👉మైనర్ బాలిక మిస్సింగ్ (తిరుపతి)…👉వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్యపై ఫిర్యాదు.. మేటర్ రూ.200 కోట్లు! .. 👉 ఢిల్లీలో బీజేపీ గెలిస్తే అసలైన గేమ్ స్టార్ట్ ? ..* ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ … *సిమ్లా సమావేశంలో ఎంపీ మాగుంట .. గుంటూరు లో కొకెయిన్ కలకలం

👉నరసరావుపేట పట్టణం లో పోలీసుల మెరుపు దాడులు…డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బార్ షాపు.వైన్స్ లాడ్జీలపై రైడింగ్…నరసరావుపేట పట్టణంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు*

👉గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం ..  8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ గుంటూరు పోలీసులు.. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది..రాష్ట్రంలో తొలి కోకైన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు..గుంటూరు నగరంలో ఒక్క గ్రామ్ కోకైన్ 6 వేల నుంచి 3 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి..నల్లచెరువు కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటువంటి మాదక ద్రవ్యాలను నగరంలో అమ్మకాలు చేస్తున్నారు…7 ప్యాకేట్లల్లో ఉన్నటువంటి 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు..గంజాయి మాదక ద్రవ్యాలకు సంబంధించిన వివరాలు 14500 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరిన ఎక్సైజ్ అధికారులు…

👉 ఓయో రూములలో గంజాయి దందా.. ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయి, మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.. ఇద్దరూ ఒకరినొకరు మనసు పడ్డారు.. మనసులు కలవడంతో.. ఇద్దరూ పెద్ద ప్లానే రచించారు.. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.. దాని కోసం గంజాయ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.. అయితే.. దొరకకుండా ఉండేందుకు ఓయో రూమ్‌లను ఎంచుకున్నారు.. ఓయో రూమ్స్‌లో ఉంటూ గంజాయి వ్యాపారం ప్రారంభించారు.. చివరకు అసలు గుట్టు బయటకు రావడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. ఓయో రూమ్స్ లో ఉంటూ ఇద్దరూ చేస్తున్న దందాను రట్టు చేశారు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.. కొండాపూర్‌లోని ఓయో రూమ్స్ లో ఉంటూ గంజాయి దందా చేస్తున్న యువతీ, యువకుడిని ఎస్టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు..ఎస్టీఎఫ్‌ అధికారి నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన దేవేందుల రాజు (25) కు మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా (18) తో కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ క్రమంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఓయోరూమ్స్‌లో గదులు అద్దెకు తీసుకొని గంజాయిని విక్రయిస్తున్నారు.కొంతకాలంగా కొండాపూర్‌లోని ఓయో రూంలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం రాత్రి ఎస్టీఎఫ్‌ బృందం తనిఖీలు నిర్వహించి అసలు గుట్టును రట్టుచేసింది.. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్ నుంచి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

👉దావోస్‌లో సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబు బృందం నాలుగు రోజుల పాటు దావోస్‌లో రేవంత్‌ బృందం పర్యటన.. భారీ పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌..సింగపూర్‌ పర్యటన విజయవంతం కావడంతో..దావోస్ సదస్సుపై తెలంగాణ సర్కార్ భారీ అంచనాలు

👉*ఇండియాలో మొదటి ఎయిర్ ట్యాక్సీ ఆవిష్కరణ*

ఇండియాలో మొట్ట మొదటి ఎయిర్టెట్యాక్సీ నమూనాను ఓ స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఎయిర్ ట్యాక్సీ ‘శూన్య’ను బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సర్లా ఏవియేషన్ ఆవిష్కరించింది. ఎయిర్ ట్యాక్సీ సేవలను 2028 నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

👉మైనర్ బాలిక మిస్సింగ్..తిరుపతి…అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటన్ మిల్లు వద్ద మిస్సింగ్ అయిన బాలిక.. మజ్జిగ కాలువ కు చెందిన బాలిక తన ఫ్రెండ్ కు బట్టలు ఇవ్వాలిఅంటూ పెదనాన్న ద్విచక్ర వాహనంలో బయలుదేరిన వైనం..కాటన్ మిల్లు వద్ద దింపి వెళ్లిపోయిన పెదనాన్న..సాయంత్రం అయినా ఇంటికి రాక పోవడంతో పోలీసులను ఆశ్రయించిన బాలిక కుటుంబం..బాలిక అన్న పవన్ కుమార్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు .కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి పోలీసులు.

