👉గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఇంధన శాఖ, ఉద్యానశాఖ, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ శకటాల ప్రదర్శనను తిలకించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
👉బాలకృష్ణకు పద్మభూషణ్ – సీఎం చంద్రబాబు అభినందనలు*
*అమరావతి:* కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన తెలుగు సినీ దిగ్గజం మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు మరియు దాతృత్వంలో రాణించారన్నారు. **ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావాన్ని లెక్కలేనన్ని జీవితాలను తాకిందని మరియు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. ఇది నిజమైన ఐకాన్ మరియు దయగల నాయకుడికి దక్కిన గౌరవమని చంద్రబాబు అన్నారు.
👉పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి.. ప్రధాని మోడీకి లేఖ రాసే యోచనలో రేవంత్ రెడ్డి.. తాను సిఫార్సు చేసిన ఐదుగురి పేర్లలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోని కేంద్ర ప్రభుత్వం.
👉ఆంధ్ర రత్న భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ..జాతీయ జెండాను ఎగరవేసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా .. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ..* బిజెపి టిడిపి వైకాపా అధినాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజం*..
👉7 దశాబ్దాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ..మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశం..మన దేశం విభిన్న సంస్కృతి తో కూడిన నిలయం..మనకున్న ఈ హక్కులు అన్ని మన రాజ్యాంగం కల్పించినవే..
⭐రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్..బీజేపీకి ఇవ్వాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదు..స్వాతంత్ర్య పౌరులను సైతం అవమానిస్తోంది ..అంబేద్కర్ ను హేళన చేస్తున్నారు..
⭐మహాత్మ గాంధీని విలన్ గా చూపిస్తున్నారు..మహాత్మ ను చంపిన గాడ్సే కి గుడులు కడుతున్నారు.. మతం,కులం పేరుతో కలహాలు రేపుతున్నారు
⭐దేశ సంపదను మోడీ దొస్తులకు కట్టబెడుతున్నరు..ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారు..పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను అవమానించారు..ఏపిలో ఉన్న రెండు పెద్ద పార్టీలు టీడీపీ,వైసిపి లు బీజేపీ తో జత కట్టాయి.. బీజేపీ చేస్తున్న అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయి .. విభజన హామీలపై బీజేపీ మోసం చేసినా పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నారు
⭐బాబు ది తెరముందు పొత్తు.జగన్ ది తెరవెనుక పొత్తు జగన్ బీజేపీ కి గులాం గిరీ చేశాడు..వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కాడు ..వైసిపి కి దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే వారి పట్ల కృతజ్ఞత భావం లేదు
⭐బీజేపీ దళితులను అవమానిస్తుంటే కనీసం చిన్న ఖండన కూడా లేదు…బీజేపీ అంబేద్కర్ ను అవమానిస్తే వైసిపి ఎందుకు మౌనం పాటిస్తుంది ? …అంబేద్కర్ విగ్రహాలు పెడితే గౌరవం ఉన్నట్లు కాదు…పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ కి అవమానం జరిగితే జగన్ మౌనం వహించారు.. వైసిపి ఎంఎల్ఏ లు, ఎంపీ లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు….అంబేద్కర్ ను అవమానిస్తే టీడీపీ కి ,వైసిపి కి చీమ కుట్టినట్లు కూడా లేదు.
⭐బీజేపీ తో ప్రమాదం పొంచి ఉంది ..బీజేపీ అధికారంలో అంటే రాజ్యాంగాన్ని మార్చుతుంది…బీజేపీ అధికారంలో అంటే రిజర్వేషన్లు ఎత్తేస్తారు..బీజేపీ ఈ దేశ సంపదను అదానీ కి కట్ట బెడుతుంది..బీజేపీ అధికారంలో ఉంటే మతాల మధ్య ,కులాల మధ్య చిచ్చు పెడుతుంది..ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు..
👉ప్రియురాలి తండ్రిని హత్య చేసిన ప్రియుడు.. ఏపీలోని నెల్లూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమకు అభ్యంతరం చెబుతున్నాడని ప్రియురాలి తండ్రిని ప్రియుడు హత్య చేశాడు. నెల్లూరులోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురై అతడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాషా అక్కడికక్కడే మరణించాడు. నిందితుడు సాదిక్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
👉 అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిన బ్యాంక్ అధికారులు *
*జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని, రూ.61 వేలు అప్పు పడింది*
*అప్పు కట్టాలని గుగులోత్ లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంటావార్పు చేశారు..* కోట్లు కొల్లగొడుతున్న కుబేరులను,కోట్లు అప్పులు చేసి విదేశాలలో జల్సాగా తిరుగుచున్న వాళ్ళను వదిలేసి కూటికి తిప్పలు పడుతున్న ఇటువంటి సామాన్యుల మీదనా బ్యాంకు అధికారుల ప్రతాపం అంటున్న ప్రజలు
👉బేగంపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త జాన్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య విషయమై హరా తీశారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రమేష్ వెంట పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
👉జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు-2024 లభించింది. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతులమీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. **అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయడం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ ఈ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ఉత్తమ పనితీరు కనపరిచినందుకు ఒంగోలు ఆర్డిఓ. కే.లక్ష్మీ ప్రసన్న , దర్శి తహసిల్దారు ఎం.శ్రావణ్ కుమార్ లకు కూడా అవార్డులు లభించాయి. అవార్డు గ్రహీతలను సీఎస్ విజయానంద్‌తో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు అభినందించారు.
*ఏలూరి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముత్తుముల*
*పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పుట్టినరోజు సందర్బంగా పర్చూరు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు తదితరులు పాల్గోని శుభాకాంక్షలు తెలియచేశారు.*
👉 *రాచర్ల ఎస్సై కోటేశ్వరరావుకు ఉత్తమ పురస్కారం* ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరరావుకు ఉత్తమ పురస్కారం అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన ఎస్సై కోటేశ్వరరావును జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు. రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఉత్తమ పురస్కార ప్రశంస పత్రాన్ని ఎస్ఐ కోటేశ్వరరావు జిల్లా ఎస్పీ దామోదర్ అందించారు. విధి నిర్వహణలో అంకితభావం కొనసాగిస్తూనే ఉండాలని ఎస్పీ దామోదర్ ఎస్సై కోటేశ్వరరావుకు సూచనలు సలహాలు ఇచ్చారు.
*సిఎల్ఆర్ విద్యా సంస్థలలో…*ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*
కంభం పట్టణంలోని సిఎల్ఆర్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష మాట్లాడుతూ భారతదేశ పాలనకు దిక్సూచిగా నిలిచిన రాజ్యాంగంను ఆమోదించిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్సిసి విద్యార్థులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఎల్ ఆర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, కళాశాల అధ్యాపక బృందం భూపతి నారాయణ గుండాల ముక్తేశ్వరరావు ఏనుగుల రవికుమార్, షేక్ షరీఫ్,డేవిడ్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి,పాలిసెట్టి నవీన్, పివి ఆంజనేయులు,ఉప్పు నారాయణ, కైత రాజేశ్వరి, బి అరుణ, వి వనజ, కే.బ్యుల , ఇమ్మానియేల్, టాబ్రేజ్ తదితరులు పాల్గొన్నారు.
*హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి*.. బంజారాహిల్స్‌లోని “ఫ్రైడ్ గి అండ్ కర్డ్” పేరుతో ఉన్న షాప్ లో కల్తీ నెయ్యి తయారవుతుందని GHMC , టాస్క్ఫోర్స్ పోలీసులు తనకి నిర్వహించారు.కల్తీ పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో నెయ్యితయారీ చేస్తున్నట్లు గుర్తింపు.భారీ గా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

