*సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం👉విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించండి: మంత్రి లోకేష్ * ..*అమృత యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య*.. 👉హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌.. 8 మంది దళారులను గుర్తించిన పోలీసులు..👉 ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులకు ఉరి వేసుకుని ఆత్మహత్య..*👉ప్రొద్దుటూరులో రూరల్ పోలీసుల నిర్లక్ష్యం-రోడ్డుపై 4 రోజులుగా ఒక కుటుంబం.* విశాఖ భీమిలిలో హనీట్రాప్‌ ఘటన కలకలం

*శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*..విజయవంతంగా విదేశీ పర్యటన* ..తెలంగాణలో రూ.1.78లక్షలకోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు*..స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”*..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన అనుచరులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని రోజులుగా దావోస్ తదితర విదేశాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం సమకూర్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కృషిచేసిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

👉విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణా కార్యక్రమాలకు సహకరించండి..*డబ్ల్యుఇఎఫ్ న్యూఎకానమీ ఆపరేషన్స్ హెడ్ శ్రీరామ్ గుత్తాతో లోకేష్ భేటీ*


దావోస్: వరల్డ్ ఎకమికమిక్ ఫోరం న్యూఎకానమీ, సొసైటీ విభాగం ఎంగేజ్ మెంట్ & ఆపరేషన్స్ విభాగం హెడ్ రవి గుత్తాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగానికి గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడం మద్దతునివ్వండి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో గ్లోబల్-స్టాండర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించడానికి సహకారం అందించండి. డబ్ల్యుఇఎఫ్ వార్షిక సమావేశం వంటి గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆంధ్రప్రదేశ్‌ని విద్యాపరమైన ఆవిష్కరణలు, సాంకేతికతకు కేంద్రంగా ప్రోత్సహించడంలో సహకారం అందించండి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా విద్య, మానవ మూలధనం అభివృద్ధిలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పాలని నిర్ణయించాం. భవిష్యత్ నైపుణ్యాలు, అభ్యసనా పద్ధతులు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై ప్రత్యేకంగా దృష్టిసారించాం. విద్యాప్రమాణాలను మెరుగుపర్చడానికి ఎఐ, డిజిటల్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతకతలు వినియోగిస్తున్నాం. పరిశ్రమ సంబంధిత అధునాతన శిక్షణ కోసం ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయండి. రవి గుత్తా మాట్లాడుతూ… భారతదేశంలో విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో మేం చురుగ్గా పాల్గొంటున్నాం. బోధన, అభ్యాసం కోసం ఎఐ వినియోగంలో భారత్ కు మద్దతుగా నిలుస్తాం. భవిష్యత్ మార్కెట్ల కోసం శ్రామికశక్తిని సిద్ధం చేయడంలో భారత సంస్థలతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

👉 ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులకు ఉరి వేసుకుని ఆత్మహత్య..కామారెడ్డి జిల్లా.. బిబిపేట్ మండలం లోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన సుంకరీ ప్రవీణ్ గౌడ్ ప్రవేట్ ఫైనాన్స్ వేధింపులకు ఉరి వేసుకుని ఆత్మహత్య..మూడు లక్షల రూపాయలు లోన్ తీసుకోగా ఒక ఇన్స్టాల్మెంట్ ఎనిమిది వేల రూపాయల కోసం వేధించిన ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థ. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

👉*అమృత యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య*.. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ కథనం ప్రకారం మంగళగిరి మండలం కురగల్లు గ్రామం పరిధిలో గల అమృత విశ్వవిద్యాలయ పీఠం కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కేకే నవదేవ్ (22 ) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప డి మృతి చెందటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి సీసీ కెమెరాలు , విద్యార్థి పూర్తి వివరాలు తెలుసుకొని పరిశీలించడం జరిగింది . విద్యార్థి చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు . ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.సంఘటనా స్థలంలో సదరు విద్యార్థి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్స్, సూసైడ్ లెటర్ రాయడం జరిగింది. తను రాసిన నోటుబుక్స్ కూడా తదుపరి దర్యాప్తులో భాగంగా స్వాధీనపర్చుకోవడమైనది. విద్యార్థి నోట్ బుక్స్ , సూసైడ్ లో కూడా పరిశీలించి దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపారు

👉ప్రొద్దుటూరులో రూరల్ పోలీసుల నిర్లక్ష్యం-రోడ్డుపై 4 రోజులుగా ఒక కుటుంబం.*కడపజిల్లా* ..ప్రొద్దుటూరు*

*గజగజా వనికే చలిలో 4 రోజులుగా రోడ్డుపైనే పిల్లలతో నిద్రిస్తున్న కుటుంబం* ..*4 రోజులుగా సంఘటన జరిగినప్పటికీ,కనీసం పోలీసులు పట్టించుకోని వైనం!.. *దౌర్జన్యం చేసిన వారిపై కనీసం కేసు పెట్టాలని బాధితులు తిరుగుతున్నప్పటికీ,ఇప్పుడు చట్టాలు మారాయి,విచారణ చేసిన తర్వాత కేసు కడతాము అంటూ 4 రోజుల నుండి బాధితులను స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్న పోలీసులు* *మాకు న్యాయం చేసేవారు లేరా?? అంటూ వాపోతున్న బాధితులు*

👉*ప్రేమకు దగ్గరై… రక్త సంబంధానికి దూరమై*

*భర్త తీరుతో విసుగుచెంది ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య*నిదానపురంలో విషాద ఘటన*

