*హర్యానా బిజెపి నేతలపై సామూహిక అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదు*.. *విఆర్ఎస్ పేరుతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులను, కార్మికులను ఇంటికి పంపడమే ఏపీకి మోడీ సంక్రాంతి కానుక. ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ..👉తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం* 😱..*నిజామాబాద్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీలపై నిలదీస్తూ వెలసిన పోస్టర్లు.. *మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్..మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన పొదిలి మానవత సంస్థ ..* 👉 టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన పొదిలి విద్యార్థిని షేర్ సాజీయా ..*సంక్రాంతి సంకీర్తనల కార్యక్రమంలో  గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల

👉 హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బదోలీ, సింగర్‌ జై భగవాన్ అలియాస్ రాకీలపై సామూహిక అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌, సోలాన్ జిల్లాలోని కౌశాలిలోని ఓ హోటల్‌లో వారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

👉 ఉద్యోగం ఇప్పిస్తాన‌ని అత్యాచారం.. బీజేపీ చీఫ్ దురాచారం! ఢిల్లీకి చెందిన ఓ యువ‌తి(23) త‌న స్నేహితురాలితో క‌లిసి 2023, జూలైలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లారు. అక్క‌డి ప‌ర్యాటక ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దేశానికి నీతులు చెప్పే నాయ‌కులు అవినీతి, అక్ర‌మాల కేసుల్లో కూరుకుపోతున్నారు. తాజాగా ఓ అత్యాచారం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిపై కేసు న‌మోదైంది. ఓ యువ‌తికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తా న‌ని, నటిగా కూడా అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని న‌మ్మ బ‌లికి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన 20 మాసాల త‌ర్వాత‌.. బాధితురాలు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె పై ప‌లు మార్లు అత్యాచారం జ‌రిగిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయ‌న ఒక్క‌డే కాకుండా ఓ ప్ర‌ముఖ గాయ‌కుడు కూడా ప‌లు మార్లు అత్యాచారం చేసిన‌ట్టు గుర్తించారు. ఈ దారుణం ఎక్కడంటే? ఏం జ‌రిగింది? ఢిల్లీకి చెందిన ఓ యువ‌తి(23) త‌న స్నేహితురాలితో క‌లిసి 2023, జూలైలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లారు. అక్క‌డి ప‌ర్యాటక ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ స‌మ‌యంలో ఓ హోట‌ల్ గ‌దిలో ఉన్న‌వారిని హ‌రియాణా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ బ‌డోలీ, ప్ర‌ముఖ సింగ‌ర్ రాకీ మిట్ట‌ల్ క‌లిశారు. న‌టిగా అవ‌కాశం ఇస్తాన‌ని రాకీ, ప్ర‌భుత్వంలో పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాన‌ని బ‌డోలీ చెప్పిన‌ట్టు బాధితురాలు తెలిపారు. అనంత‌రం.. స్నేహితురాలిని బ‌య‌ట‌కు పంపించి.. ప్ర‌త్యేకంగా మాట్లాడాలంటూ స‌ద‌రు యువ‌తిపై సామూహికంగా అత్యాచారం చేశారు. అంతేకాదు.. ప‌లుమార్లు త‌ర్వాత కూడా.. క‌లిసి త‌న‌పై అత్యాచారం చేసిన‌ట్టు బాధితురాలు ఆరోపించారు. ఇక‌, ఈ క్ర‌మంలో ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు ఈ స‌న్నివేశాల‌ను వీడియో కూడా చిత్రీక‌రించార‌ని.. ఎక్క‌డైనా చెబితే చంపేస్తామ‌ని బెదిరించిన‌ట్టు బాధితురాలు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు తాజాగా ఆమెను వైద్య ప‌రీక్ష‌ల‌కు పంపించి కేసు న‌మోదు చేశారు. రాజ‌కీయ ఆరోప‌ణ‌లు.. ప్ర‌స్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారంపై రాజ‌కీయ దుమారం రేగింది. ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌మ ప్ర‌త్య‌ర్థులు ఇలాంటి విష‌యాలు ఆరోపిస్తున్నార‌ని బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు.  నిందితులు ప‌రారీలో ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు.

👉విఆర్ఎస్ పేరుతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులను, కార్మికులను ఇంటికి పంపడమే ఏపీకి మోడీ సంక్రాంతి కానుక. ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ .

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు విఆర్ఎస్ తీసుకునేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించాలనుకోవటం దుర్మార్గం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు..స్టీల్ ఉద్యోగులకు రూ.250 కోట్ల జీతాలు బకాయి, ప్లాంట్ లో ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తి తగ్గింపు, ఐరన్ ఓర్ గనులు కేటాయించక పోవటం మోడీ సర్కార్ కుట్రలో భాగమే..విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు గళమెత్తాలి అని కోరారు.

*పండుగ వేళ తీవ్ర విషాదం ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి…సంక్రాంతి వేల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు అచ్చంపేట చామర్రులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోయారు. గౌతుకట్ల కోటయ్య అనే వృద్ధుడు 80 అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత అతని కొడుకు గౌతుకట్ల నాగేశ్వరరావు, బావమరిది తెల్ల మేకల నాగేశ్వరరావు మద్యం తాగారు. వెంటనే విరోచనాలు వాంతులతో అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే ఇద్దరూ మరణించారు.

