👉 గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ శ్రీరాములు.. పతాక స్థాయికి చేరిన వివాదం ..👉 ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి సిఐటియు డిమాండ్ (కొండేపి)..*బాలికలకు మంచి విద్య అందించాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె శ్యాంబాబు .. విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి ఇవ్వాలి : ఎస్ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్ప రెడ్డి…* ..*హనీ ట్రాప్ కేసులో ఐదుగురు అరెస్ట్*

*మందకృష్ణ మాదిగ అక్రమ కట్టడాలు కూల్చివేత?*

వరంగల్ జిల్లా: జనవరి 25 ..ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందినవరంగల్ లోని కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చేశారు. హంటర్ రోడ్డులో ఉన్న తమకు చెందిన 400 గజాలను మందకృష్ణతో పాటు మరో ఇద్దరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

అక్రమ నిర్మాణాలను కూల్చివేయలేదని, తన భూమిని ఇంకా ఆక్రమించి ఉన్నారంటూ నంబూరి చారుమతి అనే మహిళ జాతీయ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. అధికారులు దీనిపై విచారిం చి ఇది అక్రమ కట్టడాలుగా తేల్చారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ నెల 24వ తేదీ లోపు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ఆదేశిం చింది. దీనిపై మంద కృష్ణ మాదిగ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశా లను రద్దు చేయాలంటూ హైకోర్టుును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆ కట్టడాలను కూల్చివేశారు

వరంగల్ హంటర్‌ రోడ్డులో తమకు చెందిన 400 గజాలను మందకృష్ణ మాదిగతోపాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం అధికారులకు నంబూరి చారుమతి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు ఆక్రమణ నిజమేనని తేల్చి కట్టడా లను కూల్చి వేయాలని 2022 సెప్టెంబరులో ఆదేశాలిచ్చారు. రెండేళ్లు దాటినా కూల్చి వేయలేదని చారుమతి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించగా జనవరి 24లోపు నిర్మాణా లను నేలమట్టం చేయాలని ఆదేశించింది. ఎన్‌హెచ్‌ ఆర్‌సీ ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయిం చినా ఊరట దక్కలేదు. దీంతో మున్సిపల్‌ సిబ్బంది కట్టడాలను కూల్చివేశారు.

👉 *హనీ ట్రాప్ కేసులో ఐదుగురు అరెస్ట్*

హనీ ట్రాప్ చేసి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన రామారావు నుంచి నగదు దోచేసిన ఘటనలో ఐదుగురుని భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. కంచరపాలేనికి చెందిన వివాహిత (34), సురేశ్, చక్రధర్, వెంకటేశ్, విజయనగరానికి చెందిన లక్ష్మణ్ మరో ఇద్దరు దండుపాళ్యం బ్యాచ్ గా ఏర్పడ్డారు. వీరంతా ఆ మహిళ ద్వారా పలువురికి ఫోన్లు చేయించి ముగ్గులోకి దింపేవారు. ఈ క్రమంలో రామారావుని మోసం చేయగా, అతని ఫిర్యాదుతో డొంక అంతా కదిలింది.

