👉 ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడం బాధాకరం*
మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2014 డిసెంబర్ లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి 5న ముంబై వెళ్లగా అక్కడ చంద్రభాను అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి కాల్చి చంపేయడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరి శిక్ష వేయడం, దాన్ని ముంబై హైకోర్టు కూడా సమర్ధించిందన్నారు.
👉 వక్ఫ్ బోర్డులో సవరణలకు.. *JPC ఆమోదం* వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు 2024పై చివరి దశకు *జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం ..ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ భవనంలో ఛైర్మెన్ జగదాంబికా పాల్ అధ్యక్షతన JPC కీలక భేటీ..పాల్గొన్న JPC సభ్యురాలు, మహబూబ్ నగర్ ఎంపీ Dk. అరుణ..ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు JPC సభ్యుల ఆమోదం..త్వరలో పార్లమెంట్ కు తమ నివేదిక అందజేయనున్న JPC..వక్ఫ్ సవరణలకు ఆమోదం తర్వాత సభ్యుల ఇష్టాగోష్టి
👉ఆయుధాల పనితీరుపై పోలీసులు తమ జ్ఞానాన్ని పెంచుకోవాలి — కడప జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్,
కడప జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్, ఐపీఎస్., పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ విధుల్లో ఉపయోగించే ఆయుధాల పనితీరుపై వారి జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో ఎ.ఆర్. పోలీసు సిబ్బందికి సమీకరణలో భాగంగా కాల్పుల సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈరోజు కాల్పుల సాధనలో పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఏకే-47, మసాడ, మరియు గ్లోక్ పిస్టల్స్‌తో కాల్పుల సాధన చేశారు. ‘వజ్ర’ వాహనం నుండి కాల్పులు జరిపి గ్యాస్ షెల్స్‌ను ఆయన పరిశీలించారు. ఆయుధ నైపుణ్యాలను ఆయన పరీక్షించారు. కాల్పుల సాధనలో, ఈ ప్రాక్టీస్ సెషన్‌లో పోలీసు సిబ్బంది నైపుణ్యాలను ఆయన పరిశీలించారు. కాల్పుల్లో ప్రతిభ చూపిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ ఈ.జి.అశోక్ కుమార్ అభినందించారు. అధికారులు మరియు సిబ్బందికి కాల్పుల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ కాల్పుల్లో పాల్గొని మంచి నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆయన కోరుకున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సేవలు చాలా కీలకమైనవని ఆయన అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడానికి పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ బి. రామన్నయ్య, AR DSP శ్రీనివాసరావు, RIలు ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, టైటాస్, RSI పాల్గొన్నారు.
👉సూర్యాపేట జిల్లా..*పరువు హత్య కేసును చేదించిన పోలీసులు..ప్రేమ, కులాంతర వివాహమే కారణం.. ఒక మహిళతో సహా మొత్తం 6 గురు నిందితులు.. అరెస్ట్.. రిమాండ్..ఎర్టిగా కారు.. కత్తి, 5 మొబైల్స్ స్వాధీనం .. పథకం ప్రకారమే 26 సాయంత్రం బైరు మహేష్ అనే వ్యక్తి వడ్లకొండ కృష్ణ (మాల బంటి)ని ఇంటినుంచి బయటకు తీసుకెళ్లాడు..సూర్యాపేట శివారు ప్రదేశంలో భార్గవి అన్న కోట్ల నవీన్, తమ్ముడు కోట్ల వంశీ తో కలిసి చేతులు పట్టుకుని బండ రాళ్ళతో కొట్టి హత్య..అనంతరం ఆమె తండ్రి కోట్ల సైదులు, నానమ్మ కు సమాచారం ఇచ్చారు.. డెడ్ బాడీ ని ఎర్టిగా కారులో తీసుకుని ముందుగా పాత సూర్యాపేట కు తీసుకెళ్లి నానమ్మ కోట్ల బుచ్చమ్మ కు చూపించారు.. అక్కడ నుంచి మృతదేహన్ని నల్లగొండ కు తీసుకెళ్లి నువ్వుల సాయిచరణ్ అనే స్నేహితునికి చూపగా భయంతో పారిపోయాడు.. తిరిగి మృతదేహన్ని మళ్ళీ సూర్యాపేట కు తీసుకువచ్చి పిల్లలమర్రి శివారులో మృతదేహన్ని అతని స్కూటీ పక్కన వదిలి వెళ్లిపోయారు.విషయం తెలుసుకున్న పోలీసులు 6గురుని అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే మూడుసార్లు హత్యకు యత్నించి విఫలమయ్యారు.. గతంలోనూ ఆరుగురు నిందితులతో పాటు మృతుడిపై కూడా పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు..