👉ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్*


హైదరాబాద్: గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి ఎంపీ ఈట ల రాజేందర్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అరుంధతినగర్‌లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతినగర్‌లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాం గ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కూల గొట్టడమే అజేండాగా పెట్టుకుందని అరోపించారు. జవహర్‌నగర్‌లో పేదకుటుంబాలే నివాసం ఉంటున్నాయని ఇక్కడ కూల్చిన రేకుల షెడ్లకు రూ.50 వేలు, స్లాబ్‌లకు రూ,2 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పెద్దవాళ్లు కోట్లాది విలువైన భూములను కొల్లగొడుతుంటే పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం జవహర్‌నగర్‌ లోని పేదలపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని విమర్శించారు.రెవెన్యూ అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఇప్పటికైనా పేదల జోలికి రాకుండా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా రూరల్‌ అధ్యక్షులు విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మహేందర్‌ యాదవ్‌, కార్పొరేటర్‌ పానుగంటి బాబు, నాయకులు రంగుల శంకర్‌, జవహర్‌నగర్‌ పార్టీ అధ్యక్షులు కమల్‌, సంతోష్‌, సందీప్‌, యాదగిరి, అరుంధతి వాసులు పాల్గొన్నారు..

👉వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్యపై ఫిర్యాదు.. మేటర్ రూ.200 కోట్లు! …వివరాల్లోకి వెళ్తే… కొండాపూర్ లో సర్వే నెంబర్ 87/2లో 2.8 ఎకరాల భూమి ఉండగా.. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొనుగోలు చేశారు. హైదరాబాద్ లో భూమి.. దాని విలువ సుమారు రూ.200 కోట్లు అని అంటున్నారు.. ఈ క్రమంలో వైసీపీలో అత్యంత కీలక నేతగా ఉన్న వ్యక్తి భార్యకు మరో వ్యక్తికి మధ్య ఇష్యూ జరుగుతుండగా.. మధ్యలో మూడో వ్యక్తి ఎంటరై.. వైసీపీ నేత, ఆయన భార్యపైన భూకబ్జాకు యత్నించారంటూ కేసు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవును… హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిపై నెలకొన్న వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ వ్యవహారంలో వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతా రెడ్డి పేర్లు వినిపిస్తుండటంతో విషయం మరింత వైరల్ గా మారిందని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే… కొండాపూర్ లో సర్వే నెంబర్ 87/2లో 2.8 ఎకరాల భూమి ఉండగా.. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఆ స్థలాన్ని ఎల్ & టీ కి లీజుకిచ్చారు. ఈ క్రమంలో గడువు ముగిసిన అనంతరం 2022లో ఆ సంస్థ ఈ స్థలాన్ని ఖాళీ చేసేసింది. ఈ క్రమంలో… అప్పటీ నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థలంలో ఎ. అనీల్ రెడ్డి అనే వ్యక్తి బోర్డులు పాతారు. ఈ సమయంలో ఆ భూమి తమదని, ఆ భూమిలో పాతిన బోర్డులు తీసి ఖాళీ చేయాలని స్వర్ణలతా రెడ్డి అడిగారు. దీంతో… అనిల్ రెడ్డి, అతడి అనుచరులు తమపై దాడి చేశారని జనవరి 5న స్వర్ణలతా రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జనవరి 8న నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎంటరై ఆ భూమిలో అనీల్ రెడ్డి పేరిట ఉన్న బోర్డులు తీసి పడేసి.. తన పేరుతో కొత్త బోర్డు పాతారు. ఈ సమయంలో ఈ వ్యవహారంపై స్వర్ణలతా రెడ్డి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. మళ్లీ వస్తామని చెప్పి అక్కడున్న వ్యక్తులు వెళ్లిపోయారు. ఇలా ఈ భూమి తనదని స్వర్ణలతా రెడ్డి చెబుతుంటే… మరోపక్క అనిల్ రెడ్డి, నర్సింహారెడ్డి అనే వ్యక్తులు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ భూమి తమదేనని బోర్డులు పెడున్నారు. మరోవైపు.. తమ భూమి కబ్జాకు యత్నించారంటూ నర్సింహారెడ్డి తరుపున అతని వాచ్ మన్ అదే రోజు వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలతా రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాలను గచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపారు. దీంతో… హైదరాబాద్ లో అత్యంత విలువైన భూముల విషయంలో ఇలాంటి ఊహకందని, సినిమా సన్నివేశాలను తలదన్నే స్థాయిలో ట్విస్టులు ఎన్నో చోటు చేసుకుంటుంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
