👉హస్తినలో సంఘ్ పరివార్ వ్యూహాలు.. ఆప్ అడ్రస్ గల్లంతేనా?
ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే.. దాదాపు 12 ఏళ్లుగా ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేయాలని చూస్తోంది ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే.. దాదాపు 12 ఏళ్లుగా ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేయాలని చూస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న కమలనాథులు ఢిల్లీ కోటను దక్కించుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు. 25 ఏళ్ల తర్వాత కమలం వికసించేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తమ మాతృ సంస్థ సంఘ్ పరివార్ ను రంగంలోకి దింపిందని చెబుతున్నారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో తనదైన వ్యూహాలతో బీజేపీకి విజయాన్ని అందించిన సంఘ్ ఢిల్లీలో కాలు మోపడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సంఘ్ పరివార్ అంటేనే బీజేపీ.. తెర ముందు బీజేపీ కనిపించినా, తెరవెనుక సంఘ్ పరివార్ కష్టమే కాషాయ జైత్రయాత్రకు ప్రధాన కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఊహించిన దెబ్బ తగలడంతో సంఘ్ పరివార్ పూర్తిగా అలర్ట్ అయింది. 400 సీట్లు వస్తాయని ధీమాతో ఆ ఎన్నికల్లో సంఘ్ ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సివచ్చిందని అంటున్నారు. దీంతో మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో పూర్తి ఫోకస్ పెట్టారు సంఘ్ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంలో విఫలమైంది. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన సంఘ్ పరివార్ ఆ రెండు రాష్ట్రాల్లో ఓ పథకం ప్రకారం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫలితాలను సమూలంగా మార్చేసింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఢిల్లీపైనా అవే వ్యూహాలను అమలు చేసే దిశగా సంఘ్ పనిచేస్తోందని చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారం ముగిసి దాదాపు పాతికేళ్లు అవుతోంది. దేశవ్యాప్తంగా విజయాలు సాధిస్తున్నా, ఢిల్లీ అసెంబ్లీ మాత్రం కాషాయానికి చిక్కడం లేదు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో అన్నిసీట్లు గెలుచుకుంటూ వస్తోంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీపై ఎలాంటి వ్యూహం అనుసరించాలో కమలం పెద్దలు తేల్చుకోలేకపోతున్నారు. దీంతో తమ మాతృ సంస్థ సంఘ్ పరివార్ ను హస్తినలో మోహరించారంటున్నారు. దీంతొ కేరాఫ్ నాగపూర్ గా ఉన్న సంఘ్ పరివార్ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది. RSSతో పాటు సంఘ్ కింద ఉన్న అన్ని సంఘాల కార్యకర్తలు, నేతలు తమ మకాంను హస్తినకు మార్చారు. ప్రతి గల్లీ గల్లీని చుట్టేస్తూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న పరిస్థితులపై వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీకి ఎక్కడ పట్టుంది..ఎక్కడ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయనే దానిపై నివేదికలిస్తూ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. చివరిసారిగా దివంగత నేత సుష్మాస్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది బీజేపీ. ఆతర్వాత కాంగ్రెస్, ఆప్ పార్టీలే వరుసగా గెలుస్తూ వస్తున్నాయి. వరుసగా ఆరుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగా సాఫ్రాన్ (కాషాయ) ఆర్మీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంఘ్ పరివార్..బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. హస్తిన మారుమూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ కనీసం 50 వేల సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే సంఘ్ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో 13 వేల వరకు ఎన్నికల బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్ స్థాయిలో సంఘ్ పరివార్ కార్యకర్తలు చిన్న చిన్న గల్లీ మీటింగ్స్ పెడుతున్నారు. ఆమ్ అద్మీ పార్టీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, వాటర్, కరెంట్ సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రేషన్ కార్డులు ఇచ్చిన అంశాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు సంఘ్ కార్యకర్తలు. బీజేపీపై అసంతృప్తితో లోక్‌సభ ఎన్నికలకు సంఘ్ పరివార్ దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అందుకేలో లోక్ సభ ఎన్నికలప్పుడు మహాయుతి ఘోరంగా దెబ్బతిందన్న అంచనాలున్నాయి. ఆ తర్వాత అత్యున్నత స్థాయిలో చర్చలు జరగడంతో సంఘ్, బీజేపీ కలసి పనిచేయాలని డిసైడ్ అయ్యాయి. ఆ చర్చల తర్వాత దోస్తీ ఫలితమే మహాలో మహాయుతి విజయమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇప్పుడు హస్తినలో కూడా బీజేపీ కోసం అన్నీ తామై పనిచేసేందుకు సంఘ్ రంగంలోకి దింగింది. డోర్ టు డోర్ ప్రచారం..సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు. దీంతో హస్తిన రాజకీయం ఆసక్తికరంగా మారింది. హోరాహోరీగా సాగుతున్న పోరులో అంతిమ విజేత ఎవరో వేచిచూడాల్సివుంది.
