👉మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ దందాపై సిబిఐ విచారణ జరపాలి సిపిఐ (ఎంఎల్) డిమాండ్…👉👉కేటీఆర్ ఓ బచ్చా ఆయనతో నాకేంటి : మంత్రి కోమటిరెడ్డి .. 👉హైదరాబాద్ నడిబొడ్డున కీచకపర్వం..*తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా…👉మహా కుంభమేళాలో తొక్కిసలాట..*నరసరావుపేటలో ” చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్”…👉*రూ.17.60 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం*..👉రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు..👉తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు! .. *కు ని ఆపరేషన్ వికటించి మహిళ మృతి ..👉గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

👉మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో దారుణం…కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి గాజుల పావని(32) వివాహిత అకాల మృతి…కు.ని ఆపరేషన్ చేస్తూ…తెనాలి వైద్యుని నిర్గక్షం.

చిన్న ప్రేగుకు, యూరినరీ బ్లాడర్ కు 2.5cm×2.5cm గాయంచేసి…నిర్లక్ష్యం గ వ్యవహరించిన తెనాలి వైద్యులు.
మహిళ శరీరం ఒక్క రోజు వ్యవధిలోనే…విషితుల్యమై… సెప్టసీమియా కారణంగా షాక్ లోకి వెళ్లిన గాజుల పావని…హుటాహుటిన..గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు….వైద్యుల చివరి ప్రయత్నం ఫలించని కారణంగా మృతి.
పోస్టుమార్టం కోసం శవాగారానికి తరలింపు.
👉*మహబూబాబాద్ జిల్లా..**మెరిసిన బంగారు తేజం….*10 కిలోమీటర్లు 34 నిమిషాల్లో….* *తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాళ్ళో మానుకోట జిల్లాకు బంగారుపతకం…*అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS*మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లింగన్న కరీంనగర్ లో జరుగుతున్న మూడవ తెలంగాణా రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పది కిలోమీటర్ల పరుగుపందెంలో బంగారుపతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 34నిమిషాల్లోనే పదికిలోమీటర్ల పరుగును పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించారు.

విజేతగా నిలిచిన ఏఆర్ కానిస్టేబుల్ లింగన్నను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ అభినందించారు.
👉గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..గౌలిదొడ్డి TNGO’S కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచారం.. వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారుల దాడులు..కెన్యా, టాంజానియా, బ్యాంకాక్‌కు చెందిన యువతులతో వ్యభిచారం..9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు… వ్యభిచార గృహం నిర్వాహకుడి వేటలో పడ్డ మాదాపూర్ ఎస్ఓటీ టీమ్..

👉ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
తెలంగాణ : ప్రియుడి వేధింపులు భరించలేక ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HYD మల్లాపూర్‌‌కు చెందిన పూజిత (21) ఇంద్ర చరణ్‌రెడ్డి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. అయితే గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ చరణ్ రెడ్డి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో మనస్తాపానికి గురైన పూజిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్మకు చేసుకుంది. పోలీసులు యువకుడిని రిమాండ్‌కు తరలించారు.
👉భార్యను చంపిన ఘటన.. సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ : హైదరాబాద్ మీర్‌పేట్‌లో వెంకటమాధవి మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు ఆమె భర్త గురుమూర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసు వివరాలను వెల్లడించిన సీపీ సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రెస్‌మీట్ పెట్టే ముందు మరోసారి అతడిని చూసేందుకు వెళ్లా. పర్సనాలిటీ బాగుంది. చాలా అందంగా కూడా ఉన్నాడు. నార్మల్‌గానే ఉన్నాడు కానీ బిహేవియర్ మాత్రం క్రూయల్’ అని అన్నారు.
[👉ముంబైలో పెట్రో వాహనాలపై నిషేధం?

ముంబైలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెట్రోలు, డీజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేవలం సీఎనీ వాహనాలను, ఈ-వాహనాలను మాత్రమే అనుమతించాలని తెలుస్తోంది. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్కుమార్ శ్రీవాస్తవ నాయకత్వంలోని ఈ కమిటీ మూడునెలల్లో తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పిస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ : డీఈఈల పదోన్నతులకు లైన్ క్లియర్!

