👉ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం*..*ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు..👉కోల్ కతా రే*ప్ లో కొత్త మలుపు! – యువ వైద్యురాలి డెడ్ బాడీ మీద మహిళ డీఎన్ఏ? ..👉అలకానంద హాస్పటల్ సీజ్?*..కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు*..👉త్వరలో.. కేసీఆర్, జగన్ భేటీ?..👉 బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడి రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువతి .. 👉ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ కేసు నమోదు*..👉 రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు సహకారంతో పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ* ..*అనుమానంతో గర్భిణి అయిన భార్యను హతమార్చిన భర్త..

👉విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు …*తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు…ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన బాలికలు.. 😱😱😱

👉ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం* *మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.*..పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.*ఈ విషాద ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.*

👉 బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడి.. రైల్ కింద పడి ఆత్మహత్య.. హైదరాబాద్ – జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ పై పడి యువతి సూసైడ్.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది.. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది.తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువతి…

👉ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ కేసు నమోదు*.. సత్ప్రవర్తన నిమిత్తం ఎమ్మార్వో వద్ద 5 లక్షల రూపాయల బైండోవర్ చేయడం జరిగింది*…మండల పరిధిలోని గ్రామాలలో ప్రజలు ఎవరూ కూడా గొడవలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరిక*… ముఖ్యంగా యువత కొట్లాట్లకు గొడవలకు వెళ్లకుండా ఉండాలని సూచన*..మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్*

ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కేసు నమోదు చేసి మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వారిని హెచ్చరించారు.మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో వివాహిత పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఆమె భర్త యువకుడి మధ్య గొడవ జరిగి దాడి చేసి కొనగా ఇద్దరికీ గాయాలైనందువలన కేసు నమోదు చేసి మండల ఎమ్మార్వో వద్ద వారి సత్ప్రవర్తన నిమిత్తం 5 లక్ష రూపాయల బైండోవర్ చేయడం జరిగిందని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ తెలిపారు. మండల పరిధిలోని గ్రామ ప్రజలు గొడవలకు దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలని ముఖ్యంగా యువకులు ఘర్షణలకు గొడవలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి తమ విలువైన భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ తనదైన శైలిలో హెచ్చరించారు.

👉 రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు సహకారంతో పదవతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ*

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రాచర్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి ఆధ్వర్యంలో రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు సహకారంతో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు .ఈ కార్యక్రమానికి రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు హాజరు అయ్యారు. అనంతరం కోటేశ్వరరావు చేతులమీదుగా మరియు మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు గిరిధర్ శర్మ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బియల్ రామనాయక్ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ చేతులమీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ క్రమశిక్షణతో చదువుకోని పదవతరగతిలో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ… విద్యార్థులు అందరూ ఒక లక్ష్యంతో చదివి పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలి అన్నారు.ఈ స్టడీ మెటీరియల్స్ కు సహాయం చేసిన దాత రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు కు చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. రాచర్ల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు, గిరిధర్ శర్మ మాట్లాడుతూ… చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పేదవారికి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,స్కూల్ చైర్మన్ గజ్జ శ్రీనివాసులు,విద్యార్థులు పాల్గొన్నారు.

👉అలకానంద హాస్పటల్ సీజ్?*..కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు*..హైదరాబాద్:జనవరి 22 ..రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్‌ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్‌ ఆసు పత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు రట్టయింది.*ఎప్పటి నుంచి ఈ వ్యవ హారం కొనసాగుతోంది.. ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నా రు.హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడులు చేస్తున్న ఆసుపత్రిపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రి లోపల నలుగురిని గుర్తించిన పోలీసులు వారికి కిడ్నీ శస్త్ర చికిత్స జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు దాతలుగా భావిస్తున్నారు. మరో ఇద్దరు గ్రహీతలుగా భావిస్తున్నారు. వీరు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ఈ నెల 17 న ఆసుపత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. వారిని ప్రశ్నించగా తాము కిడ్నీలో రాళ్లు తీసుకోవడానికి వచ్చినట్టు తెలిపారు. కానీ అధికారుల పరిశీల నలో మాత్రం వారికి కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమ య్యాయి. నలుగురికి కిడ్నీ మార్పిడి జరిగిందా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్దారించేం దుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.అలకనంద ఆసుపత్రి గత ఆరు నెలల కింద ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్య చికిత్సలకు మాత్రమే అనుమతి ఉండగా ఇది తొమ్మిది పడకల ఆసు పత్రిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ కిడ్నీ శస్త్ర చికిత్సలు వంటి వాటికి అనుమతి లేదని గుర్తించారు. అయినప్పటికీ అక్రమంగా డబ్బు ఆశ చూసి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి అక్రమంగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిని అధికారులు సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఆసుపత్రి ఇన్‌చార్జితో పాటు మరొకొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఆసుపత్రిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. కిడ్నీ రాకెట్‌ వ్యవహారం నగరంలో చర్చనీయాం శంగా మారింది.

