👉వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు..😱..👉ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం 😱..👉ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!*…👉ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగి పట్ల వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తన..*విడాకులు తీసుకున్నా వేధిస్తున్న భర్త ..👉ఇజ్రాయెల్ – గాజా సీజ్ ఫైర్… అగ్రరాజ్యంలో క్రెడిట్ ఫైట్!… ఇడ్లిపై రబ్బర్ వచ్చింది.. రూ. 20వేలు ఇవ్వు..! నకిలీ విలేకర్ల రచ్చ

👉ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగి పట్ల వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తన..

సిరంజిలు లేవని బయట కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగికి హుకుం జారీ…
మహబూబాబాద్ – దంతాల పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన..
24 గంటలు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం కోసమెరుపు….
👉బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.*
*ముంబైలోని నివాసంలో కత్తితో దాడిచేసిన దుండగుడు..*సైఫ్‌ అలీఖాన్‌కు తీవ్ర గాయాలు ముంబై లీలావతి ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స.*

👉విడాకులు తీసుకున్నా వదలకుండా.. బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న భర్త.. పోలీసులను ఆశ్రయించిన యువతి .. పీపుల్స్ వాయిస్ న్యూస్  కర్నూలు జిల్లా ..డోన్ … ప్లీజ్డోన్ పట్టణానికి చెందిన ఒక యువతిని పిల్లాడిని భర్త 15 ఏళ్లుగా వేధిస్తుండడంతో వేధింపులు తాళలేక   ఒక యువతి ఆరు నెలల కిందట కొత్త నుండి విడాకులు తీసుకున్నది అయినప్పటికీ భర్త ఆమెను తన దగ్గరికి రావాలని వేధించడంమే కాక,ఆమెను అనేక రకాలుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు విలేకరుల ముందు వాపోయింది .. ఈ విషయంపై తాను పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.

👉ప్రకాశం….బేస్తవారిపేట మండలం కలగట్ల వద్ద పొగాకు కూలీల ట్రాక్టర్ బోల్తా..ప్రమాదంలో ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు.
మృతులు మార్కాపురం మండలం. భూపతిపల్లి గ్రామానికి చెందిన మెడం కాశయ , మల్లాపురం శ్రీను ఈ సమాచారం .క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రధమ చికిత్స నిర్వహించారు..

👉*పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!*

చీరాల మున్సిపల్ పరిలోని గొల్లపాలెం చెందిన 40 ఏళ్ళ గొల్లప్రోలు గంగాధర్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే గమనించిన కుటుంబసభ్యులు,స్నేహితులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అయితే అప్పటికే గంగాదర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.
ఆసుపత్రిలో విగతజీవిగా పడిఉన్న అన్న గంగాధర్‌ను సూచి గొల్లప్రోలు గోపి (33) కన్నీరుమున్నీరయ్యాడు.
అన్న గంగాధర్ వివరాలను ఆసుపత్రిలో సిబ్బందికి వివరిస్తున్న క్రమంలో తమ్ముడు గోపి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
అన్న మృతిని తట్టుకోలేని తమ్ముడు గోపి ఆసుపత్రిలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
వైద్యులు వెంటనే వైద్య చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
కేవలం గంట వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందడంతో గొల్లపాలెంలో విషాధచాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అన్నదమ్ములు ఒకేసారి కేవలం గంట వ్యవధిలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

👉ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం 😱😱😱..ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని(17)కి ఇన్‌స్టాగ్రామ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) పరిచయం అయ్యాడు.బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించడంతో ఆమె ఈ నెల 9న సికింద్రాబాద్ వచ్చింది.ఇదే అదునుగా చూసి, ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నారు .బాలిక వాంగ్మూలం ప్రకారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు

👉 ఇజ్రాయెల్ – గాజా సీజ్ ఫైర్… అగ్రరాజ్యంలో క్రెడిట్ ఫైట్! సుమారు 15 నెలలుగా అవిరామంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  అక్టోబర్ – 7, 2023న ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, సుమారు 250 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి గాజా లక్ష్యంగా ఇజ్రాయేల్ సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలో సుమారు 46,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే.. తాజాగా వీరి మధ్య ఒప్పందం నెలకొంది. సుమారు 15 నెలలుగా అవిరామంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఓ అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమయంలో ఈ క్రెడిట్ మొత్తం తనదే అంటే తనదేనని ఫైట్ అమెరికాలో మొదలైంది. ఇందులో భాగంగా… ఈ యుద్ధం ఆగడానికి తానే కారణం అని ట్రంప్ అంటే.. ఏమిటి జోకా? అని బైడెన్ అంటున్నారు.
ఒప్పందానికి తానే కారణం అని ట్రంప్ చెబుతున్నారనే విషయాన్ని ఆయనవద్ద ఓ విలేకరి ప్రస్థావించగా.. “ఏమిటి.. జోకా..?” అని బైడెన్ వెటకారంగా స్పందించడం గమనార్హం.  ఇదే సమయంలో… ఇజ్రాయెల్ – హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు జోబైడెన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. ఈ సందర్భంగా… అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు బైడెన్ అధిక ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. అయితే… ఈ ఒప్పందం వేళ స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు… డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు. శాంతి ఒప్పందంలో కండిషన్స్ ఏమిటి?: తాజాగా ఇజ్రాయెల్ తో జరిగిన శాంతి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్ ను హమాస్ విడుదల చేసింది. ఈ ఒప్పందం మూడు దశల్లో కొనసాగుతుందని తెలిపింది! ఇందులో భాగంగా… మొదటి దశ ఆరువారాల పాటు ఉంటుందని.. ఈ సమయంలో వారానికి కొంతమంది చొప్పున విడుదల చేస్తారని.. ఆఖరి వారం బంధీలందరినీ హమాస్ విడుదల చేస్తుందని అంటున్నారు. ఇక రెండో దశలో మిలటరీ ఆపరేషన్స్ శాస్వతంగా ఆగిపోతాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్, హమాస్ లు పరస్పరం సైనికులను, పౌరుల్ని విడుదల చేస్తాయి. ఇక మూడో దశకు వచ్చేసరికి.. మృతదేహాలు, అస్తికలను ఇస్తారు. ఆ తర్వాత ఐడీఎఫ్ దాడుల్లో ఛిద్రమైన గాజా పునర్నిర్మాణం మొదలవుతుందని చెబుతున్నారు.