👉 ఒంగోలులో పట్టణంలోని మినీ స్టేడియంలో స్థానిక శాసనసభ్యులు  దామచర్ల జనార్దన్  ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంకీర్తనల కార్యక్రమంలో  గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి  మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ , ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ , జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.. జిల్లా ఇన్చార్జ్ రహిమాన్..

👉తిరుమలనాధ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముత్తుముల*..గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  కనుమ పండుగ సందర్భంగా బుధవారం ఉదయం బేస్తవారిపేట మండలం కోనపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి తిరుమలనాథ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, వేదమంత్రాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు మరియు గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.*

👉తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్..మూడో గేటు నుంచి యూనివర్సిటీ లోపలికి వెళ్లిన మనోజ్..దీంతో మనోజ్‌ను బౌన్సర్లు అడ్డుకోవడంతో….పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

👉 ఎమ్మెల్యే గారూ.. మా నియోజక వర్గానికి రావొద్దూ..నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో పోస్టర్ల కలకలం..ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీలపై నిలదీస్తూ వెలసిన పోస్టర్లు..రూపాయి వైద్యం, యువతకు ఉపాధి ఎక్కడ?..గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయి? అంటూ ఎన్నికల హామీలపై ప్రశ్నలు..నందిపేట్ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యేకు నిలదీస్తూ వెలసిన పోస్టర్లు..

👉పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్.. ఉత్తరప్రదేశ్ – హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయని బంక్ సిబ్బంది…పెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్.. దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిన కరెంటు👉తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం* 😱 వెలుగులోకి వచ్చిన రూ.300 నకిలీ ప్రత్యేక దర్శన టికెట్లు!!!*…నకిలీ టికెట్లతో దర్శనానికి అనుమతినిచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది.”నకిలీ టికెట్ల తయ్యారిలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది హస్తం “ఉన్నట్లు అనుమానిస్తున్న టీడీడీ అధికారులు.

👉 టైక్వాండో లో గోల్డ్ మెడల్ సాధించిన పొదిలి విద్యార్థిని షేర్ సాజీయాను అభినందించిన పొదిలి సీఐ వెంకటేశ్వర్లు.గుంటూరు జిల్లా రేపల్లెలో ఈనెల 11 12 తేదీల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టైక్వాండో పోటీల్లో పొదిలికి చెందిన కరాటే, టైక్వాండో మాస్టర్ కటారి చినరాజు వద్ద శిక్షణ పొందుతున్న షేక్ సాజియా బంగారు పతకం సాధించింది. పదేళ్ల లోపు, బాలికల 27 కేజీల విభాగంలో పోటీ పడింది. షాజియా నాలుగు రౌండ్ల లోనూ అద్భుతంగా ఫైట్ చేసి పాయింట్లు సాధించి బంగారు పథకం కైవసం చేసుకుంది. మంగళవారం ఉదయం పొదిలి జూనియర్ కళాశాల ప్రాంగణంలో పొదిలి సీఐ వెంకటేశ్వర్లు , కరాటే మాస్టర్ కటారి రాజు, ఆర్ఎంపి వైద్యులు భరత్, హబీబుల్లా సేవా సంస్థ చైర్మన్ కరిముల్లా బెగ్ షాజీయాను బంగారు మెడల్, ప్రశంసాపత్రంతో అభినందించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థినిలకు ఆత్మరక్షణకు కరాటే, టైక్వాండో విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్నారి షాజీయాను అభినందిస్తూ జాతీయస్థాయిలో రాణించాలని ఆశీర్వదించారు. తమ కూతురు బంగారు పథకం సాధించేలా శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ చిన్న రాజును షాజియా తల్లిదండ్రులు ఖాసిం షాహిద్, షాతాజ్ బేగం పూలమాల, దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హబీబుల్లా సేవా సంస్థ చైర్మన్ కరిముల్లా బేగ్, కరాటే ఇన్స్ట్రక్టర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

👉 మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన మానవత సంస్థ..   పొదిలి నగర పంచాయితీ గురువారం స్వర్గస్తులైన చెన్నుపల్లి మాలకొండయ్య కుటుంబానికి మానవతా సంస్థ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. ముందుగా వారు మాలకొండయ్య పార్దివదేహానికి ఘన నివాళి అర్పించారు. అంత్యక్రియల కోసం సంస్థ దాతల సహకారంతో ఇచ్చే 5000 రూపాయలను ఆయన భార్య కు అందించారు.  కార్యక్రమంలో మానవతా సంస్థ పొదిలి మండల కన్వీనర్ మువ్వల పార్ధసారధి, జిల్లా కార్యదర్శి కే యల్లమందారెడ్డి, మండల కార్యదర్శి అశోక్ బండి, షేక్ బాజీ కరీముల్లా,శాంతి కమిటీ సభ్యుడు ఎద్దు నగేష్, బాషాలు పాల్గొన్నారు.

👉సీనియర్ టిడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ ఇమాంసా కు మాతృవియెగం.

పొదిలి మాజి ఎంపిటిసి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాయకులు, ఆర్ఎంపి వైద్యులు సయ్యద్ ఇమాంసాకు మాతృ యోగం కలిగింది. ఆయన మాతృమూర్తి సయ్యద్ ఖాశింబ(85) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వారి స్వగృహంలోమరణించారు. ఈ సందర్భంగా పొదిలి, కొనకనమిట్ల మండలాల మాజీ జడ్పిటిసిలు కాటూరి వెంకట నారాయణ బాబు, వేల్పుల వెంకటేశ్వర్లు, పలువురు పుర ప్రముఖులు స్థానికులు ఆమె మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..