*పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం వివరాలు బైటపెట్టిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు..*QR కోడ్ ద్వారా ఫిర్యాదు దారుల ఫీడ్ బ్యాక్ సేకరణ : పీసీ డాక్టర్ అనూరాధ.. *ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం *..* చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి వినతి ..ఇజ్రాయెల్ – గాజా సీజ్ ఫైర్… అగ్రరాజ్యంలో క్రెడిట్ ఫైట్!

హైదరాబాద్ .. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీస్ట్ పద్మభూషణ్ అవార్డు గ్రహిత డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది.

👉 ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం *…ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు..బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్ వచ్చింది.ఇదే అదునుగా చూసి, ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నారు.బాలిక వాంగ్మూలం ప్రకారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు

👉 ఇజ్రాయెల్ – గాజా సీజ్ ఫైర్… అగ్రరాజ్యంలో క్రెడిట్ ఫైట్! సుమారు 15 నెలలుగా అవిరామంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  అక్టోబర్ – 7, 2023న ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, సుమారు 250 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి గాజా లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలో సుమారు 46,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే.. తాజాగా వీరి మధ్య ఒప్పందం నెలకొంది.  సుమారు 15 నెలలుగా అవిరామంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

*ఈ సమయంలో ఈ క్రెడిట్ మొత్తం తనదే అంటే తనదేనని ఫైట్ అమెరికాలో మొదలైంది. ఇందులో భాగంగా… ఈ యుద్ధం ఆగడానికి తానే కారణం అని ట్రంప్ అంటే.. ఏమిటి జోకా? అని బైడెన్ అంటున్నారు.
*ఒప్పందానికి తానే కారణం అని ట్రంప్ చెబుతున్నారనే విషయాన్ని ఆయనవద్ద ఓ విలేకరి ప్రస్థావించగా.. “ఏమిటి.. జోకా..?” అని బైడెన్ వెటకారంగా స్పందించడం గమనార్హం.  ఇదే సమయంలో… ఇజ్రాయెల్ – హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు జోబైడెన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ఈ సందర్భంగా… అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు బైడెన్ అధిక ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. అయితే… ఈ ఒప్పందం వేళ స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు… డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. శాంతి ఒప్పందంలో కండిషన్స్ ఏమిటి?: తాజాగా ఇజ్రాయెల్ తో జరిగిన శాంతి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ ను హమాస్ విడుదల చేసింది. ఈ ఒప్పందం మూడు దశల్లో కొనసాగుతుందని తెలిపింది! ఇందులో భాగంగా… మొదటి దశ ఆరువారాల పాటు ఉంటుందని.. ఈ సమయంలో వారానికి కొంతమంది చొప్పున విడుదల చేస్తారని.. ఆఖరి వారం బంధీలందరినీ హమాస్ విడుదల చేస్తుందని అంటున్నారు. ఇక రెండో దశలో మిలటరీ ఆపరేషన్స్ శాస్వతంగా ఆగిపోతాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్, హమాస్ లు పరస్పరం సైనికులను, పౌరుల్ని విడుదల చేస్తాయి. ఇక మూడో దశకు వచ్చేసరికి.. మృతదేహాలు, అస్తికలను ఇస్తారు. ఆ తర్వాత ఐడీఎఫ్ దాడుల్లో ఛిద్రమైన గాజా పునర్నిర్మాణం మొదలవుతుందని చెబుతున్నారు.
[పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం వివరాలు బైటపెట్టిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.
పట్టపగలు గిరిజనులు, మహిళలపై పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడులు చేస్తున్నారు.
17 మంది గిరిజనుల మీద పండగవేళ కేసులు పెట్టారు.
ఊరిలో గిరిజనులను పోలీసులు నాలుగురోజులగా పరిగెత్తిస్తున్నారు..పోలీసులు వాళ్లు నిలబడి జేసీబీలు పెట్టించి సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఒక పెద్ద మనిషికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు – బీజేపీ ఎంపీ రఘునందన్ రావు…

👉చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య పై వెంటనే చర్యలు తీసుకోండి*.!!
*ఎస్పీ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన టీజేఎఫ్ జర్నలిస్టులు నాయకులు*.విలేకరులు అయితే ఏం డోంట్ కేర్ అంటున్న చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య*

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లోని చాపాడు మండలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చిన్న పెద్దయ్య ఉన్నత బాధ్యతను మరిచి వ్యవహరించిన తీరని చూస్తే ఇట్లే తెలుస్తోంది. ఆయన రూటే సప రేటుగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న 1 tv జర్నలిస్ట్ జేబీ వుల్లా పై విచక్షణారహితంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన ఎస్సై చిన్న పెద్దయ్య పై తక్షణమే చర్యలు తీసుకోవాలని
టీజేఎఫ్( తెలుగు జర్నలిస్టు ఫోరం నాయకులు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వినతిపత్రం అందజేశారు
వార్త కవరేజ్ కోసం వెళ్లిన పొద్దుటూరు రిపోర్టర్ పై చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య దాడి చేయడం హేయమైన చర్య. అన్నారు ..జిల్లా కన్వీనర్ శ్రీకాంత్,
జిల్లా ఎలక్రానిక్ మీడియా కో కన్వీనర్ రామచంద్ర
సలహాదారులు సుధీర్ కుమార్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
👉 ప్రజలకు మరిన్ని ఉన్నత సేవలు అందించడానికి కోసం QR కోడ్ ద్వారా ఫిర్యాదు దారుల ఫీడ్ బ్యాక్ సేకరణ*..*పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ,

*ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినప్పుడు వారికి అందుతున్న సేవలు గురించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి*
*ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణ సర్కిల్ కార్యాలయము ఎసిపి కార్యాలయం సిపి కార్యాలయ ఆవరణలో క్యూఆర్ కోడ్ ఉన్న ఐదు పోస్టర్లు *
*పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ..
తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తయారుచేసిన క్యూఆర్ కోడ్ ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ యందు, సర్కిల్ కార్యాలయాలు, ఏసిపి ఆఫీసులు, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు దారుల సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు , పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరో అందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందే ఈ QR కోడ్.
ఈ QR కోడ్ వలన పోలీసుల గురించి ప్రజల నుండి వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ QRకోడ్ పోస్టర్లు ప్రతి పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాల్లో, ఏసీపీ ఆఫీసులలో, ఐదు ప్రదేశాలలో రిసెప్షన్, పోలీస్ స్టేషన్ ముందు బాగాన ప్రజలకు విజబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది…*ప్రజలు వారి అభిప్రాయాలు ఫీడ్ బ్యాక్/ తెలియజేసే అంశాలు*👉 ఫిర్యాదులు/ పిటిషన్

👉 ఎఫ్ఐఆర్ /FIR
👉 ఈ చాలన్ ట్రాఫిక్ ఉల్లంఘనలు
👉 పాస్ పోర్ట్ ధ్రువీకరణ
👉 ఇతర అంశములు
పై అంశాలపై స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయాలి. రేటింగ్ ఇవ్వవచ్చు జిల్లా ప్రజలు ఈ QR కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల అభిప్రాయ సేకరణ బట్టి మరిన్ని ఉన్నత సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలోతెలిపారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..