👉 గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ శ్రీరాములు.. పతాక స్థాయికి చేరిన వివాదం మాజీ మంత్రి శ్రీరాములు ఒక అడుగు ముందుకు వేసి మరి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను బయటపెడతానంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు గురించి తెలియకుండా ఎవరికి ఉండదు. వీరిద్దరూ అత్యంత సన్నిహితులు. అత్యంత ఆత్మీయంగా మెలిగిన ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు వైరం పురుడు పోసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. మాజీ మంత్రి శ్రీరాములు ఒక అడుగు ముందుకు వేసి మరి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను బయటపెడతానంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. తాజాగా బళ్లారి హవంభావి సమీపంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను ఒక రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నావని, నీ మాటలు ఎవరు నమ్మరని శ్రీరాములు వ్యాఖ్యానించారు. ‘నావల్ల నీవు ఎదిగావో.. నీవల్ల నేను ఎదిగానో జనానికి తెలుసు’ అని పేర్కొన్నారు. రెండు రోజుల కిందట బెంగళూరులో బిజెపి హై కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తాపే సండూరు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి పనిచేయలేదని పేర్కొంది. దీనిపై స్పందించిన శ్రీరాములు.. ఇది ముమ్మాటికి అసత్యం అని, తాను పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానని స్పష్టం చేశారు. ఈ అసత్యపు ప్రచారం గాలి జనార్దన్ రెడ్డి సృష్టిస్తున్నారని, తాను ముందు నుంచి బిజెపిలో ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని వివరించిన శ్రీరాములు.. 14 ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆయనకు ఇక్కడ ప్రాధాన్యం తగ్గిందని, అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీలో తనకొంటూ ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్న శ్రీరాములు.. ఓడిపోయిన పార్టీ విడలేదని స్పష్టం చేశారు. ఎస్టి నాయకుడిగా ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు పెట్టడం, పార్టీ వాళ్ళనే ఓడించేందుకు జనార్దన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మరో సంచలన ఆరోపణను చేశారు. కంప్లిలో తన అల్లుడు సురేష్ బాబుని ఓడించేందుకు గాలి గ్రూపు రాజకీయాలు చేశారని ఆరోపించారు. పార్టీలో సమస్యలు సర్దుకుంటాయని, కానీ జనార్దన్ రెడ్డితో మనస్పర్ధలు మర్చిపోలేనని స్పష్టం చేశారు. పేదలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వెల్లడించారు. గాలి జనార్దన్ రెడ్డి అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కల్పితాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీరాములు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అవసరమైతే తాను గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను బయటపెడతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

👉శిoగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ చిమకుర్తి వెంకటేశ్వర్లు రెండవ వర్ధంతి కార్యక్రమం మూలగుంటపాడు లోని మలినేని పెరుమాళ్ళు ఐటిఐ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయ వాలంటీర్ల వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యి చీమకుర్తి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి. అక్కడ ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది.

👉 ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి సిఐటియు డిమాండ్. సిఐటియు కొండపి మండలం జనరల్ బాడీ సమావేశం కె.విజయ అధ్యక్షుతన జరిగింది.సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు కార్మికులకి వ్యతిరేకమైన నిర్ణయాలుగా ఉన్నాయన్నారు .గతంలో వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాడితే చట్టాన్ని రద్దు చేసుకుంటామని హామీ ఇవ్వడంతో పోరాటం ముగిసింది ..కానీ చట్టాలు రద్దు చేయకపోయినా దొడ్డి దారిన చట్టాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆమరణ నిరాహార దీక్షలో దల్లేవాల్ కూర్చున్నారు.కార్మిక సమస్యలు పరిష్కారం కావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆమరణ నిరాహారదీక్షతో రైతు సంఘాలు , కార్మిక సంఘాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి హామీ ఇచ్చింది.పోరాటాన్ని తాత్కాలికంగా విరమించడం జరిగింది ..26వ తేదీ అన్ని మండలాల్లో నిరసన చేపట్టాలని కార్మిక ,కర్షక వేదిక పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం ఉద్యోగులని కార్మికుల్ని బానిసలుగా మార్చటమే. అనేక చట్టాలు పార్లమెంటు లో ఎలాంటి చర్చ లేకుండా ముందుకు తీసుకువచ్చి ఆ చట్టాన్ని అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈరోజు ముందుకు వస్తా ఉంది.. ప్రధానంగా కార్పోరేట్స్ కి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి శ్రీనివాసులు ఆరోపించారు. విశాఖ ఉక్కు పోరాటం మనం చూసాం దాదాపు ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. సిఐటియు కోరుతుంది ప్యాకేజీ కాదు ముడి సరుకులు విశాఖ ఉక్కుకి కేటాయించి సెయిల్ లో దాని విలీనంచేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఆ పోరాటం ఆ సమస్యలు పరిష్కార అయ్యేంతవరకు సిఐటియు పోరాడుతుందని ఉద్యోగాలకి కార్మికులకు తెలియచేయటం జరిగింది. విఓఏ లకు కాల పరిమితి సర్కులర్ ఉండటం వల్ల ప్రభుత్వం మారినప్పుడల్లా విఓఏకు మెడ మీద కత్తిలా ఉంది. ఏడో తేదీ లోపే వేతనాలు చెల్లించాలని బకాయి వేతనాలు చెల్లించాలని జనవరి 27 , 28 , 29 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది.. రవాణా కార్మికులకు ,భవన నిర్మాణ కార్మికుల కు సంక్షేమ చట్టాన్ని ఏర్పాటు చేయాలని శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవాణా కార్మికులు ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు నోచుకోక చాలా అవసధ్తలు పడుచున్నారు. కొత్తగా వచ్చిన చట్టాల తో అనేక ఇబ్బందులు పడుతున్నారు కొత్తగా బి ఎన్ ఎస్ చట్టం తీసుకువచ్చి యాక్సిడెంట్ జరిగితే పది లక్షల రూపాయలు జరిమారా లేదా పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించే విధంగా చట్టాలు తీసుకురావడం జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రవాణా కార్మికులు ఉద్యమిస్తా ఉన్నారు .ఆశా లకు 26 ,000 ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికులకు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది హమాలీ ముఠా కార్మికులకి భవనిర్మాణ కార్మికులకి సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది దేశవ్యాప్తంగా ఉద్యోగులకి కార్మికులకి సమస్యలు పరిష్కారం కావాలని కార్యాచరణ తీసుకొని సిఐటియు పనిచేస్తుంది ఈ సందర్భంగా కొండపిల జరిగిన సమావేశంలో 12 మంది తో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కన్వీనర్ గా కె విజయ ,కోకన్వీనర్స్ గాలక్కెపోగు జాన్ ,శివ ఎంపికయ్యారు.సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కాకర్ల గుంటూరు మస్తాన్ , సిఐటియు నాయకులు ,జి.వందనం ,వై.రూబెన్ , పి రవణమ్మ తదితరులు నాయకత్వం వహించడం జరిగింది..