👉వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు..😱😱😱 * శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసిన కుటుంబసభ్యులు..*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..*పరారిలో కుటుంబ సభ్యులు..*

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహిత నాగమణి ని (35)కి హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన కుటుంబం సభ్యులు. భర్త అత్త మామ ఆడపడుచు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట తవ్వగా బయటపడిన మృతదేహం. ఇంటికి తాళం వేసి పరారైన మృతురాలి భర్త గోపి అత్త లక్ష్మి మామ రాములు ఆడపడుచు దుర్గ భర్త మహేందర్ లు పరారిలో ఉన్నారు. మృతి చెందిన నాగమణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు..

👉ఇడ్లిపై రబ్బర్ వచ్చింది.. రూ. 20వేలు ఇవ్వు..!*

*ఓ హోటల్ యజమాన్యాన్ని బెదిరించిన ప్రబుద్ధుడు*  *షాద్ నగర్ పోలీస్ ఠాణాకు చేరిన పంచాయతీ*  *పోనీలే అంటూ రికమండేషన్లు* ..ఫేక్ మీడియా పేరుతో బెదిరింపులు..**పోలీసుల అదుపులో నిందితుడు..* షాద్ నగర్ లో మీడియా పేరిట కొందరు నకిలీలు వెధవ వేషాలు వేస్తున్నారు.. ఇటీవల ఈ అంశంపై రచ్చ కొనసాగుతోంది.

ఎవరు నిజమైన మీడియా ప్రతినిధులు.. ఎవరు కాదు? అనే అంశం పక్కన పెడితే మీడియా పేరిట హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి 20,000 రూపాయలు డిమాండ్ చేసిన ప్రబుద్ధుడి తతంగం చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో గల ఓ ఉడిపి హోటల్లో ఇడ్లీ కొనుగోలు చేసి పార్సిల్ తీసుకువెళ్లిన వ్యక్తి ఆ తర్వాత ఇడ్లీలో రబ్బర్ ఉందని హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి దబాయించాడు. దానికి హోటల్ నిర్వాహకులు అలాంటిదేమీ లేదని, ఇడ్లీ తీసుకువెళ్లి చాలాసేపటి తర్వాత ఇలా చెప్పడం ఫోటోలు పంపించడం సరికాదు కదా అని సమాధానం చెబితే మర్యాదగా 20,000 రూపాయలు ఇవ్వండి లేదంటే మిమ్మల్ని మీ హోటల్ నీ బద్నాం చేస్తా అంటూ బ్లాక్మెయిల్ కు దిగాడు. తను ఓ మీడియా జర్నలిస్టు అని చెప్పడం బెదిరింపులకు దిగడంతో అతని మాటలకు ఆశ్చర్యపోయిన హోటల్ యాజమాన్యం చేసేది లేక షాద్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రధాన మీడియా పేరును వాడుకున్న సదరు యువకుడిని పోలీసులకు అప్పచెప్పారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సదరు యువకుడు ఉన్నాడు. ఇడ్లీలో రబ్బరు వచ్చిందని మొదటగా చెప్పిన సదరు యువకుడు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసే వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత అసలైన నిజ స్వరూపం బయటపెడుతూ 20వేల రూపాయలు కావాలి అంటూ డిమాండ్ చేసినట్లు హోటల్ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. ఇడ్లీలో రబ్బర్ వస్తే 20వేలు మరి పురుగు వస్తే ఏకంగా లక్షలు అడుగుతారా? అని యాజమాన్యం కూడా అవాక్కు అయింది. ఇదేం దౌర్జన్యం? విచిత్ర పరిస్థితి అని హోటల్ యాజమాన్యం కూడా నిశ్చేస్తులయ్యారు. హోటల్ లో ఇప్పటివరకు ఎవరి నుండి కూడ ఫిర్యాదు రాకపోవడం ఈ ఒక్క యువకుడి ద్వారా ఇలాంటి వింత ఫిర్యాదు రావడం అది కూడా 20వేల రూపాయలు అడుగుతూ బ్లాక్మెయిలుకు దిగడం చర్చనీయాంశం. పైగా సదరు యువకుడు తాను ఓ రెండు హోటళ్ళను బంద్ చేయించానని గొప్పగా చెప్పుకోవడం మీకు అదే గతి పడుతుందని చెప్పడం కోస మెరుపు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు అతనికి సంబంధించిన కొంతమంది నాయకులు మరికొందరు ఏదో పొరపాటు జరిగింది విడిచిపెట్టమని పోలీసులను ప్రాదేయపడుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై అటు హోటల్ యాజమాన్యం ఇటు పోలీస్ అధికారి సీఐ విజయ్ కుమార్ వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు. కొంతమంది నాయకుల పైరవీలతో ఇది కేసు అవుతుందా లేదా హోటల్ యజమానిని కూడా బెదిరించి ఇష్యూను క్లోజ్ చేస్తారా వేచి చూడాల్సిందే…?

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..