👉త్వరలో.. కేసీఆర్, జగన్ భేటీ?అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వైసీపీ బాస్ జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి మొదటి వారంలో భేటీ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ మాజీ సీఎంలు కలసి రానున్న ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలి అనేదానిపై వ్యూహాల గురించి చర్చించుకుంటారని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.

👉ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పెళ్లి.. అనుమానంతో గర్భిణి అయిన భార్యను హతమార్చిన భర్త..ముఖంపై దిండు అదిమిపెట్టి హత్య..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

హైదరాబాద్ – కుషాయిగూడలోని నాగార్జున నగర్లో కాచిగూడ రాజ్మాహల్లాకు చెందిన సచిన్ సత్యనారాయణ(21)కు కాప్రాకు చెందిన ఠాకూర్ స్నేహ(21)తో 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయంతో 2022లో వివాహం చేసుకున్నారు.. వీరికి పుట్టిన బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కొన్ని నెలల పాటు ఇద్దరూ దూరంగా ఉన్నారు.ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల క్రితం భార్యతో మళ్లీ రాజీ కుదుర్చుకుని నాగార్జుననగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజుల అనంతరం భార్య ఏడు నెలల గర్భవతి అని తేలడంతో సత్యనారాయణకు ఆమెపై అనుమానం ఏర్పడింది.ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్య ఏడు నెలల గర్భిణీ ఎలా అయిందని అనుమానంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 16న తెల్లవారు జామున స్నేహతో గొడవపడ్డ సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.దీంతో కడుపులో ఉన్న ఏడునెలల పిండం కూడా బయటపడింది. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు.

👉కోల్ కతా రే*ప్ లో కొత్త మలుపు! – యువ వైద్యురాలి డెడ్ బాడీ మీద మహిళ డీఎన్ఏ?  ఇదంతా ఒక ఎత్తు అయితే బాధితురాలు ‘అభయ’ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్ కతాలోని ఆర్ జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికోపై జరిగిన హత్యాచారం ఉదంతంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్ ను చనిపోయే వరకు జైల్లోనే ఉండేలా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పెదవి విరిచారు. తాజాగా ఈ తీర్పుపై హైకోర్టు అప్పీలును కోరారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పుపై విమర్శలు భారీగా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే బాధితురాలు ‘అభయ’ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో.. ఈ వ్యవహారంపై కొత్త చర్చ మొదలైంది. విచారణకు సంబంధించిన కొన్ని నివేదికలు వెలుగు చూడటంతో ఈ హత్యాచార ఉదంతంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన రిపోర్టును చూసినప్పుడు అత్యాచారానికి గురైన బాధితురాలి డెడ్ బాడీ మీద సంజయ్ రాయ్ డీఎన్ఏ 100 శాతం మేర ఉన్నట్లుగా గుర్తించారు. అదే సమయంలో కొద్ది శాతం మరో మహిళ డీఎన్ఏ కూడా ఉన్నట్లు తేలింది. ఇది సంజయ రాయ్ డీఎన్ ఏలో కలిసిందా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. మరోవైపు కోర్టు తీర్పుపై పెదవి విరిచిన మమతా సర్కారు.. దీనిపై అప్పీలుకు హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు ఓకే చెప్పింది. ఈ కేసు విచారణను మరింత లోతుగా సాగాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..