👉ఢిల్లీ కి వచ్చేయి..నువ్వు లోకల్ కాదు నేషనల్*.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా ? విజయసాయిరెడ్డి స్థానంలో…ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారా ? ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాకపోతే…ఇంకెపుడు బలపడుతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా ?
2029 నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా ? అందులో భాగంగానే పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందా ?
ఆంధ్రప్రదేశ్‌లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి 175 స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎక్కువకాలం ఆధారపడితే..మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది. అందులో భాగంగానే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్‌గా పని చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం నడుపుతోంది. వైసీపీ తరపున ఎన్నికైన విజయసాయిరెడ్డి…రెండ్రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ఆమోదించారు. ఆయన దారిలోని మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తి వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పవన్ కల్యాణ్‌ను పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో పార్టీలోని మెజార్టీ నేతలు…పక్క చూపులు చూస్తున్నారు. కొందరు ఎన్నికల ముందు టీడీపీ, జనసేనలో చేరి…టికెట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మిగిలిన నేతలంతా ఎపుడెపుడు బయటపడాలనే ఆలోచనతో ఉన్నారు. దీన్ని కాషాయ పార్టీ నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకొని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిపోయారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. మంచి తరుణం మించినా దొరకదనే ఆలోచనలో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ…2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులతో 8 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 2029లో ఈ సీట్లను మరింత గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది.
పవన్ కల్యాణ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని…ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. 2029లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసేలా…కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్ చేసి…ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే పవన్ ద్వారా తెరవెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ.
👉తిరుపతి… ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య!!!.
మంగళం సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఘటన.
కర్నూలు జిల్లా, డోన్ పట్టణానికి చెందిన శివప్రసాద్ (19)గా పోలీసులు గుర్తింపు.
సోమవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లకుండా తానున్న రూమ్ లో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య.
మృతదేహాన్ని తిరుపతి రూయా మార్చురీకి తరలింపు.
ఆత్మహత్య సంబంధించిన కారణాలపై విచారిస్తున్న తిరుచానూరు ఎస్సై జగన్నాథం.
👉 పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్…కడప* *పులివెందుల: పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. పులివెందుల మండలం మొట్నూతలపల్లె గ్రామానికి చెందిన గంగాధర్ పోలీసులు వేధిస్తున్నారంటూ స్టేషన్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 కొమురవెల్లిలో అఘోరి హల్చల్! కత్తితో దాడి…
AP: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద అఘోరి హల్ చల్ చేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆలయ సిబ్బందితో వారించింది. అయితే దుస్తులు ధరించి వస్తేనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తామని అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన అఘోరి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలువురిపై దాడికి యత్నించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉*జనం ముందుకు రానున్న LTTE ప్రభాకరన్ ?*
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) పేరిట శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ప్రభాకరన్ బతికే ఉన్నారా? ఈ ఏడాది మేలో జనం ముందుకు రానున్నారా? తమిళ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రభాకరను తాము అంతం చేసినట్లు 2009లో శ్రీలంక సైన్యం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫొటోలనూ విడుదల చేసింది. అలాంటిది ఆయన బతికున్నారంటూ ఇప్పుడు వార్తలు రావడం సంచలనంగా మారింది.
👉 *ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. రూ .30వేల నుంచి రూ.78 వేల వరకు.. వెంటనే దరఖాస్తు చేస్కోండి*..ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మంచి అవకాశంపీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు..రాయితీపై ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లను అమరుస్తున్నారు..ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర పథకమైన పీఎం సూర్యఘర్ యోజనను డ్వాక్రా మహిళలకు కూడా అమలు చేస్తోంది.
ఈ మేరకు రాయితీతో డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ మేరకు సామర్థ్యాన్ని బట్టి రాయితీని అందిస్తోంది.
ఒక కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది. రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60 వేలు ఉంటుంది. అదే మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్ ఏర్పాటు కోసం వ్యయం రూ.1.95 లక్షలు కాగా.. రాయితీ రూ.78 వేలు వస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్‌టాప్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు.
పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద.. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) అధికారులుది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరతున్నారు.
👉 *మాజీ అడిషనల్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకి భారీ ఊరట*
▪️ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం.
▪️ఆయన పై నమోదైన అభియోగాలు వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు.
▪️సస్పెన్షన్ కాలపు బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు.
▪️గత ప్రభుత్వ హయాంలో 2 దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.