👉ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ మరియు శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
👉హోరేబ్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్ అనాధ పిల్లల ఆశ్రమ భవనాన్ని ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హన్మంత్ రెడ్డి *
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగత్గిరిగుట్ట లో హోరేబ్ మినిస్ట్రీస్ వారు నిర్మించిన (హోరేబ్ చిల్డ్రన్స్ ఆర్ఫనేజ్) అనాధ పిల్లల ఆశ్రమ భవనాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ జగత్గిరిగుట్ట హోరేబ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అనాధల పిల్లలకు ఆశ్రమంను ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. నిరుపేద ప్రజలకు ఈ ఆశ్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆశ్రమ నిర్మాణానికి కృషి చేసిన సభ్యులు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హోరేబ్ మినిస్ట్రీస్ సభ్యులు మధుకర్ బైల్ల, సోను మధుకర్, డివిజన్ అధ్యక్షులు గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రవీందర్ మరియు తదితరులు పాల్గొన్నారు .
👉శ్రీ విశ్వకర్మ సొసైటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హన్మంత్ రెడ్డి ..*
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ & శ్రీ విశ్వకర్మ సొసైటీ – 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, ఆలయం అధ్యక్షులు శేఖర్ చారి, ఉపాధ్యక్షులు యాదగిరి చారి, లక్ష్మణ్ చారి, జనరల్ సెక్రెటరీ సంతోష్ చారి, ఆర్గనైజర్ అశోక్ చారి(బిల్లు), చిరంజీవి ,కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

👉జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాచాల*
జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు గ్రామంలో వెలసిన జమ్ములమ్మ అమ్మవారిని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ బుధవారం దర్శించుకున్నారు.రాచాలకు ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రాములు స్వాగతం పలికి శాలువాతో సన్మానించగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు వనం తిరుపతయ్య యాదవ్, వివి గౌడ్, బత్తుల జితేందర్ గౌడ్, మహేందర్ నాయుడు, రాఘవేందర్ గౌడ్, దేవర శివ, గౌతమ్ శంకర్, వసంత చారి, రామన్ గౌడ్, పరుశురాం, రామాంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.
👉జోగులాంబ గద్వాల జిల్లాలో రాచాల సుడిగాలి పర్యటన..
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు.ఉదయం అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారు మరియు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ అర్చకులు రాచాలకు శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించారు.
బీసీ పొలిటికల్ జెఎసి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షునిగా ఎర్రవల్లి మండలం కొండపేట మాజీ సర్పంచ్ నరసింహ యాదవ్ ని నియమించారు.బీసీ పొలిటికల్ జెఎసి ఉండవెల్లి మండల అధ్యక్షునిగా శేరిపల్లి గ్రామానికి చెందిన డబ్బి ఎల్లగౌడ్ ని నియమించారు.
⭐మధ్యాహ్నం గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన జమ్ములమ్మ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.రాచాల బృందానికి ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రాములు స్వాగతం పలికి శాలువాతో సన్మానించగా అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు.ఈ పర్యటనలో బీసీ పొలిటికల్ జెఎసి వనపర్తి జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ రవి సాగర్, వనపర్తి జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్ గౌడ్, ఉండవెల్లి మండల అధ్యక్షుడు దబ్బి ఎల్లగౌడ్, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహేందర్ నాయుడు నాయకులు రాఘవేందర్ గౌడ్, దేవర శివ, గౌతమ్ శంకర్, వసంత చారి, రామన్ గౌడ్, పరుశురాం, రామాంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.
👉తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి అధ్యక్షతన నేడు ఇందిరా భవన్ గాంధీ భవన్ లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.*ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా హాజరైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ లు సురభి ద్వివేది మరియు సయ్యద్ ఖలీద్ …ఈ సందర్బంగా జక్కిడి శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ…యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ…ప్రతి ఒక్కరు యువజన కాంగ్రెస్ భలోపేతానికి కృషి చేయాలని కోరారు…అదేవిధంగా రాష్ట్రం లో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో మరియు ఇతర ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కీలక భూమిక పోషించాలని సూచించారు…అనంతరం త్వరలోనే యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నామని అన్నారు…ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణ మరియు ప్రోటోకాల్ పాటించాలని కోరారు… నేటి యువకులు రాజకీయంగా ఎదగాలి అంటే వివిధ అంశాలపై తమ వాయిస్ ని ప్రజలకు వినిపించాలని యంగ్ ఇండియా కె బోల్ సీజన్ -5 గొప్ప అవకాశమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు స్వదినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు రాష్ట్ర కార్యదర్శిలు మరియు జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు…
👉ఒంగోలు నగరంలోని 14వ డివిజన్ టీటీడీ ఫంక్షన్ హల్ నందు 6.15కోట్లతో మంజూరైన బాలికల వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాత , నాయకులు కోలా ప్రభాకర్, బెల్లం సత్యనారాయణ , కుప్పా రంగ సాయి, పాలపర్తి శ్రీనారెడ్డి మరియు తదితర నాయకులు.
👉 ఒంగోలు నగరంలోని సి.వి.ఆర్ రీడింగ్ రూమ్ నందు అక్కినేని కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరావు వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన అక్కినేని అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, మండువ మురళి , అక్కినేని అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ సంగీత దర్శకులు, వందేమాతరం శ్రీనివాస్ రావు, నల్లూరి వెంకటేశ్వర్లు , కళ్ళగుంట కృష్ణయ్య పొన్నూరు వెంకట శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ ఇస్మాయిల్ బెల్లం సత్యనారాయణ , మరియు తదితర నాయకులు, అభిమానులు.

