సైఫ్ పై కత్తితో దాడి కేసు… కరీనా కపూర్ స్టేట్ మెంట్ .. *వచ్చే నెలలో డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ?…*మార్కాపురం సబ్ జైలును తనిఖీ చేసిన జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జ్ జి. బాలాజీ …*ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల…*గిద్దలూరు ఆటో డ్రైవర్స్ కు పోలీసుల విజ్ఞప్తి ..

👉సైఫ్ పై కత్తితో దాడి కేసు… కరీనా కపూర్ స్టేట్ మెంట్ ఇదే! తాజాగా నటుడు సైఫ్ ఆలీఖాన్ సతీమణి, బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డ్ చేశారు. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు ఆరుసార్లు కత్తితో పొడిచి దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం సైఫ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. శస్త్రచికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయం లేదని అన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా… తాజాగా నటుడు సైఫ్ ఆలీఖాన్ సతీమణి, బాలీవుడ్ నటి కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆరుసార్లు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. సైఫ్ పై కత్తితో దాడి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కరీనా కపూర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కరీనా… దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని.. ఈ సమయంలో సైఫ్ పై ఆరుసార్లు కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. ఆ సమయంలో పిల్లలు తైమూర్, జహంగీర్ లను రక్షించడానికే సైఫ్ ప్రయత్నించాడని.. ఈ నేపథ్యంలోనే దుండగుడు పిల్లలను చేరుకోలే సైఫ్ పై దాడికి పాల్పడ్డాడని.. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడని తెలిపారు. ఇంట్లోని నగలు, నగదు ఏమీ దొంగిలించలేదని బాంద్రా పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కరీనా చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో… సంఘటన జరిగిన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన కరీనా కపూర్.. తన సోదరి కరిష్మా ఇంటికి వెళ్లగా.. సైఫ్ ఆలీఖాన్ ఆస్పత్రికి ఆపరేషన్ చేయించుకున్నారు. దీనిపై స్పందించిన కరీనా… తాను చాలా భయపడటంతో కరిష్మా తన ఇంటికి తీసుకెళ్లిందని తెలిపారు. నిందితుడు ముంబై వీధుల్లోనే తిరుగుతున్నాడా? మరోవైపు సైఫ్ పై దాడిచేసినట్లు అనుమనిస్తున్న వ్యక్తి ముంబై వీధుల్లోనే పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. దాడి జరిగిన రోజు.. నిందితుడి ఫోటోలను పోలీసులు తొలుత మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతడు బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లు కనిపించాడు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో విడుదల చేసిన సీసీ ఫుటేజీల్లో బ్లూ షర్ట్ లో కనిపించగా.. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో అతడు పసుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు కనిపించాడు. దీంతో… ఇవి బాంధ్రా రైల్వే స్టేషన్ లోని ఫుటేజ్ లోని దృశ్యాలు అని అంటున్నారు. దీంతో… నిందితుడు ముంబై వీధుల్లోనే ఉన్నాడనే చర్చ మొదలైంది. మరోవైపు.. అతడు స్టేషన్ లో రైలెక్కి నగరంలోని మరో చోటుకి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ఓ మొబైల్ షాపులో హెడ్ ఫోన్స్ కొంటున్నట్లు కనిపించిన నిందితుడి వీడియో అని చెబుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.

👉 వచ్చే నెలలో డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ? చంద్రబాబు తరువాత ప్లేస్ లో ఉన్నారు ఆయనను భవిష్యత్తు నేతగా అంతా గురించి గౌరవిస్తున్నారు.  నారా లోకేష్ కి ప్రమోషన్ వస్తుందా అది కూడా కేవలం నెల రోజులలో జరుగుతుందా అంటే సాగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే అలాగే ఉంది అంటున్నారు. నిజానికి నారా లోకేష్ ఈ రోజుకు టీడీపీలో నంబర్ టూ గా ఉన్నారు. ఆయన స్థానం అక్కడ అత్యంత కీలకం. చంద్రబాబు తరువాత ప్లేస్ లో ఉన్నారు ఆయనను భవిష్యత్తు నేతగా అంతా గురించి గౌరవిస్తున్నారు.