👉 ఏసీబీ వలలో లింగంపేట్ ఎస్ఐ సుధాకర్.. నిజామాబాద్ ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్.ఐ. సుధాకర్ చిక్కారు. వాహనాలు అమ్మకాలు, కొనుగోలు చేసే వ్యాపారి నుంచి 12 వేలు లంచం అడిగిన ఎస్.ఐ. సుధాకర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద 12 వేలు లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డరు. ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
👉అమరావతి డీజీపీగా మళ్లీ హరీశ్ కుమార్ గుప్తా.. ఒకటిన బాధ్యతలు స్వీకరణ..రేపటిలోపు అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం?..రెండ్రోజుల్లో తిరుమలరావు పదవీవిరమణ.. రాష్ట్ర నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం దాదాపు ఖరారైంది. ఈ నెల 31న పదవీ విర మణ చేయబోతున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయన్ను ప్రభు త్వం ఎంపిక చేసినట్లు విశ్వస నీయంగా తెలిసింది.
👉గీతం స్కూల్ హ్యాకథాన్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన విద్యార్థులు.. శిoగరాయకొండలోని గీతం స్కూల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8, 9 తేదీల్లో జరగబోయే “హ్యాకథాన్ 2025” కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ను విద్యార్థులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అధికారికంగా ఆహ్వానించారు.విద్యార్థులు ఈ సందర్భంగా హ్యాకథాన్ ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, ఇది యువతలో ఆవిష్కరణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రితో పాటు, ప్రకాశం జిల్లా విద్యా శాఖ అధికారి ఏ . కిరణ్ కుమార్, రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా మరియు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి లను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ఈ హ్యాకథాన్‌లో రొబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్‌మెంట్ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా, ఆర్డ్యునో ఆధారిత ప్రాజెక్టులు, స్మార్ట్ డివైసెస్, సెక్యూరిటీ సిస్టమ్స్, హోమ్ ఆటోమేషన్, సేఫ్ లాకింగ్ అప్లికేషన్లు వంటి వినూత్న ప్రాజెక్టులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.ప్రిన్సిపాల్ లక్ష్మణ్ మాట్లాడుతూ, హ్యాకథాన్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ముఖ్య అతిథుల హాజరు తో, యువత సాంకేతిక రంగంలో ముందుకు సాగేందుకు మరింత ఉత్సాహం పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
👉 మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అమరావతిలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలసు పార్థసారథి ని కలసి మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ ఫేజ్ -1,ఫేజ్ -2 గృహాల సముదాయాలలో మౌలిక సదుపాయాలైన మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ కల్పనకు 33 కోట్ల రూపాయల అంచనాలు తయారుచేసి ఇవ్వడం జరిగింది. త్వరలోనే దీనికి ఆమోదం రానున్నది. ఎన్నో సంవత్సరాల నుండి మూలనపడ్డ ఇందిరమ్మ ఫేజ్ -1, ఇందిరమ్మ ఫేజ్ -2 గృహ సముదాయాలకు మహర్దశ పట్టనుంది.
👉 కంభం చెరువు అభివృద్ది, విమానాశ్రయం, సంగీత – నృత్య కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రిని కలసిన మాగుంట..నిన్న పార్లమెంట్ సభ్యులతో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో భాగంగా ఉండవల్లి లోని ముఖ్యమంత్ర్రి కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు ను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కలసి ఒంగోలు దగ్గర విమానాశ్రయం, ఒంగోలులో మ్యూజిక్ – డాన్స్ కాలేజీ మరియు గిద్దలూరు నియోజకవర్గం లోని కంభం చెరువు అబివృద్ధితోపాటు చెరువులోని 8 కొండలకు అష్టదిగ్గజాల పేర్లు పట్టడం గురించి లిఖిత పూర్వకంగా కోరినారు.ఒంగోలు దగ్గర విమానాశ్రయం ఏర్పాటకు ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్ర్రి గారికి మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగారికి మాగుంట శ్రీనివాసులురెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం ఏర్పాటపై కేంద్ర నిపుణుల బృందం రాష్ట్ర నాయకులు మరియు అధికారులలో కలసి 22-01-2025 తేదీన ఒంగోలు సమీపంలోని అల్లూరు – ఆలూరు మధ్యన వున్న 657 ఎకరాల స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, ఇందులో ప్రభుత స్థలం పోను మిగతా స్థలానికి కేవలం రూ. 115 కోట్లు సరిపోతాయని, కనుక కేంద్ర పౌర విమానయాన మంత్రిని , అధికారులతో సంప్రతించి విమానాశ్రయాన్ని మంజూరు చేయించాలని కోరినారు.