ఆంధ్రప్రదేశ్ : డీఈఈల పదోన్నతులకు లైన్ క్లియర్!
ఆంధ్రప్రదేశ్ : జలవనరుల శాఖలో ఇంజనీరింగ్ అధికారుల పదోన్నతులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు తెలుస్తోంది. సీనియారిటీ విషయంలో ఇంజనీరింగ్ అధికారుల మధ్య వివాదాలు తలెత్తి న్యాయ పోరాటాలు చేస్తున్న తరుణంలో మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు తదితరులతో సమీక్షించారు. త్వరలోనే పదోన్నతులు కల్పించించనున్నట్లు తెలుస్తోంది.
👉మహా కుంభమేళాలో తొక్కిసలాట..మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు..భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట… దాదాపు 20 మంది మృతిచెందినట్టు సమాచారం.. తీవ్రంగా గాయాలపాలైన పలువురు భక్తులు

👉తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి మరిన్ని దారుణాలు! … గత ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్…త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌పై నిఘా…ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆధారాలు ..కీలక నిందితుడి ఫోన్ విశ్లేషణతో వెలుగులోకి మరిన్ని విషయాలు .. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన విషయం ఇటీవల బయటపడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరువక ముందే, ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక నిందితుడి సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది..నిందితుల ఫోన్లలో ఇద్దరు న్యాయమూర్తుల ఫొటోలతో పాటు వారి పూర్తి ప్రొఫైల్స్ ఉన్నాయి. వారు ఎక్కడ జన్మించారు? ఎక్కడ చదువుకున్నారు? కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగ ప్రస్థానం వంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. వారి నంబర్ల కాల్ డిటైల్ రికార్డ్స్ (సీడీఆర్)తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్)ను కూడా నిందితుడు సేకరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా, వాయిస్ కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ మెయిల్స్, చాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వంటి వివరాలను తెలుసుకోవడానికి నిఘా పెట్టినట్లు కూడా తేలింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. పలువురు ప్రతిపక్ష నేతలు, హైకోర్టు న్యాయమూర్తితో పాటు ఆయన భార్య ప్రొఫైల్‌ను కూడా నిందితులు రూపొందించి వారి సెల్‌ఫోన్లపై నిఘా ఉంచిన విషయం బయటపడింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇప్పుడు మరో ఇద్దరు న్యాయమూర్తులపై నిఘా పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది.

👉*కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరం*

*హైదరాబాద్ నగరంతో పాటు ఏపీ, తమిళనాడులో సైతం లింకులు*ఇప్పటివరకు 13 మందిని నిందితులుగా తేల్చిన పోలీసులు**ప్రధాన నిందితుడు సర్జన్ రాజశేఖర్ అరెస్ట్, రిమాండ్**విశాఖలో కిడ్నీ మార్పిడి కేసులో 2023లో అరెస్ట్ అయిన డాక్టర్ రాజశేఖర్*

👉గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..తెలంగాణ : రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 84 మంది విద్యార్థులకు అస్వస్థత..!!!

వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మంచం పట్టిన విద్యార్థులు..ఈ విషయాన్ని తొక్కిపెట్టి బయటకు పొక్కకుండా విద్యార్థులను బెదిరించిన ప్రిన్సిపల్ ..జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు వడ్డించగా.. వాటిని తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు..హాస్టల్లోనే నర్సు సాయంతో వైద్యం చేయించేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్. ఈ క్రమంలో కొంత మంది పరిస్థితి సీరియస్ కావడంతో వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించడంతో బయటకు పొక్కిన విషయం…విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు వెంటనే వెళ్లగా గురుకులానికి తాళం వేసి వాళ్లను అడ్డుకున్న ప్రిన్సిపల్…పోలీసులను పిలిపించిన తర్వాత తల్లిదండ్రులను లోపలికి వదిలిన ప్రిన్సిపల్.. కనీసం సమాచారం ఇవ్వక పోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం.

