👉కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆరోపణలు తోసిపుచ్చిన బీజేపీ..👉రేపటి నుంచి పోలీసు ఆరోగ్య భద్రత బంద్?*👉 గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం..⭐👉ప్రోటోకాల్ దర్శనం కోసం కేంద్ర ఆఫీసర్ ఓవరాక్షన్! ..👉లోన్ కట్టాలని వేధించిన అధికారులు..(ఆదిలాబాద్).. 👉రేపటి నుంచి పోలీసు ఆరోగ్య భద్రత బంద్?… * 35 మందికి సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*…*కంభం పోలీస్ స్టేషన్లో స్వచ్ఛభారత్ …కోడిపందాలపై పోలీసుల దాడులు (మర్రిపూడి)

👉 *సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌*

*నిందితుడు ఆకాశ్ కనోజియాగా గుర్తింపు..నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అరెస్టు చేసిన రైల్వే పోలీసులు…నిందితుడి కోసం ముంబై నుండి ఛత్తీస్‌గఢ్‌ బయల్దేరిన పోలీసులు*

👉 ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడి. కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన బీజేపీ కార్యకర్తలు. బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ అనుచరుల పనే అన్న ఆప్‌ నేతలు. ఆప్ నేతల ఆరోపణలను ఖండించిన బీజేపీ. కేజ్రీవాల్‌ కారు బీజేపీ కార్యకర్తలను ఢీకొట్టిందన్న బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ. బీజేపీ కార్యకర్తలు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారన్న బీజేపీ నేత..👉కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆరోపణలు తోసిపుచ్చిన బీజేపీ..అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ దాడికి పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి ప్రచారం చేస్తుండగా కేజ్రీవాల్ కారుపై ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని ఆ పార్టీ ఆరోపించింది. దాడికి సంబంధించిన వీడియోను కూడా పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసింది. మరోవైపు, కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు యువకులను ఢీకొట్టారని బీజేపీ ఆరోపించింది.

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ నేత పర్వేష్ వర్మ అనుచరులు దాడి చేశారని శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్ కారుపై రాళ్లు రువ్వారని పేర్కొంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీలో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానికులు జోక్యం చేసుకుని దుండగులను తరిమికొట్టినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆరోపించిన దాడికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఓటమి భయంతో బీజేపీ భయాందోళనకు గురవుతోందని ఆ పార్టీ పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు బీజేపీ తన గూండాలను సిద్ధం చేసింది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు కేజ్రీవాల్‌ ప్రచారం చేయకుండా ఇటుకలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచేందుకు ప్రయత్నించారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ పిరికి దాడికి కేజ్రీవాల్ భయపడరని ఆ పార్టీ పేర్కొంది. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం చెబుతారని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టింది ఆప్.

**బీజేపీ వెర్షన్ మరోలా ..మరోవైపు తమ కార్యకర్తలపై ఆప్ వర్గాలు దాడికి యత్నించాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటన తర్వాత బీజేపీ నేత పర్వేష్ వర్మ కూడా గాయపడినవారిని పరామర్శించేందుకు లేడీ హార్డింజ్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పవ్రేష్ వర్మ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. కేజ్రీవాల్ తన కారుతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను ఢీకొట్టారని ఆరోపించారు.

💥ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో చొక్కారావు మృతి. బీజాపూర్‌లోని పుజారి -కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చొక్కారావుతో పాటు 17 మంది మృతి. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో లేఖ విడుదల.

💥> స్వచ్ఛ ఆంధ్రకోసం అందరూ కలిసి పని చేయాలి. ఇతర దేశాలలో రోడ్లపై చెత్తవేయరు.. డస్ట్‌బిన్లలో వేస్తారు. మున్సిపాలటీల్లో స్వచ్ఛతతో ముందుకు వెళ్తాం. దేశ విదేశాలు తిరిగి ప్రధానికి పరిశుభ్రతపై సమగ్రమైన నివేదక ఇచ్చా. మూడవ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్రపై శ్రద్ధ పెట్టాలి.. -సీఎం చంద్రబాబు

