విమర్శల ఎక్కు పెట్టింది. వెరసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ అధికారం చేజార్చుకోరాదని ఆప్ ప్రయత్నిస్తోంది. కానీ, గత అస్థిత్వాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక, మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మోడీ కూడా అంతే సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎవరిదనే అంచనాలు.. లెక్కలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. ప్రస్తుతం అధికంగా ఓటు బ్యాంకు ఉన్న అగ్రవర్ణాలపై అధికార పార్టీ.. ఆప్, కాంగ్రెస్‌లు ఆధారపడ్డాయి. ఉత్తరాది బ్రాహ్మణులను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక, పటేళ్లు, గుజ్జర్లు వంటి బీసీ సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈ మూడు పార్టీలు కూడా.. ఉచిత పథకాల ప్రకటనల్లో ఎవరికివారు మించి పోయారు. వెరసి..
మరో నాలుగు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్నా.. ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారనే విషయంపై తల పండిన మేధావులు కూడా పక్కా అంచనాకు రాలేక పోతున్నారు. తనపై కేసులు పెట్టి వేధించారంటూ.. సింపతీని రంగరిస్తున్న కేజ్రీవాల్, తమ పాలనను చూడలేదా.. ఎన్నో చేశామంటూ.. కాంగ్రెస్ తెరుస్తున్న గత చరిత్ర పుస్తకాలు.. ఈ రెండు పార్టీలూ ఒక్కటే.. మేమే అసలైన అభివృద్ధి చోదకులం అంటూ.. కమల నాథులు చేస్తున్న ప్రచారం వంటివి ఢిల్లీ వాసులకు ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది బిగ్ టెస్ట్‌గా మారిపోయింది.
👉గ్యాస్ సిలిండర్ పేలి మూడేళ్ల చిన్నారి సహా భార్యాభర్తల మృతి..
గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు చెందిన వలస కూలీలు గ్యాస్ సిలిండర్ పేలడంతో మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రం ముంద్రాలో ఈ దుర్ఘటన జరిగింది. ముంద్రాకు బతుకు తెరువు కోసం వెళ్లిన వలస కూలీలు లండ రవి (38), అతని భార్య లండ కవిత (31), కుమారై లండ జాహ్నవి (3)లు మృత్యువాత పడ్డారు. రవి టీ తాగడానికి గదిలో ఉన్న గ్యాస్ పొయ్యిని వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