👉రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు..ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు..రామ్ గోపాల్ వర్మ వాట్సప్‌కి నోటీసు పంపిన రూరల్ సీఐ శ్రీకాంత్

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వర్మ ..నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు ..నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన వర్మ… *డబ్బున్న వారు ఎలాగైనా చెలాయించుకుంటారు కదా..

👉*రూ.17.60 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం*

అమ‌రావ‌తి క్రైం:- అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వార‌కాతిరుమ‌ల‌రావు ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారంనాడు అన‌కాప‌ల్లి పోలీసులు 459 గంజాయి కేసులకు సంబంధించి సుమారు రూ.17 కోట్ల 60 లక్షల విలువైన 35,000 వేల కేజీల గంజాయిని, 39 కేజీల హాషిష్ ఆయిల్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. మొత్తం కేసుల సంఖ్య 459. గంజాయి మొత్తం పరిమాణం 34,419 కిలోలు. హాషిష్ ఆయిల్ మొత్తం పరిమాణం 39.4 లీటర్లు. అరెస్టయిన మొత్తం వ్యక్తులు 1,304 మంది. స్వాధీనం చేసుకున్న మొత్తం వాహనాలు 205. 1,000 కిలోల కంటే పైగా ఉన్న కేసులు 9. 1,000 కిలోల కంటే తక్కువ ఉన్న కేసులు 446. హాషిష్ ఆయిల్ కేసులు 4 ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల వివరాల‌కు సంబంధించి మొత్తం 1,304 మంది నిందితుల్లో 871 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా.. 433 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు. కార్యక్రమంలో ఈగల్ డైరెక్టర్ ఐజిపి అకే రవి కృష్ణ, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఈగల్ ఎస్పీ కె.నగేష్ బాబు, అదనపు ఎస్పీ కె.ధీరజ్, అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, అనకాపల్లి ఆర్డిఓ షేక్ ఆయేషా, డీఎస్పీలు బి.అప్పారావు, వి.విష్ణు స్వరూప్, పి.శ్రీనివాసరావు, శ్రావణి, ఇ.శ్రీనివాసులు, పరవాడ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు గంజాయి ధ్వంసం కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉*పల్నాడు జిల్లా ..నరసరావుపేటలో ” చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్”…*చెన్నైలో యాచక వృత్తి ముసుగులో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా…* *నరసరావుపేట ముఠాని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు…*అంజమ్మ,వీరమ్మ, ఉమా,సరస్వతిలు అరెస్ట్…*ఈనెల 12న సెంట్రల్ రైల్వే స్టేషన్ లో అసోంకు చెందిన సఖిబుద్దిన్ ను కిడ్నాప్ చేసిన మహిళ కిడ్నాపర్లు…*

👉*సీసీ కెమెరాలలో మహిళ కిడ్నాపర్ లను గుర్తించి అరెస్టు…**కిడ్నాపర్లది నరసరావుపేట,కొండకావూరు, ఎక్కలవారిపాలెం, యల్లమంద గా గుర్తింపు…*

*నరసరావుపేట లో మహిళ కిడ్నాపర్ల అరెస్ట్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పల్నాడు పోలీసులు.*

*తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా…* హైదరాబాద్, జనవరి 29…* తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల* ఫిబ్రవరి 3న నోటిఫికేషన్* ఫిబ్రవరి 27న ఓటింగ్*.. మార్చి 3న ఫలితాలు

👉హైదరాబాద్ నడిబొడ్డున కీచకపర్వం..కాలేజీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసిన ప్రిన్సిపల్, క్లర్క్ ..బేగంపేట్ మహర్షి కాలేజీలో ఘటన.. కాలేజీ ముందు బాధితురాలుతో సహా విద్యార్థుల ఆందోళన..