👉 నామాట కాదనకుండా పిలిస్తే చిరంజీవి వస్తారు. అనేక మంది సినీ ప్రముఖులతో బీజేపీకి సంబంధాలున్నాయి. కొందరు పార్టీలో చేరారు.. మంత్రులు అయ్యారు. -కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

👉 ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల బుద్ధి మారలేదు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగుస్తున్నామని చేసిన విష ప్రచారం బెడిసికొట్టింది. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్‌ ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారం చేస్తున్నారు. -గొట్టిపాటి రవికుమార్‌

💥> సిద్దిపేట : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో అగ్నిప్రమాదం. రెండు గంటల నుంచి డంపింగ్ యార్డ్‌లో చెలరేగుతున్న మంటలు. వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న మున్సిపల్ సిబ్బంది. స్థానికులు ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించని అగ్నిమాపక సిబ్బంది. ఇప్పటివరకు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లు.

💥> సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటన కేసు. సంజయరాయ్‌ని దోషిగా తేల్చిన సీల్దా కోర్టు. కోల్‌కతా హత్యాచార ఘటనలో సంజయ్‌రాయ్‌ దోషి. దోషి సంజయ్‌కు సోమవారం శిక్ష ఖరారు చేయనున్న సీల్దా కోర్టు. గతేడాది ఆగస్టు 9న RGకర్‌ జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం. ఆగస్టు 10న నిందితుడు సంజయ్‌రాయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.

👉ఛాంపియన్స్ ట్రోఫి – 2025 భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్‌గిల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటెల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్ కి చోటు.. ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు తేజం నితీష్‌కు నిరాశ.. గాయం నుండి కోలుకోవడంతో టీమ్‌లోకి బుమ్రా..

💥అమరావతి: పవన్‌ క్యాంప్‌ ఆఫీసుపై డ్రోన్‌ కలకలం. మధ్యాహ్నం ఆఫీసుపై ఎగిరిన డ్రోన్‌. డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసిన సిబ్బంది.

💥తమన్‌ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి. తమన్‌ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. తమన్‌ ఎంత కలత చెంది ఉంటే ఇలా స్పందించారో. విషయం ఏదైనా సోషల్‌ మీడియా మాటల ప్రభావం.. ఆ వ్యక్తులపై ఎలా ఉంటుందో ఆలోచించాలి-చిరంజీవి

💥ఆదిలాబాద్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌లో దారుణం. బ్యాంక్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. లోన్‌ డబ్బు కట్టలేదని బ్యాంక్‌ సిబ్బంది వేధింపులు. బ్యాంక్‌ సిబ్బంది వేధింపులకు రైతు మనస్తాపం. మృతుడు జాదవ్‌ దేవరావుగా గుర్తింపు. బ్యాంక్‌ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన

💥 సిఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉండవల్లిలోని సిఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమిత్ షా తో భేటీ అయ్యారు.

👉లోన్ కట్టాలని వేధించిన అధికారులు..*ఆదిలాబాద్ జిల్లా: బేల మండలం రేణిగూడకు చెందిన రైతు ఆదిలాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో 2019 లో భూమిని కుదువ పెట్టి 3.50 లక్షల రుణం తీసుకున్నాడు. ఏడాదికి కొంత వడ్డీని కడుతూ వస్తున్నాడు. గత ఏడాది కాలంగా పంటలు సరిగా పండక వడ్డీ కట్టలేకపోయాడు. వడ్డీని చెల్లించలేని లేని పక్షంలో భూమిని జప్తు చేసుకుంటామంటూ బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తనకు ఇన్నాళ్లు అన్నం పెట్టిన భూమి పోతుందని మనోవేదనకు గురైన రైతు దేవరావు పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చి అందరూ చూస్తుండగానే క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు.గమనించిన సెక్యూరిటీ గార్డ్ రైతును పక్కనే ఉన్న కుర్చిలో కూర్చోబెట్టి బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే రైతు తీవ్ర అస్వస్థకు గురై అక్కడికక్కడే కూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు బ్యాంకు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

👉నరసరావుపేటలో గంజాయి తాగించి దొంగతనాలు చేయిస్తున్న ముఠా*..అమాయక పిల్లలకు మత్తుమందు ఇచ్చి దొంగతనాలు చేయిస్తున్న గ్యాంగ్*

