👉అదానీ ఊపిరిపీల్చుకో…. హిండెన్ బర్గ్ ప్రకటన.. హిండెన్ బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త అదానీకి గొప్ప ఉపశమనం. షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ వేట ముగించింది. సరిగ్గా రెండేళ్ల క్రితం సంచలన నివేదికతో అదానీ గ్రూపును వణికించిన హిండెన్ బర్గ్ సంస్థ తన కార్యకలాపాలను ముగిస్తున్నట్టు ప్రకటించి షేర్ మార్కెట్ రంగంలోని పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది.
హిండెన్ బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంస్థను కొనసాగించే ఐడియాలు అన్నీ అయిపోవడంతో మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు ఓ లేఖలో తెలిపారు. ఈ విషయం గురించి గత ఏడాది నుంచి కుటుంబం, స్నేహితులు, సంస్థ ఉద్యోగులతో చర్చించాను. అనంతరం హిండెన్ బర్గ్ సంస్థను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా, దీనిపై మేం ఎంచుకున్న ప్రణాళికలు, ఐడియాలు అన్నీ అయిపోయాయని తెలిపారు. హిండెన్ బర్గ్ మూసివేత వెనుక ఇంకే కారణాలు లేవు. నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నా. ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. విజయవంతమైన కెరీర్ ఏదో ఒక రోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని నాకు తెలుసు. గతంలో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకునేవాడిని. హిండెన్ బర్గ్ నా జీవితంలో ఒక భాగం. జీవితానికి సరిపడా చేసిన సాహసం. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశాం. ఇదంతా నాకో ప్రేమకథలా అనిపిస్తుందని అండర్సన్ రాసిన లేఖలో తెలిపారు. ఇంత మార్పా? న్యూయార్క్ కేంద్రంగా పనిచేసిన హిండెన్ బర్గ్ కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తించేది. ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్లో పెట్టుబడులు పెడుతుంది. 2017లో నాథన్ అండర్సన్ ప్రారంభించిన ఈ సంస్థ మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో కుంభకోణానికి పాల్పడిందని నివేదిక రిలీజ్ చేసి సంచలనం రేపింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ ఉక్కిరిబిక్కిరి అయింది. లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. దీంతో హిండెన్ బర్గ్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. అదానీ గ్రూపుపై సంచలన ఆరోపణలు చేసి ఆ సంస్థను దెబ్బతీసిన హిండెన్ బర్గ్ మూసివేతపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం సంచలన నివేదికతో ప్రపంచ వ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షించిన హిండెన్ బర్గ్ మూసివేతపై ఇన్వెష్టర్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకుల ఒత్తిళ్లను, బెదిరింపులను భరించలేక సంస్థను మూసి వేస్తున్నారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
👉చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ..ఆ పార్టీలో చేరతారా?*
వెండితెర మీద మెరిసినా..పొలిటికల్ మీటింగ్‌లో కనిపించినా.. ఆయనెక్కడున్నా సమ్‌థింగ్ స్పెషలే. పాలిటిక్స్‌కు ఆయన దూరంగా ఉన్నా..రాజకీయాలు మాత్రం ఆ టాలీవుడ్ బిగ్‌స్టార్ నుంచి దూరం కావడం లేదు.
మరోసారి ప్రధానితో కనిపించి..పొలిటికల్ గాసిప్‌లో వైరల్ న్యూస్‌గా మారారు మెగాస్టార్. చిరు రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా? మెగాస్టార్‌ను కాషాయం ఆకర్షిస్తుందా? చిరంజీవికి మోదీ అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రీజనేంటి?