👉వద్దురా నాయన.. కిషన్ రెడ్డి పాలన అంటూ గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యుల ధర్నా..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్యాంక్‌బండ్‌ ప్రోగ్రాం బోటు ప్రమాదంలో మరణించిన అజయ్ అనే యువకుడు

సికింద్రాబాద్ – గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యుల, బంధువుల ధర్నా ..కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్..

👉వరంగల్‌లో‌ ఉగ్రవాదుల కలకలం..వరంగల్‌లో జక్రియా అనే వ్యక్తికి పాకిస్థాన్‌ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు..జక్రియాను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..కొంతకాలంగా వరంగల్‌ శివనగర్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద బిర్యానీ సెంటర్‌ నడుపుతున్న జక్రియా..కొన్నేళ్లుగా పాక్‌ ఉగ్రవాదులతో జక్రియా సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించిన నిఘావర్గాలు

👉రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకే రక్షణ కరువు..??నా వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీని తిట్టిన రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఇది కాంగ్రెస్ రాజ్యాంగం అంటూ చేతులతో నెట్టేసి ఏసీపీపై దాడికి దిగిన ఎమ్మెల్యే అనుచరులు..చోద్యం చూస్తూ ఏసిపికే గొడవ వద్దంటూ సర్దిచెప్పిన తోటి పోలీసులు…ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లోద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు..తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడంటూ ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులుని తిట్టిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఇది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం అంటూ జాన్ నర్సింహులు ను  నెట్టేస్తూ, దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు..

👉మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ దందాపై సిబిఐ విచారణ జరపాలి.👉ఆక్రమిత అటవీ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి..ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం, మంగళంపేట సమీపంలోని అడవుల్లో అటవీ భూముల ఆక్రమణలపై తక్షణం సిబిఐ విచారణ జరిపించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకటరత్నం, రామశెట్టి వెంకయ్యలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అడవిలో సర్వేనెంబర్ 295లో 17.69 ఎకరాలు, సర్వేనెంబర్ 296లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ (ఎఫ్ఎంబి)లో రికార్డు అయి ఉందన్నారు. ఆ సర్వే నెంబర్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి లక్ష్మిరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మల పేరు మీద 2000, 2001 వ సంవత్సరంలో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయడం వెనుక భారీ భూ దందా నడిచినట్లుగా స్పష్టంగా అర్థమవుతోందన్నారు. వారి భూమి 23. 69 ఎకరాలైతే 45. 8 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ఎవరు చేయించారు? ఎలా చేశారు? అన్నదానిపై విచారణ జరగాలన్నారు. రెవెన్యూ రికార్డుల్లో 295/ఎ,295/1బి, 295/1సి,295/1డి,296/1, 296/1బి లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద 45. 8 ఎకరాలుగా ఉన్న భూమి కాస్త 75.75 ఎకరాలకు ఎలా పెరిగిందో, ఎవరు పెంచారరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 75. 75 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆధీనంలో ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించాలని కోరారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి అడవులను అందులోని వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి బదులుగా, కట్టదిట్టమైన భద్రత నడుమ విలాసవంతమైన ఎస్టేట్ నిర్మించుకోవడం, దానికి ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకోవడం తన కుటుంబానికి ఆ భూములను కట్టబెట్టడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి, అక్రమాలకు నిదర్శనం గా కనిపిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో వేల సంఖ్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పేదల భూములు సైతం దురాక్రమణ చేశారని ఇప్పటికే బాధితులు ఫిర్యాదులు కూడా చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని దీనిపై విచారణ జరిపి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు సహకరించిన అధికారులను సైతం వదిలిపెట్టకుండా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు.

👉కేటీఆర్ ఓ బచ్చా ఆయనతో నాకేంటి : మంత్రి కోమటిరెడ్డి ..నేను మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు..నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కే లేదు ..అలాంటిది ఈ బచ్చా కేటీఆర్ ఎంత ? ..మీరు కూడా గడికోసారి కేటీఆర్ గురించి నన్ను అడగడం కరెక్ట్ కాదు .. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..