👉ఒంగోలు పట్టణం సాంస్క్రుతిక మరియు ఆధాత్మిక వారసత్వానికి ప్రతీకయని, భారతీయ సంగీత త్రయంలో, ఇద్దరు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళాకారులు – త్యాగరాజస్వామి మరియు శ్యామ శాస్త్రి ప్రకాశం జిల్లాకు చెందినవారని, కనుక జిల్లాలోని ఔత్సాహిక విద్యార్దులు – కళాకారులకు నాణ్యమైన శిక్షణ ఇచ్చుటకు సంగీతం మరియు నృత్యం విద్యల కళాశాలను ఒంగోలులో ఏర్పాటుచేయాలని మరియు శ్రీకృష్ణదేవరాయల వారి శకంలో గుండ్లకమ్మ – జంపలేరు నదుల గుండా కంభం మరియు బేస్తవారిపేట మండలాలలోని 19 గ్రామాలలోని 6,944 ఎకరాల ఆయకట్టుతో నిర్మించబడ్డ “ప్రపంచ వారసత్వ” కంభం చెరువు అభివృద్ధికి రూ.9.585 కోట్లు మంజూరు చేసి, చెరువులో వున్న 8 చిన్న కొండలకు అష్టదిగ్గజాలు : అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయగారి మల్లన్న, దూర్జటి, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణ పేర్లు పెట్టవలసినదిగా లిఖిత పూర్వకంగా కోరినారు. దానికి ముఖ్యమంత్ర్రి సానుకూలంగా స్పందించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
👉 యాచవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి ఆధ్వర్యంలో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠశాలప్రధానోపాధ్యాయులు పత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్ని ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు బి రవి తేజ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో చదివి పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలి అని అన్నారు చదువుఉన్నత స్థాయికి చేరుస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేసిన చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ ను అభినందించారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి అని అన్నారు ఈ సందర్భంగా మాగులూరి శ్రీకాంత్ సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి వి కృష్ణయ్య వై శ్రీనివాసులు షేక్ సనావుల్లా కే గురవయ్య టి కాశి రావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
👉 పల్నాడు జిల్లా:చిలకలూరిపేటకి చెందిన తన భర్త పుల్లగూర సుధీర్ నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ హైదరాబాద్ కు చెందిన మౌనిక అనే మహిళ నరసరావుపేటలోని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను వేడుకుంది. చిలకలూరిపేట సాంబశివ నగర్ కు చెందిన పుల్లగుర సందీప్ తో 10 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. అయితే గత రెండేళ్లగా వేరోక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. పిల్లలను చదివించుకుంటూ వారింట్లో నివాసం ఉంటున్న తనను బెదిరిస్తున్నారని తెలిపింది. పిల్లలతో పాటు తనకు ఎటువంటి ప్రాణహాని జరిగిన భర్తదే పూర్తి బాధ్యత అన్నారు..
👉భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నం.. హైదరాబాద్‌లో భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ప్రణీత అనే మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం…సెల్ఫీ వీడియోలో వేధింపుల గురించి ప్రస్థావిస్తూ కన్నీటి పర్యంతమై, ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రణిత..కర్మన్ ఘట్ – జీవన్ ఆసుపత్రికి తరలింపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితురాలు
👉దేవుని కడప ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్*
⭐వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన ఎస్పీ.. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 4 న రథసప్తమి నాడు జరుగనున్న రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఎస్పీ ఆదేశం..* రథోత్సవం జరిగే మార్గాన్ని కాలినడకన పరిశీలించిన ఎస్పీ..* సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని చిన్నచౌకు సీఐ ఓబులేసు కు సూచించిన ఎస్పీ..