*చిరు పొలిటికల్ రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్..*
మెగాస్టార్ చిరంజీవి. తెలుగు స్టేట్స్‌లోనే కాదు..నేషనల్ వైడ్‌గా ఆయనకున్న క్రేజే వేరు. సినిమా పరంగానే..రాజకీయం రంగంలోనూ చిరుకు ఫాలోయింగ్ బానే ఉంది. అందుకే ప్రధాన పార్టీలు ఆయన పేరు ప్రస్తావించకుండా ఉండలేవు. అయితే చిరంజీవి పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. కమలం చిరును ఆకర్షిస్తుందన్న టాక్ ఆసక్తిరేపుతోంది. అటు చిరు అభిమానుల్లోనూ..పవన్ ఫ్యాన్స్ లోనూ చిరు పొలిటికల్ రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.
2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు..అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత..అటు కేంద్రంలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు.
*చిరుకి ప్రధాని మోదీ ఇచ్చిన ఇంపార్టెన్స్‌పై ఆసక్తికర చర్చ..*
ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా.. రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరుచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్‌ను రాజకీయాల్లోనూ లాగుతోంది. లేటెస్ట్‌గా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ..చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని.. మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట. చిరు సేవలను బీజేపీ వాడుకోవాలని చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు చాలా సందర్భాలను గుర్తు చేస్తున్నారు. గతేడాది జూన్ కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని..చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు పవన్, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. అప్పట్లో ఆ సీన్ హైలెట్‌గా నిలిచింది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
మరోసారి ప్రధాని మోదీ, చిరంజీవిల కలయిక మళ్లీ అలాంటి చర్చకే దారితీస్తోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి కూడా అటెండ్ అయ్యారు. అయితే అందరిలో ఒకడిలా కాకుండా..చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపైనే ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.
*చిరుకి ప్రధాని మోదీ ఆత్మీయ పలకరింపు..*
చిరంజీవిని చూడగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్యాయంగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత కార్యక్రమానికి సంబంధించిన జ్యోతి వెలిగించే విషయంలోనూ చిరుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాని మోదీ తొలుత ఒక ఒత్తి వెలిగించగా.. చిరంజీవి రెండో ఒత్తిని వెలిగించారు.
అంతేకాదు చిరంజీవితో పాటు నడుచుకుంటూ..తమకు ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చున్నారు. పక్కపక్క సీట్లలోనే కూర్చుని కార్యక్రమాలను తిలకించారు. ఈ క్రమంలోనే చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలకు అహ్వానించడం, ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బీజేపీ ఆంతర్యం వేరే ఉందన్న చర్చ మొదలైంది.
*తెలుగు రాష్ట్రాల్లో మైలేజీ పెంచుకోవాలనే ప్లాన్..*
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ పాలిటిక్స్‌లో కీరోల్ ప్లే చేస్తున్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. సేనానితో మహారాష్ట్రలో ప్రచారం చేయించి మంచి ఫలితాలు సాధించింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో మరింత మైలేజీని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు టాక్. అందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. .*ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు ఏఐసీసీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్ చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి కాషాయం కండువా కప్పుకుని ఆ పార్టీకి ఫుల్ టైమ్ పనిచేస్తారా లేక..రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్‌గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ చిరు బీజేపీలో చేరితే ఇప్పటికే పవన్ జనసేన పార్టీ పరిస్థితి ఏంటన్నది కూడా మరో చర్చ. అయితే బీజేపీ, జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరు ప్లస్ పాయింట్ అంటున్నారు…. *బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తుండటంతో బీజేపీ, జనసేన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. పవన్ కూడా మోదీ, అమిత్‌షాతో సన్నిహితంగా ఉంటున్నారు. సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో చిరు బీజేపీ గూటికి చేరుతారా? రాజ్యసభకు నామినేట్ అవుతారా..? ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా అన్నది ఆసక్తి రేపుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో.. చిరు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.
👉 విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐవిజయవాడ శివారు జక్కంపూడిలో జూద శిబిరాలు ఖాళీ చేయించామని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. జక్కంపూడిలో పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని ఎస్ఐ సివిల్ డ్రెస్లో ఉండటం వల్ల అక్కడ ఉన్న ఆకతాయిలు గుర్తుపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం జూద శిబిరాన్ని ఖాళీ చేయించామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ తెలిపారు. మరల జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
👉 ”రాజకీయనాయకుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్..
