👉బిజేపీ వ్యాఖ్యలను ఖండించిన కేజ్రీవాల్…👉 ఉత్తరాఖండ్ లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి… ఎందుకు ముద్దు, మరెందుకు వద్దు?.. 👉నంద్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం – మంత్రివర్యులు NMD ఫరూక్ ..గుంటూరు నుంచి గ్రానైట్ అన్లోడ్ చేయటానికి వచ్చిన ముఠా కార్మికులపై రౌడీయిజం..👉10tv విలేకరిని బెదిరించిన సుబ్రహ్మణ్యం నాయుడు పై కేసు నమోదు ..* ఘనంగా ఘంటసాల సంగీత విభావరి (తాడిపత్రి)..👉ఉత్తమ అవార్డు అందుకున్న గిద్దలూరు పంచాయతీ రాజ్ డిఈ సుబ్బారెడ్డి*..మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఈసారి ఎవరికీ…?

👉 ఉత్తరాఖండ్ లో నేటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి… ఎందుకు ముద్దు, మరెందుకు వద్దు? యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి – యూసీసీ) అంటే… యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే సంగతి తెలిసిందే. యూనీఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి – యూసీసీ) అంటే… యావద్దేశానికీ ఒకటే పౌరచట్టం అని అర్ధం అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో ఒకటే పౌరచట్టం లేదు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత మొదలైన వ్యక్తిగత అంశాల్లో మతాలవారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయ్యి.. అందరికీ ఒకే చట్టం అమలవుతుంది.  *’యూసీసీ’పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోను ఈ యూసీసీ ఉండాలని నిర్దేశించారు. 44 ఆర్టికల్ ప్రకారం పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి కానీ.. ఇది స్వచ్ఛందంగా రావాలి అని అభిలాషించారు. ఈ సమయంలో ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం తీసుకుంది. అవును… బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ లో నేటి (జనవరి 27 – 2025) నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దీంతో… దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని అంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం… యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని.. పౌరులందరికీ సమానమైన హక్కులతో పాటు బాధ్యతలు దక్కేలా చూస్తామని తెలిపారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందులో కీలక అంశాలు ఇలా ఉన్నాయి! ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మతాలతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, వీలునామాలు, దత్తత మొదలైన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. ఇదే సమయంలో… ఉత్తరాఖండ్ లో సహ జీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. వీరంతా ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఇకపై ఉత్తరాఖండ్ లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయసు ఒకేలా ఉంటుంది. అదేవిధంగా… అన్ని మతాల్లోనూ బహుభార్యత్వాన్ని, హలాల్ విధానాన్ని నిషేధించారు. *ఎందుకు ముద్దు..? యూసీసీ ని కొంతమంది బలంగా సమర్ధిస్తున్నారు. ఈ సందర్భంగా.. పౌరస్మృతితో మతాలకు అతీతంగా భారతీయ పౌరులందరికీ ఒకే రకమైన న్యాయం లభిస్తుందన్నది దాన్ని సమర్థించేవారి వాదనగా ఉంది. దీనివల్ల పర్సనల్ చట్టాల్లోని వివక్ష పోయి.. స్త్రీ-పురుష సమానత్వం సాధ్యం అవుతుందని అంటారు. ఎందుకు వద్దు..? ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. ఇకపై మతపరమైన పర్సనల్ చట్టాలు రద్దవుతాయి. అంటే.. వివిధ మతాలను అనుసరించే, ఆయా మతాలకు సంబంధించిన చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోయినట్లవుతుందనేది దీన్ని వ్యతిరేకించేవారి వాదన. యూసీసీ అమల్లోకి వస్తే దేశంలో వైవిధ్యం దెబ్బతింటుందని, మైనారిటీలు అభద్రతకు లోనవుతారని, మత స్వేఛ్చకు విఘాతం కలుగుతుందనేది వారి ఆందోళన!..

👉నంద్యాల తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే ఎనిమిది కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాం ..  రాబోయే ఐదేళ్లలో నంద్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం – రాష్ట్ర మంత్రివర్యులు NMD ఫరూక్ ..

*రాష్ట్ర మంత్రివర్యులు NMd ఫరూక్   నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఆరు నెలలు గడపకు ముందే దాదాపు 8 కోట్ల రూపాయల నిధులను నంద్యాలకు తెప్పించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించమని  రాష్ట్ర మంత్రివర్యులు NMd ఫరూక్ అన్నారుు.నంద్యాల ప్రజలు తమ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నంద్యాల ప్రజలను రుణం తీర్చుకుంటామన్నారు.. *గతంలో తన హయాంలో నందమూరి వైయస్సార్ నగర్ కు భూములు కేటాయించి స్థాపించింది మా ప్రభుత్వమే, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లు, షాది ఖానాలు, రోడ్డు విస్తరణలు, బ్రిడ్జిలు,కళ్యాణ మండపాలు, 13 వేల టిడ్కో గృహాల నిర్మాణాలు ఇలా ఎన్నో నిర్మాణాలు పూర్తి చేసి అభివృద్ధి చేశామన్నారు…

*నంద్యాల ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము చేయ్యకుండా ఈ ఐదేళ్లలో కూడా నంద్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసితీరుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*

*మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఈసారి ఎవరికీ…?