ఈ నేపధ్యంలో నారా లోకేష్ కి ప్రభుత్వంలో అంతే ప్రాధాన్యత దక్కుతోంది. జనసేన మంత్రులు ముగ్గురు బీజేపీ మంత్రి ఒకరు మినహాయించి మిగిలిన 19 మంది మంత్రులు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా లోకేష్ కి చంద్రబాబు తో సరిసమానంగా గౌరవం ఇస్తున్నారు. ఆ మధ్యన లోకేష్ అమెరికా టూర్ కి వెళ్ళి ఏకంగా పద్దెనిమిది మంది కేబినెట్ మంత్రులు అంతా లోకేష్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనను అభినందించి వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు షాక్ అలా చూసుకుంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అనధికారికంగా లోకేష్ నే నంబర్ టూ అని అంటారు. ఇక కూటమిలో టీడీపీ భారీ భాగస్వామి. ఆ పార్టీకి 134 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే టోటల్ గా ఉన్న 175 సీట్లలో ఇది 76 శాతం గా చెప్పుకోవాలి. ఈ విధంగా టీడీపీ కూటమిలో అత్యంత బలంగా ఉన్నపుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావడానికి అడ్డేముంది. నిజానికి చూస్తే అది ఈపాటికే జరిగి తీరాల్సి ఉంది అని అంటున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో అయిన తొలిసారి సీఎం అయిన స్టాలిన్ తొలిసారి మంత్రి అయిన ఉదయనిధికి మూడేళ్ళ వ్యవధిలోనే డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇచ్చారు. మరి నాలుగు సార్లు ఏపీకి సీఎం చంద్రబాబు. లోకేష్ చూస్తే రెండోసారి మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు. అలాంటిది లోకేష్ కి ఏమి తక్కువ అన్నది టీడీపీ తమ్ముళ్లలో వస్తున్న డిమాండ్ గా ఉంది. అంతే కాదు నారా లోకేష్ కుటుంబంలో కూడా ఇదే రకమైన డిమాండ్ వస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా నారా కుటుంబం కోరికమేరకు లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ప్రమోషన్ గా దక్కనుంది అని అంటున్నారు. ఇక ఈ నెలాఖరు నుంచి మాఘమాసం వస్తుంది. ఆ మీదట అన్నీ మంచి రోజులే. దాంతో ఫిబ్రవరి నెలలో ఒక మంచి ముహూర్తం చూసుకుని నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. ఇదే విషయం టీడీపీలో అతి పెద్ద చర్చగా సాగుతోంది. ఒక విధంగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవడం ఖాయమని కూడా ప్రచారం హోరెత్తుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ శ్రేణుల మూడ్ ఎలా ఉంది అనడానికి ఒక నిదర్శనంగా కడప జిల్లా సంఘటన చూడాలని అంటున్నారు. కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి వేళ అక్కడకి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాసరెడ్డి ఇదే విషయం మీద బాబుకు రిక్వెస్ట్ చేశారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయమని ఆయన కోరడం తో తమ్ముళు అంతా మద్దతు పలికారు. ఇది తమ్ముళ్ల మనసులో ఏముందో అసలు టీడీపీ మదిలో ఏముందో కూడా తెలియచేసే ఉదంతంగా చూస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బహిరంగంగా ఈ విధంగా డిమాండ్ చేశారు అంటే కనుక కచ్చితంగా లోకేష్ డిప్యూటీ సీఎం అయి తీరుతారని అంటున్నారు. ఇక నారా లోకేష్ కుటుంబం అంతా ఇదే కోరుకుంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబు తరువాత నంబర్ టూ ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ అన్నది జనాలకు పార్టీ జనాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ గా వెళ్లాలీ అంటే డిప్యూటీ సీఎం గా లోకేష్ అవడమే బెటర్ అని అంటున్నారు నిజానికి చంద్రబాబుకు నాలుగవ సారి సీఎం అయినా ఆయన గతంలో చూసిన అధికార వైభవమే ఇది అని, ఇంతకంటే ఏదీ లేదు అని అంటున్నారు. ఉమ్మడి ఏపీకే సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు తిరుగులేని అధికారాన్ని చలాయించిన చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు అంటే అదంతా టీడీపీని చక్కబెట్టడానికి లోకేష్ ని ఎలివేట్ చేయడానికి అన్న మాట కూడా ప్రచారంలో ఉంది. లోకేష్ కూడా గతంతో పోలిస్తే బాగా రాణిస్తున్నారు. ఇదే కరెక్ట్ సమయం అని ఆయనను ముందుగా డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేస్తే ఆ తరువాత సీఎం పదవికి ఆయన ఏ విధమైన ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా చేరుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి మాఘ మాసంలో మంచి ముహూర్తంలో లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని అంటున్నారు.

👉ప్రకాశం జిల్లా మార్కాపురం హైకోర్టు డైరెక్షన్లో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో మార్కాపురం జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జ్ జి. బాలాజీ మార్కాపురం సబ్ జైలును తనిఖీ చేశారు. అనంతరం ముద్దాయిలతో జైలు ప్రాంగణంలోని పలు సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్న జడ్జి. దీనితోపాటు ముద్దాయిలలో ఏమైనా కుల వివక్ష ఉందా అని ఆరా తీసిన జడ్జి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న లాయరు పి. రామచంద్ర, పార లీగల్ వాలంటరీ షేక్ బాషా మరియు జైల్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

👉సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్..*ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల…*

*గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్య మంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీగల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు..*

*ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్..   * ఈ సందర్బంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో, మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సహకారంతో నిర్వహించిన “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్” కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ, నందమూరి అభిమానులు 206 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు, బీజేపీ నాయకులు జేవి నారాయణ, పిడతల రమేష్ రెడ్డి, మరియు మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

👉ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆటో డ్రైవర్స్ కు విజ్ఞప్తి .. కే సురేష్ గిద్దలూరు అర్బన్ ఎస్ఐ..  ఆటో కు వెనుక డోర్ ను ఓపెన్ చేయరాదు.. ఒకవేళ వెనుక డోర్ ను ఓపెన్ చేసినా లేక ఆటో వెనుక డోర్ మీద ప్రయాణికులు ప్రయాణం చేసిన ఆ ఆటో కు 500/- రూపాయలు జారినామా విదించబడును. అంతేకాక ఆ ఆటో యొక్క డోర్ ను క్లోజ్ చేసి వెల్డింగ్ చేయడం జరుగు తుందని హెచ్చరించారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..