తప్పన్నగారిపల్లి గ్రామం, సోమల మండలం, చిత్తూరు జిల్లా కు చెందిన మాస భాను @పవన్ @రాజేష్ చెడు వ్యసనాలకు అలవాటు పడి గతంలో రాజకీయ నాయకుల వద్ద పీఆర్వో గా పనిచేసానని, చాలా మంది నాయకులు తెలుసని ఆ పలుకబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు. తరువాత అతని పై చిత్తూరు జిల్లాలోనే పలు కేసు కేసులో నమోదైనవి. తరువాత అతను అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇతన్ని చిత్తూరు జిల్లా, సోమ్లా పోలీస్ స్టేషన్ వారు జైలుకి పంపినారు. తరువాత బెయిల్ పై బయటకు వచ్చినా కూడా అతనిలో మార్పు రాలేదు. ఆ క్రమంలో మరలా గతంలో మాదిరిగానే మరలా ఉద్యోగాలను ఇప్పిస్తానని చీటింగ్ చేస్తూ ఆ క్రమంలో తనకు పరిచయమైనా 2వ ముద్దాయి అయిన నాగమల్లేశ్వరరావు తో పరిచయం ఏర్పడి అతని సపోర్ట్ తో సత్తెనపల్లి నియోజకవర్గంలోని పొలిటికల్ వాట్సన్ గ్రూప్ లలో ఉన్న సభ్యుల ఫోన్ నంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేసి రాజమండ్రి మరియు తిరుపతి రేనుగుంట ఎయిర్ పోర్టులలో జాబ్స్ ఇప్పిస్తానని నమ్మబలికి ఫోన్ పే ద్వారా డబ్బులు వేయించుకొని జాబులు పేరుతో మోసం చేస్తూ ఆర్దిక నేరాలకు పాల్పడుతున్నాడని రాబడిన ఫిర్యాది మేరకు సత్తెనపల్లి టౌన్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా పల్నాడు జిల్లా ఎస్పీ మరియు సత్తెనపల్లి డి.ఎస్.పి ల ఉత్తర్వుల మేరకు సత్తెనపల్లి టౌన్ సిబ్బంది పై 1 వ ముద్దాయిని 14.01.2025 వ తేదిన పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా కోర్టు లో 14 రోజుల రిమాండ్ విదించటమైనది.సత్తెనపల్లి పట్టణ ప్రజలు ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే వారి మాటలు నమ్మి మోసపోవద్దని తెలియజేసారు.
*పందెం: రూ.కోటి గెలిచిన కోడి!*..తాడేపల్లిగూడెంలో జరిగిన కోళ్ల పందెం వైరల్ అవుతోంది. బరిలో ఏకంగా రూ.1.25 కోట్లు పందెం కాశారు. గుడివాడ ప్రభాకర్ రావు ‘నెమలి పుంజు’, రత్తయ్య ‘రసంగి పుంజు’ బరిలోకి దిగాయి….ఈ పందేనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా బెట్టింగులు కాశారు. ఈ పోటీలో ‘నెమలి పుంజు’ విజేతగా నిలిచింది. రత్తయ్య రూ.20 లక్షలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అటు భీమవరంలో నిన్న ఒక్కరోజే రూ. 150 కోట్లు చేతులు మారినట్లు సమాచారం.
👉 విశ్రాంత కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్లో పొలిటికల్ వార్*
MP భోపాల్లో 2024 డిసెంబర్ 19న ఓ కార్ నుంచి 52KGల బంగారు, రూ 10 కోట్ల నగదును ఐటి అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం ఆర్ టి ఓ మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బిజెపి ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్నాథ్ సర్కార్ అవినీతికి మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.