*ప్రకాశం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై ఈసారి ఆసక్తి నెలకొంది.. ఇప్పటివరకు ఎంతోమంది మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బాధ్యతలు నిర్వహించారు. మరి ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమి విజయానికి కీలకపాత్ర పోషించిన కాపులకు ఈసారి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని స్థానిక ప్రజలతో పాటు రైతులు, కాపులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల సమస్యపై పూర్తి అవగాహన ఉన్న దుత్త బాలేశ్వరయ్య కు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని స్థానిక రైతులు ప్రజలు మరియు కాపులు తమ మనసులో మాట బయట పెడుతున్నారు. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.

👉గుంటూరు నుంచి గ్రానైట్ అన్లోడ్ చేయటానికి వచ్చిన ముఠా కార్మికులపైరౌడీయిజం.. కృష్ణాజిల్లా…ఉయ్యూరు..గుంటూరు నుంచి గ్రానైట్ ఉయ్యూరు కు చెందిన పెద్ద ముటా కూలీలు , ఇది మా ఏరియా ఇక్కడ ఏదన్నా మేమే అన్లోడ్ చేయాలి..మా ఏరియా కి వచ్చి దిగుమతి చేయటానికి మీరు ఎవరు అని, వచ్చిన కూలీలతో ఘర్షణ పడి చితకబాదిన ఉయ్యూరు పెద్ద ముఠా కార్మికులు..తీవ్ర గాయాలతో హాస్పటల్లో జాయిన్ అయినా బాధితులు.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఉయ్యూరు టౌన్ పోలీసులు..

👉బీజేపీ వ్యాఖ్యలను ఖండించిన కేజ్రీవాల్…తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బీజేపీ పేర్కొనడాన్ని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ ఖండించారు. ఒకవైపు బడా వ్యాపారవర్గాలకు భారీ రాయితీలు ఇస్తూ.. మధ్యతరగతి ప్రజల్లో మాత్రం అపరాధ భావనను సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ‘ఉచిత విద్యుత్‌, మహిళలకు ఫ్రీ బస్‌ వంటి పథకాలను నిలిపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే మీరు ఈ వ్యయాలను భరించగలరా?’ అని ప్రజలను ప్రశ్నించారు.

👉 అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీవాణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో జాతీయ అవార్డు విజేత శ్రీ చంద్రతేజ బృందం ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి,ఘన గంధర్వుడు శ్రీ చంద్రతేజ మరియు శ్రీవాణి స్కూల్ యాజమాన్యం.

👉10tv విలేకరిని బెదిరించిన సుబ్రహ్మణ్యం నాయుడు పై కేసు నమోదు…!* అన్నమయ్య జిల్లా పుల్లంపేట విద్యుత్ శాఖ ఏ ఈ పై వార్త రాసిన రాజంపేట 10టీవీ విలేకరి కూరాకు శ్రీనివాసులు ను జనవరి 4వ తేదీ రామక్కపల్లె కు చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు అలియాస్ (మణి) ఫోన్లో బెదిరించాడు. ఈ విషయంపై అప్పటి రాజంపేట డిఎస్పి సుధాకర్ కు పాత్రికేయలతో కలిసి 10 టీవీ విలేకరి శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ సుధాకర్ రోజులు గడిచినా స్పందించకపోవడం తో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ను కలిసి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ పాత్రికేయులను బెదిరిస్తే ఉపేక్షించేది లేదని కచ్చితంగా కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. దీంతో పుల్లంపేట ఎస్సై మోహన్ కుమార్ గౌడ్ ఫిర్యాదు తీసుకుని కోర్టు ఆదేశాలతో సుబ్రహ్మణ్యం నాయుడు అలియాస్ (మణి) పై క్రైం నెంబర్ 09/2025 సెక్షన్ 351 (BNS ACT ) కింద కేసు నమోదు చేశారు.

👉ఉత్తమ అవార్డు అందుకున్న గిద్దలూరు పంచాయతీ రాజ్ డిఈ సుబ్బారెడ్డి*గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ అవార్డుల్లో ప్రకాశం జిల్లాలో గిద్దలూరు పంచాయతీ రాజ్ డీఈ నారపురెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం ఒంగోలు జిల్లా పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గార్ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.. ఈ సందర్బంగా వారికి ఉన్నత అధికారులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియచేశారు..*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..