👉 బాలికలకు మంచి బాల్యం అందించాలని వారి భద్రత ఆరోగ్యం విద్య విషయాలలో ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహించి బాలికల ఉన్నతికి తోడ్పడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె శ్యాంబాబు తెలియచేశారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్ అడ్వొకసి వారు రూపొందించిన గోడ పత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వెల్ విషర్ శంకర్, బాలల సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ వి రామాంజనేయులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

👉విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీకి ఇవ్వాలి : ఎస్ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్ప రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలని ఎస్. డబ్లు.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అయ్యప్ప రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఆర్టీసీలో ప్రజా రవాణాని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే కుట్రలో భాగంగా ఇప్పటికే తిరుమల- తిరుపతి మధ్య 100 విద్యుత్తు బస్సులను ప్రైవేటు వారికి అప్పగించారన్నారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకు అప్పగిస్తే ప్రభుత్వం ఆర్టీసీకి, ప్రజలకు తీరని ద్రోహం చేసిన వారు అవుతారని హెచ్చరించారు. అనంతరం డిపో మేనేజర్ శంకర్ రావు కలిసి విజ్ఞానపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి శ్రీనివాసరావు, డి మల్లికార్జునరావు, డిపో అధ్యక్ష కార్యదర్శులు జి వేణుగోపాల్, ఎం సురేష్, కార్మికుల ఉద్యోగులు పాల్గొన్నారు.

👉 పరిటాల రవి  20వ వర్ధంతి సందర్బంగా  చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిననియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిటాల రవి  20వ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. అనంతరం ఆయన  మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో వారు ప్రజలకు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు..అలాగే పేద ప్రజలకు అండగా నిలిచిన ప్రజా నాయకుడు పరిటాల రవి అన్నారు… ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ జెట్టి కుసుం కుమార్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపిసీసీ జనరల్ సెక్రటరీ నర్సిరెడ్డి భూపతిరెడ్డి, కూకట్ పల్లి నియోజవర్గం ఇంచార్జ్ బండి రమేష్ గార్లతో పాటు బండి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, పులి సందీప్, మోతి శ్రీనివాస్ యాదవ్, అర్వ వెంకట్, గుమస్తా మధు, ప్రభాకర్ రెడ్డి నిర్వాహకులు నీలపాటి కరుణాకర్ రావు, సుండూరి అనంత చౌదరి, అంతయ్య, శశి, కోటేశ్వరరావు, వంశీ, రమేష్, శివాజీ, పరిటాల రవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..