నరసరావుపేట పట్టణానికి చెందిన ముఠాపిల్లలను డ్రగ్స్, గంజాయి కి బానిసలుగా చేసి వారిచేత సెల్ ఫోన్ దొంగతనాలు, గంజాయి రవాణా చేయిస్తున్నారు.. ఇప్పటికీ సుమారు 150 దొంగతనాలు చేయించినట్లు అనుమానంరెండు నెలల క్రితం పోలీసులకు పట్టుబడిన జమీర్ మీరావలిజువైనల్ హోంలో శిక్ష అనుభవించిన మీరావలిఇంటికి వచ్చిన తర్వాత తిరిగి దొంగతనాలు చేయాలంటూ వేధిస్తున్న ముఠావారి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన జమీర్ మీరావలిమత్తు పదార్థం ఇచ్చినప్పుడు మాకు ఏం చేస్తున్నావో తెలియక వాళ్ళు చెప్పింది చేస్తున్నామన్న బాధితుడుదొంగతనాలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయిన బాధితుడు,అమాయకులైన చిన్న పిల్లలను టార్గెట్ చేసుకున్న వారిద్దరిపై చర్యలు తీసుకోవాలంటున్న బాధితుడి తల్లిదండ్రులు.

👉ప్రోటోకాల్ దర్శనం కోసం కేంద్ర ఆఫీసర్ ఓవరాక్షన్!*

తిరుమలలో గౌరవమర్యాదలతో దర్శనం కోసం అమిత్ షాతో పాటు ఏపీకి వచ్చిన ఓ అధికారి చేసిన అతి వివాదాస్పదమయింది. టీటీడీ చైర్మన్ కు శనివారం ఓ లేఖ అందింది. దాని సారాంశం ఏమిటంటే ఓ హోంశాఖ అధికారి వచ్చి క్రౌడ్ మేనేజ్మెంట్ పై సమీక్ష చేస్తారని. అసలు సమీక్ష చేయడానికి ఆ అధికారి ఎవరు.. ఒక్కరు వచ్చి సమీక్ష చేసి ఏం చేస్తారు..? అని టీటీడీ అధికారులకు అర్థం కాలేదు. హోంశాఖ అధికారులను సంప్రదించారు. ఇదేం సమీక్ష అని ప్రశ్నించడంతో మొదట హోంశాఖ అధికారులకు అర్థం కాలేదు.

హోంశాఖ ఏదైనా రాష్ట్రంలోని అంశాలపై స్వయంగా సమీక్ష చేయాలనుకుంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారం ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఓ లేఖ రాసేసి వచ్చేస్తామని.. ఒకే అధికారి సమాచారం పంపారు. ఈ విషయాన్ని ఏపీలోనే ఉన్న అమిత్ షా దృష్టికి ప్రభుత్వ వర్గాలు తీసుకెళ్లాయి. ఆయన కూడా ఆశ్చర్యపోయారు. హోంశాఖ తరపున ఇలాంటి సమీక్ష లని నిర్వహించాలని అనుకోలేదని తక్షణం రద్దు చేసుకవాలని ఆదేశించారు. దాంతో లేఖ ఉపసంహరించుకున్నారు…కేవలం అమిత్ షాతో పాటు ఏపీకి వస్తున్న ఆ అధికారి.. దర్శనం ప్రోటోకాల్ కోసమే ఇలా లేఖ రాశానని అంతిమగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. టీటీడీ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం తనను తీసుకెళ్లి దర్శనం చేయించి .. ఓ సమావేశం పెట్టి పంపిస్తారని అనుకున్నారు. కానీ రచ్చ అయ్యే సరికి నాలిక్కరుచుకోవాల్సి వచ్చింది.