👉 ఢిల్లీలో బీజేపీ గెలిస్తే అసలైన గేమ్ స్టార్ట్ ? .. బీజేపీకి ఇపుడు కళ్ల ముందు ఉన్న భారీ లక్ష్యం ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతున్నాయి. బీజేపీకి ఇపుడు కళ్ల ముందు ఉన్న భారీ లక్ష్యం ఢిల్లీ ఎన్నికలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగుతున్నాయి. మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాలు 8వ తేదీన వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి చివరిసారి గెలిచింది 1993లోనే అంటే మూడు దశాబ్దాలకు పైగా ఢిల్లీలో గెలుపు రుచిని బీజేపీ ఆస్వాదించలేదు అన్న మాట. దాంతో ఒక వైపు విజయం కోసం పట్టుదల గెలిచి తీరాలన్న కసితో బీజేపీ ఈసారి గెలుపే మాది అంటోంది. బీజేపీ ధీమాకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఆప్ అన్న పార్టీ 2013 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తోంది. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే ఐదవసారి పీఠం ఎక్కి రికర్డు క్రియేట్ చేయనున్నారు. కానీ గతంలో ఉన్న ఇమేజ్ అయితే ఈసారి అరవింద్ కి లేదని అంటున్నారు. ఆయనను పన్నెండేళ్ళుగా ప్రజలు చూసారు. తమదైన తీర్పుని ఆయనకు అనుకూలంగా చాలా సార్లు ఇచ్చారు. ఈసారి గ్రౌండ్ లెవెల్ లో చూస్తే మార్పు కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటు గతంలో మాదిరిగా ఆప్ లో ఐక్యత లేదు. సీనియర్లు కూడా కొందరు దూరంగా ఉన్నారు. పార్టీలో వర్గ పోరు సాగుతోంది. ఇవన్నీ తట్టుకుని కేజ్రీవాల్ ఒంటి చేత్తొ పోరాడి గెలిస్తే మాత్రం ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో మైలు రాయిని దాటినట్లే అంటున్నారు. కేజ్రీవాల్ ఇమేజ్ తగ్గడం ఆప్ మునుపటిలా లేకపోవడం ప్రజలలో మార్పు కోసం తపించడం వంటివి తమకు కలసి వస్తాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇక మరో వైపు చూస్తే ఢిల్లీలో చూస్తే ఒక విధంగా ట్రయాంగిల్ ఫైటింగ్ అని చెప్పాలి. ఇండియా కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆప్ తో ఢీ కొడుతోంది. కాంగ్రెస్ ఢిల్లీని 1998 నుంచి 2013 దాకా అంటేఅ ఏకంగా పదిహేనేళ్ళ పాటు పాలించింది. దాంతో కాంగ్రెస్ కి కూడా కొన్ని సెగ్మెంట్లలో బలం ఉంది. ఓటు బ్యాంక్ కూడా ఉంది. దాంతో ఈ త్రిముఖ పోటీ వల్ల ఆప్ ఓట్లు చీలిపోయి తమకు విజయావకాశాలు బాగా పెరుగుతాయని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఢిల్లీలో తాము బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నామని అపుడే బీజేపీ పెద్దలు గొప్పగా చెబుతున్నారు. బీజేపీ అనుకున్నట్లుగా ఢిల్లీలో గెలిస్తే అసలైన గేమ్ స్టార్ట్ చేస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం అలగే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని ఆమోదించడంతో పాటు రాజకీయంగా దూకుడు పెంచుతుందని అంటున్నారు. ఆ దూకుడుతో ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే బీహార్ ఎన్నికల్లోనూ మరోమారు సక్సెస్ కొట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందని 2026లో జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తుందని విపక్షాల వ్యూహాలకు అందనంత విధంగా పకడ్బందీ వ్యూహంతో వారిని చక్రబంధం చేస్తుందని అంటున్నారు. అంతే కాదు ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడుతుందని ఏపీ పాలిటిక్స్ లో కూడా బీజేపీ సరికొత్త జోరుని చూపించబోతుందని అంటున్నారు. సో అన్నింటికీ ఢిల్లీయే కీలకం కాబట్టి ఫిబ్రవరి 8న ఫలితాలు ఎలా వస్తాయి అన్నది వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.
👉గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ టూర్ లో భాగంగా షిమ్లా లో కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు.కార్యక్రమం లో కమిటీ సభ్యులు , గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOHUA), డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (DFS), యూకో బ్యాంక్, నేషనల్ బిల్డింగ్స్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) మరియు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) యొక్క ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం ఆదివారం
గృహ  పట్టణ వ్యవహారాల కమిటీ టూర్ లో భాగంగా ఈ రోజు షిమ్లా లోని పలు ప్రాంతాలను సందర్శించిన కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర కమిటీ సభ్యులు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..