మధిర: జనవరి 23అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో గాలివాటంగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకున్నది… ఏ విద్యార్హత ఆర్థిక స్తోమత లేకున్నా తన మనసుకు నచ్చిన వాడిని మతాచారం అడ్డొచ్చినా రక్త బంధాన్ని తెంచుకొని మరీ నమ్మించిన వాడిని మనవాడి జీవనం సాగిస్తోంది… సుఖ సంతోషాలతో కొనసాగిన జీవితాన్ని వదిలి కష్టాలు నష్టాలు పడుతూ దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ ఈ బంధంతో పుట్టిన ఇరువురు బిడ్డలను సాకుతూ తన గుండె అంతరాల్లో కొనసాగుతున్న బడబాగ్నిని సైతం లెక్కచేయకుండా జీవనం సాగిస్తున్న సౌమ్యురాలు ఈమె… భర్త వ్యవహారం అతని చర్యలు తరచూ బాధించినా తాను మారుతాడు అన్న నమ్మకం జీవనాన్ని సాగిస్తూ వస్తుంది… ఆయన నమ్మకం మరో మారు వమ్మైంది … చివరకు భర్త చేసిన నేరం పై విచారణకు పిలవడంతో ఆత్మాభిమానం కలిగిన ఈబిడ్డ తనువు చాలించేందుకు సిద్ధమై తన కడుపున పుట్టిన బిడ్డలను కడతేర్చి తాను తనుపు చాలించింది… ఈ హృదయ విదారకమైన సంఘటన మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని నిదానపురం గ్రామానికి చెందిన షేక్ జానీ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన షేక్ ప్రేజా(28)(మారిన పేరు) ఐదేళ్ల క్రితం మతాంతర ప్రేమ వివాహాన్ని చేసుకుంది. హైదరాబాదులో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో గాలివాటంగా పరిచయమైన బాజీ చెప్పిన మాయమాటలను నమ్మి హిందూ సంప్రదాయంతో విద్యావంతుల కుటుంబానికి చెందిన మృతురాలు దాంపత్య జీవితాన్ని గడిపేందుకు సిద్ధమై తన రక్త సంబంధాన్ని కనిపెంచిన తల్లిదండ్రులను విడిచి వచ్చేసింది. ప్రేమ మోజులో మృతురాలని తీసుకువచ్చిన భర్త బాజీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రేజా కూడా గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లేదని తెలిసింది. ప్రస్తుతం బాజీ ఖమ్మంలో ఓ ప్రైవేటు మోటారు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసింది. కాగా బాజీ ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికపరమైన నేర ప్రవృత్తిలో తప్పటడుగులు వేశాడు. వీటన్నింటినీ భరించుకుంటూ వచ్చిన మృతురాలు ఇటీవల జరిగిన ఓ కేసుకు సంబంధించి గురువారం ఉదయం ఖమ్మం చెందిన పోలీసులు విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చి బాజీని వెంట తీసుకొని వెళ్లారు. భర్త తల్లిదండ్రులు తమకున్న రెండు ఎకరాల పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లగా, పోలీసులు వచ్చి వెళ్లిన సమాచారాన్ని వారికి మృతురాలు అందజేసింది. ఈ క్రమంలో అత్తామాములు ఇంటికి వచ్చే సమయానికే ఆత్మాభిమానాన్ని కలిగిన మృతురాలు తన ఇరువురు పిల్లలుమెహక్,(4) మెనురూల్(3) లను దగ్గరికి తీసుకొని తనలో లేని కసాయితనాన్ని ప్రదర్శించి వారిరువురిని కడతేర్చింది. అదే క్రమంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకొని తనూ తను చాలించింది. ఇది ఇలా ఉండగా, కోడలు ఇచ్చిన సమాచారంతో ఇంటికి వచ్చిన అత్తమామలు కోడలు మనవరాళ్ళు విగత జీవులుగా పడి ఉండడాన్ని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల సహకారంతో వీరిని హుటాహుటిన మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్పటికీ అప్పటికే ముగ్గురు మృతి చెందారని వైద్యులు గుర్తించారు. క్షణాల వ్యవధిలో హృదయ విదారకంగా జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు ఎంతో మంచిదని తన కుటుంబం కోసం ఉన్నత సాంకేతిక విద్య చదివిన ఈమె వ్యవసాయ పనులకు కూడా వెళ్లేదని, కేవలం అవమానభారాన్ని భరించలేక మనస్థాపానికి గురై ఇలా చేసి ఉంటుందని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

👉విశాఖపట్నం: విశాఖ భీమిలిలో హనీట్రాప్‌ ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళం వాసి రామారావుకు ఈనెల 18న ఓ యువతి ఫోన్‌ చేసింది. 19న పెద్దిపాలెం వెళ్తుండగా మరోసారి ఆమె నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. సంగివలస మూడుగుళ్ల వద్దకు రావాలని చెప్పింది. రామారావు అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతన్ని కిడ్నాప్‌ చేసి దాకమర్రిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. రామారావు వద్ద ఉన్న రూ.48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్నారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ఇవాళ మరో రూ.7వేలు కాజేశారు. నగదు మాయంపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

👉హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్‌.. 8 మంది దళారులను గుర్తించిన పోలీసులు.హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పరిధిలోని అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది దళారులను పోలీసులు గుర్తించారు..గత ఆరు నెలలుగా అలకనంద ఆస్పత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుడితోపాటు మరికొంత మంది ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు…

👉పరిమితికి మించి లోడు వేసుకుని వెళ్లే వాహనాలపై కఠిన చర్యలు కంభం  సీఐ కే మల్లికార్జున రావు..ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గురువారం రాత్రి స్థానిక సీఐ కె .మల్లికార్జునరావు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించి ఓవర్ లోడుతో వెళ్తున్న వాహన డ్రైవర్లకు సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా జరిమానా విధించాలని ఎస్సైని ఆదేశించారు. పోలీసు శాఖ పదేపదే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మార్పు రాకపోతే ఎలా అని వాహనదారులపై సీఐ మల్లికార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి లోడు వేసుకొని వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..