👉రేపటి నుంచి పోలీసు ఆరోగ్య భద్రత బంద్?*

*ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రేపటి నుండి వైద్యం చేయబోమని చెప్పిన దవాఖానలు*..సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్న పోలీసు ఆరోగ్య భద్రత వైద్య సేవలు*..చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్న దవాఖానలు*..తమకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం 20వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్ఏహెచ్ఎ) జనవరి 6న ఆరోగ్య భద్రత కార్యదర్శికి లేఖ రాసింది*కానీ, ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పోలీసు ఆరోగ్య భద్రత విభాగం అధికారులు చెప్పారు..*దీంతో ప్రతినెలా నగదు చెల్లిస్తున్నా.. తమవారికి ఆపద వచ్చినప్పుడు వైద్యం చేయించుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్న పోలీసు కుటుంబాలు*

👉 గుంటూరు జిల్లాలో కోకైన్ కలకలం..⭐8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ గుంటూరు పోలీసులు.. గుంటూరు శ్యామలా నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.. రాష్ట్రంలో తొలి కోకైన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. గుంటూరు నగరంలో ఒక్క గ్రామ్ కోకైన్ 6 వేల నుంచి 3 వేల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి..నల్లచెరువు కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటువంటి మాదక ద్రవ్యాలను నగరంలో అమ్మకాలు చేస్తున్నారు…7 ప్యాకేట్లల్లో ఉన్నటువంటి 8.5 గ్రాముల కోకైన్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. గంజాయి మాదక ద్రవ్యాలకు సంబంధించిన వివరాలు 14500 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరిన ఎక్సైజ్ అధికారులు…

👉ప్ర‌జ‌ల సంతోష‌మే త‌న సంతోషంగా ప‌నిచేసే ముఖ్య‌మంత్రి దొర‌క‌డం ఏపీ ప్ర‌జ‌ల అదృష్టం – ఎమ్మెల్యే ముత్తుముల**తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 35 మందికి సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*…గిద్దలూరు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ప‌లువురికి వైద్య‌ స‌హాయార్థం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి (సీఎం.ఆర్.ఎఫ్‌) నుంచి ఆర్థిక స‌హాయం అందించటం జ‌రిగింది. ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాస‌న‌స‌భ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి 35 మందికి రూ.63,30,330 – 00 లు, అక్షరాల అరవై మూడు లక్షల ముప్పై వేల మూడు వందల ముప్పై రూపాయల చెక్కుల‌ను అందించడం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్ర‌జ‌ల సంతోష‌మే త‌న సంతోషంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌నిచేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల గురించి, రాష్ట్రం గురించి ఇంత‌గొప్ప‌గా ఆలోచించే నాయ‌కుడు మ‌న‌కు దొర‌క‌డం నిజంగా ఏపీ ప్ర‌జ‌ల‌ అదృష్ట‌మ‌న్నారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఎవ‌రూ దిగులు ప‌డాల్సిన ప‌నిలేద‌ని, గ‌త ప్ర‌భుత్వంలో మాదిరి ఎవ‌రూ ప్రాణాలు కాపాడుకోవ‌డం కోసం ఆస్తులు అమ్ముకోవ‌డం.. అప్పులు చేయ‌డం వంటివి కూట‌మి ప్ర‌భుత్వంలో చేయాల్సిన ప‌నిలేద‌న్నారు. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో పాటు, పాల‌నాప‌ర‌మైన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎన్దీయే ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కొత్త ప‌రిష్కార‌ వేదిక ఏర్పాటు చేయ‌నుంద‌న్నారు. అంద‌రి చేతిలో ఉండే మొబైల్ లోని వాట్సాప్ ఫ్యూచ‌ర్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేలా వివిధ శాఖ‌ల‌ను అనుసంధానిస్తూ, ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే నూత‌న విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురానుంద‌న్నారు. సాంకేతికను పాల‌నా ప‌ర‌మైన అంశాల‌కు జోడించ‌డం ద్వారా ఇటు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గ‌డంతో పాటు, అటు రాష్ట్రాభివృద్ధి కూడా ప‌రుగులు పెడుతుంద‌న్నారు. మంచి చేసిన ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.

*స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్లో ఎస్సై బి నరసింహారావు  ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.

*ప్రకాశం జిల్లా…. మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామంలో కోడిపందాలపై పోలీసుల దాడులు….. పదిమందిని అదుపులోకి తీసుకొని నాలుగు కోళ్లు స్వాధీనం చేసుకుని 6500/- రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న మర్రిపూడి పోలీసులు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..